గిన్నిస్ స్కార్ఫ్...
కొరుక్కుపేట(చెన్నై): చెన్నైకు చెందిన 700 మంది మహిళలతో కలసి మదర్ ఇండియా క్రోచెట్ క్వీన్స్ గ్రూప్ సృష్టించిన అతి పొడవైన స్కార్ఫ్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించింది. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు ప్రతినిధి రిష్నాత్ నేతృత్వంలో దీన్ని రూపొందించారు.
ఈ రికార్డు గురించి గ్రూప్ వ్యవస్థాపకురాలు శుభశ్రీ నటరాజన్ మాట్లాడుతూ స్కార్ఫ్ తయారు చేసేందుకు ఐదు నెలల ముందు నుంచే సన్నద్ధమవుతున్నామని తెలిపారు. వివిధ రాష్ట్రాలకు చెందిన 60 మంది ఈ రికార్డులో భాగస్వాములుగా ఉన్నారని పేర్కొన్నారు. జనవరి నుంచి స్కార్ఫ్‌లు తయారు చేస్తున్నామని ఇందులో చిన్నారులు, గృహిణుల నుంచి 1500 స్కార్ఫ్‌లు రాగా మొత్తం 5,300 స్కార్ఫ్‌లతో 14.09 కిలోమీటర్ల పొడవు దూరం స్కార్ఫ్ తయారు చేశామని అన్నారు. దీంతో గిన్నిస్ రికార్డులో స్థానం పొందినట్లు తెలిపారు.