Shirts
-
మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి స్టార్ ఫ్యాషన్ డిజైనర్‌గా..
ఫ్యాషన్ డిజైనర్‌కు రెండు కళ్లతో పాటు మూడో కన్ను ఉండాలి. ఆ కన్ను చారిత్రక,సాంస్కృతిక వైభవాన్ని చూడగలగాలి. కాలంతో పాటు నడుస్తూనే ముందు కాలాన్ని చూడగలగాలి. జైపూర్‌కు చెందిన ఫ్యాషన్ డిజైనర్ హర్ష్ అగర్వాల్‌కు ఈ సామర్థ్యం ఉంది. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన 27 సంవత్సరాల హర్ష్ అగర్వాల్ ‘హరగో హ్యాండ్ ఎంబ్రాయిడ్ షర్ట్స్’తో అంతర్జాతీయ స్థాయిలో గెలుపు జెండా ఎగరేశాడు.... రెండు సంవత్సరాల క్రితం...ఆరోజు హర్ష్ అగర్వాల్ ఫ్యాషన్ లేబుల్ ఇన్స్టాగ్రామ్ ఎకౌంట్‌కు నోటిఫికేషన్ల వరద మొదలైంది. పాపులర్ ఇంగ్లిష్ సింగర్ హారీ స్టైల్స్ ‘హరగో హ్యాండ్ ఎంబ్రాయిడ్ షర్ట్స్’ ధరించి ఉన్న ఫొటోలు అవి. జైపూర్ ఫ్యాషన్ బ్రాండ్ అంతర్జాతీయ స్థాయిలో వెలిగిపోతుంది అని చెప్పడానికి ఇది చిన్న ఉదాహరణ మాత్రమే. ‘ఇలా ఉండాలి. అలా ఉండాలి’ అంటూ చిన్నప్పుడు తన దుస్తులను తానే డిజైన్ చేయించేవాడు హర్ష్. ‘ఎకనామిక్స్ అండ్ బిజినెస్’లో పట్టా పుచ్చుకున్న హర్ష్ వేరే దారిలో ప్రయాణిస్తానని ఊహించలేదు. ‘ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్’ ఇంటర్న్‌షిప్ న్యూయార్క్‌లో చేస్తున్న రోజుల్లో ‘ఫ్యాషన్’ అనే మాట ఎక్కడ వినబడితే తాను అక్కడ ఉండేవాడు. పేరున్న ఫ్యాషన్ డిజైనర్లతో ముచ్చటించేవాడు. ఈ క్రమంలో తనకు సొంతంగా ఏదైనా చేయాలనిపించేది. ఇండియాకు తిరిగివచ్చిన తరువాత...పశ్చిమ బెంగాల్ నుంచి గుజరాత్ వరకు ఎన్నో ప్రాంతాలకు వెళ్లి మన చేనేతకళావైభవాన్ని రెండు కళ్లలో పదిలపరుచుకున్నాడు. వాటి నుంచి స్ఫూర్తి తీసుకొని తల్లి, సోదరితో కలిసి ‘హరగో హ్యాండ్స్’ అనే మెన్స్‌వేర్ లేబుల్‌కు శ్రీకారం చుట్టాడు. ముగ్గురితో మొదలైన ‘హరగో’లో ఇప్పుడు 20 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ టీమ్‌లో టైలర్లు, జూనియర్ డిజైనర్లు, ప్రొడక్షన్ ఇన్‌చార్జ్‌లు ఉన్నారు. ‘హస్తకళలపై ఎక్కువగా దృష్టి కేంద్రీకరించాలనుకున్నాను. మన దేశానికి తనదైన గొప్ప సాంస్కృతిక, శిల్పకళావైభవం ఉంది. అది చేతివృత్తి కళాకారుల పనిలో ప్రతిఫలిస్తుంది. అలాంటి వారికి సహాయంగా నిలవాలనుకున్నాను’ అంటాడు హర్ష్ అగర్వాల్. ఒక డిజైన్ హిట్ అయిన తరువాత దాని వెంటే పయనించడం అని కాకుండా ఎప్పటికప్పుడు కొత్త కొత్త డిజైన్లపై వర్క్ చేస్తుంటాడు హర్ష్. ప్రతి రోజు ఒక కొత్త శాంపిల్ రూపొందిస్తాడు. 105 పీస్‌లు రెడీ కాగానే ప్రీ–ఆర్డర్స్ కోసం సోషల్ మీడియా పేజీలలో ప్రకటిస్తాడు. కోవిడ్ కల్లోలం సద్దుమణిగిన తరువాత కొత్త కలెక్షన్ కోసం ఇంటర్నేషనల్ బయర్స్ నుంచి ఆర్డర్లు వెల్లువెత్తాయి. లేబుల్ క్లాతింగ్ రిటైలర్లలో మ్యాచెస్ ష్యాషన్–లండన్, సెసెన్స్(మాంట్రియల్), ఎల్ఎమ్డీఎస్–షాంఘై, బాయ్‌హుడ్–కొరియా...మొదలైనవి ఉన్నాయి. ‘హరగో’కు ఇది టిప్పింగ్ పాయింట్‌గా మారింది. బ్రాండ్ అభిమానుల్లో ఇంగ్లాండ్‌కు చెందిన టెలివిజన్ హోస్ట్, ఫ్యాషన్ డిజైనర్ టాన్ ఫ్రాన్స్ ఉన్నాడు. ‘కొన్ని నెలల క్రితం హర్ష్ బ్రాండ్ గురించి విన్నాను. నా నెట్‌ఫ్లిక్స్ షో కోసం అతడు డిజైన్ చేసిన దుస్తులు ధరించాను. కొత్తగా, కంఫర్ట్‌గా అనిపించాయి. డిజైనింగ్‌లో హర్ష్‌కు తనదైన నేర్పు ఉంది’ అంటున్నాడు టాన్ ఫ్రాన్స్. హర్ష్ కొత్త కలెక్షన్ డిజైన్ స్కెచ్‌లతో మొదలు కాదు. నేతకళాకారులతో ముచ్చటించిన తరువాత ఒక ఐడియా వస్తుంది. దాన్ని మెరుగులు దిద్దడంపై దృష్టి పెడతాడు. ‘హర్ష్ వర్క్‌లో క్వాలిటీ మాత్రమే కాదు క్లాసిక్ లుక్ కనిపిస్తుంది’ అంటుంది టెక్స్టైల్ ఇనోవేషన్ ప్రాజెక్ట్ ‘అంబ’ ఫౌండర్ హేమ ష్రాఫ్ పటేల్. -
రూ. 70 వేల చొక్కా.. రూ.25 లక్షల వాచీ.. సమీర్‌పై మాటల దాడి
ముంబై: నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖెడేపై మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ దాడిని మరింత తీవ్రతరం చేశారు. వాంఖెడే రూ.70 వేల విలువైన షర్టు, రూ.25–50 లక్షల విలువైన వాచీలు వాడుతుంటారని ఆరోపించారు. నీతి నిజాయితీగల ఒక అధికారి అంతటి ఖరీదైన వస్తువులు ఎలా కొనుక్కోగలడని ప్రశ్నించారు. డ్రగ్స్ కేసుల్లో ప్రముఖుల్ని తప్పుడుగా ఇరికించి వారి నుంచి కోట్లు దండుకోవడమే అతను చేస్తున్న పని అని ఆరోపించారు. డ్రగ్స్ కేసుల్లో ఇరికించడానికి ఎన్సీబీకి ఒక ప్రైవేటు బృందం ఉందని మాలిక్ ఆరోపించారు. మాఫియాతో తనకి సంబం« దాలు ఉన్నాయని మాజీ సీఎం ఫడ్న వీస్ చేసిన ఆరోపణలను తిప్పికొట్టారు. (చదవండి: చైన్ స్నాచింగ్తోనే రూ.48 లక్షలు విలువ చేసే ఫ్లాట్, కారు కొన్నా!) -
టాప్ డిజైన్!
న్యూలుక్ ఎప్పుడూ ఒకేలాంటి టీ షర్ట్స్, షర్ట్స్ వేసుకోవాలంటే బోర్ అనిపించవచ్చు. ఓ కొత్త ప్రయోగంతో డిజైనర్ టాప్‌ని మీకు మీరుగానే రూపొందించుకోవచ్చు. ఇది చాలా సులువు కూడా! క్యాజువల్ వేర్‌లోనూ స్టైలిష్ లుక్‌తో అదరగొట్టే డిజైన్స్ మీ కోసం... ఒక టీ షర్ట్ లేదా షర్ట్ రూపు మార్చడానికి ఏదైనా ఒకటి ఎంచుకోవాలి. దీనికి సరైన కాంబినేషన్ గల ప్రింటెడ్ మెటీరియల్ తీసుకోవాలి. ఇందుకు రెండు షర్ట్‌లను కూడా ఉపయోగించవచ్చు. ఏ భాగం కట్ చేసి, ఏ మెటీరియల్‌ని ప్యాచ్‌గా వేస్తే టాప్ బాగా కనిపిస్తుందో ముందే ఒక అంచనాకు రావాలి. షర్ట్‌లో ఏదైనా ఒక పార్ట్ మాత్రమే కట్ చేసి, ఆ ప్లేస్‌ను కవర్ చేసేలా మెటీరియల్‌తో ప్యాచ్ చేయాలి. ఇలా ఒక్కో మార్పును చేర్చుతూ షర్ట్ రీ డిజైనింగ్ చేసుకోవచ్చు. బటన్ టాప్ కింది భాగం ► (నడుము) కట్ చేసి, దీనికి అదనంగా మరో సాఫ్ట్ క్లాత్‌ని జత చేస్తే ఇలా అందమైన టాప్ సిద్ధం. ► టీ షర్ట్ టాప్‌కి చెక్స్ షర్ట్ కాలర్, ఛాతీ భాగం, హ్యాండ్ కఫ్స్ జత చేయాలి. స్టైలిష్ టాప్ రెడీ. ► ప్లెయిన్ లాంగ్ స్లీవ్స్ టాప్‌కి వీపు భాగం, పాకెట్, స్లీవ్స్ క ఫ్స్.. మరో క్లాత్‌తో ప్యాచ్‌వర్క్ చేస్తే చూడ ముచ్చటైన షర్ట్ రెడీ. డెనిమ్ షర్ట్ కింది భాగం (నడుము నుంచి దాదాపు 5 సెంటీమీటర్ల) భాగం కట్ చే యాలి. దీనికి మరో ప్రింటెడ్ మెటీరియల్‌ను జత చేస్తే మరో డిజైనర్ షర్ట్ రెడీ చెక్స్ షర్ట్ నెక్ కాలర్ కట్ చేసి బ్లాక్ కలర్ క్లాత్‌తో పైపింగ్ చేయాలి. అలాగే చెక్స్ స్లీవ్స్ తీసేసి ప్రింటెడ్ మెటీరియల్ లాంగ్ స్లీవ్స్ జత చేయాలి. రెండు వైపులా పాకెట్స్ ప్యాచ్‌గా వేయాలి. మరో డిజైనర్ షర్ట్ సిద్ధం. -
డ్యూక్ ‘షర్ట్స్, ట్రౌజర్స్ అండ్ డెనిమ్స్’ కలెక్షన్-2016
హైదరాబాద్: డ్యూక్ ఫ్యాషన్స్ ఇండియా తాజాగా ‘షర్ట్స్, ట్రౌజర్స్ అండ్ డెనిమ్స్’ కలెక్షన్-16ను ఆవిష్కరించింది. ఇందులో వివిధ డిజైన్లు, కలర్స్, సైజ్‌లలో ఉన్న రిలాక్స్డ్ ఆఫీస్ వియర్స్, వీకెండ్ క్యాజువల్ వియర్స్ ఉంటాయని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. కలెక్షన్లోని ఫార్మల్ ట్రౌజర్స్, షర్ట్స్, కాటన్ షర్ట్స్‌లో స్టైల్తోపాటు లగ్జరీ కూడా ఉట్టిపడుతుందని పేర్కొంది. వీటి ధర రూ.595 నుంచి ప్రారంభమౌతుందని పేర్కొంది. ఇవి డ్యూక్ ఎక్స్‌క్లూజివ్ షోరూమ్స్, ప్రముఖ మల్టీ బ్రాండెడ్ ఔట్లెట్స్లలోనూ అందుబాటులో వినియోగదారులకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. -
స్కార్ఫ్ ... రీ స్టైల్....
స్టైల్‌గా చేతికి అల్లేసినా, ఎండవేళలో తలకు చుట్టుకున్నా స్కార్ఫ్ మగువల మెడలో హారంలా భాసిల్లుతూనే ఉంటుంది. డ్రెస్‌లకు మ్యాచ్ అయ్యేవి, ముచ్చటపడి కొనుగోలు చేసి మూలన పడేసినవి, బోర్ అనిపించి వార్డ్‌రోబ్‌లో వదిలేసిన స్కార్ఫ్లకు కొత్త ఊపిరి ఇవ్వచ్చు. కొంగొత్తగా వాటిని ఇలా ధరించవచ్చు. షర్ట్స్, జాకెట్స్ రెండువైపులా స్కార్ఫ్‌ని ఇలా జత చేసి కుట్టాలి. డిజైన్ వేర్‌గా ధరిస్తే స్టైల్‌గా కనిపిస్తారు. రెండు కాంట్రాస్ట్ రంగుల స్కార్ఫ్‌లు తీసుకొని జత చేసి, ఒక వైపు జడలాగి అల్లి కుడితే, మోడ్రన్ స్కార్ఫ్ రెడీ. రెండు రకాల స్కార్ఫ్‌లను తీసుకొని సన్నని పీలికలుగా క త్తిరించాలి. మూడు పొడవాటి పీలికలను తీసుకొని జడ అల్లాలి. ఇలా అన్నింటినీ తయారు చేసుకోవాలి. పైకి పీలికలు, దారాలు రాకుండా జాగ్రత్తపడాలి. మెడ వెనక భాగంలోకి వచ్చే విధంగా అల్లిన తాళ్లన్నీ కలిపి ఒకదగ్గర ముడివేయాలి. ముడి దగ్గర పెద్ద బటన్ లేదా కాంట్రాస్ట్ కలర్ ఫ్యాబ్రిక్ పువ్వును కుడితే ఫ్యాషన్ జువెల్రీ సిద్ధం. స్కార్ఫ్‌ల్లో పొడవూ, పొట్టివి ఉంటాయి. వాటి డిజైన్స్‌ను బట్టి టాప్స్‌గా మలుచుకోవచ్చు. స్కర్ట్స్గానూ రూపపొందించుకోవచ్చు. అప్పటి వరకు వాడిన రంగు స్కార్ఫ్‌లు బోర్ అనిపించినా, వెలిసిపోయినట్లు కనిపించినా ఇలా చేయచ్చు. కాటన్, సిల్క్ ఫ్యాబ్రిక్ ప్లెయిన్ స్కార్ఫ్‌లను టై అండ్ డై పద్ధతిలో కొత్త రంగులను వేసి, కొంగొత్తగా తయారుచేసుకోవచ్చు. -
పూలచొక్కాలోయ్!
స్టైల్: మర్యాదకరంగా కనిపించే దుస్తులను మాత్రమే ధరించే అలవాటు మీకు ఉండొచ్చుగాక, కానీ అప్పుడప్పుడూ లేటెస్ట్ ట్రెండ్ మీద కూడా ఒక నజర్ వేయండి. కాస్త భిన్నంగా ఉండడానికి ప్రయత్నించండి. హాటెస్ట్ ట్రెండ్‌లో ‘ఫ్లోరల్స్’ షర్ట్స్ ధరించడం కూడా ఒకటి. ఈ పూల చొక్కాలు మీ లుక్కును పూర్తిగా మార్చేస్తాయి. ఈ వారమే ప్రయత్నించి చూడండి మరి.