ఈ ఏడాది 1996 క్యాలెండర్స్ వాడుకోండి..! ఎందుకంటే? | 1996 Calendar Come Back Again Video Viral | Sakshi
Sakshi News home page

2024లో 1996 క్యాలెండర్లకు డిమాండ్ - కారణం ఏంటంటే?

Published Sat, Jan 6 2024 7:17 PM | Last Updated on Sat, Jan 6 2024 7:34 PM

1996 Calendar Come Back Again Video Viral - Sakshi

2023 ముగిసింది 2024 కూడా వచ్చేసింది. అయితే ఈ ఏడాది చాలా మంది 1996 క్యాలెండర్ తీసి మళ్ళీ గోడకు తగిలిస్తున్నారు. ఇంతకీ 2024లో సుమారు మూడు దశాబ్దాల నాటి క్యాలెండర్ ఎందుకు తగిలిస్తున్నారు? దీని వెనుక ఉన్న కారణం ఏంటనేది ఈ కథనంలో తెలుసుకుందాం.

నిజానికి 2024లో వచ్చిన క్యాలెండర్ మొత్తం 1996 నాటి క్యాలెండర్ మాదిరిగానే ఉంది. అంటే 2024 జనవరి 1.. సోమవారంతో మొదలైంది. 1996 జనవరి 1 కూడా సోమవారమే మొదలైంది. రెండూ కూడా లీప్ సంవత్సరాలే. దీన్ని బట్టి చూస్తే క్యాలెండర్ చక్రం మళ్ళీ మొదలైందా అన్నట్లు అనిపిస్తోంది. దీనికి సంబంధించిన పోస్టులు, వీడియోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.

1996 ఈజ్ బ్యాక్ అంటూ కొందరు, 1996 - 2024 సేమ్ టు సేమ్ అంటూ కొందరు వీడియోలను వైరల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ క్యాలెండర్ ట్రెండ్ అవుతోంది. ఈ విషయాన్ని గమనించిన కొన్ని ఈ కామర్స్ సంస్థలు 1996 క్యాలెండర్ మాదిరిగానే దాని మీద వివిధ కవర్ ఫొటోలతో అమ్మకానికి పెడుతూ డబ్బు సంపాదించుకుంటున్నాయి.

ఇదీ చదవండి: మోదీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఈ కంపెనీలకు కొత్త రూల్స్! 

ఆన్‌లైన్‌లో అమ్మకానికి ఉన్న ఈ క్యాలెండర్ల ధరలు 50 డాలర్ల నుంచి 200 డాలర్ల వరకు ఉంది. భారతీయ కరెన్సీ ప్రకారం వీటి ధర రూ. 4000 నుంచి రూ. 16000 వరకు ఉందన్నమాట. ఇందులో కూడా 1996లో చైల్డ్ స్టార్‌గా ఫేమస్ అయిన 'జొనాథన్ టేలర్ థామస్' ఫోటో ఉన్న క్యాలెండర్లకు డిమాండ్ ఎక్కువగా ఉంది.

1996 క్యాలెండర్‌లో ఉన్న డేట్స్ మాత్రమే కాకుండా ప్రెసిడెంట్ ఎలక్షన్స్, ఒలంపిక్ గేమ్స్ వంటివి కూడా దాదాపు ఒకేలా ఉన్నట్లు తెలుస్తోంది. 1996లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు, ఒలంపిక్ గేమ్స్ జరిగాయి. ఇప్పుడు 2024లో కూడా అమెరికా ఎలక్షన్స్.. ఒలంపిక్ గేమ్స్ కూడా జరగనున్నాయి.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement