టాప్ డిజైన్!
న్యూలుక్
ఎప్పుడూ ఒకేలాంటి టీ షర్ట్స్, షర్ట్స్ వేసుకోవాలంటే బోర్ అనిపించవచ్చు. ఓ కొత్త ప్రయోగంతో డిజైనర్ టాప్‌ని మీకు మీరుగానే రూపొందించుకోవచ్చు. ఇది చాలా సులువు కూడా! క్యాజువల్ వేర్‌లోనూ స్టైలిష్ లుక్‌తో అదరగొట్టే డిజైన్స్ మీ కోసం...
ఒక టీ షర్ట్ లేదా షర్ట్ రూపు మార్చడానికి ఏదైనా ఒకటి ఎంచుకోవాలి. దీనికి సరైన కాంబినేషన్ గల ప్రింటెడ్ మెటీరియల్ తీసుకోవాలి. ఇందుకు రెండు షర్ట్‌లను కూడా ఉపయోగించవచ్చు. ఏ భాగం కట్ చేసి, ఏ మెటీరియల్‌ని ప్యాచ్‌గా వేస్తే టాప్ బాగా కనిపిస్తుందో ముందే ఒక అంచనాకు రావాలి. షర్ట్‌లో ఏదైనా ఒక పార్ట్ మాత్రమే కట్ చేసి, ఆ ప్లేస్‌ను కవర్ చేసేలా మెటీరియల్‌తో ప్యాచ్ చేయాలి. ఇలా ఒక్కో మార్పును చేర్చుతూ షర్ట్ రీ డిజైనింగ్ చేసుకోవచ్చు.
బటన్ టాప్ కింది భాగం
► (నడుము) కట్ చేసి, దీనికి అదనంగా మరో సాఫ్ట్ క్లాత్‌ని జత చేస్తే ఇలా అందమైన టాప్ సిద్ధం.
► టీ షర్ట్ టాప్‌కి చెక్స్ షర్ట్ కాలర్, ఛాతీ భాగం, హ్యాండ్ కఫ్స్ జత చేయాలి. స్టైలిష్ టాప్ రెడీ.
► ప్లెయిన్ లాంగ్ స్లీవ్స్ టాప్‌కి వీపు భాగం, పాకెట్, స్లీవ్స్ క ఫ్స్.. మరో క్లాత్‌తో ప్యాచ్‌వర్క్ చేస్తే చూడ ముచ్చటైన షర్ట్ రెడీ.
డెనిమ్ షర్ట్ కింది భాగం
(నడుము నుంచి దాదాపు 5 సెంటీమీటర్ల) భాగం కట్ చే యాలి. దీనికి మరో ప్రింటెడ్ మెటీరియల్‌ను జత చేస్తే మరో డిజైనర్ షర్ట్ రెడీ
చెక్స్ షర్ట్ నెక్ కాలర్
కట్ చేసి బ్లాక్ కలర్ క్లాత్‌తో పైపింగ్ చేయాలి. అలాగే చెక్స్ స్లీవ్స్ తీసేసి ప్రింటెడ్ మెటీరియల్ లాంగ్ స్లీవ్స్ జత చేయాలి. రెండు వైపులా పాకెట్స్ ప్యాచ్‌గా వేయాలి. మరో డిజైనర్ షర్ట్ సిద్ధం.