
స్కార్ఫ్ వాడుతున్నారా?
ఏ డ్రెస్ ధరించినా స్కార్ఫ్‌ను రెండు చేతులతో పట్టుకొని, మెడవెనక నుంచి, భుజాల మీదుగా తీసుకుంటూ ఒక్క ముడి వేసి వదిలేస్తే చాలు.. మీ రూపం క్షణంలో అధునాతనంగా మారిపోతుంది. ‘ఆడ, మగ భేదం లేకుండా ఇద్దరి వార్డ్‌రోబ్‌లోనూ ఉండాల్సిన స్టైలిష్ మెటీరియల్ స్కార్ఫ్’ అని ఫ్యాషన్ డిజైనర్స్ చెబుతున్న మాట. ఈ టిప్స్ పాటిస్తూ ధరించే రంగు, మెటీరియల్‌ను బట్టి మీ వ్యక్తిగత స్టైల్ స్టేట్‌మెంట్‌ను స్కార్ఫ్ ద్వారా ఎదుటివారికి ఇట్టే తెలియజేయండి.
స్కార్ఫ్‌ను ఎంచుకునేటప్పుడు మీదైన ముద్ర కనిపించాలి. అందుకు సరైన ఫ్యాబ్రిక్, పరిమాణం, షేప్‌ను దృష్టిలో పెట్టుకోవాలి.
వాతావరణం కాస్త డల్‌గా ఉన్నప్పుడు కాంతివంతమైన రంగులు గల స్కార్ఫ్‌ను వాడాలి.
రూపం అధునాతనంగా, కొంచెం రఫ్‌గా మరికొంచెం ఫాస్ట్‌లుక్‌తో కనిపించాలనుకుంటే లేత రంగులు గలవి, ధరించిన దుస్తులకు కాంట్రాస్ట్‌వి ఎంచుకోవాలి.
దేహానికి ఫిట్‌గా ఉండే దుస్తులను ధరించినప్పుడే స్కార్ఫ్ వాడటం మేలైన పద్ధతి.
ఒకేరంగు స్కార్ఫ్, డ్రెస్ ధరిస్తే చూడటానికి అస్సలు బావుండదు.
దుస్తులు వదులుగా ఉన్నప్పుడు స్కార్ఫ్ నప్పదు.
టోపీ ధరించినప్పుడు పెద్ద స్కార్ఫ్ వాడాలి.
సాయంకాలం స్కార్ఫ్‌ను భుజాల మీదుగా షాల్‌లా వేసుకుంటే చల్లని వాతావరణాన్ని తట్టుకున్నట్టూ ఉంటుంది. మరింత స్టైలిష్‌గానూ కనిపిస్తారు.