ముంబై: సమీర్ వాంఖడే గుర్తున్నాడా?.. బాలీవుడ్ స్టార్ హీరో షారూక్ ఖాన్ కొడుకు ఆర్యన్‌పై డ్రగ్స్ ఆరోపణలను దర్యాప్తు చేసిన ఉన్నతాధికారి. అదిగో ఆ ఆఫీసర్‌పై శుక్రవారం సీబీఐ అవినీతి కేసు ఫైల్ చేసింది. అదీ ఆర్యన్ ఖాన్ వ్యవహారంతో ముడిపడిన ఆరోపణలపైనే కావడం గమనార్హం.
సమీర్‌తో పాటు ఇతర అధికారులు.. ఆర్యన్‌ను డ్రగ్స్ కేసులో ఇరికించకుండా ఉండేందుకు పాతిక కోట్ల రూపాయల లంచం డిమాండ్ చేసినట్లు అభియోగాలు నమోదు చేసింది సీబీఐ. ఈ మేరకు ముంబై, ఢిల్లీ, రాంచీ, కాన్పూర్‌లలో సీబీఐ సోదాలు కూడా నిర్వహించింది.
ముంబై క్రూయిజ్ డ్రగ్స్ కేసు రెయిడ్ సమయంలో.. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోకు ముంబై జోనల్ చీఫ్‌గా సమీర్ వాంఖేడే ఉన్నాడు. షారూక్ ఖాన్ కొడుకు ఆర్యన్‌పై ఆరోపణలు వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేసింది కూడా తొలుత ఈయనే. అయితే ఈ విచారణ సమయంలో ఆయన తీరుపై ఎన్నో విమర్శలు వచ్చాయి.
దీంతో ఈ కేసు నుంచి తప్పించి.. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్‌ఐ)కు పంపారు. ఆపై ముంబైలోని అనలైటిక్స్ అండ్ రిస్క్‌మేనేజ్‌మెంట్‌కు బదిలీ చేశారు. కిందటి ఏడాది నాన్-సెన్సిటివ్ పోస్టింగ్ మీద చెన్నైకు బదిలీ చేశారు. ఇక ఆర్యన్ వ్యవహారంలో వాంఖడే వ్యవహరించిన తీరుపైనా దర్యాప్తు కోసం యాంటీ డ్రగ్స్ ఏజెన్సీ(NCB) ఒక సిట్ ఏర్పాటు చేయించింది. ఈ విజిలెన్స్ టీమ్ వాంఖడేను పలుమార్లు ప్రశ్నించింది కూడా.
మరోవైపు ఈ వ్యవహారంలో నాలుగు వారాలపాటు జైల్లో గడిపిన షారూక్ ఖాన్ తనయుడు .. సరైన ఆధారాలు లేకపోవడంతో మే 2022లో క్లీన్ చిట్ దక్కించుకున్నాడు.
సంబంధిత వార్త: సమీర్ అంటే ఒకప్పుడు వాళ్లకు ‘సింహస్వప్నం’
Comments
Please login to add a commentAdd a comment