స్కార్ఫ్ ... రీ స్టైల్....
స్టైల్‌గా చేతికి అల్లేసినా, ఎండవేళలో తలకు చుట్టుకున్నా స్కార్ఫ్ మగువల మెడలో హారంలా భాసిల్లుతూనే ఉంటుంది. డ్రెస్‌లకు మ్యాచ్ అయ్యేవి, ముచ్చటపడి కొనుగోలు చేసి మూలన పడేసినవి, బోర్ అనిపించి వార్డ్‌రోబ్‌లో వదిలేసిన స్కార్ఫ్‌లకు కొత్త ఊపిరి ఇవ్వచ్చు. కొంగొత్తగా వాటిని ఇలా ధరించవచ్చు.
షర్ట్స్, జాకెట్స్ రెండువైపులా స్కార్ఫ్‌ని ఇలా జత చేసి కుట్టాలి. డిజైన్ వేర్‌గా ధరిస్తే స్టైల్‌గా కనిపిస్తారు. రెండు కాంట్రాస్ట్ రంగుల స్కార్ఫ్‌లు తీసుకొని జత చేసి, ఒక వైపు జడలాగి అల్లి కుడితే, మోడ్రన్ స్కార్ఫ్ రెడీ.
రెండు రకాల స్కార్ఫ్‌లను తీసుకొని సన్నని పీలికలుగా క త్తిరించాలి. మూడు పొడవాటి పీలికలను తీసుకొని జడ అల్లాలి. ఇలా అన్నింటినీ తయారు చేసుకోవాలి. పైకి పీలికలు, దారాలు రాకుండా జాగ్రత్తపడాలి. మెడ వెనక భాగంలోకి వచ్చే విధంగా అల్లిన తాళ్లన్నీ కలిపి ఒకదగ్గర ముడివేయాలి. ముడి దగ్గర పెద్ద బటన్ లేదా కాంట్రాస్ట్ కలర్ ఫ్యాబ్రిక్ పువ్వును కుడితే ఫ్యాషన్ జువెల్రీ సిద్ధం.
స్కార్ఫ్‌ల్లో పొడవూ, పొట్టివి ఉంటాయి. వాటి డిజైన్స్‌ను బట్టి టాప్స్‌గా మలుచుకోవచ్చు. స్కర్ట్స్‌గానూ రూపపొందించుకోవచ్చు.
అప్పటి వరకు వాడిన రంగు స్కార్ఫ్‌లు బోర్ అనిపించినా, వెలిసిపోయినట్లు కనిపించినా ఇలా చేయచ్చు. కాటన్, సిల్క్ ఫ్యాబ్రిక్ ప్లెయిన్ స్కార్ఫ్‌లను టై అండ్ డై పద్ధతిలో కొత్త రంగులను వేసి, కొంగొత్తగా తయారుచేసుకోవచ్చు.