
సోషల్ మీడియా ప్లాట్‌ఫాం రారాజుగా నీరాజనాలు అందుకుంటోంది 'యుట్యూబ్'..!. దీని పుణ్యమా అని నేటితరం ఏదైనా అవలీలగా చిటికెలో నేర్చేసుకుంటోంది. ఏ చిన్న సందేహం వచ్చినా..యూట్యూబ్ సాయంతో చకచక తెలుసుకుంటున్నారు. అది కుకింగ్, చదువు, ఇతరత్రా ఏదైనా..క్షణాల్లో తెలుసుకుంటున్నారు, నేర్చుకుంటున్నారు. అంతేగాదు ఈ యూట్యూబ్ సాయంతో ఎంతో మంది ఓవర్‌నైట్ స్టార్‌లుగా మారారు. పైగా ఎంతోమందికి జీవనోపాధిని అందించింది కూడా. అలాంటి యూట్యూబ్ ఫ్లాట్ ఫాంలో అప్‌లోడ్ అయినా తొలి వీడియో ఏదో తెలుసా..అది నేటికి నిశ్శబ్దంగా ఇంటర్‌నెట్ చరిత్రను సృష్టిస్తోంది.
యూట్యూబ్‌ను ఫిబ్రవరి 14, 2005న జావేద్ కరీం, చాడ్ హర్లీ, స్టీవ్ చెన్, పేపాల్ తదితర వ్యక్తులు స్థాపించారు. ఇది ప్రస్తుతం గూగుల్ యాజమాన్యంలో ఉంది. అలా మొదలైనా యూట్యూబ్ ప్రస్థానం..ఎంతోమంది యంగ్ టాలెంట్‌ని వెలికితీసి పరిచయం చేసింది..వారి స్కిల్ ప్రపంచమే తెలుసుకునేందుకు వేదికగా మారింది.
అంతేగాదు దీని సాయంతో కొందరూ కంటెంట్ క్రియేటర్లుగా మారి ప్రభంజనం సృష్టిస్తున్నారు కూడా. అలాంటి యూట్యూబ్ ఫ్లాట్ ఫాంపై అప్‌లోడ్ అయినా తొలి వీడియో ఏదో తెలుసా..!. ఇప్పటికీ అది మిలియన్ల వ్యూస్‌తో దూసుకుపోతూ నెట్టింట చరిత్ర సృష్టిస్తోంది. పైగా అది జస్ట్ 19 సెకన్ల వీడియో. ఏప్రిల్ 23, 2005న, YouTube సహ వ్యవస్థాపకుడు జావేద్ కరీం శాన్ డియాగో ఓ జూ వద్ద నిలబడి చేసిన చిన్న వీడియో అది.
సుమారు 20 ఏళ్ల క్రితం జావేద్ ఏనుగుల ముందు నిలబడి..వాటి గురించి మాములుగా చెబుతున్న సాధారణ వీడియో. ఎలాంటి ఎడిటింగ్ లేకుండా..కనీసం వెనుక ఏవిధమైన సంగీత నేపథ్యం లేని సాదాసీదా వీడియో క్లిప్ అది. కానీ ఆ వీడియోకి గత కొన్నేళ్లుగా వస్తున్నా..వ్యూస్, లైక్‌లు చూస్తే మతిపోతుంది.
ఇప్పటికీ ఆ ఈవీడియోకి 335 మిలియన్లకు పైగా వ్యూస్, 17 మిలియన్లకు పైగా లైక్‌లు ఉండటం విశేషం. మరో గమ్మత్తైన విశేషం ఏంటంటే.. కరీమ్ య్యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ అయినా ఏకైక వీడియో అదే కావడం. ఇంకెందుకు ఆలస్యం ఆ వీడియో మీరు కూడా చూసేయండి మరీ..!.
(చదవండి: 24 ఏళ్లకే కంపెనీ రన్ చేశాడు ..28కే రిటైర్మెంట్! ఏకంగా రూ. 106 కోట్లు..)