ముంబై: డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ కుమారుడి ఆర్యన్ ఖాన్‌కి బాంబే హైకోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన ఆర్యన్ 20 రోజులకు పైగా జైలు జీవితం గడిపాడు. మూడు సార్లు బెయిల్ తిరస్కరించిన కోర్టు.. నేడు ఆర్యన్‌కి ఊరట కలిగించింది.
డ్రగ్స్ కేసుకు సంబంధించి ఆర్యన్ కేసులో కీలకంగా వ్యవహరించిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడేపై ఎన్‌సీపీ నాయకుడు నవాబ్ మాలిక్ గత కొన్ని రోజులుగా సంచలన ఆరోపణలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్యన్‌కు బెయిల్ వచ్చిన సందర్భంగా నవాబ్ మాలిక్ సంచలన వ్యాఖ్యలు చేసి మరోసారి వార్తల్లో నిలిచారు.
(చదవండి: ఎట్టకేలకు ఆర్యన్ ఖాన్‌కు బెయిల్)
ఆర్యన్‌కు బెయిల్ వచ్చిన విషయం తెలిసిన వెంటనే నవాబ్ మాలిక్ ట్వీట్ చేశారు. అది కూడా షారుక్ ఖాన్ ఓం శాంతి ఓం సినిమాలోని ఫేమస్ డైలాగ్ ‘పిక్చర్ అభీ బాకీ హై మేరా దోస్త్’(సినిమా అప్పుడే అయిపోలేదు మిత్రమా) అంటూ ట్వీట్ చేశారు. ఎన్‌సీబీ డైరెక్టర్ సమీర్ వాంఖడేని ఉద్దేశించే నవాబ్ మాలిక్ ఇలా ట్వీట్ చేశారని నెటిజనులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ తెగ వైరలవుతోంది.
(చదవండి: ఆర్యన్‌ఖాన్ నవ యవ్వనంలో ఉన్న బాధితుడు.. నిందితుడు కాదు)
पिक्चर अभी बाकी है मेरे दोस्त
— Nawab Malik نواب ملک नवाब मलिक (@nawabmalikncp) October 28, 2021
సింగిల్ బెంచ్ జస్టిస్ ఎన్‌వీ సంబ్రే.. ఆర్యన్‌తో పాటు ఆర్భాజ్ మర్చంట్, మున్‌మున్ ధమేచాలకు కూడా బెయిల్ మంజూరు చేశారు. ఈ సందర్భంగా జస్టిస్ సంబ్రే ‘‘మూడు అభ్యర్ధనలు అనుమతించాను. రేపు సాయంత్రంలోగా నేను వివరణాత్మక ఉత్తర్వులను జారీ చేస్తాను’’ అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment