CBI Files Corruption Case Against Ex-NCB Officer Sameer Wankhede - Sakshi
Sakshi News home page

సమీర్ వాంఖడేపై సీబీఐ ఛార్జిషీట్.. షారుక్ తనయుడి కేసులో రూ.25 కోట్ల లంచం అడిగినట్లు అభియోగం

Published Mon, May 15 2023 1:19 PM | Last Updated on Mon, May 15 2023 1:39 PM

Cbi Files Corruption Chargesheet Against Sameer Wankhede - Sakshi

న్యూఢిల్లీ: మాజీ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారి సమీర్ వాంఖడేపై సీబీఐ ఛార్జిషీట్ నమోదు చేసింది.  బాలీవుడ్‌ స్టార్‌ హీరో షారూక్‌ ఖాన్‌ కుమారుడు ఆర్యన్‌ ఖాన్‌పై డ్రగ్స్న్‌కేసులో రూ.25 కోట్లు లంచం డిమాండ్ చేసినట్లు అభియోగాలు మోపింది. ఈ కేసుకు సంబంధించి ముంబై, ఢిల్లీ, రాంచీ, కాన్పూర్‌లలో సీబీఐ ఇప్పటికే సోదాలు కూడా నిర్వహించింది. సమీర్‌ వాంఖడేతో పాటు మరో నలుగురు అధికారులపై కేసు కూడా నమోదు చేసింది.

ముంబై క్రూయిజ్‌ డ్రగ్స్‌ కేసు రెయిడ్‌ సమయంలో.. నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరోకు ముంబై జోనల్‌ చీఫ్‌గా సమీర్‌ వాంఖేడే ఉన్నారు.    షారూక్‌ తనయుడు ఆర్యన్‌పై ఆరోపణలు వచ్చిన ఆరోపణలపై ఈయనే తొలుత దర్యాప్తు చేశారు.  ఈయనపై అవినీతి ఆరోపణలు రావడంతో కేసు నుంచి తప్పించి.. డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌(డీఆర్‌ఐ)కు పంపారు. ఆపై ముంబైలోని అనలైటిక్స్‌ అండ్‌ రిస్క్‌మేనేజ్‌మెంట్‌కు బదిలీ చేశారు. కిందటి ఏడాది నాన్‌-సెన్సిటివ్‌ పోస్టింగ్‌ మీద చెన్నైకు బదిలీ చేశారు. 

ఇక ఆర్యన్‌ వ్యవహారంలో వాంఖడే వ్యవహరించిన తీరుపైనా దర్యాప్తు కోసం యాంటీ డ్రగ్స్‌ ఏజెన్సీ(NCB) ఒక సిట్‌ ఏర్పాటు చేసింది. ఈ విజిలెన్స్ టీమ్ వాంఖడేను పలుమార్లు ప్రశ్నించింది. మరోవైపు ఈ వ్యవహారంలో నాలుగు వారాలపాటు జైల్లో గడిపిన షారూక్‌ ఖాన్‌ తనయుడికి .. సరైన ఆధారాలు లేకపోవడంతో 2022 మేలో క్లీన్‌చిట్‌ లభించింది.

చదవండి: హృదయ విదారకం.. అంబులెన్సుకు డబ్బుల్లేక కుమారుడి శవంతో 200 కిమీ..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement