Sameer Wankhede
-
చంపుతామంటూ బెదిరిస్తున్నారు
ముంబై: తనను చంపుతానంటూ బెదిరింపులు వస్తున్నాయని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) ముంబై మాజీ చీఫ్ సమీర్ వాంఖడే ముంబై పోలీసులను ఆశ్రయించారు. తనను, తన భార్యను సామాజిక మాధ్యమాల్లో దుర్భాషలాడుతూ చంపుతామంటూ గత నాలుగు రోజులుగా బెదిరింపులు వస్తున్నాయని వాంఖడే పేర్కొన్నారు. వాంఖడే తన ప్రతినిధి ద్వారా ఈ మేరకు ఒక లేఖను దక్షిణ ముంబై పోలీస్ కమిషనరేట్‌కు పంపినట్లు ఒక అధికారి తెలిపారు. ‘క్రూయిజ్ డ్రగ్స్’ కేసులో బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్‌ను ఇరికించకుండా ఉండేందుకు రూ.25 కోట్లు లంచం డిమాండ్ చేసినట్లు వచ్చిన ఆరోపణలపై సమీర్ వాంఖడేను శని, ఆదివారాల్లో సీబీఐ ప్రశ్నించింది. -
ఆర్యన్‌ని జైల్లో పెట్టొద్దు! సమీర్ వాంఖడేని వేడుకున్నట్లు స్క్రీన్ షాట్లు
బాలీవుడ్ దిగ్గజ నటుడు షారూఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ అరెస్టులో సీనియర్ ఆఫీసర్‌గా పేరొందిన నార్కోటిక్స్ మాజీ అధికారి సమీర్ వాంఖడే అక్రమంగా వ్యవహరించారంటూ సంచలన ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ విషయమై సీబీఐ ఆయన తోపాటు మరికొందరూ షారూఖ్ ఖాన్ కుటుంబాన్ని డబ్బులు డిమాండ్ చేశారని ఆరోపణలు చేస్తోంది. సీబీఐ పెట్టిన కేసుల విషయమై ముంబై హైకోర్టు ఆశ్రయించిన సమీర్ వాంఖడే శుక్రవారం తనకు షారుక్ ఖాన్‌కి మధ్య జరిగిన చాట్ల సంభాషణను కోర్టుకి సమర్పించారు. అంతేగాదు షారూఖ్ తన కొడుకుని విడిపించమని వేడుకుంటూ జరిగిన సుదీర్ఘ చాట్ సంభాషణ గురించి పిటిషన్లో పేర్కొన్నాడు వాంఖడే. ఆ స్క్రీన్ షాట్లో దయ చేసి అతన్ని జైల్లో పెట్టోద్దు. మిమ్మల్ని వేడుకుంటున్నా. మీరు నా కుటుంబంపై దయచూపాలి. నా కొడుకుని కరుడుగట్టిన నేరస్తుడిలా జైల్లో ఉండటానికి అర్హుడు కాదు. అది అతడి ఆత్మవిస్వాశాన్ని దెబ్బతీస్తుంది. ఒక తండ్రిగా నేను మిమ్మల్ని వేడుకుంటున్నా. ఈ కేసు ఉపసంహరించుకునేలా నా శక్తిమేర చేయల్సిదంతా చేస్తానని మీకు హామి ఇస్తున్నా. దయచేసి నా కొడుకుని ఇంటికి పంపించండి. అని షారూక్ తనకు వాట్సాప్ మెసేజ్‌లు చేశారని సమీర్ వాంఖడే ఆరోపించారు. అందుకు సమీర్ సమాధానంగా షారూక్ నువ్వొక మంచి మనిషిగా నాకు నీ గురించి తెలుసు. నేను జోనల్ డైరెక్టర్. సమాజాన్ని, పిల్లల జీవితాలన్ని కలుషితం చేస్తున్న వాటిని ప్రక్షాళ చేసే సర్వీస్ చేస్తున్నాను. కానీ కొందరూ నా ప్రయత్నాన్ని దుర్మార్గంగానూ, స్వార్థ ప్రయోజనాల కోసం చేస్తున్నట్లుగా బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని వాంఖడే స్రీన్‌షాట్ మెసేజ్‌లో పేర్కొన్నట్లు ఉంది. ఇదిలా ఉండగా, హైకోర్టులో సమీర్ వాంఖడేకు ఊరట లభించింది. మే 22 దాకా ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని సీబీఐని శుక్రవారం హైకోర్టు ఆదోశిచింది. కాగా, వాంఖడే తన కుటుంబంతో కలిసి పలుమార్లు విదేశాలకు వెళ్లాడని, ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నాడని ఎన్సీబీ నివేదిక పేర్కొనడం గమనార్హం. BREAKING : WhatsApp chats between Sameer Wankhede & Shahrukh Khan leaked. Chats from the time when Shahrukh Khan's son was in jail in connection with Cordelia cruise drug case. In the chats, Shahrukh Khan tells Sameer Wankhede: 'You promised you will reform my child and not… pic.twitter.com/sLUcDb2guX — Jan Ki Baat (@jankibaat1) May 19, 2023 (చదవండి: సిన్సియర్ సమీర్ వాంఖడే.. రోలెక్స్ వాచీ, ఫారిన్ ట్రిప్పులు, కోట్లు విలువ చేసే ప్లాట్లు?!) -
సిన్సియర్ సమీర్.. రోలెక్స్ వాచీ, ఫారిన్ ట్రిప్పులు, ప్లాట్లు?!
సిన్సియర్ ఆఫీసర్‌గా పేరొందిన సమీర్ వాంఖడే సంచలన ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఆర్యన్ ఖాన్ అరెస్ట్ వ్యవహారంలో ఈ నార్కోటిక్స్ మాజీ అధికారి అక్రమంగా వ్యవహరించాడంటూ సీబీఐ చెబుతోంది. ఆర్యన్‌ను ఈ కేసులో ఇరికించకుండా ఉండేందుకు ఆయన, మరికొందరు కలిసి పాతిక కోట్ల రూపాయల లంచం షారూఖ్ ఖాన్ కుటుంబం నుంచి డిమాండ్ చేశారనే అభియోగాలతో ముందుకు వెళ్తోంది సీబీఐ. అయితే.. ఆదాయంతో సంబంధం లేకుండా అడ్డగొలుగా ఆయన ఆస్తుల్ని వెనకేసుకున్నారని, అలాగే కుటుంబంతో కలిసి ఫారిన్ ట్రిప్పులకూ వెళ్లారని నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో(NCB) ఒక నివేదిక రూపొందించింది. ఈ నివేదిక ఆధారంగానే ఎఫ్ఐఆర్ నమోదుచేసిన సీబీఐ.. తన దర్యాప్తు కొనసాగించడం గమనార్హం. సిబిఐ పెట్టిన కేసుపై బాంబే హైకోర్టును ఆశ్రయించిన సమీర్ వాంఖడేకు సోమవారం వరకు ఊరట దక్కింది. Order Prima facie there is a legal bar under 17A of the PC Act and since a 41A notice is issued in the case..no coercive action against the petitioner till the next date Monday. #SameerWankhede#BombayHighCourt#CBI #AryanKhan — Live Law (@LiveLawIndia) May 19, 2023 2017 నుంచి 2021 మధ్య సమీర్ వాంఖడే ఆరుసార్లు కుటుంబంతో కలిసి విదేశాలకు వెళ్లాడు. ఆ జాబితాలో యూకే, ఐర్లాండ్, పోర్చ్‌గల్, సౌతాఫ్రికా, మాల్దీవ్స్ ఉన్నాయి. దాదాపు 55 రోజులు ఆ ట్రిపుల్లో గడిపాడు. ఆ పర్యటనల కోసం కేవలం రూ.8 లక్షల 75 వేలు మాత్రమే ఖర్చు చేశానని నివేదించాడాయన. కానీ, ఆ ఖర్చు విమాన ప్రయాణాలకే సరిపోతుందని అధికారులు అంటున్నారు. ఇక సమీర్ వాంఖడే ఆస్తులకు సంబంధించి కూడా విస్తూపోయే విషయాల్ని వెల్లడించింది ఎన్సీబీ రిపోర్ట్. సమీర్, ఆయన భార్య ఇద్దరి ఆదాయం కలిపి ఏడాదికి 45 లక్షల రూపాయలుగా ఐటీ రిటర్న్స్‌లో చూపించారు. కానీ, చేతికి 17 లక్షల రూపాయలకు తక్కువకాని ఓ రోలెక్స్ వాచీతో పాటు ముంబైలో కోట్లు ఖరీదు చేసే నాలుగు ప్లాట్లు, అలాగే.. వాసిం ఏరియాలో 41 వేల ఎకరాల జాగా ఆయన పేరు మీద ఉన్నట్లు తెలిపింది. ఇక కొత్తగా 82 లక్షల రూపాయలకు మరో ప్లాట్‌ను కొన్నారాయన. అయితే.. గోరేగావ్‌లో ఉన్న ఆ ప్లాట్ విలువ రూ.2.45 కోట్లుగా అధికారులు తేల్చారు. ఇవేకాదు.. పెళ్లికి ముందు కోటికి పైగా విలువ చేసే ఓ ప్లాట్‌ను సమీర్ ఖరీదు చేశాడు. అయితే ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందనే దానికి సమీర్ లెక్కలు చూపించలేదని సీబీఐ అంటోంది. Acceptance, tolerance, bravery, compassion. These are the things my mom taught me. The words of my mother echo constantly that my son is equal to thousands. Such inspiration lifts my spirit to epitome for each end every challenge and struggle…#MothersDay #SameerWankhede pic.twitter.com/pteBReu5bf — Sameer Wankhede (@swankhede_IRS) May 14, 2023 సెలబ్రిటీ పేరు వింటే.. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ముంబై విభాగం) మాజీ డైరెక్టర్ సమీర్ వాంఖడేపై స్థానిక మోడల్ మున్మున్ దామెచా సంచలన ఆరోపణలు చేశారు. కార్డిలియా డ్రగ్స్ వ్యవహారంలో అరెస్ట్ అయ్యి.. బెయిల్ మీద బయట ఉన్నారామె. ‘‘సమీర్‌కు పబ్లిసిటీ పిచ్చి. సెలబ్రిటీ అని తెలిస్తే చాలూ.. వాళ్లను ఏదో ఒకరకంగా జైలుకు పంపించేవాళ్లు. అలా మీడియాలో నానడం ఆయనకు ఇష్టం. అందుకే మోడల్స్‌ను, సెలబ్రిటీలను ఆయన టార్గెట్‌గా చేసుకునేవాళ్లు. ఈ కేసులో అన్యాయంగా నన్ను ఇరికించారాయన. తొలుత నాకేం కాదని ధైర్యం చెప్పే యత్నం చేశారు. ఆపై తాను ఒక మోడల్ అని తెలియగానే.. అరెస్ట్ చేయాలని ఆదేశించారు. కస్టడీలో ఉన్నప్పుడు కూడా తనను మానసికంగా వేధించారని తెలిపారామె. ఎన్సీబీ విజిలెన్స్ రిపోర్ట్ ప్రకారం.. ముంబైలో కార్డిలియా క్రూయిజ్ మీద దాడి జరిగాక.. ఆర్యన్ ఖాన్‌తో పాటు అతని స్నేహితుడు అర్బాజ్ మర్చంట్ పేర్లను చివరి నిమిషంలో సమీర్ టీం యాడ్ చేసింది. 2021, అక్టోబర్ 3వ తేదీన ఆర్యన్ ఖాన్‌ను అరెస్ట్ చేసింది. అలాగే.. రోలింగ్ పేపర్‌తో పట్టుబడ్డ ఓ యువతిని మాత్రం వదిలేసిందన్న ఆరోపణలు ఉన్నాయి. అదే సమయంలో ఆర్యన్ ఖాన్ కస్టడీ విషయంలో సమీర్ వాంఖడే వ్యవహరించిన తీరు పలు అనుమానాలకు తావిచ్చింది.అలాగే.. ఆర్యన్‌ను ఎన్సీబీ కార్యాలయానికి తీసుకొచ్చిన వ్యవహారానికి సంబంధించి తేడాలు కనిపిస్తున్నాయి అని ఎన్సీబీ విజిలెన్స్ నివేదిక వెల్లడించింది. BREAKING : WhatsApp chats between Sameer Wankhede & Shahrukh Khan leaked. Chats from the time when Shahrukh Khan's son was in jail in connection with Cordelia cruise drug case. In the chats, Shahrukh Khan tells Sameer Wankhede: 'You promised you will reform my child and not… pic.twitter.com/sLUcDb2guX — Jan Ki Baat (@jankibaat1) May 19, 2023 సమీర్‌కు ఊరట ఇదిలా ఉంటే సీబీఐ తనపై అరెస్ట్ సహా ఎలాంటి బలవంతపు చర్యలు చేపట్టకుండా ఆదేశించాలని కోరుతూ సమీర్ వాంఖడే బాంబే హైకోర్టును ఆశ్రయించారు. సీబీఐ కేసు తనపై ప్రతీకార చర్యగానే ఉందంటూ పిటిషన్లో పేర్కొన్నారాయన. ఈ క్రమంలో.. ఆయనకు ఊరట లభించింది. సోమవారం(22, మే) దాకా ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని సీబీఐని శుక్రవారం ఆదేశించింది బాంబే హైకోర్టు. గురువారం ఆయన సీబీఐ ఎదుట విచారణకు హాజరు కావాల్సి ఉండగా.. ఆయన మాత్రం గైర్హాజరు అయ్యారు. మరోవైపు.. ఎన్సీబీ డిప్యూటీ డైరెక్టర్ జ్ఞానేశ్వర్ సింగ్ తనను కులం పేరుతో దూషించారని, వేధింపులకు గురి చేశారని సమీర్ వాంఖడే ఆరోపిస్తున్నారు. ఆర్యన్ ఖాన్‌ను డ్రగ్స్ కేసు నుంచి బయటపడేసేందుకే జ్ఞానేశ్వర్ తనపై సీబీఐను ప్రయోగించారంటూ సంచలన ఆరోపణలు చేశారు కూడా. -
సమీర్ వాంఖడేపై సీబీఐ ఛార్జిషీట్.. రూ.25 కోట్ల అవినీతి ఆరోపణలు
న్యూఢిల్లీ: మాజీ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారి సమీర్ వాంఖడేపై సీబీఐ ఛార్జిషీట్ నమోదు చేసింది. బాలీవుడ్ స్టార్ హీరో షారూక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌పై డ్రగ్స్న్కేసులో రూ.25 కోట్లు లంచం డిమాండ్ చేసినట్లు అభియోగాలు మోపింది. ఈ కేసుకు సంబంధించి ముంబై, ఢిల్లీ, రాంచీ, కాన్పూర్లలో సీబీఐ ఇప్పటికే సోదాలు కూడా నిర్వహించింది. సమీర్ వాంఖడేతో పాటు మరో నలుగురు అధికారులపై కేసు కూడా నమోదు చేసింది. ముంబై క్రూయిజ్ డ్రగ్స్ కేసు రెయిడ్ సమయంలో.. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోకు ముంబై జోనల్ చీఫ్‌గా సమీర్ వాంఖేడే ఉన్నారు. షారూక్ తనయుడు ఆర్యన్‌పై ఆరోపణలు వచ్చిన ఆరోపణలపై ఈయనే తొలుత దర్యాప్తు చేశారు. ఈయనపై అవినీతి ఆరోపణలు రావడంతో కేసు నుంచి తప్పించి.. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ)కు పంపారు. ఆపై ముంబైలోని అనలైటిక్స్ అండ్ రిస్క్‌మేనేజ్‌మెంట్‌కు బదిలీ చేశారు. కిందటి ఏడాది నాన్-సెన్సిటివ్ పోస్టింగ్ మీద చెన్నైకు బదిలీ చేశారు. ఇక ఆర్యన్ వ్యవహారంలో వాంఖడే వ్యవహరించిన తీరుపైనా దర్యాప్తు కోసం యాంటీ డ్రగ్స్ ఏజెన్సీ(NCB) ఒక సిట్ ఏర్పాటు చేసింది. ఈ విజిలెన్స్ టీమ్ వాంఖడేను పలుమార్లు ప్రశ్నించింది. మరోవైపు ఈ వ్యవహారంలో నాలుగు వారాలపాటు జైల్లో గడిపిన షారూక్ ఖాన్ తనయుడికి .. సరైన ఆధారాలు లేకపోవడంతో 2022 మేలో క్లీన్చిట్ లభించింది. చదవండి: హృదయ విదారకం.. అంబులెన్సుకు డబ్బుల్లేక కుమారుడి శవంతో 200 కిమీ.. -
ఆర్యన్‌ఖాన్‌ను వదిలేసేందుకు రూ.25 కోట్లు!
న్యూఢిల్లీ: బాలీవుడ్ బాద్షా షారూక్‌ఖాన్ కుమారుడు ఆర్యన్‌ఖాన్‌ను మాదకద్రవ్యాల కేసులో ఇరికించకుండా ఉండడానికి రూ.25 కోట్లు డిమాండ్ చేశారన్న ఆరోపణలపై ఎన్సీబీ మాజీ అధికారి సమీర్ వాంఖేడెపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. శుక్రవారం ముంబై, ఢిల్లీ, రాంచీ, కాన్పూర్లలో మొత్తం 29 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. 2021, అక్టోబర్ 2న ఒక క్రూయిజ్ షిప్లో డ్రగ్స్‌ని సేవించాడన్న ఆరోపణలపై ఆర్యన్‌ఖాన్‌ను ఎన్సీబీ అరెస్ట్ చేయడం, ఆ తర్వాత క్లీన్ చిట్ ఇవ్వడం తెలిసిందే. వాంఖెడే దర్యాప్తు చేసిన ఈ కేసులో తప్పులుతడకలు ఉన్నాయని సిట్ దర్యాప్తులో ఇప్పటికే తేలింది. ఆర్యన్‌ను కేసు నుంచి వదిలేయడానికి రూ.25 కోట్లు డిమాండ్ చేశారన్న ఆరోపణలపై సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టింది. వాంఖేడె అడ్వాన్స్ కింద రూ.50 లక్షలు తీసుకున్నారని తమకు సమాచారం ఉందని సీబీఐ అధికారులు తెలిపారు. -
సమీర్ వాంఖడేపై సీబీఐ అవినీతి కేసు
ముంబై: సమీర్ వాంఖడే గుర్తున్నాడా?.. బాలీవుడ్ స్టార్ హీరో షారూక్ ఖాన్ కొడుకు ఆర్యన్‌పై డ్రగ్స్ ఆరోపణలను దర్యాప్తు చేసిన ఉన్నతాధికారి. అదిగో ఆ ఆఫీసర్‌పై శుక్రవారం సీబీఐ అవినీతి కేసు ఫైల్ చేసింది. అదీ ఆర్యన్ ఖాన్ వ్యవహారంతో ముడిపడిన ఆరోపణలపైనే కావడం గమనార్హం. సమీర్‌తో పాటు ఇతర అధికారులు.. ఆర్యన్‌ను డ్రగ్స్ కేసులో ఇరికించకుండా ఉండేందుకు పాతిక కోట్ల రూపాయల లంచం డిమాండ్ చేసినట్లు అభియోగాలు నమోదు చేసింది సీబీఐ. ఈ మేరకు ముంబై, ఢిల్లీ, రాంచీ, కాన్పూర్లలో సీబీఐ సోదాలు కూడా నిర్వహించింది. ముంబై క్రూయిజ్ డ్రగ్స్ కేసు రెయిడ్ సమయంలో.. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోకు ముంబై జోనల్ చీఫ్‌గా సమీర్ వాంఖేడే ఉన్నాడు. షారూక్ ఖాన్ కొడుకు ఆర్యన్‌పై ఆరోపణలు వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేసింది కూడా తొలుత ఈయనే. అయితే ఈ విచారణ సమయంలో ఆయన తీరుపై ఎన్నో విమర్శలు వచ్చాయి. దీంతో ఈ కేసు నుంచి తప్పించి.. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ)కు పంపారు. ఆపై ముంబైలోని అనలైటిక్స్ అండ్ రిస్క్‌మేనేజ్‌మెంట్‌కు బదిలీ చేశారు. కిందటి ఏడాది నాన్-సెన్సిటివ్ పోస్టింగ్ మీద చెన్నైకు బదిలీ చేశారు. ఇక ఆర్యన్ వ్యవహారంలో వాంఖడే వ్యవహరించిన తీరుపైనా దర్యాప్తు కోసం యాంటీ డ్రగ్స్ ఏజెన్సీ(NCB) ఒక సిట్ ఏర్పాటు చేయించింది. ఈ విజిలెన్స్ టీమ్ వాంఖడేను పలుమార్లు ప్రశ్నించింది కూడా. మరోవైపు ఈ వ్యవహారంలో నాలుగు వారాలపాటు జైల్లో గడిపిన షారూక్ ఖాన్ తనయుడు .. సరైన ఆధారాలు లేకపోవడంతో మే 2022లో క్లీన్ చిట్ దక్కించుకున్నాడు. సంబంధిత వార్త: సమీర్ అంటే ఒకప్పుడు వాళ్లకు ‘సింహస్వప్నం’ -
సమీర్ వాంఖడే కులంపై అనుమానాలు.. క్లీన్చిట్ ఇచ్చిన కాస్ట్ ప్యానెల్
ముంబై: నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) మాజీ ముంబై జోనల్ డైరెక్టర్, ఐఆర్ఎస్ అధికారి సమీర్ వాంఖడే జన్మతః ఎస్సీ వర్గానికి చెందిన మహర్ కులస్తుడని మహారాష్ట్ర సామాజిక న్యాయ విభాగం శుక్రవారం స్పష్టం చేసింది. ముస్లిం అయిన సమీర్ వాంఖడే నకిలీ ధ్రువపత్రాలతో ప్రభుత్వ ఉద్యోగం పొందారంటూ వచ్చిన ఆరోపణల్లో నిగ్గు తేల్చేందుకు ఏర్పాటైన కమిటీ ఈ మేరకు క్లీన్చిట్ ఇచ్చింది. సమీర్ వాంఖడే కులంపై మహారాష్ట్ర మాజీ మంత్రి, ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ తదితరులు అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు అందిన ఫిర్యాదులపై ముంబై జిల్లా కుల ధ్రువీకరణ పరిశీలన కమిటీ విచారణ జరిపింది. సమీర్, ఆయన తండ్రి ధ్యాన్‌దేవ్ వాంఖడేలు హిందూ మతం వీడి ఇస్లాం స్వీకరించినట్లు ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదని పేర్కొంది. 2021 అక్టోబర్‌లో ముంబై క్రూయిజ్ షిప్‌పై వాంఖడే నేతృత్వంలోని ఎన్సీబీ బృందం సోదాలు జరపడం, డ్రగ్స్ కలిగి ఉన్నారనే ఆరోపణలపై బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ సహా పలువురిని అదుపులోకి తీసుకోవడం తెలిసిన విషయమే. -
ఆ అధికారి ఒకప్పుడు ‘సింహస్వప్నం’.. ఇప్పుడేమో ఇలా..
ఒకప్పుడు.. ఆయనంటే నిజాయితీకి మారుపేరు. రంగంలోకి దిగితే ఎంతటి వాళ్లనైనా వదిలేవాడు కాదు అని ఆయన పని చేసే సంస్థలే ఆకాశానికి ఎత్తేవి. కానీ, ఇప్పుడు విమర్శలు, రాజకీయాలతో వివాదాలలో చిక్కుకున్నాడు. చివరకు బదిలీల మధ్య నలిగిపోతోంది ఆయన ప్రయాణం. యాంటీ నార్కోటిక్స్ మాజీ అధికారి సమీర్ వాంఖేడేపై మరో బదిలీ వేటు పడింది. తాజాగా ఆయన్ని చెన్నైలోని పన్నుల శాఖ విభాగానికి డైరెక్టోరేట్ జనరల్‌గా బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ముంబై: షారూక్ ఖాన్ కొడుకు ఆర్యన్‌పై ఆరోపణలు వచ్చిన ముంబై క్రూయిజ్ డ్రగ్స్ కేసును దర్యాప్తు చేసింది తొలుత ఈయనే. అయితే ఈ విచారణ సందర్భంగా ఎన్నో ఆరోపణలు ఎదుర్కొన్నాడు. దీంతో ఈ కేసు నుంచి తప్పించి.. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ)కు పంపారు. ఆపై ముంబైలోని అనలైటిక్స్ అండ్ రిస్క్‌మేనేజ్‌మెంట్‌కు బదిలీ చేశారు. ఇప్పుడేమో నాన్-సెన్సిటివ్ పోస్టింగ్ మీద చెన్నైకు బదిలీ చేశారు. షారూక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్‌కు డ్రగ్స్ కేసులో క్లీన్ చిట్ లభించిన నేపథ్యంలోనే ఈ చర్యలు తీసుకున్నట్లు స్పష్టం అవుతోంది. ముంబై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో చీఫ్‌గా ఉన్న టైంలో క్రూయిజ్ డ్రగ్స్ వ్యవహారాన్ని వెలుగులోకి తెచ్చాడాయన. దీంతో ఆయన్ని అంతా హీరోగా చూశారు. అయితే దర్యాప్తులో ఆయన పక్కాగా వ్యవహరించలేదని, కీలక విషయాల్ని పొందుపర్చలేదని, పైగా ఆర్యన్ ఖాన్‌ను ఇరికించే ప్రయత్నం చేశాడంటూ విమర్శలు వచ్చాయి. దీంతో గుర్రుగా ఉన్న కేంద్రం.. ఆయనపై చర్యలు తీసుకోవాలని ఆర్థిక మంత్రిత్వ శాఖను ఆదేశించింది. ఇక ఉద్యోగంలో చేరే సమయంలో ఫేక్ కాస్ట్ సర్టిఫికెట్ సమర్పించారని ఆయనపై మరో ఆరోపణ ఉండగా.. దానిపైనా విచారణ జరుగుతోంది. ముంబైలో పుట్టి, పెరిగిన సమీర్ వాంఖడే.. ఆయన తల్లిదండ్రులది మతాంతర వివాహం కావడంతో చిక్కుల్ని ఎదుర్కొంటున్నారు. 2008 ఇండియన్ రెవెన్యూ బ్యాచ్ కు చెందిన సమీర్ వాంఖడే.. అత్యున్నత దర్యాప్తు సంస్థలలో పనిచేయడంతో పాటు దాదాపు ప్రతి చోటా మెడల్స్ తన ఖాతాలో వేసుకున్నాడు. ► 2008లో ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్లో ఫస్ట్ పోస్టింగ్ తీసుకున్న సమీర్.. ముంబై ఎయిర్ పోర్ట్ లో కస్టమ్స్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ కమిషనర్‌గా పనిచేసినప్పుడు కస్టమ్స్ డ్యూటీ ఎగ్గొట్టే సెలబ్రెటీల పాలిట సింహస్వప్నంగా మారాడు. ► 2010లో మహారాష్ట్ర టాక్స్ డిపార్ట్మెంట్లో పనిచేసిన సమీర్. ఆ ఏడాది 2,500 మంది టాక్స్ ఎగవేత దారులపై కేసులు నమోదు చేశారు.. ఇందులో 200 మందికి పైగా సెలబ్రెటీలే ఉన్నారు.. ఆ ఏడాది ముంబైలో అదనంగా 87 కోట్ల పన్నులు వసూలు అయ్యింది. ► తను ముంబై ఎయిర్‌పోర్ట్‌లో విధులు నిర్వర్తించే సమయంలో జరిగిన 2011 క్రికెట్ వరల్డ్ కప్ ట్రోఫీకి సైతం కస్టమ్ డ్యూటీ వేశారు సమీర్.. బాలీవుడ్ సెలబ్రెటీల ఇళ్లల్లో అనేక రైడ్లు చేశారు.. ఇందులో అనురాగ్ కశ్యప్, వివేక్ ఒబేరాయ్, రామ్ గోపాల్ వర్మ కూడా ఉన్నారు. ► బ్యాంకాక్ నుంచి తిరిగి వచ్చిన సింగర్ మికా సింగ్.. దగ్గర నిబంధనలకు మించి కరెన్సీ, మద్యం దొరకడంతో అదుపులోకి తీసుకున్నాడు సమీర్. ఆపై నాలుగు గంటల తర్వాత లక్ష రూపాయల జరిమానాతో మికాను విడుదల చేశాడు. ► 2014-16 మధ్య డిప్యూటేషన్‌పై ఎన్ఐఏలో పనిచేసిన సమీర్.. ఆ సమయంలో ఎన్నో హై ప్రొఫైల్ టెర్రరిస్ట్ కేసులను హ్యాండిల్ చేసి ఎక్సలెన్స్ ఇన్ సర్వీస్ మెడల్ కూడా అందుకున్నారు.. ► ఆ తర్వాత 2017-20 మధ్య డీఆర్ఐ జాయింట్ డైరెక్టరేట్‌గా బదిలీ అయ్యారు.. ఆ సమయంలో ముంబై ఎయిర్‌పోర్ట్‌లో 180 కేజీల గోల్డ్ స్మగ్లింగ్ గుర్తించి.. సమీర్ ఓ రికార్డ్‌నే సృష్టించారు. ► బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ సూసైడ్ కేసులో కూడా సమీర్ వాంఖడేను ఏరికొరి మరి పిలిపించుకోని దర్యాప్తు బాధ్యతలను అప్పగించింది ఎన్సీబీ.. అప్పటి నుంచే ఈ కేసు దర్యాప్తులో వేగం పెరిగింది. ఈ కేసు టేకప్ చేశాక 33 మందిని అరెస్ట్ చేశారాయన. ► ఎన్సీబీలో తన పదవీ కాలం ముగుస్తుందనగా క్రూయిజ్ షిప్ డ్రగ్ రాకెట్ ను బయట పెట్టారు సమీర్… దీంతో ఆయన పదవీకాలాన్ని మరో ఆరు నెలల పాటు పొడిగించింది ఎన్సీబీ. ► అయితే ఎన్నో కేసుల్లో నిందితులతో ముందుగానే వాంగ్మూలాలను ఇప్పించేవారని.. దీనికి తన సోదరి క్రిమినల్ లాయర్ యాస్మిన్‌కు కూడా లింక్ ఉందన్న ఆరోపణలు వచ్చాయి. దానిపై సమీర్ కూడా కౌంటర్ ఇస్తూనే ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు.. నిజాయితీపరుడు, హీరో అనే ప్రశంసలు అందుకున్న ఓ అధికారి అవమానకరరీతిలో ఇలా బదిలీలు ఎదుర్కొవాల్సి వస్తోంది. సంబంధిత వార్త: నేను దళితుడినే.. సమీర్ వాంఖెడే -
7న నవాబ్ మాలిక్‌పై ధిక్కరణ కేసు విచారణ
ముంబై: మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ ఇప్పటికే వేరే కేసులో జైలులో ఉన్నందున, ధిక్కరణ కేసులో విచారణ చేపట్టడం కుదరదని ముంబై హైకోర్టు తెలిపింది. ఎన్సీబీ మాజీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే తండ్రి ధ్యాన్‌దేవ్ వాంఖడే వేసిన పిటిషన్‌పై సోమవారం విచారణ జరిగింది. కోర్టుకు ఇచ్చిన హామీని ఉల్లంఘిస్తూ నవాబ్ మాలిక్ తమ కుటుంబంపై అనేక వ్యాఖ్యలు చేశారంటూ ధ్యాన్‌దేవ్ పిటిషన్ వేశారు. నవాబ్ మాలిక్ కస్టడీ గడువు ఈ నెల 3వ తేదీ వరకు ఉన్నట్లు లాయర్ ఫెరోజ్ బరూచా తెలిపారు. దీంతో, న్యాయస్థానం మాలిక్‌కు ధిక్కరణ కేసులో నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను ఈనెల 7వ తేదీకి వాయిదా వేసింది. -
ఎన్సీబీ నుంచి తిరిగి డీఆర్ఐకి సమీర్ వాంఖడే
న్యూఢిల్లీ: నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) ముంబై జోనల్ డైరెక్టర్‌గా కొనసాగిన సమీర్ వాంఖడే తిరిగి మాతృసంస్థ అయిన డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) పరిధిలోకి వెళ్లిపోయారు. 2008 బ్యాచ్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్(ఐఆర్ఎస్) అధికారి అయిన సమీర్ వాంఖడే ఎన్సీబీ ముంబై విభాగం చీఫ్‌గా 2020 ఆగస్ట్ నుంచి కొనసాగుతున్నారు. 2021అక్టోబర్‌లో ముంబై తీరంలో క్రూయిజ్ నౌకలో సోదాలు జరిపి డ్రగ్స్ కలిగి ఉన్నారనే ఆరోపణలపై బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ సహా కొందరిని అదుపులోకి తీసుకోవడంతో వాంఖడే పేరు మార్మోగింది. డిసెంబర్ 31వ తేదీతో ఎన్సీబీలో వాంఖడే పదవీ కాలం ముగిసింది. కేంద్రం పదవీ కాలాన్ని పొడిగించకపోవడంతో తిరిగి వాంఖడే డీఆర్ఐకు వెళ్లిపోయారు. -
నా ఇంటిపై రెక్కీ: మాలిక్
ముంబై: ముంబై క్రూయిజ్ నౌకలో డ్రగ్స్ స్వాధీనం కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ), సంస్థ ఉన్నతాధికారి సమీర్ వాంఖెడేలపై కొంతకాలంగా ఆరోపణలు గుప్పిస్తున్న మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ ఈసారి కొత్త ఆరోపణలు చేశారు. అనుమానాస్పద వ్యక్తులు తన ఇల్లు, కుటుంబ సభ్యులపై నిఘా పెట్టారని శనివారం ముంబైలో ఆరోపించారు. ‘ గత వారం నేను దుబాయ్‌లో ఉన్నపుడు ముంబైలో నా ఇంటి వద్ద ఇద్దరు రెక్కీ నిర్వహించారు. కుటుంబ సభ్యులపై నిఘా పెట్టారు. ఇల్లు, ఆఫీస్, మనవళ్ల పాఠశాలల వద్ద కెమెరాలతో ఫొటోలు తీశారు. మా సమాచారం సేకరించారు. నా దగ్గర సాక్ష్యాలున్నాయి. తప్పుడు కేసులు పెట్టేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థల అధికారులు చేసిన వాట్సాప్ చాట్స్ నా వద్ద ఉన్నాయి. నాపై కేసులు పెడితే ఊరుకోను. ఈ విషయమై కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ముంబై పోలీస్ కమిషనర్ హేమంత్ నగ్రాలేలకు ఫిర్యాదుచేస్తా’ అని నవాబ్ మాలిక్ హెచ్చరించారు. -
డ్రగ్స్ బిజినెస్‌లో ఉన్నారా.. మీకిది తగునా?
ముంబై: ఎన్సీపీ నేత, మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖెడే మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. సమీర్ భార్య సోదరి గతంలో డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నారని ఆరోపిస్తూ తాజాగా మాలిక్ ట్వీట్ చేశారు. దీనికి తనదైన శైలిలో సమీర్ కౌంటర్ ఇచ్చారు. ‘గుడ్ వర్క్ మిత్రమా. కానీ ఒక మహిళ పేరును స్వప్రయోజనాల కోసం వాడుకోవడం ఎంత వరకు సమంజసం? నిజానికి, మేము పత్రికా ప్రకటనను జారీ చేసేటప్పుడు, మహిళల గౌరవాన్ని కాపాడటానికి వారి పేర్లు గోప్యంగా ఉంచుతాం. ఇద్దరు పిల్లలు, కుటుంబం ఉన్న మహిళ పేరును ఇలా బహిరంగపరచడం మీకు తగునా? మీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆలోచిస్తున్నామ’ని సమీర్ పేర్కొన్నారు. (చదవండి: మంత్రి నవాబ్ మాలిక్‌కు హైకోర్టు చురకలు) సమీర్ వదిన హర్షదా దీననాథ్ రెడ్కర్ పేరు మాదక ద్రవ్యాల నిరోధక చట్టం కింద 2008లో నమోదైన కేసులో ఉందని నవాబ్ మాలిక్ వెల్లడించారు. ‘సమీర్ దావూద్ వాంఖెడే.. మీ వదిన హర్షదా దీననాథ్ రెడ్కర్ డ్రగ్స్ వ్యాపారంలో ఉన్నారా? ఆమె కేసు పుణె కోర్టులో పెండింగ్‌లో ఉన్నందున మీరు సమాధానం చెప్పాల’ని నవాబ్ మాలిక్ ట్వీట్ చేశారు. 2008 జనవరిలో ఈ కేసు నమోదైనప్పుడు తాను సర్వీస్‌లో కూడా లేనని సమీర్ వాంఖడే తెలిపారు. 2017లో క్రాంతి రెడ్కర్‌ను వివాహం చేసుకున్నట్లు చెప్పారు. అయితే తన సోదరి ఈ కేసులో బాధితురాలిగా ఉందని సమీర్ భార్య క్రాంతి రెడ్కర్ అన్నారు. ఈ కేసు కోర్టు పరిధిలో ఉన్నందున తాము ఎటువంటి వ్యాఖ్యలు చేయబోమని అన్నారు. నవాబ్ మాలిక్‌ను తన సోదరి చట్టపరంగా ఎదుర్కొంటారని చెప్పారు. అలాగే ఈ కేసుతో తన భర్తకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. (చదవండి: ఆర్యన్ ఖాన్‌ను కిడ్నాప్ చేయాలనుకున్నారు) -
మంత్రి నవాబ్ మాలిక్‌కు హైకోర్టు చురకలు
ముంబై: ఎన్సీపీ నేత, మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్‌కు బాంబే హైకోర్టు చురకలు అంటించింది. కోర్టుకు వచ్చి సమాధానం చెప్పాలని ఆయనను ఉన్నత న్యాయస్థానం సోమవారం ఆదేశించింది. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖెడే తండ్రి ధ్యాన్‌దేవ్ వేసిన పరువు నష్టం దావా విచారణ సందర్భంగా ఈ ఆదేశాలు జారీ చేసింది. నవాబ్ మాలిక్ తమ కుటుంబ ప్రతిష్టకు భంగం కలిగించారంటూ ధ్యాన్‌దేవ్ పరువునష్టం దావా వేశారు. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ మాధవ్ జామ్‌ధార్ నేతృత్వంలోని వెకేషన్ బెంచ్.. అఫిడవిట్ ద్వారా సమాధానం ఇవ్వాలని మాలిక్‌ను ఆదేశించింది. ‘మీరు (నవాబ్ మాలిక్) రేపటిలోగా మీ సమాధానం ఇవ్వండి. మీరు ట్విటర్లోనే కాదు, ఇక్కడకు వచ్చి కూడా సమాధానం ఇవ్వొచ్చు’ అంటూ మాలిక్‌కు చురకలు అంటించింది. కాగా, ముంబై క్రూయిజ్ మాదక ద్రవ్యాల కేసు వెలుగులోకి వచ్చినప్పటి నుంచి సమీర్ వాంఖెడేను లక్ష్యంగా చేసుకుని ట్విటర్లో మాలిక్ పలు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అయితే వాంఖెడే కుటుంబానికి వ్యతిరేకంగా మళ్లీ ఎటువంటి ప్రకటనలు చేయకుండా మాలిక్‌కు హైకోర్టు ఆదేశాలు జారీ చేయలేదు. (చదవండి: ఆర్యన్ కేసు నుంచి వాంఖెడే అవుట్) ప్రతిరోజు తప్పుడు ప్రకటనలతో వాంఖెడే కుటుంబ పరువుకు నష్టం కలిగించేలా నవాబ్‌మాలిక్ ఆరోపణలు చేస్తున్నారని వాంఖెడే తరఫు న్యాయవాది అర్షద్ షేక్ కోర్టులో వాదించారు. సోషల్ మీడియాలో అసత్య పోస్ట్‌లు పెడుతూ మరింత ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. ఈ ఉదయం కూడా సమీర్ వాంఖడే భార్య సోదరి గురించి ట్వీట్ చేశారని వెల్లడించారు. కనీసం విచారణ ముగిసే వరకు నవాబ్ మాలిక్ ఎటువంటి ప్రకటనలు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును అభ్యర్థించారు. దావాపై అఫిడవిట్ దాఖలు చేయడానికి సమయం ఇవ్వాలని నవాబ్ మాలిక్ తరపు న్యాయవాది అతుల్ దామ్లే కోరారు. ఇతర వ్యక్తులు సోషల్ మీడియాలో వ్యాఖ్యానించిన వాటిని నవాబ్ మాలిక్ ఆపాదించడం సరికాదని కోర్టుకు తెలిపారు. కాగా, మీడియా సమావేశాలు, సోషల్ మీడియా తమ కుటుంబ పరువు తీసిన నవాబ్ మాలిక్‌పై రూ.1.25 కోట్లకు ధ్యాన్‌దేవ్ వాంఖెడే దావా వేశారు. (చదవండి: ఆర్యన్‌ను కిడ్నాప్ చేయాలనుకున్నారు) -
ఆర్యన్‌ను కిడ్నాప్ చేయాలనుకున్నారు
ముంబై: ఆర్యన్‌ఖాన్ డ్రగ్స్ కేసు నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ), బీజేపీ మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలతో రాజకీయ వేడిని పెంచుతోంది. షారూక్‌ఖాన్ కుమారుడు ఆర్యన్‌ఖాన్‌ని కిడ్నాప్ చేసి కోట్లు దండుకోవాలని కుట్రపన్నారని మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ కుట్రకి బీజేపీ నేత మోహిత్ భారతీయ ప్రధాన సూత్రధారని ఆరోపించారు. మాలిక్ ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ ఎన్సీబీ ముంబై జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖెడే కూడా కుట్రలో భాగస్వామేనని అన్నారు. క్రూయిజ్ నౌకపై దాడి జరగడానికి ముందు ఒషివరలోని ఒక శ్మశాన వాటిక వద్ద మోహిత్‌ను వాంఖెడే కలిశారన్నారు. అయితే వాంఖెడేకి అదృష్టం కలిసి వచ్చి సీసీటీవీ ఫుటేజీ దొరకలేదన్నారు. అయితే తనను ఎక్కడ ఇరికిస్తారోనన్న భయంతో వాంఖెడే డ్రగ్స్ కేసును ఆర్యన్‌పై బనాయించారన్నారు. వాంఖెడే ప్రైవేటు ఆర్మీలో మోహిత్ కూడా ఒక సభ్యుడని మాలిక్ ఆరోపించారు. జర్నలిస్టు ఆర్కె బజాజ్, అడ్వకేట్ ప్రదీప్ నంబియార్లు వాంఖెడే ప్రైవేటు ఆర్మీలో ఉన్నారన్నారు. ‘‘ఆర్యన్‌ని విడిచిపెట్టడానికి రూ.25 కోట్లు అడిగారు డీల్ రూ.18 కోట్లకు కుదిరింది. రూ.50 లక్షలు షారూక్ ఇచ్చారు. కానీ కిరణ్ గోసవితో ఆర్యన్ సెల్ఫీ బయటకొచ్చి వారి కుట్ర భగ్నమైంది’’ అని మాలిక్ చెప్పుకొచ్చారు. ‘సిట్’ విచారణకు ఆర్యన్ ఖాన్ గైర్హాజరు డ్రగ్స్ కేసులో నిందితుడైన ఆర్యన్ ఖాన్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) ఆధ్వర్యంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఎదుట ఆదివారం విచారణకు హాజరు కాలేదు. జ్వరంతో బాధ పడుతున్నానని, అందుకే హాజరు కాలేకపోతున్నారని ఆర్యన్ వివరణ ఇచ్చినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఆర్యన్ సోమవారం ‘సిట్’ ఎదుట హాజరయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. సహనిందితుడైన అర్బాజ్ మర్చంట్‌ను ఆదివారం సిట్ దాదాపు 9 గంటలు ప్రశ్నించింది. డ్రగ్స్ కేసులో మాస్టర్‌మైండ్‌గా ఆరోపణలు ఎదుర్కొంటున్న ముంబై బీజేపీ యువ నేత సునీల్ పాటిల్ ఆదివారం పోలీస్ ‘సిట్’ ముందు విచారణకు హాజరయ్యాడు. -
ఆర్యన్ కేసు నుంచి వాంఖెడే అవుట్
న్యూఢిల్లీ: బాలీవుడ్ సూపర్ స్టార్ షారూక్‌ఖాన్ కుమారుడు ఆర్యన్‌ఖాన్ నిందితుడుగా ఉన్న ముంబై క్రూయిజ్ డ్రగ్స్ కేసు మరో కీలక మలుపు తిరిగింది. ఎన్సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖెడేని ఈ కేసు విచారణ నుంచి తప్పించారు. ఆర్యన్‌ను విడిచిపెట్టడానికి ముడుపులు అడిగారని ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) ఈ నిర్ణయం తీసుకుంది. ఆర్యన్ డ్రగ్స్‌తో సహా ఆరు కేసుల్ని ముంబై జోన్ నుంచి ఢిల్లీలోని ఎన్సీబీ కేంద్ర కార్యాలయానికి బదిలీ చేస్తున్నట్టు శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ కేసుల్ని విచారించడానికి ఎన్సీబీ సీనియర్ అధికారి సంజయ్ సింగ్ ఆధ్వర్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేసింది. మహారాష్ట్ర మంత్రి, ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ అల్లుడు సమీర్ ఖాన్, నటుడు అర్మాన్ కొహ్లి కేసులు కూడా ఇందులో ఉన్నాయి. డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్‌ను విడిచిపెట్టడానికి రూ.25 కోట్లకు డీల్ కుదిరిందని అందులో వాంఖెడే వాటా రూ.8 కోట్లు అంటూ ఈ కేసులో సాక్షి ప్రభాకర్ సాయిల్ ఆరోపణలు ప్రకంపనలు సృష్టించాయి. దీనిపై వాంఖెడేపై శాఖాపరమైన దర్యాప్తు కూడా కొనసాగుతోంది. ఇక మంత్రి నవాబ్ మాలిక్ అడుగడుగునా వాంఖెడేపై ఆరోపణలు చేయడంతో ఈ కేసు రాజకీయ రంగు పులుముకుంది. ఎన్సీబీ మాత్రం డ్రగ్స్ కేసులో జాతీయ, అంతర్జాతీయ ముఠా హస్తం ఉందని, దీనిపై లోతుగా విచారించడం కోసమే సిట్ ఏర్పాటు చేసినట్టుగా తెలిపింది. వాంఖెడే ముంబై జోనల్ డీజీగా కొనసాగుతారని స్పష్టం చేసింది. ఇలా ఉండగా, ఆర్యన్ ఖాన్ శుక్రవారం ఎన్సీబీ కార్యాలయానికి వెళ్లి హాజరు వేయించుకున్నాడు. బాంబే హైకోర్టు ఆర్యన్‌కు బెయిల్ ఇస్తూ ప్రతీ శుక్రవారం ఎన్సీబీ కార్యాలయానికి వ్యక్తిగతంగా హాజరుకావాలని షరతు విధించింది. బెయిల్ వచ్చి న తర్వాత తొలిసారి శుక్రవారం మధ్యాహ్నం ఎన్సీబీ కార్యాలయానికి ఆర్యన్ వచ్చాడు. -
రూ. 70 వేల చొక్కా.. రూ.25 లక్షల వాచీ.. సమీర్‌పై మాటల దాడి
ముంబై: నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖెడేపై మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ దాడిని మరింత తీవ్రతరం చేశారు. వాంఖెడే రూ.70 వేల విలువైన షర్టు, రూ.25–50 లక్షల విలువైన వాచీలు వాడుతుంటారని ఆరోపించారు. నీతి నిజాయితీగల ఒక అధికారి అంతటి ఖరీదైన వస్తువులు ఎలా కొనుక్కోగలడని ప్రశ్నించారు. డ్రగ్స్ కేసుల్లో ప్రముఖుల్ని తప్పుడుగా ఇరికించి వారి నుంచి కోట్లు దండుకోవడమే అతను చేస్తున్న పని అని ఆరోపించారు. డ్రగ్స్ కేసుల్లో ఇరికించడానికి ఎన్సీబీకి ఒక ప్రైవేటు బృందం ఉందని మాలిక్ ఆరోపించారు. మాఫియాతో తనకి సంబం« దాలు ఉన్నాయని మాజీ సీఎం ఫడ్న వీస్ చేసిన ఆరోపణలను తిప్పికొట్టారు. (చదవండి: చైన్ స్నాచింగ్తోనే రూ.48 లక్షలు విలువ చేసే ఫ్లాట్, కారు కొన్నా!) -
దళితుడినే: సమీర్ వాంఖెడే
న్యూఢిల్లీ: నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) ముంబై జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖెడే సోమవారం ఢిల్లీలో జాతీయ ఎస్సీ కమిషన్(ఎన్సీఎస్సీ) చైర్పర్సన్ విజయ్ సాంప్లాను కలిశారు. తన కులాన్ని(దళిత) ధ్రువీకరించే పత్రాలను అందజేశారు. తాను ముమ్మాటికీ దళితుడినేనని పేర్కొన్నారు. ఎన్సీఎస్సీ కోరిన అన్ని పత్రాలను, సాక్ష్యాధారాలను అందజేశానని వాంఖెడే చెప్పారు. ముంబై తీరంలో క్రూయిజ్ నౌకలో పట్టుబడిన డ్రగ్స్ కేసును ఆయన దర్యాప్తు చేస్తున్నారు. యూపీఎస్సీ పరీక్షలో నెగ్గి, ఎస్సీ కోటాలో ఉద్యోగం సంపాదించడానికి వాంఖెడే కుల ధ్రువీకరణ పత్రాన్ని ఫోర్జరీ చేశాడని, ఆయన దళితుడు కాదని, జన్మతా.. ముస్లిం అని మహారాష్ట్ర మంత్రి, ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ ఆరోపిస్తున్నారు. డ్రగ్స్ కేసులో పట్టుబడిన బాలీవుడ్ నటుడు షారుక్‌ఖాన్ కొడుకు ఆర్యన్ నుంచి రూ.25 కోట్లు లంచం డిమాండ్ చేశారంటూ సమీర్ వాంఖెడే సహా ఇతర అధికారులపై వచ్చిన ఆరోపణలపై ఎన్సీబీ దర్యాప్తుకు ఆదేశించిన సంగతి తెలిసిందే. -
ఆర్యన్‌కు బెయిల్: ‘సినిమా అప్పుడే అయిపోలేదు’
ముంబై: డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ కుమారుడి ఆర్యన్ ఖాన్‌కి బాంబే హైకోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన ఆర్యన్ 20 రోజులకు పైగా జైలు జీవితం గడిపాడు. మూడు సార్లు బెయిల్ తిరస్కరించిన కోర్టు.. నేడు ఆర్యన్‌కి ఊరట కలిగించింది. డ్రగ్స్ కేసుకు సంబంధించి ఆర్యన్ కేసులో కీలకంగా వ్యవహరించిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడేపై ఎన్సీపీ నాయకుడు నవాబ్ మాలిక్ గత కొన్ని రోజులుగా సంచలన ఆరోపణలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్యన్‌కు బెయిల్ వచ్చిన సందర్భంగా నవాబ్ మాలిక్ సంచలన వ్యాఖ్యలు చేసి మరోసారి వార్తల్లో నిలిచారు. (చదవండి: ఎట్టకేలకు ఆర్యన్ ఖాన్‌కు బెయిల్) ఆర్యన్‌కు బెయిల్ వచ్చిన విషయం తెలిసిన వెంటనే నవాబ్ మాలిక్ ట్వీట్ చేశారు. అది కూడా షారుక్ ఖాన్ ఓం శాంతి ఓం సినిమాలోని ఫేమస్ డైలాగ్ ‘పిక్చర్ అభీ బాకీ హై మేరా దోస్త్’(సినిమా అప్పుడే అయిపోలేదు మిత్రమా) అంటూ ట్వీట్ చేశారు. ఎన్సీబీ డైరెక్టర్ సమీర్ వాంఖడేని ఉద్దేశించే నవాబ్ మాలిక్ ఇలా ట్వీట్ చేశారని నెటిజనులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ తెగ వైరలవుతోంది. (చదవండి: ఆర్యన్‌ఖాన్ నవ యవ్వనంలో ఉన్న బాధితుడు.. నిందితుడు కాదు) पिक्चर अभी बाकी है मेरे दोस्त — Nawab Malik نواب ملک नवाब मलिक (@nawabmalikncp) October 28, 2021 సింగిల్ బెంచ్ జస్టిస్ ఎన్వీ సంబ్రే.. ఆర్యన్‌తో పాటు ఆర్భాజ్ మర్చంట్, మున్మున్ ధమేచాలకు కూడా బెయిల్ మంజూరు చేశారు. ఈ సందర్భంగా జస్టిస్ సంబ్రే ‘‘మూడు అభ్యర్ధనలు అనుమతించాను. రేపు సాయంత్రంలోగా నేను వివరణాత్మక ఉత్తర్వులను జారీ చేస్తాను’’ అని తెలిపారు. చదవండి: ఆయన ఉండి ఉంటే: సీఎంకు నటి క్రాంతి వాంఖడే బహిరంగ లేఖ -
Aryan Khan drugs case: ఆయన ఉండి ఉంటే: సీఎంకు క్రాంతి వాంఖడే బహిరంగ లేఖ
-
ఆయన ఉండి ఉంటే: సీఎంకు నటి క్రాంతి వాంఖడే బహిరంగ లేఖ
సాక్షి, ముంబై: బాలీవుడ్ స్టార్హీరో కుమారుడు డ్రగ్స్ కేసు ప్రకంపనలు రోజుకో మలుపు తిరుగుతోంది. ఒకవైపు డ్రగ్స్ కేసులో హీరో షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ బెయిల్ వ్యవహారం వాయిదా పడుతూ వస్తోంది. మరోవైపు ఆర్యన్ ఖాన్‌ను అరెస్ట్ చేసి సంచలనం రేపిన ఎన్సీబీ ముంబై జోనల్ అధికారి సమీర్ వాంఖడేపై వేటు వేసుందుకు రంగం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో భార్య క్రాంతి రేడ్కర్ వాంఖడే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్సీపీ నేత, మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్, సమీర్ మధ్య ముదురుతున్న వివాదం నేపథ్యంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖను ట్విటర్లో పోస్ట్ చేశారు. మరాఠీ ప్రజల సమాన హక్కుల కోసం పోరాడుతున్న శివసేనను చూస్తూ పెరిగిన మరాఠీ అమ్మాయినైనా తాను ప్రతీరోజు అవమానాల పాలు కావాల్సి వస్తోందని, ఛత్రపతి శివాజీ మహారాజ్, బాలాసాహెబ్ రాష్ట్రంలో ఒక మహిళకు తీరని అవమానం జరుగుతోందని క్రాంతి వాపోయారు. ఈ రోజు బాలాసాహెబ్ ఇక్కడ ఉండి ఉంటే ఇలా జరిగేది కాదని ఆమె వ్యాఖ్యానించారు. బాలాసాహెబ్ ఠాక్రేల సిద్ధాంతాలను గౌరవిస్తూ పెరిగాను. ఎవరికీ అన్యాయం చేయకూడదని, అన్యాయాన్ని అస్సలు సహించకూడదని ఆ నేతలంతా తనకు నేర్పించారని ఆమె అన్నారు. బాలాసాబ్లో మిమ్మల్ని చూసుకుంటున్నానంటూ సీఎం ఠాక్రే నుద్దేశించి లేఖ రాశారు. తన కుటుంబానికి అన్యాయం చేయరనే విశ్వాసాన్ని ఆ లేఖలో వ్యక్తం చేశారు. ఈ మేరకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు లేఖ రాసిన క్రాంతి ఎన్సీబీ అధికారి, తన భర్త సమీర్ వాంఖడేకు న్యాయం చేయాలని కోరారు. అలాగే సీఎం అపాయింట్మెంట్ కోరినట్టు తెలుస్తోంది. సమీర్ పనిచేయడం, చాలా మందికి నచ్చడం లేదని, డ్రగ్స్ ద్వారా వచ్చే భారీ ఆదాయాన్ని వదులుకోవడం ఇష్టం లేదని వ్యాఖ్యానించారు. అందుకే ఆయన్ను తొలిగించాలని భావిస్తున్నారని, తమకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని క్రాంతి ఆరోపించారు. ఈ వ్యవహారంలో మాలిక్ ఆరోపణలను ఖండించిన సమీర్ వాంఖడే సోదరి, న్యాయవాది యాస్మీన్ గురువారం ముంబై పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. మంత్రి నవాబ్ మాలిక్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ లిఖితపూర్వక ఫిర్యాదును ఆమె సమర్పించారు. అయితే ఆమె ఫిర్యాదు మేరకు ఇప్పటివరకు ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు. కాగా ఆర్యన్ ఖాన్ కేసులో విచారణకు నాయకత్వం వహిస్తున్న ఎన్‌సిబి అధికారి సమీర్ వాంఖడే దోపిడీ, అక్రమ ట్యాపింగ్, పత్రాల ఫోర్జరీ ఆరోపణలు వెల్లు వెత్తాయి. క్రూయిజ్ షిప్ వివాదంలో ఆర్యన్ విడుదల కోసం రూ.25 కోట్లు డిమాండ్ చేశాడని ఒక సాక్షి ఆరోపించి అఫిడవిట్ దాఖలు చేయడంతో సమీర్ వాంఖడేపై విచారణకు ఆదేశించింది. దీనికి తోడు మంత్రి నవాబ్‌మాలిక్ కూడా సమీర్‌పై ఆరోపణలకు దిగారు. ప్రభుత్వ ఉద్యోగం కోసం మోసపూరితంగా జనన , మరియు, కుల ధృవీకరణ పత్రాన్ని పొందాడని ఆరోపించారు. మరోవైపు సినీ సెలబ్రెటీలను టార్గెట్ చేసి ఎన్సీబీ దాడులు చేస్తోందని రాష్ట్రంలో అధికారంలో ఉన్న శివసేన ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. माननीय उद्धव ठाकरे साहेब @CMOMaharashtra पत्रास करण की … pic.twitter.com/0VJxURk5oi — Kranti Redkar Wankhede (@KrantiRedkar) October 28, 2021 -
వాంఖెడే X నవాబ్ మాలిక్
ముంబై: ముంబై తీరంలోని నౌకలో మాదకద్రవ్యాలు లభించిన కేసులో ఇప్పుడు అందరి దృష్టి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖెడేపైనే ఉంది. వాంఖెడేపై వచ్చిన ముడుపుల ఆరోపణలకు సంబంధించి బుధవారం ఆయనపై శాఖాపరమైన దర్యాప్తు మొదలైంది. ఈ కేసులో వాంఖెడేపై రోజుకొక కొత్త ఆరోపణలు వెలుగులోకి వస్తున్నాయి. అవినీతి దందా, ఫోన్ ట్యాపింగ్, సాక్షుల్ని ముందే కూడగట్టారు, జన్మతః ముస్లిం వంటి ఆరోపణలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్, సమీర్ వాంఖెడేపై మధ్య పోరాటంగా ఈ కేసు మలుపులు తిరుగుతోంది. అయిదుగురు సభ్యులున్న విజిలెన్స్ దర్యాప్తు బృందం బుధవారం ఉదయం ముంబైకి చేరుకొని వాంఖెడేపై విచారణ మొదలు పెట్టింది. ఈ బృందానికి నేతృత్వం వహిస్తున్న ఎన్సీబీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (డీడీజీ) జ్ఞానేశ్వర్ సింగ్ అవినీతి అరోపణలపై సమీర్ వాంఖెడే స్టేట్మెంట్ను రికార్డు చేసినట్టుగా మీడియాకి వెల్లడించారు. వాంఖెడే స్టేట్మెంట్ రికార్డు చేయడానికి నాలుగున్నర గంటలకు పైగా పట్టింది. ఎన్సీబీ కార్యాలయం నుంచి ఈ కేసుకి సంబంధించి కీలకమైన డాక్యుమెంట్లు కూడా తీసుకున్నారు. అయితే వాంఖెడే తనపై వచ్చిన ఆరోపణలపై ఏమంటున్నారో ఆయన వెల్లడించలేదు. శాఖాపరమైన దర్యాప్తు జరుగుతోంది కాబట్టి ఇప్పుడే వివరాలను బయటపెట్టలేమన్నారు. అవసరమైతే వాంఖెడే నుంచి మళ్లీ సమాచారం సేకరిస్తామని జ్ఞానేశ్వర్ సింగ్ తెలిపారు. మరోవైపు ఇదే కేసులో ఆర్యన్‌ఖాన్‌ని విడిచిపెట్టడానికి ఎన్సీబీ అధికారులు రూ.25 కోట్లు డిమాండ్ చేశారని ఆరోపించిన సాక్షి ప్రభాకర్ సాయిల్ స్టేట్మెంట్ను ముంబై పోలీసులు రికార్డు చేశారు. సాయిల్ రికార్డు పూర్తి చేయడానికి వారికి ఎనిమిది గంటల సమయం పట్టింది. మంగళవారం సాయంత్రం మొదలైన ప్రక్రియ బుధవారం తెల్లవారుజామున 3 గంటలకి ముగిసింది. మరోవైపు సాయిల్కి ఎవరూ హాని తలపెట్టకుండా మహారాష్ట్ర పోలీసులు ఆయనకు భద్రత ఏర్పాటు చేశారు. ఆర్యన్ బెయిల్‌పై కొనసాగుతున్న వాదనలు ముంబై క్రూయిజ్ డ్రగ్స్ కేసులో బాలీవుడ్ బాద్షా షారుక్‌ఖాన్ కుమారుడు ఆర్యన్‌ఖాన్ బెయిల్ పిటిషన్‌పై వరసగా రెండోరోజు బుధవారం బాంబే హైకోర్టులో వాదనలు కొనసాగాయి. ఆర్యన్‌ఖాన్, అర్బాజ్ మర్చంట్, మున్మున్ ధమేచాలు కుట్ర చేశారని ఆరోపిస్తున్న ఎన్సీబీ ఈ అంశంలో అధికారికంగా ఎలాంటి అభియోగాలు నమోదు చేయలేదని న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌డబ్ల్యూ సాంబ్రే దృష్టికి లాయర్లు తీసుకువచ్చారు. అరెస్ట్ మెమోలో సరైన సాక్ష్యాధారాలేవీ లేవని సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహత్గీ చెప్పారు. మరోవైపు ఇదే కేసులో అరెస్టయిన మరో ఇద్దరికి ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసినప్పుడు తమ క్లయింట్లకు ఎందుకు ఇవ్వడం లేదని మరో న్యాయవాది అమిత్ దేశాయ్ ప్రశ్నించారు. తదుపరి విచారణ గురువారానికి వాయిదా పడింది. షారుఖ్‌కు గతంలో జరిమానా! బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్‌కు సమీర్ వాంఖెడేతో పరిచయం కొత్తదేమీ కాదు. 2011లో ముంబై విమానాశ్రయంలో కస్టమ్స్ శాఖలో అసిస్టెంట్ కమిషనర్‌గా పనిచేసిన కాలంలోనే సమీర్... షారుఖ్‌కు చుక్కలు చూపించారు. అప్పట్లో హాలెండ్, లండన్లలో సెలవులు గడిపి ముంబైకి తిరిగివచ్చిన షారుఖ్ దగ్గర పరిమితికి మించిన అధిక బ్యాగేజీ ఉందని సమీర్ వాంఖెడే ఆయన్ను విచారించారు. రూ.1.5 లక్షల జరిమానా విధించి వదిలిపెట్టారు. -
ఆర్యన్‌ఖాన్ నవ యవ్వనంలో ఉన్న బాధితుడు.. నిందితుడు కాదు
ముంబై: ముంబై తీరంలోని నౌకలో డ్రగ్స్ లభించిన కేసులో అరెస్టయిన బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్‌ఖాన్ కుమారుడైన ఆర్యన్‌ఖాన్ బెయిల్ పిటిషన్‌పై బాంబే హైకోర్టులో బుధవారం కూడా వాదనలు కొనసాగనున్నాయి. ఆర్యన్‌ను అక్రమంగా అరెస్ట్ చేశారని, అతని వద్ద మాదక ద్రవ్యాలున్నట్టు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) దగ్గర ఆధారాలేవీ లేవని అతని తరఫు లాయర్లు ముకుల్ రోహత్గి, సతీష్ మానెషిండే వాదనలు వినిపించారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.డబ్ల్యూ సాంబ్రె ఎదుట మంగళవారం రోజంతా ఆర్యన్ తరఫు లాయర్లు వాదించారు. ఎన్సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖెడేపై వచ్చిన ముడుపుల ఆరోపణల అంశంలో కూడా ఆర్యన్‌కు ఎలాంటి ఫిర్యాదులు లేవని, అనవసర వివాదాల జోలికి అతను పోవడం లేదని లాయర్లు కోర్టుకు చెప్పారు. ఆ నౌకలో తక్కువ మొత్తంలో డ్రగ్స్ లభ్యమైనా ఎన్సీబీ అరెస్ట్‌లు చేసిందని నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టెన్సస్ (ఎన్డీపీఎస్) చట్టం ప్రకారం నవ యవ్వనంలో ఉన్న వారిని బాధితులుగా చూడాలే తప్ప, నిందితులుగా కాదని రోహత్గీ తన వాదనలు వినిపించారు. ఆర్యన్ గతంలో మాదకద్రవ్యాలు సేవించినట్టు ఎలాంటి ఆధారాలు లేవని , అతనొక యువకుడని పేర్కొన్నారు. ఆర్యన్ దగ్గర డ్రగ్స్ లభించలేదని, అతను మాదక ద్రవ్యాలను సేవించాడని కూడా రుజువు కాలేదన్నారు. అర్బాజ్ వద్ద డ్రగ్స్ లభిస్తే అతని వెంట ఉన్న ఆర్యన్‌ని ఎలా అరెస్ట్ చేస్తారని రోహత్గి ప్రశ్నించారు. కొంతమంది స్వార్థ ప్రయోజనాల కోసం, అనవసర వివాదాలు తలెత్తి మీడియాలో ప్రాచుర్యం రావడం వల్ల ఈ కేసు పెద్దదిగా కనిపిస్తోందని, కానీ ఇది చాలా చిన్న కేసని రోహత్గి వాదించారు. (చదవండి: వివాహేతర సంబంధం: పిల్లలకు నిప్పంటించి..) ఆర్యన్‌తో బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన అర్బాజ్ మర్చంట్, మున్మున్ ధమేచా బెయిల్ పిటిషన్‌పైనా ఎన్సీబీ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ అనిల్ సింగ్ వాదనలు బుధవారం కొనసాగనున్నాయి. మరోవైపు ఇదే కేసులో అరెస్టయిన మనీష్ రాజ్గరియా, అవిన్ సాహులకు మంగళవారం ప్రత్యేక ఎన్డీపీఎస్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 2న ముంబై తీరంలో డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్న సమయంలో ఎన్సీబీ 20 మందిని అదుపులోనికి తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆ నౌకలో వీరిద్దరూ అతిథులుగా వచ్చారని ఎన్సీబీ చెప్పడంతో కోర్టు వారికి బెయిల్ ఇచ్చింది. మరోవైపు తన భర్త సమీర్ వాంఖెడే ప్రాణాలకు ముప్పు ఉందని ఆయన భార్య, నటీమణి క్రాంతి రేడ్కర్ ఆందోళన వ్యక్తం చేశారు. తమకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఎక్కువైందని మంగళవారం ఆమె విలేకరులకు తెలిపారు. భయపడుతూ బతికే రోజులు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్త నీతి, నిజాయతీ పరుడైన ప్రభుత్వ అధికారి అని ఆమె తెలిపారు. ఫోన్ల అక్రమ ట్యాపింగ్: మాలిక్ ఎన్సీబీ జోనల్ డైరెక్టర్, ఆర్యన్‌ఖాన్ డ్రగ్స్ కేసులో కీలకంగా వ్యవహరిస్తున్న సమీర్ వాంఖెడే కొంతమంది ఫోన్లను అక్రమంగా ట్యాప్ చేశారని మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ ఆరోపించారు. ఈ ఏడాది జనవరిలో డ్రగ్స్ కేసులో ఎన్సీబీ నవాబ్ మాలిక్ అల్లుడిని అరెస్ట్ చేసింది. అప్పట్నుంచి వాంఖెడేని లక్ష్యంగా చేసుకొని మాలిక్ ఆరోపణల్ని తీవ్రతరం చేస్తున్నారు. ముంబై, పుణెలోని ఇద్దరి వ్యక్తుల సాయంతో కొందరి ఫోన్లు అక్రమంగా ట్యాప్ చేశారని, పోలీసుల నుంచి కాల్ రికార్డులు తెప్పించుకున్నారని ఆరోపించారు. వాంఖెడే అవినీతి, అక్రమాలపై తనకు ఎందరో లేఖలు రాశారని, వాటిని ఎన్సీబీ డీజీ దృష్టికి తీసుకువెళతానని చెప్పారు. మరోవైపు వాంఖెడే ఢిల్లీలోని ఎన్సీబీ ప్రధాన కార్యాలయానికి వెళ్లి 2 గంటల సేపు అక్కడే ఉన్నారు. (చదవండి: బైక్‌పై చిన్నారులుంటే.. వేగం 40 కి.మీ. మించరాదు)