యూట్యూబ్‌లో మొదటి వీడియో ఏది? ఎంతమంది చూశారు? | First Video of Youtube it was About This Special Animal | Sakshi
Sakshi News home page

యూట్యూబ్‌లో మొదటి వీడియో ఏది? ఎంతమంది చూశారు?

Published Mon, Oct 23 2023 7:05 AM | Last Updated on Mon, Oct 23 2023 12:03 PM

First Video of Youtube it was About This Special Animal - Sakshi

ఈ రోజుల్లో యూట్యూబ్ అనేది వినోద ప్రపంచపు రారాజు. ఒకవైపు యూట్యూబ్‌ ద్వారా కోట్లాది మంది వినోదం పొందుతుండగా, మరోవైపు లక్షలాది మంది ఈ ప్లాట్‌ఫారమ్‌ ద్వారా  ఉపాధి పొందుతున్నారు. నేటి రోజుల్లో యూట్యూబర్‌గా మారడం అనేది ఉద్యోగం కంటే ఉత్తమమైన ఆదాయం అందుకోగల వృత్తి అనడంలో అతిశయోక్తి లేదు. అయితే యూట్యూబ్‌ ఎప్పుడు ప్రారంభమయ్యింది? దానిలో పోస్ట్ చేసిన మొదటి వీడియో ఏది? అనే ఆసక్తికర వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

యూట్యూబ్‌ని 2005లో స్టీవ్ చెన్, చాడ్ హర్లీ, జావేద్ కరీం ప్రారంభించారు. అయితే ఆ తర్వాత వీరు దీనిని 165 కోట్ల డాలర్లకు గూగుల్‌కు విక్రయించారు. ఈ రోజు ఈ యాప్‌కున్న క్రేజ్‌ ఎంతంటే ప్రతి నెలా 200 బిలియన్లకు(ఒక బిలియన్‌ అంటే వంద కోట్లు) పైగా వినియోగదారులు దీనిని సందర్శిస్తున్నారు. 

యూట్యూబ్‌లో మొదటి వీడియో 2005 సంవత్సరంలో ఏప్రిల్ 24న రాత్రి 8:27 గంటలకు అప్‌లోడ్ చేశారు. ఈ వీడియోను యూట్యూబ్ సహ వ్యవస్థాపకుడు జావేద్ కరీం అప్‌లోడ్ చేశారు. ఈ వీడియో టైటిల్ ‘మీ ఎట్ ది జూ’. ఈ 19 సెకన్ల వీడియోలో జావేద్ ఏనుగుల గురించి మాట్లాడుతూ ‘ఇప్పుడు మనం ఏనుగుల ముందున్నాం. ఏనుగులకు పొడవాటి తొండం ఉంటుంది’ అని అన్నారు.

ఈ వీడియోకు ఇప్పటివరకు 291 మిలియన్లకు (ఒక మిలియన్‌ అంటే పది లక్షలు) పైగా వీక్షణలు దక్కాయి. అదే సమయంలో 4.09 మిలియన్ల మంది ఈ ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్‌  చేసుకున్నారు. ఈ వీడియోను 14 మిలియన్ల మంది లైక్ చేశారు. అయితే ఇక్కడ అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ ఛానెల్‌లో ఈ వీడియో తప్ప మరో వీడియో అందుబాటులో లేదు. 
ఇది కూడా చదవండి: గోల్ఫ్ కోర్సుల రంధ్రాల మూసివేత ఎందుకు?
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement