అమ్మాయిలు సాధారణంగా చుడీదార్ లేదా స్కార్ఫ్‌లతో బైక్‌లు నడుపుతుంటారు. అలాంటప్పుడూ కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే బైక్‌లు లాంటివి నడిపేటప్పుడూ ఇక్కడ ఈ అమ్మాయికి ఎదురైన చేదు అనుభవమే ఎదురుకావొచ్చు. అయితే ఈ అమ్మాయి భయపడకుండా చాలా తెలివిగా బైక్‌ని హ్యాండిల్ చేయడమే గాక స్థానికులు సహాయంతో విపత్కర పరిస్థితి నుంచి సునాయాసంగా బయటపడింది.
అసలేం జరిగిందంటే..సునీతా మనోహార్ తరుచుగా బైక్‌పై వెళ్తుంటుంది. అలానే ఒక రోజు ముంబై వీధుల గుండా వెళ్తుండగా ఆ గాలికి సడెన్‌గా తన ముఖానికి చుట్టుకున్న స్కార్ఫ్ ఊడిపోయి బైక్‌లో చిక్కుకుపోయింది. అది గమనింకపోవడంతో కొద్దిసేపటికి ఆమె మెడ బైక్ ముందు భాగానికి వంగిపోయేలా చేసింది. ఈ హఠాత్పరిణామానికి తత్తరపడకుండా నిధానంగా బైక్ క్లచ్‌ని లాగి ఆపేసింది. ఆమె బైక్‌పై వెనుక సీటులో ఉన్న మరోక అమ్మాయి సాయం కోసం చుట్టుపక్కల వాళ్లని అభ్యర్థించగా.. అటుగా వెళ్తున్న మరో బైకర్ ఆమెకు సాయం చేశాడు.
దీంతో కొద్దిపాటి చిన్న గాయంతో ఆ ఆపద నుంచి బయటపడింది. ఈ మేరకు సునీతా మనోహర్ బైక్‌పై ప్రయాణించేవారు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తూ తను ఫేస్ చేసిన చేదు ఘటనకు సంబంధించిన వీడియోని షేర్ చేసుకుంది. ఇక్కడ సునీతా ముఖం అంతా కవర్ అయ్యేలా స్కార్ఫ్ చుట్టుకునిమరీ హెల్మెట్ ధరించింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అయితే నెటిజన్లు ఆమె అంతటి భయానక స్థితిలో టెన్షన్ పడకుండా బైక్‌ని కంట్రోల్ చేసిన విధానాన్ని ప్రశంసిస్తూ పోస్ట్‌లు పెట్టారు.
(చదవండి: బిర్యానీ ఆకుతో ఎన్ని లాభాలో తెలుసా..! ఆ సమస్యలు దూరం..!)
Comments
Please login to add a commentAdd a comment