
స్కార్ఫ్ స్పార్క్!
డ్రెస్సుల మీదకు మెడలో ఆభరణంలా స్కార్ఫ్ వాడకం సాధారణమే.
డ్రెస్సుల మీదకు మెడలో ఆభరణంలా స్కార్ఫ్ వాడకం సాధారణమే. అయితే, ఆ స్కార్ఫ్ మరింత స్పార్క్‌గా ఆకట్టుకోవాలంటే.. మార్కెట్‌లో జల్లెడపట్టాల్సిన అవసరం లేదు. మన దగ్గర ఉన్న క్లాత్, టీ షర్ట్స్, పాత స్కార్ఫ్‌లను.. ఇలా కొత్తగా ముస్తాబు చేయవచ్చు. వాటిని మన ముస్తాబులో అందంగా చేర్చవచ్చు.
న్యూలుక్
ఉడెన్, స్టీల్... బీడ్స్, పెద్ద పెద్ద లాకెట్స్‌ను స్కార్ఫ్‌కు గుచ్చి అందమైన కంఠాభరణంగా మార్చుకోవచ్చు. ప్లెయిన్ క్లాత్‌కి లేస్ డిజైన్‌ను తీసుకొని, ఇలా జత చేస్తే డ్రెస్సుల మీదకు చూడచక్కని స్కార్ఫ్ సిద్ధం. పాత ఉలెన్ స్కార్ఫ్‌లు చాలా సాదా సీదాగా కనిపిస్తుంటాయి. వాటిని అందమైన డిజైన్‌గా ఇలా రూపొందిస్తే పువ్వుల స్కార్ఫ్ పిల్లల కోసం రెడీ.