చౌదరి చరణ్ సింగ్ విశ్వవిద్యాలయం (ఫైల్‌ఫోటో)
మీరట్ : చౌదరి చరణ్ సింగ్ విశ్వవిద్యాలయం సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. ఇక మీదట కాలేజీ విద్యార్ధినులు స్కార్ఫ్ ధరించి యూనివర్సిటీలో ప్రవేశించకూడదనే నిబంధనను తీసుకువచ్చింది. యూనివర్సిటీకి చెందని వారిని క్యాంపస్‌లోకి రాకుండా నియంత్రించడానికే ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు యూనివర్సిటీ అధికారులు ప్రకటించారు. అయితే విశ్వవిద్యాలయాల్లో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఇదే ప్రథమం.
ఈ వియషం గురించి యూనివర్సిటీ అధికారులు ‘గత కొద్ది రోజులుగా యూనివర్సిటీకి చెందని యువతులు అనేక మంది కాలేజీ పరిసారాల్లో కనిపిస్తున్నారు. వారిని తమ ఐడెంటీని చూపించమని అడిగినప్పుడు ఎవరి దగ్గర సరైన ఆధారాలు లేవు. అమ్మాయిలు స్కార్ఫ్ ధరించి యూనివర్సిటీలోకి ప్రవేశించడం వలన క్యాంపస్‌కు చెందిన అమ్మాయిలా లేకా బయటి వారా అనే విషయం గుర్తించడం కష్టమవుతుంది. అందువల్లే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. దీని వల్ల క్యాంపస్ విద్యార్ధినులకు కలిగే నష్టం ఏం లేదు ’అని తెలిపారు.
అయితే యూనివర్సిటీ నిర్ణయం పట్ల మిశ్రమ స్పందన వ్యక్తమవుతుంది. కొందరు విద్యార్ధులు దీన్ని సమర్ధించగా మరి కొందరు మాత్రం ‘కాలేజిలోకి బయటి వారిని రాకుండా నియంత్రించాల్సిన బాధ్యత యూనివర్సిటీది. వారు ఈ బాధ్యతను సక్రమంగా నిర్వహించలేక ఇలాంటి నిర్ణాయాన్ని తీసుకున్నారు. దీనివల్ల క్యాంపస్ వాతావరణం దెబ్బతింటుంద’ని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment