Scarf
-
చున్నీ లేదా స్కార్ఫ్‌లతో బైక్ నడిపేటప్పుడూ జాగ్రత్త..! లేదంటే..
అమ్మాయిలు సాధారణంగా చుడీదార్ లేదా స్కార్ఫ్‌లతో బైక్‌లు నడుపుతుంటారు. అలాంటప్పుడూ కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే బైక్‌లు లాంటివి నడిపేటప్పుడూ ఇక్కడ ఈ అమ్మాయికి ఎదురైన చేదు అనుభవమే ఎదురుకావొచ్చు. అయితే ఈ అమ్మాయి భయపడకుండా చాలా తెలివిగా బైక్‌ని హ్యాండిల్ చేయడమే గాక స్థానికులు సహాయంతో విపత్కర పరిస్థితి నుంచి సునాయాసంగా బయటపడింది. అసలేం జరిగిందంటే..సునీతా మనోహార్ తరుచుగా బైక్‌పై వెళ్తుంటుంది. అలానే ఒక రోజు ముంబై వీధుల గుండా వెళ్తుండగా ఆ గాలికి సడెన్‌గా తన ముఖానికి చుట్టుకున్న స్కార్ఫ్ ఊడిపోయి బైక్‌లో చిక్కుకుపోయింది. అది గమనింకపోవడంతో కొద్దిసేపటికి ఆమె మెడ బైక్ ముందు భాగానికి వంగిపోయేలా చేసింది. ఈ హఠాత్పరిణామానికి తత్తరపడకుండా నిధానంగా బైక్ క్లచ్ని లాగి ఆపేసింది. ఆమె బైక్‌పై వెనుక సీటులో ఉన్న మరోక అమ్మాయి సాయం కోసం చుట్టుపక్కల వాళ్లని అభ్యర్థించగా.. అటుగా వెళ్తున్న మరో బైకర్ ఆమెకు సాయం చేశాడు. దీంతో కొద్దిపాటి చిన్న గాయంతో ఆ ఆపద నుంచి బయటపడింది. ఈ మేరకు సునీతా మనోహర్ బైక్‌పై ప్రయాణించేవారు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తూ తను ఫేస్ చేసిన చేదు ఘటనకు సంబంధించిన వీడియోని షేర్ చేసుకుంది. ఇక్కడ సునీతా ముఖం అంతా కవర్ అయ్యేలా స్కార్ఫ్ చుట్టుకునిమరీ హెల్మెట్ ధరించింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అయితే నెటిజన్లు ఆమె అంతటి భయానక స్థితిలో టెన్షన్ పడకుండా బైక్‌ని కంట్రోల్ చేసిన విధానాన్ని ప్రశంసిస్తూ పోస్ట్‌లు పెట్టారు. View this post on Instagram A post shared by Sunita Manohar More (@nusti_bhatkantii) (చదవండి: బిర్యానీ ఆకుతో ఎన్ని లాభాలో తెలుసా..! ఆ సమస్యలు దూరం..!) -
బాలిక ఉసురుతీసిన పోకిరీలు
అంబేడ్కర్‌నగర్(యూపీ): సైకిల్‌పై వెళ్తున్న బాలికను వేధించేందుకు బైక్‌పై వచ్చిన ఇద్దరు ఆకతాయిలు ప్రయత్నించారు. దుపట్టాను లాగేయడంతో ఆమె అదుపుతప్పి సైకిల్‌పై నుంచి పడిపోయింది. ఆ వెనుకే మరో యువకుడు ఆమెను బైక్‌తో ఢీకొట్టి చంపేశాడు. ఒళ్లుగగుర్పొడిచే ఈ ఘటన యూపీలోని అంబేడ్కర్‌నగర్‌లో చోటుచేసుకుంది. బర్హి అయిదిల్పూర్కు చెందిన నయన్శీ పటేల్(17) ఇంటర్ చదువుతోంది. శుక్రవారం సాయంత్రం సైకిల్‌పై ఇంటికి వెళుతోంది. వేగంగా బైక్‌పై వచ్చిన ఆకతాయిలు ఆమె దుపట్టాను లాగడంతో అదుపుతప్పి కిందపడి పోయింది. ఆ వెనుకే బైక్‌పై వచ్చిన మరో యువకుడు ఆమె మీదుగా బైక్‌ను పోనిచ్చాడు. తీవ్రగాయాలతో బాలిక చనిపోయింది. ఈ అమానుషానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు సెహబాజ్, అర్బాజ్, ఫైసల్ అనే వారిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులను ఆదివారం ఆస్పత్రికి తీసుకెళ్తుండగా పారిపోయేందుకు యత్నించారు. పోలీసుల కాల్పుల్లో ఇద్దరికి గాయాలయ్యాయి. మరొకరు పారిపోయేక్రమంలో కిందపడి కాలు విరగ్గొట్టుకున్నాడు. సదరు పోకిరీలు తన కూతుర్ని వేధిస్తున్నారంటూ వారం క్రితమే పోలీసులకు తెలిపినట్లు తండ్రి సభజీత్ వర్మ తెలపడంతో స్టేషన్ హౌస్ ఆఫీసర్ రితేశ్ పాండేను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. -
కన్నడనాట ‘హిజాబ్’ రగడ
బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటకలో హిజాబ్ గొడవ రాజకీయ రంగు పులుముకుంటోంది. విద్యా సంస్థల్లో యూనిఫాం నిబంధనలు పాటించాల్సిందేనని పాలక బీజేపీ అంటుండగా హిజాబ్‌కు మద్దతుగా విపక్ష కాంగ్రెస్ గొంతు విప్పింది. రాష్ట్రంలో పలుచోట్ల కాలేజీల్లో హిజాబ్ (స్కార్ఫ్) ధరించిన బాలికలను అనుమతించపోవడంపై కొద్ది రోజులుగా దుమారం రేగుతున్న విషయం తెలిసిందే. వారికి పోటీగా కొందరు స్టూడెంట్లు కాషాయ శాలువాతో క్లాసులకు హాజరవడం ఉద్రిక్తతలను మరింత పెంచింది. జనవరిలో ఉడుపిలోని పీయూ కాలేజీలో స్కార్ఫ్‌తో వచ్చిన ఆరుగురు స్టూడెంట్లను వెనక్కు పంపడంతో మొదలైన ఈ గొడవ తాజాగా కుందాపూర్, బైందూర్తో పాటు బెల్గావీ, హసన్, చిక్‌మగళూరు, శివమొగ్గ, మైసూరు సహా పలు చోట్లకు విస్తరించింది. హిజాబ్ తమ హక్కు అంటూ ఒక వర్గానికి చెందిన విద్యార్థినులు శనివారం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు, ప్రదర్శనలు చేశా రు. వాటిలో పలుచోట్ల కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. హిజాబ్‌ను అనుమతించాలన్న డిమాండ్‌కు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా మద్దతు పలికారు. ఈ గొడవ ద్వారా విద్యార్థినుల భవిష్యత్తును నాశనం చేస్తున్నారని విమర్శించారు. ‘‘చదువుల తల్లి సరస్వతి తన బిడ్డలకు ఎలాంటి తేడా చూప దు. జ్ఞానాన్ని అందరికీ పంచుతుంది’’ అని వసంత పంచమి పర్వదినాన్ని గుర్తు చేస్తూ ట్వీట్ చేశారు. కాంగ్రెస్, బీజేపీ వాగ్యుద్ధం కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య హిజాబ్ అనుకూల ఆందోళనలకు మద్దతు ప్రకటించారు. హిజాబ్ ధరించినంత మాత్రాన విద్యా సంస్థల్లోకి రానివ్వకపోవడం రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కును కాలరాయడమేనన్నారు. ‘‘హిజాబ్ సాకుతో రాష్ట్రమంతటా మతపరమైన ఉద్రిక్తతలు సృష్టించేందుకు బీజేపీ, ఆరెస్సెస్ ప్రయత్నిస్తున్నాయి. ఒక వర్గానికి చెందిన బాలికలను చదువుకు దూరం చేయడమే దీని వెనక సంఘ్ పరివార్ ప్రధాన ఎజెండా’’ అని ఆరోపించారు. ఈ గొడవలకు మూలకారకులను తక్షణం అరెస్టు చేయాలని సీఎం బస్వరాజ్ బొమ్మైని డిమాండ్ చేశారు. ‘బేటీ బచావో, బేటీ పడావో’ అని నినాదాలిచ్చే ప్రధాని మోదీకి ఈ గొడవలు కన్పించడం లేదా అని ప్రశ్నించారు. ఈ ఆరోపణలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ నళిన్‌కుమార్ కటీల్ తోసిపుచ్చారు. సిద్ధరామయ్యే విభజన రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ‘‘ఇక్కడున్నది బీజేపీ ప్రభుత్వం. విద్యా సంస్థలు సరస్వతీ నిలయాలు. హిజాబ్ తదితరాలకు అక్కడ స్థానం లేదు. వాటిల్లో తాలిబన్ తరహా పరిస్థితులను అనుమతించబోం. నియమ నిబంధనలకు అంతా కట్టుబడాల్సిందే’’ అన్నారు. ‘‘ఇప్పుడు హిజాబ్‌ను అనుమతిస్తే తర్వాత బుర్ఖా అంటారు. స్కూళ్లలో మసీదులు కడతామంటారు’’ అని బీజేపీ ఎమ్మెల్యే బసన్నగౌడ పాటిల్ అన్నారు. ఈ వివాదానికి కాంగ్రెస్, బీజేపీ రెండూ బాధ్యులేనని మాజీ సీఎం హెచ్డీ కుమారస్వామి విమర్శించారు. హిజాబ్‌ను అనుమతించకపోవడాన్ని సవాలు చేస్తూ ఉడుపి గవర్నమెంట్ ప్రీ వర్సిటీ కాలేజీకి చెందిన ఐదుగురు విద్యార్థినులు వేసిన పిటిషన్‌ను కర్ణాటక హైకోర్టు మంగళవారం విచారించనుంది. -
ఆమెను కొత్త స్వెటర్ కొనుక్కోనిద్దాం..
చలికాలం పిల్లలు నిద్ర లేవరు. వారికి ఆ హక్కు ఉందట. భర్త గారు ‘కాసేపు నిద్రపోనీ’ అంటుంటారు. ఆయనగారిని ఏం అనగలం. కాని స్త్రీలు లేవాల్సిందే. వంట చేయాల్సిందే. అన్నీ సిద్ధం చేయాల్సిందే. వారెప్పుడు రుతువులను ఎంజాయ్ చేయాలి? భార్యకు కొత్త స్వెటర్ కొనివ్వాలంటే టైమ్ ఉండదు. పోనీ ఆమెను కొనుక్కోనివ్వము. అమ్మకు చెవులకు స్కార్ఫ్ ఎప్పుడూ పాతదే. చలికి ఆడవాళ్ల పాదాలకు సాక్సులు అవసరం అని కూడా అనుకోము. ఈ కాలంలో స్త్రీలకు ఏం కావాలో వారిని తెచ్చుకోనివ్వండి. పని ఒత్తిడి తగ్గించండి. టీ తాగుతూ చలిని వారినీ ఆస్వాదించనివ్వండి. చలికాలం బద్దకం కాలం. వెచ్చగా ముసుగుతన్నమని చెప్పేకాలం. కాని ఆ లగ్జరీ ఇంటి మగవారికి, పిల్లలకి ఉన్నట్టుగా ఆడవారికి ఉండదు. బయట ఎంత చలి ఉన్నా తెల్లారే ఆరుకు వాళ్లు లేవాల్సిందే. బయట ఎంత మంచు కురుస్తున్నా తొంగి చూడక వంట గదిలో దూరాల్సిందే. వరండాలోనో, బాల్కనీలోనో, ముంగిలి లోనో కుర్చీ వేసుకుని కాఫీ తాగుతూ మంచుతో తడిసిన బంతిపూల మొక్కను చూడాలని వారికీ ఉంటుంది. కాని వారికి కాఫీ తెచ్చిచ్చేవారు ఎవరూ ఉండరు. వారి కాఫీ వాళ్లే పెట్టుకోవాలి. చలికాలమైనా హిమ ఉదయమైనా. ఇంకా ద్వితీయశ్రేణి పౌరులేనా? చలికాలం వస్తే భర్త బజారు నుంచి వస్తూ వస్తూ రోడ్డు మీద అమ్మే ఒక జర్కిన్నో, స్వెటర్నో కొనుక్కుంటాడు. బండి నడుపుతాడు కదా మంకీ క్యాప్ కొనుక్కుంటాడు. పిల్లలు చలికి ఎక్స్పోజ్ అయితే ఎలా? వారి కోసం తప్పక స్వెటర్లు కొంటాడు. కాని భార్యకు ఎందుకనో వెంటనే కొనడు. కొనాలన్నా ఉంది కదా అనిపిస్తుంది. ఆమే కొనుక్కుంటుందిలే మన సెలక్షన్ నచ్చదు అనుకుంటాడు. ఆమె కొనుక్కునేది లేదు. ఆమెకు ఆ వీలూ చిక్కదు. చాలా ఇళ్లల్లో స్త్రీలు పాతబడిన స్వెటర్లతోనే తిరుగుతూ ఉంటారు ఈ సీజన్లలో. స్త్రీలకు రకరకాల స్వెటర్లు అమ్ముతారు. హాఫ్ స్వెటర్లు ఇంట్లో వేసుకోవచ్చు. ఫుల్స్వెటర్లు బయటకు వెళ్లేప్పుడు. కొనే స్తోమత ఉన్నా ‘ఇన్ని ఎందుకు’ అనే ప్రశ్న ఆమెకు ఎదురవుతుంది. స్త్రీలు సౌందర్య ప్రియులు అని తెలుసు. ఈ శీతాకాలం రెండు మూడు నెలలు ఒకే ఒక్క స్వెటర్‌తో వాళ్లు ఎందుకు గడిపేయాలి. అక్కర్లేదు అని వారూ అనుకోరు. ఇంటి మగవారూ చెప్పరు. అమ్మ సంగతి ఏమిటి? ఇంట్లో అమ్మ ఉంటే శీతాకాలం ఆమెకై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఆమెకు బడ్జెట్ కేటాయించాలి. ఒక మంచి షాల్ కప్పుకుని ఆమె కూచుంటే ఎంత బాగుంటుంది. ఆమెకు నచ్చిన రంగుల్లో రెండు మూడు స్కార్ఫులు ఉంటే ఎంత బాగుంటుంది. నేలకు పాదాలు తాకి జిల్లు మనకుండా ఇంట్లో తిరగడానికి మంచి స్లిప్పర్లు, సాక్సులు ఆమెకు తప్పనిసరి. ఒక కొత్త రగ్గు కొని ఇస్తే ఆ ఉత్సాహమే వేరు. అమ్మ ఆ ఇంట్లో కొడుకు, కోడలు మీద ఆధారితమైతే ఆమెను చిన్నబుచ్చకుండా ఇవన్నీ లేదా వీటిలో కొన్నయినా ఈ శీతాకాలపు ప్రారంభంలోనే ఆమెకు కొనిస్తే నోరు తెరిచి అడగాల్సిన అవస్థ తప్పుతుంది. ఇవాళ వృద్ధాప్య పెన్షన్లు ఉన్నాయి. ఆ డబ్బును చాలా ఇళ్లల్లో ఆ అమ్మలు, అత్తలు కొడుకు చేతుల్లోనో కోడలు చేతుల్లోనో పెట్టాల్సిన పరిస్థితి ఉంది. ‘ఈ నెల డబ్బు మీ కోసం మీ చలికాలపు అవసరాల కోసం ఉంచుకోండి’ అని చెప్పలేమా? వంట బాధ రోజూ ఉదయాన్నే టిఫిన్ చేస్తున్నా ఒక్కపూట బజారు నుంచి తెచ్చుకోండి అంటే ‘బజారు టిఫినా’ అని విసుక్కుని రోజు మూడ్‌ని పాడు చేసే భర్తలు ఉంటారు. రోజూ టిఫిన్ చేసే బాధ వేరే ఏ కాలంలో అయినా ఓకే కాని చలికాలం చాలా కష్టం. చలికి పని చేయబుద్ధి కాదు. ఎవరైనా చేసిపెడితే బాగుండు అని భర్తలకు సదా అనిపించినట్టే భార్యలకు అప్పుడప్పుడైనా అనిపిస్తుంది. భోజనం తిప్పలు ఎలాగూ తప్పవు కాబట్టి బ్రేక్‌ఫాస్ట్ సమస్యను ఎలా పరిష్కరించవచ్చో ఎలా ఆ శ్రమ కాస్తంత తగ్గించవచ్చో ప్రతి ఇంటి పురుషులు, పిల్లలు ఆలోచించాలి. ప్రత్యామ్నాయ టిఫిన్లు, ఇన్స్టంట్ టిఫిన్లు, ఆమె చేయకపోయినా మనం చేసుకు తినగలిగే అల్పాహారాలు ఎన్నో మార్కెట్లో ఉన్నాయి. యూట్యూబ్‌లో కొడితే వందలాది వీడియోలు ఉన్నాయి. మనం ఇల్లు కదలకపోయినా తెచ్చిపెట్టే స్విగ్గి, జొమాటోలు ఉన్నాయి. వారంలో ఒకటి రెండు రోజులైనా ఈ శీతాకాలంలో ఉదయపు వంట చెర నుంచి ఆమెను విముక్తి చేస్తే ఆమెకు కలిగే సంతోషం ఆలోచించారా ఎవరైనా? ఆమె సౌందర్యం అవును. చక్కగా ఉండే హక్కు, సౌందర్యాన్ని కాపాడుకునే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. మగవాళ్లు దీనిని లెక్క చేయొచ్చు చేయకపోవచ్చు. కాని శీతాకాలంలో స్త్రీలు తమ శరీరం గురించి ఆలోచన చేస్తారు. చర్మాన్ని, శిరోజాల్ని కాపాడుకోవడానికి వారికి కొన్ని వస్తువులు అవసరం. క్రీములు, నూనెలు, సబ్బులు... అదనపు ఖర్చే. ఆ ఖర్చు వారు సంపాదించే దాని నుంచైనా భర్త సంపాదన నుంచైనా చేసే వాతావరణం ఇంట్లో ఉండాలి. చర్మ సమస్యలు కొందరిలో రావచ్చు. వాటిని చిట్కాలతో సరిపుచ్చుతూ బాధపడాల్సిన పని లేదు. వైద్యుల దగ్గరకు వెళ్లాలి. ఇక ఇంట్లో గర్భిణీ స్త్రీలు ఉంటే వారికి చలికాలం మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వారిని రోజువారీ చాకిరీ నుంచి దాదాపుగా తప్పించాలి. ఈ కాలంలో జలుబు, త్రోట్ ఇన్ఫెక్షన్లు సహజం. వాటి నుంచి కాపాడేలా ఆమెను వెచ్చని వాతావరణంలో విశ్రాంతంగా ఉంచడం కోసం ఏం చేయొచ్చో ఆలోచించాలి. నిజానికి ఇవన్నీ రాసి చెప్పాలా అనిపించవచ్చు. రాసి చెప్తే కాని స్త్రీలకు ఎంత పని ఉందో దాని నుంచి ఎలా తప్పించవచ్చో తెలియనంతగా ఆ పని స్త్రీల నెత్తి మీద ఉంది. చలికాలం వారికి పని తేలిక చేద్దాం. చలికాలాన్ని ఎంజాయ్ చేసేలా చూద్దాం. హ్యాపీ వింటర్. నిజానికి ఇవన్నీ రాసి చెప్పాలా అనిపించవచ్చు. రాసి చెప్తే కాని స్త్రీలకు ఎంత పని ఉందో దాని నుంచి ఎలా తప్పించవచ్చో తెలియనంతగా ఆ పని స్త్రీల నెత్తి మీద ఉంది. చలికాలం వారికి పని తేలిక చేద్దాం. -
విందుకు వెళ్తుండగా మహిళ ప్రాణం తీసిన స్కార్ఫ్
యానాం: ఆనందంగా ఫంక్షన్‌కు హాజరయ్యేందుకు బైక్‌పై వెళుతున్న ఆ కుటుంబాన్ని స్కార్ఫ్ రూపంలో ప్రమాదం వెంటాడింది. ఆ మహిళ ధరించిన స్కార్ఫ్ బైక్ వెనుక చక్రంలో చిక్కుకు పోవడంతో ఆమె కింద పడటంతో తలకు తీవ్రగాయాలై మృతిచెందింది. గురువారం కాట్రేనికోన మండలం పల్లంకు చెందిన దంపతులు పాలెపు లక్ష్మణ్, పాలెపు దుర్గ (25) యానాం శివారు సావిత్రినగర్‌లో బంధువుల ఇంటిలో ఫంక్షన్‌కు హాజరయ్యేందుకు బైక్‌పై తమ మూడేళ్ల కుమారైతో వెళ్తున్నారు. మార్గమధ్యలో దొమ్మేటిపేట ఇసుక కాలువ వద్దకు వచ్చేసరికి దుర్గ ముఖానికి కట్టుకున్న స్కార్ఫ్ బైక్ వెనుక చక్రంలో చిక్కుకుపోయింది. దీంతో బైక్ అదుపుతప్పి ఆమె రోడ్డుపై పడిపోయింది. తలకు తీవ్రగాయమై అపస్మారక స్థితికి చేరిన ఆమెను స్థానికులు యానాం జీజీహెచ్‌కు తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కాకినాడ జీజీహెచ్‌కు తరలించగా అక్కడ చికిత్సపొందుతూ దుర్గ మృతిచెందింది. భర్త లక్ష్మణ్‌కు, కుమారైకు స్వల్ప గాయాలయ్యాయి. యానాం ట్రాఫిక్ ఎస్సై కట్టా సుబ్బరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మహిళ ప్రాణం తీసిన స్కార్ఫ్
తల్లాడ : తల్లాడ పెట్రోల్ బంకు సమీపంలో ముఖానికి కట్టుకున్న స్కార్ఫ్ మోటార్ సైకిల్ చక్రానికి చుట్టుకొని కింద పడటంతో మహిళ మృతి చెందిన ఘటన మంగళవారం జరి గింది. వివరాలిలా ఉన్నాయి.. కృష్ణా జిల్లా విజయవాడ రూరల్ మండలం పైడూరూపాడు గ్రామానికి చెందిన షేక్ మాలన్‌బీ (45) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోని తన అన్న ఇంటికి వెళ్లింది. కరోనా వైరస్ కారణంగా లాక్డౌన్ విధించడంతో అక్కడే ఉండి పోయింది. ఇంటికి వెళ్తానని చెప్పడంతో అన్న అల్లుడు గఫూర్ కృష్ణా జిల్లా నందిగామ వెళ్తుండగా ఆమె కూడా మోటార్ సైకిల్‌పై బయలు దేరింది. మోటార్ సైకిల్‌పై నందిగామ వెళ్లి అక్కడ నుంచి బస్సులో వెళ్తానని చెప్పింది. కరోనా వల్ల ముఖానికి స్కార్ఫ్ కట్టుకొని ప్రయాణిస్తుండగా తల్లాడ సమీపంలో వెనుక చక్రంలో స్కార్ఫ్ చుట్టుకొని మాలన్‌బీ కింద పడటంతో బలమైన గాయమైంది. దీంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఈ మేరకు ఎస్ఐ బి.తిరుపతిరెడ్డి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మధిర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
స్కార్ఫ్‌లపై యూనివర్సిటీ సంచలన నిర్ణయం
మీరట్ : చౌదరి చరణ్ సింగ్ విశ్వవిద్యాలయం సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. ఇక మీదట కాలేజీ విద్యార్ధినులు స్కార్ఫ్ ధరించి యూనివర్సిటీలో ప్రవేశించకూడదనే నిబంధనను తీసుకువచ్చింది. యూనివర్సిటీకి చెందని వారిని క్యాంపస్‌లోకి రాకుండా నియంత్రించడానికే ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు యూనివర్సిటీ అధికారులు ప్రకటించారు. అయితే విశ్వవిద్యాలయాల్లో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఇదే ప్రథమం. ఈ వియషం గురించి యూనివర్సిటీ అధికారులు ‘గత కొద్ది రోజులుగా యూనివర్సిటీకి చెందని యువతులు అనేక మంది కాలేజీ పరిసారాల్లో కనిపిస్తున్నారు. వారిని తమ ఐడెంటీని చూపించమని అడిగినప్పుడు ఎవరి దగ్గర సరైన ఆధారాలు లేవు. అమ్మాయిలు స్కార్ఫ్ ధరించి యూనివర్సిటీలోకి ప్రవేశించడం వలన క్యాంపస్‌కు చెందిన అమ్మాయిలా లేకా బయటి వారా అనే విషయం గుర్తించడం కష్టమవుతుంది. అందువల్లే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. దీని వల్ల క్యాంపస్ విద్యార్ధినులకు కలిగే నష్టం ఏం లేదు ’అని తెలిపారు. అయితే యూనివర్సిటీ నిర్ణయం పట్ల మిశ్రమ స్పందన వ్యక్తమవుతుంది. కొందరు విద్యార్ధులు దీన్ని సమర్ధించగా మరి కొందరు మాత్రం ‘కాలేజిలోకి బయటి వారిని రాకుండా నియంత్రించాల్సిన బాధ్యత యూనివర్సిటీది. వారు ఈ బాధ్యతను సక్రమంగా నిర్వహించలేక ఇలాంటి నిర్ణాయాన్ని తీసుకున్నారు. దీనివల్ల క్యాంపస్ వాతావరణం దెబ్బతింటుంద’ని విమర్శించారు. -
గిన్నిస్ స్కార్ఫ్...
కొరుక్కుపేట(చెన్నై): చెన్నైకు చెందిన 700 మంది మహిళలతో కలసి మదర్ ఇండియా క్రోచెట్ క్వీన్స్ గ్రూప్ సృష్టించిన అతి పొడవైన స్కార్ఫ్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించింది. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు ప్రతినిధి రిష్నాత్ నేతృత్వంలో దీన్ని రూపొందించారు. ఈ రికార్డు గురించి గ్రూప్ వ్యవస్థాపకురాలు శుభశ్రీ నటరాజన్ మాట్లాడుతూ స్కార్ఫ్ తయారు చేసేందుకు ఐదు నెలల ముందు నుంచే సన్నద్ధమవుతున్నామని తెలిపారు. వివిధ రాష్ట్రాలకు చెందిన 60 మంది ఈ రికార్డులో భాగస్వాములుగా ఉన్నారని పేర్కొన్నారు. జనవరి నుంచి స్కార్ఫ్‌లు తయారు చేస్తున్నామని ఇందులో చిన్నారులు, గృహిణుల నుంచి 1500 స్కార్ఫ్‌లు రాగా మొత్తం 5,300 స్కార్ఫ్‌లతో 14.09 కిలోమీటర్ల పొడవు దూరం స్కార్ఫ్ తయారు చేశామని అన్నారు. దీంతో గిన్నిస్ రికార్డులో స్థానం పొందినట్లు తెలిపారు. -
కర్నాటక కాలేజిలో బుర్ఖా వివాదం
-
మాస్క్ మంచిదేగా !
బ్యూటిఫుల్ స్కార్ఫ్..పెంటాస్టిక్ పేస్‌మాస్క్ బైక్ ప్రయాణాల్లో ఉపయోగం దుమ్ము, ధూళి నుంచి రక్షణ ఆసక్తి చూపుతున్న యువత కరీంనగర్ బిజినెస్ : రయ్‌మంటూ బైక్‌లపై దూసుకెళ్లే యువత గమ్యస్థానం చేరే వరకు ముఖాలు మసిబారిపోతున్నాయి. ఆఫీస్‌కు, కాలేజీలకు వెళ్లేందుకు అందంగా ముస్తాబై బైక్‌పై వెళ్తుంటే ముందు వెళ్లే వాహనం నుంచి వచ్చే పొగ, రోడ్డుపై వచ్చే దుమ్ముతో ముఖాలు మసకబారిపోతుంటాయి. అయితే వీటన్నింటినికి చెక్ పెట్టేందుకు యువకులు ఫేస్‌మాస్క్‌లు, ఆడవాళ్లు స్కార్ఫ్‌లు ధరిస్తున్నారు. ఎండ, చలి, పొగ, దుమ్ము, ధూళీ నుంచి రక్షణ కల్పిస్తున్నాయి. ఫుల్స్కార్ఫ్, హాఫ్స్కార్ఫ్, రైడర్మాస్క్లు, నింజా, మల్టీపర్పస్ స్నఫ్, బైకర్స్, అగస్టా, ఫేస్ సేఫ్, ఫేస్రిచ్ వంటి పేర్లతో వివిధ మోడళ్లలో లభిస్తున్నాయి. ఆకర్షణీయమైన డిజైన్లలో లభిస్తుండడంతో గిరాకీ కూడా బాగుంటుందని వ్యాపారులు అంటున్నారు. స్కార్ఫ్‌తో రక్షణగా మహిళలు, యువతులు స్కార్ఫ్ కట్టుకుని ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు. ద్విచక్రవాహనాలపై ప్రయాణించినప్పుడు చాలా మంది ఎండ నుంచి తట్టుకునేందుకు, చలి నుంచి కాపాడుకునేందుకు స్కార్ఫ్ కవచంగా పనిచేస్తుందంటున్నారు యూత్. మహిళలకు ప్రత్యేకంగా రకరకాల డిజైన్లలో లభిస్తుండడంతో ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా విద్యార్థినిలు, ఉద్యోగులు ఎక్కువగా స్కార్ఫ్ వాడుతున్నారు. వీటి ధరలు రూ.100 నుంచి రూ.200 వరకు అందుబాటులో ఉన్నాయి. రైడర్మాస్క్లతో రయ్..రయ్ కుర్రకారు రైడర్మాస్క్లతో రయ్మంటున్నారు. ఇవి పలురకాల రంగులలో స్పోర్ట్స్ రైడర్స్ ఉపయోగించే లా ఉంటాయి. ఇందులో రెండు రకాలు.. సింగిల్‌కలర్, మల్టీకలర్స్. ముఖానికి గరుకుగా ఉండి ఇబ్బందిపెట్టకుండా ఉండే సాఫ్ట్క్లాత్తో వీటిని తయారు చేస్తారు. వీటి ధరలు దాదాపు రూ.150 నుంచి రూ.250 వరకు ఉన్నాయి. నింజామాస్క్ ముఖానికి నిండుగా ఉంటూ పైభర్ క్లాత్‌తో నింజా మాస్క్‌లు తయారవుతాయి. ఇది ముఖాన్ని పూర్తిగా కప్పేస్తుంది. దీని ధర దాదాపు రూ.120 నుంచి రూ.150 వరకు ఉంది. బైకర్స్ వీటిని హాఫ్ మాస్క్లని కూడా అంటారు. కేవలం ముక్కు, చెవులను కప్పేందుకు ఉపయోగపడతాయి. కొందరికి హెల్మెట్ ధరించే ఇష్టం లేక రుమాల్, హ్యాండ్కీలను కట్టుకుంటున్నారు. ఇలాంటి వారికి ఈ మాస్కులు చాలా ఉపయోగం. వీటి ధరలు నాణ్యతను బట్టి రూ.90 నుంచి రూ.120 వరకు ఉన్నాయి. మల్టీపర్పస్ స్నఫ్ ఇవి కేవలం ఒకే రకాలుగా కాకుండా వివిధ రకాలుగా ఉపయోగపడతాయి. ఒకటే స్నఫ్ 8 రకాలుగా ముఖాన్ని సంరక్షించేందుకు ఉపయోగపడుతుంది. హాఫ్, ఫుల్, రౌండ్ మోడళ్లుగా వాడుకోవచ్చు. అగస్టాతో సేఫ్ ఇవి దుమ్ము, దూళి నుంచి రక్షణకు ప్లాస్టిక్ మూత ఉంటుంది. చాలా దుమ్ము, దూళి కలిగిన ప్రదేశాల్లో మట్టి రోడ్లపై రక్షణగా ఉపయోగపడతాయి. వీటి ధరలు నాణ్యతను బట్టి రూ.120 నుంచి రూ.150 వరకు ఉన్నాయి. నగరంలో దుకాణాలు నగరంలోని పలు ప్రదేశాల్లో మాస్క్‌ల దుకాణాలు నగర ప్రజలకు స్వాగతం పలుకుతున్నాయి. బస్టాండ్‌లో, బస్టాంట్వెలుపల, టవర్‌సర్కిల్, కొర్డురోడ్, రాంనగర్తోపాటు పలు ప్రాంతాల్లో ఉన్న టోపీల దుకాణాలు, ఫుట్‌పాత్ షాపులు, మంచిర్యాల రోడ్, గోదావరిఖనిరోడ్, పద్మనగర్ శివారుల్లో ఫుట్‌పాత్ దుకాణాల్లో లభిస్తున్నాయి. రక్షణగా.. – రాజు, బీటెక్ విద్యార్థి మనం ఎంత అందంగా ముస్తాబైన రోడ్డుపై ప్రయాణిస్తే పది నిమిషాల్లో ముఖం వాడిపోతుంది. ఎండ, దుమ్ము, ధూళి , పొగ నుంచిరక్షణగా ఈ మాస్క్‌లు ఉపయోగకరంగా ఉంటాయి. మార్కెట్లో వివిధ రకాల డిజైన్లలో లభిస్తున్నాయి. దుమ్ము ధరిచేరకుండా – సంతోష్‌చారి , వ్యాపారి పనిమీద బయటకు వెళ్లినప్పుడు మాస్క్ ధరిస్తాను. అన్ని కాలాల్లో చాలా ఉపయోగం. డస్ట్ ఎలర్జీ ఉన్న వారు ఈ మాస్క్‌లు ధరించి ధైర్యంగా ప్రయాణం చేస్తున్నారు. ముఖ్యంగా యువకులు బైక్‌లపై మాస్క్‌లు ధరిస్తున్నారు. -
స్కార్ఫ్ స్పార్క్!
డ్రెస్సుల మీదకు మెడలో ఆభరణంలా స్కార్ఫ్ వాడకం సాధారణమే. అయితే, ఆ స్కార్ఫ్ మరింత స్పార్క్‌గా ఆకట్టుకోవాలంటే.. మార్కెట్లో జల్లెడపట్టాల్సిన అవసరం లేదు. మన దగ్గర ఉన్న క్లాత్, టీ షర్ట్స్, పాత స్కార్ఫ్‌లను.. ఇలా కొత్తగా ముస్తాబు చేయవచ్చు. వాటిని మన ముస్తాబులో అందంగా చేర్చవచ్చు. న్యూలుక్ ఉడెన్, స్టీల్... బీడ్స్, పెద్ద పెద్ద లాకెట్స్‌ను స్కార్ఫ్‌కు గుచ్చి అందమైన కంఠాభరణంగా మార్చుకోవచ్చు. ప్లెయిన్ క్లాత్కి లేస్ డిజైన్‌ను తీసుకొని, ఇలా జత చేస్తే డ్రెస్సుల మీదకు చూడచక్కని స్కార్ఫ్ సిద్ధం. పాత ఉలెన్ స్కార్ఫ్‌లు చాలా సాదా సీదాగా కనిపిస్తుంటాయి. వాటిని అందమైన డిజైన్‌గా ఇలా రూపొందిస్తే పువ్వుల స్కార్ఫ్ పిల్లల కోసం రెడీ. -
స్కార్ఫ్ ... రీ స్టైల్....
స్టైల్‌గా చేతికి అల్లేసినా, ఎండవేళలో తలకు చుట్టుకున్నా స్కార్ఫ్ మగువల మెడలో హారంలా భాసిల్లుతూనే ఉంటుంది. డ్రెస్‌లకు మ్యాచ్ అయ్యేవి, ముచ్చటపడి కొనుగోలు చేసి మూలన పడేసినవి, బోర్ అనిపించి వార్డ్‌రోబ్‌లో వదిలేసిన స్కార్ఫ్లకు కొత్త ఊపిరి ఇవ్వచ్చు. కొంగొత్తగా వాటిని ఇలా ధరించవచ్చు. షర్ట్స్, జాకెట్స్ రెండువైపులా స్కార్ఫ్‌ని ఇలా జత చేసి కుట్టాలి. డిజైన్ వేర్‌గా ధరిస్తే స్టైల్‌గా కనిపిస్తారు. రెండు కాంట్రాస్ట్ రంగుల స్కార్ఫ్‌లు తీసుకొని జత చేసి, ఒక వైపు జడలాగి అల్లి కుడితే, మోడ్రన్ స్కార్ఫ్ రెడీ. రెండు రకాల స్కార్ఫ్‌లను తీసుకొని సన్నని పీలికలుగా క త్తిరించాలి. మూడు పొడవాటి పీలికలను తీసుకొని జడ అల్లాలి. ఇలా అన్నింటినీ తయారు చేసుకోవాలి. పైకి పీలికలు, దారాలు రాకుండా జాగ్రత్తపడాలి. మెడ వెనక భాగంలోకి వచ్చే విధంగా అల్లిన తాళ్లన్నీ కలిపి ఒకదగ్గర ముడివేయాలి. ముడి దగ్గర పెద్ద బటన్ లేదా కాంట్రాస్ట్ కలర్ ఫ్యాబ్రిక్ పువ్వును కుడితే ఫ్యాషన్ జువెల్రీ సిద్ధం. స్కార్ఫ్‌ల్లో పొడవూ, పొట్టివి ఉంటాయి. వాటి డిజైన్స్‌ను బట్టి టాప్స్‌గా మలుచుకోవచ్చు. స్కర్ట్స్గానూ రూపపొందించుకోవచ్చు. అప్పటి వరకు వాడిన రంగు స్కార్ఫ్‌లు బోర్ అనిపించినా, వెలిసిపోయినట్లు కనిపించినా ఇలా చేయచ్చు. కాటన్, సిల్క్ ఫ్యాబ్రిక్ ప్లెయిన్ స్కార్ఫ్‌లను టై అండ్ డై పద్ధతిలో కొత్త రంగులను వేసి, కొంగొత్తగా తయారుచేసుకోవచ్చు. -
టవల్స్టార్!
హ్యూమర్ టవలు, తువాలు, తువ్వాల, తుండు గుడ్డ... పేరైదైనా గానీ దానికి మనం అన్నకున్న దానికంటే ఎక్కువ సీన్ ఉంది. ఊహించిన దానికంటే ఎక్కువ విస్తృతి ఉంది. కాకపోతే చాలామంది దాన్ని గుర్తించరంతే! గుర్తించినవాడు సమర్థంగా వాడుకుంటాడు. ‘ఆ... ఎవరికి తెలియదులే, ఎవరు వాడుకుంటార్లే పెద్ద చెప్పొచ్చారూ’ అని మీరు అనుకోవచ్చు. కానీ మీకు ఖచ్చి తంగా తెలియదు. తెలిస్తే... రజనీకాంత్‌కు ముందుగా మీరే దాన్ని గిరగిరా అనేకమైన మెలికలు తిప్పేసి భుజం మీద కప్పేసేవారు. పెదరాయుడు సినిమాకంటే ముందర దాన్ని ఎన్ని రకాలుగా యూజ్ చేసినా, ఆ సినిమా తర్వాతే దాంతో అన్ని గిరికీలు కొట్టించవచ్చని తెలిసింది. అసలు హీరోయిజమ్‌ను భుజం మీది కండువాతో సాధించవచ్చని తెలిశాక... దాన్ని రజనీకాంత్ కంటే సమర్థంగా ఉప యోగించిన వాళ్లు లేరు. మన సూపర్‌స్టార్ రజనీని కుర్చీ మీద కూర్చోబెట్టకుండా, నిలబెట్టి అవమానిద్దామంటే... అక్కడెక్కడో ఆకాశంలో వేలాడదీసి ఉన్న తూగుటుయ్యాలకు కండువాతో మెలికేసి, సయ్మంటూ లాగేసి, హుందాగా దాని మీద కూర్చొని... మళ్లీ రయ్‌మంటూ కాళ్లమీద కాళ్లేసుకుని తన హీరోచిత దర్జా చూపించడానికి ఉపయోగపడేది భుజం మీద టవలే. తదాదిగా ధీరోచిత ప్రద ర్శనకు టవల్‌ను ఒక టూల్లాగా సినిమా రంగాన విశేషంగా వాడుకున్నారు. అంటే భుజం మీడి కండువా తీసుకో వడం, కుర్చీ కోడుకు మెలికేసి దగ్గరికి లాక్కో వడం, కాలు మీద కాలేసుకొని కూర్చో వడం వంటి ప్రదర్శనలకు దాని సేవలు ఎంతగానో ఉపయోగించుకున్నారు. ఒక్క సినీరంగంలోనే కాదు... రాజకీయ రంగంలోనూ దాని సేవలు అందుతున్న విషయం సమకాలీనులకు తెలియనిదేమీ కాదు. ఒకప్పుడు పార్టీ మారడాన్ని చాలా ఇండికేటివ్గా మరింత సున్నితంగా చెప్పేందుకు ‘పార్టీ తీర్థం పుచ్చుకున్నారు’ లాంటి నర్మగర్భమైన మాటలు వాడేవారు. ఇప్పుడు అన్ని రంగాలలోనూ సింపుల్ మాటలు ఉపయోగించడం పరిపాటి అయ్యింది కాబట్టి పార్టీ మునుపటి తీర్థం స్వీకరించడం వంటి వాటి కంటే ‘కండువా కప్పుకున్నారు’ లాంటి మాటలే ఎక్కువగా వాడుతున్నారు. భాషాపరంగా వచ్చిన ఈ మార్పు కూడా జనాన్ని తమకు చేరువ చేస్తుందనీ నేతల విశ్వాసం. ఎంత ఆ నమ్మకం లేకపోతే ఒక బలమైన మాట స్థానంలో కండువా చేరుతుంది చెప్పండి! ఇప్పుడంటే రాజకీయ నేతలూ, దానికి కాస్త ముందు సినిమావాళ్లు తువ్వాలును, తుండుగుడ్డను తమ స్వప్ర యోజనాలకు వాడుతున్నారు గానీ... అనాది కాలంగా దాని ఉపయోగాలన్నీ మనందరికీ తెలియనివేమీ కాదు. అందుకే తుండుగుడ్డ పేరిట ఎన్నో జాతీయాలూ, సామెతలూ వెలిశాయి. ‘నడుం బిగించారు’ అనే మాటలో తువ్వాల అనే మాటే లేకపోయినా... ఏదైనా పనికి ఒడిగడుతున్నామంటే తువ్వాలనే నడుముకి బిగించామన్నది సమస్త తెలుగువాడకందారులందరికీ సుపరిచితమైన మాట. ఇక తలకు గుడ్డ కట్టుకోవడం అన్నది చాలా శ్రమతో కూడిన పనికి ముందర ఆరంభసూచికగా చేసే పని. ఇక ఊళ్లో పెద్దమనిషి డ్రెస్‌కోడ్‌లో భుజం మీద తువ్వాలు తప్పకుండా ఉంటుంది. పైగా దాని క్వాలిటీ మీదనే ఆయన ఎంత పెద్దవాడనే అంశం కూడా ఆధారపడి ఉంటుంది. పెద్ద పెద్ద నేతలైతే ఖద్దరు కండువాలూ, రాజకీయ వాసనలేమీ లేకుండా జస్ట్... మామూలు పెద్దవాళ్లు (అనగా పెద్దరికం మైనస్ రాజకీయాలు అన్నమాట) అయితే ఖరీదైన టర్కీటవళ్లు, ఓన్లీ పెద్దమనుషులైతే మంచి క్వాలిటీ కండువాలు, అదే శ్రామిక వర్గం అయితే ముతక తుండుగుడ్డలు భుజాల మీద ఉంటాయి. అనగా... మతం, కులం, ఇతర సూచికలతో పాటు... సామాజిక వర్గీకరణకు సైతం తుండుగుడ్డలు బాగా ఉపయోగపడతాయని సోషియాలజిస్టులు ఇంకా కనుగొనాల్సిన వాస్తవం. ఇక ఆధ్యాత్మికతకూ తుండుగుడ్డ ఒక సూచన. కావి రంగు తువ్వాల దీనికి ఒక తిరుగులేని చిహ్నం. ఆడంబరాలకూ, ఐశ్వర్యాలకూ, ఐహిక భవబంధాలకూ దూరంగా ఉన్నారని తెలపడానికీ ముతక కావిరంగు భుజంగుడ్డ ఒక తార్కాణం. సర్వసంగ పరిత్యాగ గుణంతో, ఒక రకమైన నిర్లిప్తతతో గడిపే గుణం తెలిపేందుకు ఈ భుజం గుడ్డ బాగా ఉపయోగపడుతుంది. అందుకే ప్రఖ్యాత దర్శకుడు కె.విశ్వనాథ్ తన శంకరశాస్త్రి గారి భుజాన ఇది వేసి చూపెడతాడు. పవర్‌లెస్ అని చూపించడానికి అదెంత పవర్‌ఫుల్‌గా ఉపయోగపడుతుందో నిరూపిస్తాడు. చిత్రమేమిటంటే... టవల్ అనే ఒకే ఒక అంశం... అటు ఆడంబరతకూ, ఇటు నిరాడంబరానికీ... ఈ రెండు గుణాలకూ ప్రతీక కావడం దాని గొప్పదనం. దండెం మీద వేలాడుతూ సామాన్యంగా కనిపిస్తుందని దానివైపు అసలు దృష్టే పోవడం లేదని అనుకోకండి. అటు సూపర్‌స్టార్ రజనీని అయినా, ఇటు కామన్స్టార్ శంకరశాస్త్రి గారినైనా సమదృష్టితో ఆదరించే గుణం తువ్వాలకు ఉంది. ఆ వస్త్రవిశేష నేత విజ్ఞతలో భగవంతుడికి ఉన్నంత స్థితప్రజ్ఞత ఉంది. - యాసీన్ -
ఓ ముసుగు ముచ్చట
Protection 4 Fashion 8 స్కార్ఫ్.. ఒక రక్షణ కవచం. కాలుష్య రక్కసి నుంచి మాత్రమే కాదు కాటేసే చూపుల నుంచి కూడా. పొల్యూషన్‌కు సొల్యూషన్‌లా వచ్చిన ఈ స్కార్ఫ్ ఫ్యాషన్‌కు కేరాఫ్‌గా మారుతోంది. దీంతో అమ్మాయిలు వీటిని విరివిగా వినియోగిస్తున్నారు. వీటి ట్రెండ్ ఊపందుకోవడంతో కొత్త కొత్త వెరైటీ స్కార్ఫ్‌లు మార్కెట్లోకి వచ్చేస్తున్నాయి. అయితే ఫ్యాషన్ మోజులో ఏవి పడితే అవి ఉపయోగించడం వల్ల చర్మవ్యాధులు వస్తాయని హెచ్చరిస్తున్నారు సిటీకి చెందిన డెర్మటాలజిస్టులు. - ఎస్.సత్యబాబు నిజానికి స్కార్ఫ్‌లను స్టోల్ అని పిలుస్తారు. అయితే వాడుకలో స్కార్ఫ్ అంటున్నారు. సిటీలో కాలుష్యం బారి నుంచి తప్పించుకునేందుకు అమ్మాయిలు స్కార్ఫ్‌లను విరివిగా వినియోగిస్తున్నారు. బైక్, బస్సుల్లో, ఆఖరికి నడిచి వెళ్తున్నవారు కూడా విభిన్న రకాల స్కార్ఫ్‌లను వాడుతున్నారు. ప్రొటక్షన్‌గా వచ్చిన స్కార్ఫ్‌లు కాస్త ఫ్యాషన్‌గా మారిపోయాయి. అయితే స్కార్ఫ్ల ఫ్యాబ్రిక్ వల్ల కొత్త రకం చర్మ వ్యాధులు వచ్చే ప్రమాదముందని సిటీకి చెందిన ప్రజ్ఞ ఆసుపత్రి డాక్టర్ పద్మావతి సూరపనేని హెచ్చరిస్తున్నారు. రక్షణ కోసం వాడేది సమస్యల కారకంగా మారకూడదంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనంటున్నారు. వస్త్రం నుంచి వర్ణం దాకా కారణాలే.. దేహంతో పోలిస్తే మహిళల ముఖ చర్మం మరింత సున్నితం. కాలుష్యం నుంచి తమను తాము కాపాడుకునేందుకు స్కార్ఫ్‌లు వినియోగించినప్పటికీ తరచూ ముఖంపై రాషెస్ వస్తున్నాయని పలువురు ఫిర్యాదు చేస్తున్నారంటే కారణం... సదరు స్కార్ఫ్ల తయారీలో వినియోగించిన కొన్ని రకాల ఫ్యాబ్రిక్స్. సెన్సిటివ్ స్కిన్ ఉన్న వారికి ఫ్యాబ్రిక్ అలర్జీ కారణంగా రాషెస్ రావచ్చు. ముఖ్యంగా నైలాన్, పాలిస్టర్, స్పాండెక్స్ వంటి సింథటిక్ ఫ్యాబ్రిక్‌లు వినియోగిస్తే కాంటాక్ట్ డెర్మటైటిస్ (ఒకరి నుంచి ఒకరికి వ్యాపించే చర్మవ్యాధి) సమస్య తప్పదు. అదే విధంగా కొన్ని ఫ్యాబ్రిక్స్ మెత్తగా, ముడతల్లేకుండా ఉండేందుకు వాడే ఐడొహైడ్ వంటి రసాయనాలు సైతం చర్మంపై దుష్ర్పభావాన్ని చూపిస్తాయి. అలాగే కొన్ని రకాల రంగుల్లో వినియోగించే పారా-ఫెనిలెనెడియామైన్(పిపిడి) అజో, ఆంత్రాక్క్వైనోన్ ఆధారిత డైలు కూడా అలర్జిక్ డెర్మటైటిస్‌కు కారణమవుతాయి. కాటన్, ఫ్యాబ్రిక్, ప్యూర్ సిల్క్ వంటి వాటిలో కూడా వీటిని వినియోగిస్తారు. మేకప్పుకు పైకప్పుగా వద్దు.. కన్సీలర్స్ లేదా ఫౌండేషన్‌ను ముఖానికి వినియోగించినప్పుడు అదే సమయంలో సింథటిక్ స్కార్ఫ్స్ను ఎక్కువ సేపు అదిమిపెట్టి ఉంచితే గాలి సోకకపోవడంతో విపరీతమైన స్వేదం ఏర్పడి మొటిమలు వస్తాయి. స్కార్ఫ్స్ కొనేటప్పుడు సహజ సిద్ధంగా తయారైన ఫ్యాబ్రిక్ లేదా కాటన్ లేదా లెనిన్ ఫ్యాబ్రిక్మాత్రమే ఎంచుకోవడం ఉత్తమం. రంగులు కూడా అత్యంత తక్కువ కలిసినవి మాత్రమే వినియోగించాలి. వీటిలో తక్కువ డై ఉంటుంది. ఎక్కువ సేపు స్కార్ఫ్ కట్టుకొని ఉండాల్సి వస్తే దానిని తొలగించిన వెంటనే ముఖాన్ని మంచినీటితో శుభ్రపరచుకొని మాయిశ్చరైజర్ రాసుకోవాలి. డాక్టర్ పద్మావతి డెర్మటాలజిస్ట్, కాస్మొటాలజిస్ట్, ప్రజ్ఞ హాస్పిటల్,పంజాగుట్ట 040 23356070 / 9848367000 -
నిండా ప్రేమలో మునిగాక.. ముసుగే శరణ్యం!!
-
స్కార్ఫ్ వాడుతున్నారా?
ఏ డ్రెస్ ధరించినా స్కార్ఫ్‌ను రెండు చేతులతో పట్టుకొని, మెడవెనక నుంచి, భుజాల మీదుగా తీసుకుంటూ ఒక్క ముడి వేసి వదిలేస్తే చాలు.. మీ రూపం క్షణంలో అధునాతనంగా మారిపోతుంది. ‘ఆడ, మగ భేదం లేకుండా ఇద్దరి వార్డ్‌రోబ్‌లోనూ ఉండాల్సిన స్టైలిష్ మెటీరియల్ స్కార్ఫ్’ అని ఫ్యాషన్ డిజైనర్స్ చెబుతున్న మాట. ఈ టిప్స్ పాటిస్తూ ధరించే రంగు, మెటీరియల్‌ను బట్టి మీ వ్యక్తిగత స్టైల్ స్టేట్మెంట్ను స్కార్ఫ్ ద్వారా ఎదుటివారికి ఇట్టే తెలియజేయండి. స్కార్ఫ్‌ను ఎంచుకునేటప్పుడు మీదైన ముద్ర కనిపించాలి. అందుకు సరైన ఫ్యాబ్రిక్, పరిమాణం, షేప్‌ను దృష్టిలో పెట్టుకోవాలి. వాతావరణం కాస్త డల్‌గా ఉన్నప్పుడు కాంతివంతమైన రంగులు గల స్కార్ఫ్‌ను వాడాలి. రూపం అధునాతనంగా, కొంచెం రఫ్‌గా మరికొంచెం ఫాస్ట్లుక్తో కనిపించాలనుకుంటే లేత రంగులు గలవి, ధరించిన దుస్తులకు కాంట్రాస్ట్వి ఎంచుకోవాలి. దేహానికి ఫిట్‌గా ఉండే దుస్తులను ధరించినప్పుడే స్కార్ఫ్ వాడటం మేలైన పద్ధతి. ఒకేరంగు స్కార్ఫ్, డ్రెస్ ధరిస్తే చూడటానికి అస్సలు బావుండదు. దుస్తులు వదులుగా ఉన్నప్పుడు స్కార్ఫ్ నప్పదు. టోపీ ధరించినప్పుడు పెద్ద స్కార్ఫ్ వాడాలి. సాయంకాలం స్కార్ఫ్‌ను భుజాల మీదుగా షాల్లా వేసుకుంటే చల్లని వాతావరణాన్ని తట్టుకున్నట్టూ ఉంటుంది. మరింత స్టైలిష్‌గానూ కనిపిస్తారు.