న్యూఢిల్లీ: బాలీవుడ్ బాద్‌షా షారూక్‌ఖాన్ కుమారుడు ఆర్యన్‌ఖాన్‌ను మాదకద్రవ్యాల కేసులో ఇరికించకుండా ఉండడానికి రూ.25 కోట్లు డిమాండ్ చేశారన్న ఆరోపణలపై ఎన్‌సీబీ మాజీ అధికారి సమీర్ వాంఖేడెపై సీబీఐ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. శుక్రవారం ముంబై, ఢిల్లీ, రాంచీ, కాన్పూర్‌లలో మొత్తం 29 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది.
2021, అక్టోబర్ 2న ఒక క్రూయిజ్ షిప్‌లో డ్రగ్స్‌ని సేవించాడన్న ఆరోపణలపై ఆర్యన్‌ఖాన్‌ను ఎన్‌సీబీ అరెస్ట్ చేయడం, ఆ తర్వాత క్లీన్ చిట్ ఇవ్వడం తెలిసిందే. వాంఖెడే దర్యాప్తు చేసిన ఈ కేసులో తప్పులుతడకలు ఉన్నాయని సిట్ దర్యాప్తులో ఇప్పటికే తేలింది. ఆర్యన్‌ను కేసు నుంచి వదిలేయడానికి రూ.25 కోట్లు డిమాండ్ చేశారన్న ఆరోపణలపై సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టింది. వాంఖేడె అడ్వాన్స్ కింద రూ.50 లక్షలు తీసుకున్నారని తమకు సమాచారం ఉందని సీబీఐ అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment