
ముంబై: తనను చంపుతానంటూ బెదిరింపులు వస్తున్నాయని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్‌సీబీ) ముంబై మాజీ చీఫ్ సమీర్ వాంఖడే ముంబై పోలీసులను ఆశ్రయించారు. తనను, తన భార్యను సామాజిక మాధ్యమాల్లో దుర్భాషలాడుతూ చంపుతామంటూ గత నాలుగు రోజులుగా బెదిరింపులు వస్తున్నాయని వాంఖడే పేర్కొన్నారు.
వాంఖడే తన ప్రతినిధి ద్వారా ఈ మేరకు ఒక లేఖను దక్షిణ ముంబై పోలీస్ కమిషనరేట్‌కు పంపినట్లు ఒక అధికారి తెలిపారు. ‘క్రూయిజ్ డ్రగ్స్’ కేసులో బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్‌ను ఇరికించకుండా ఉండేందుకు రూ.25 కోట్లు లంచం డిమాండ్ చేసినట్లు వచ్చిన ఆరోపణలపై సమీర్ వాంఖడేను శని, ఆదివారాల్లో సీబీఐ ప్రశ్నించింది.
Comments
Please login to add a commentAdd a comment