ముంబై: నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖెడేపై మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ దాడిని మరింత తీవ్రతరం చేశారు. వాంఖెడే రూ.70 వేల విలువైన షర్టు, రూ.25–50 లక్షల విలువైన వాచీలు వాడుతుంటారని ఆరోపించారు. నీతి నిజాయితీగల ఒక అధికారి అంతటి ఖరీదైన వస్తువులు ఎలా కొనుక్కోగలడని ప్రశ్నించారు.
డ్రగ్స్ కేసుల్లో ప్రముఖుల్ని తప్పుడుగా ఇరికించి వారి నుంచి కోట్లు దండుకోవడమే అతను చేస్తున్న పని అని ఆరోపించారు. డ్రగ్స్ కేసుల్లో ఇరికించడానికి ఎన్‌సీబీకి ఒక ప్రైవేటు బృందం ఉందని మాలిక్ ఆరోపించారు. మాఫియాతో తనకి సంబం« దాలు ఉన్నాయని మాజీ సీఎం ఫడ్న వీస్ చేసిన ఆరోపణలను తిప్పికొట్టారు.
(చదవండి: చైన్ స్నాచింగ్‌తోనే రూ.48 లక్షలు విలువ చేసే ఫ్లాట్, కారు కొన్నా!)
Comments
Please login to add a commentAdd a comment