bail grants
-
నోబెల్ గ్రహీత నర్గీస్ విడుదల
పారిస్: నోబెల్ శాంతి బహుమతి గ్రహీత నర్గీస్ మొహమ్మదీ బుధవారం ఇరాన్‌లోని టెహ్రాన్‌లోని ఎవిన్ కారాగారం నుంచి విడుదలయ్యారు. అనారోగ్య కారణాలరీత్యా ఆమెకు మూడు వారాలపాటు శిక్షను నిలుపుదల చేసి జైలు అధికారులు విడుదలచేశారు. తిరిగి జైలులో లొంగిపోయాక ఈ మూడువారాలు అదనంగా శిక్షాకాలంగా అనుభవించాల్సి ఉంటుంది. గత రెండేళ్లలో తొలిసారిగా తన తల్లితో ఫోన్లో మాట్లాడానని పారిస్‌లో ఉంటున్న నర్గీస్ కుమారుడు అలీ రహ్మానీ తెలిపారు. ఆమె జైలు నుంచి విడుదలయ్యాక 2022–2023 నిరసన ఉద్యమ నినాదం అయిన ‘మహిళల జీవితానికి స్వేచ్ఛ లభించాలి’అని నినదించారు. ‘‘ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నా మానసికంగా బాగున్నారు. పోరాట పటిమ ఆమెలో అలాగే ఉంది. హిజాబ్ లేకుండా జైలు నుంచి బయటకు రాగలిగా’’అని తన తల్లి చెప్పిందని కుమారుడు రహా్మనీ వెల్లడించారు. మహిళల హక్కులకోసం ఇరాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆమె అలుపెరగని పోరాటం కొనసాగిస్తారని పేర్కొన్నారు. ఇరాన్లో హిజాబ్ ధారణపై అత్యంత కఠిన చట్టాలు, ఇతర నేరాలకు మరణశిక్ష అమలును వ్యతిరేకంగా పోరాడిన నర్గీస్‌ను అరెస్ట్ చేసిన ఇరాన్ పోలీసులు పల సెక్షన్ల కింద దోషిగా తేల్చారు. దీంతో ఆమె 2021 నవంబర్ నుంచి ఎవిన్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. దశాబ్ద కాలంగా జైలు జీవితం గడుపుతున్న ఆమె కొన్నేళ్లుగా కనీసం భర్త, కవల పిల్లలను చూడలేదు. ఆమె కారాగార శిక్ష అమలును 21 రోజులు నిలుపుదల చేశారని, ఆ 21 రోజులను ఆమె తిరిగి జైలుకెళ్లాక అదనంగా శిక్షాకాలాన్ని అనుభవించాల్సి ఉంటుందని ఆమె మద్దతుదారులు ఆగ్రహం వ్యక్తంచేశారు. బెయిలును కనీసం మూడు నెలలకు పొడిగించాలని ఆమె మద్దతుదారులు డిమాండ్ చేశారు. ఆమె అనారోగ్యం కారణంగా వైద్యుల సలహా మేరకు ప్రాసిక్యూటర్ విడుదలకు అనుమతించారని న్యాయవాది ముస్తఫా నీలీ తెలిపారు. ఆమెకు ఉన్న కణితి ప్రాణాంతకం కాదని, అయితే ప్రతి మూడు నెలలకోసారి ఆమెకు వైద్యపరీక్షలు అవసరమని లాయర్ వెల్లడించారు. జైలులోనూ నర్గీస్ పోరాట మార్గాన్ని వీడలేదు. ఎవిన్ జైలు ఆవరణలో నిరసనలు చేపట్టారు. నిరాహార దీక్షలు చేశారు. ఇరాన్లో మహిళలపై జరుగుతున్న దారుణమైన అణచివేతను ఆమె సెప్టెంబర్‌లో జైలు నుంచి రాసిన లేఖలోనూ ఖండించారు. 2022–2023లో అయతుల్లా అలీ ఖమేనీ ఆధ్వర్యంలో ఇస్లామిక్ అధికారులను గద్దె దింపాలని కోరుతూ జరిగిన నిరసనలకు నర్గీస్ పూర్తి మద్దతు తెలిపారు. దేశానికి వ్యతిరేకంగా ప్రచారం చేసినందుకు జూన్‌లో ఆమెకు మరో ఏడాది జైలు శిక్ష పడింది. -
29మంది బాలలకు మరణశిక్ష
పిల్లలను రక్షించాల్సిన ప్రభుత్వమే వారిని శిక్షిస్తోంది. అన్యాయం, అసమానతలపై గొంతెత్తడమే వారి నేరమైంది. 29 మంది పిల్లలకు కోర్టు మరణశిక్ష విధించడం నైజీరియా లో సంచలనం రేపింది. అయితే బాలల హక్కుల చట్టం ప్రకారం పిల్లలకు మరణ శిక్ష విధించడానికి క్రిమినల్ ప్రొసీడింగ్స్ అనుమతించకపోవడంతో బెయిలు మంజూరు చేసింది. నైజీరియాలో ఇంతకుముందెన్నడూ లేనివిధంగా జీవన వ్యయ సంక్షోభం నెలకొంది. సరైన విద్య, ఉపాధి లేదు. చివరకు ఆకలితో చనిపోయే రోజులొచ్చాయి. దీనిపై తీవ్రమైన నిరసనతో యువత సామూహిక నిరసనలను చేపట్టింది. ఆగస్టులో జరిగిన ఆందోళనల్లో దాదాపు 20 మందిని ప్రభుత్వం కాల్చి చంపింది. వందలాది మంది యువకులను అరెస్టు చేశారు. 76 మందిపై దేశద్రోహం, తిరుగుబాటు, ఆస్తుల విధ్వంసం సహా 10 ఆరోపణలతో కేసు వేశారు. ఈ కేసులో విచారణ జరిపిన కోర్టు.. వారందరికీ మరణశిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది. అయితే ఈ 76 మందిలో 29 మంది చిన్నారులు ఉండటం, వారంతా 14 నుంచి 17 ఏళ్లలోపు వారు కావడం సంచలనమైంది. కేసు విచారణ జరుగుతున్న సమయంలో కోర్టు ఆవరణలోనే నలుగురు చిన్నారులు కుప్పకూలిపోయారు. అయితే నైజీరియా బాలల హక్కుల చట్టం ప్రకారం పిల్లలపై క్రిమినల్ ప్రోసీడింగ్స్, మరణశిక్ష విధించడానికి అనుమతి లేదని బాలుర తరఫు లాయర్ వాదనలతో ఏకీభవించిన కోర్టు బెయిలు మంజూరు చేసింది. ఒక్కొక్కరికీ రూ. 5 లక్షల పూచికత్తుతో పాటు కఠినమైన ఆంక్షలు విదించింది. నైజీరియాలో 1970లో మరణశిక్షను ప్రవేశపెట్టారు. 2016 నుంచి ఉరిశిక్ష అమలులో లేదు. నైజీరియా కోర్టు సంచలన తీర్పు21 కోట్లకు పైగా జనాభా ఉన్న నైజీరియా జనాభా పరంగా ఖండంలో అతిపెద్దది. ఆఫ్రికాలో ముడిచమురు ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉంది. అయినా ప్రపంచంలోని పేద దేశాలలో ఒకటిగా ఉంది. ఇటీవలికాలంలో ద్రవ్యోల్బణం రేటు కూడా 28 ఏళ్ల గరిష్టానికి పెరిగింది. స్థానిక నైరా కరెన్సీ డాలర్‌తో పోలిస్తే రికార్డు కనిష్టానికి పడిపోయింది. ఓవైపు ప్రజలు ఆకలితో చస్తుంటే.. ప్రభుత్వ అధికారుల జీవనశైలి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. ఆ దేశ రాజకీయ నాయకులు ఆరోపణలతో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. చట్టసభ సభ్యులు అత్యధిక పారితోíÙకం అందుకుంటున్నారు. ప్రభుత్వాధినేతలు, అధికారులు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. పెద్ద సంఖ్యలో ప్రజలు తీవ్రమైన ఆహార అభద్రతను ఎదుర్కొంటున్నారని తెలిపిన ఐక్యరాజ్యసమితి.. ఆహార సంస్థల నివేదికలో నైజీరియాను ‘ఆందోళన కలిగించే హాట్ స్పాట్’గా వర్గీకరించింది. ఈ నేపథ్యంలో ఉపాధి, ఉద్యోగాలు, ఆహార భద్రతను డిమాండ్ చేస్తూ యువత ఆందోళనలు చేస్తున్నారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
Arvind Kejriwal: రెండ్రోజుల్లో రాజీనామా
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కనీ్వనర్ అరవింద్ కేజ్రీవాల్ సంచలన ప్రకటన చేశారు. ముఖ్యమంత్రి పదవికి రెండు రోజుల తర్వాత రాజీనామా చేయబోతున్నట్లు వెల్లడించారు. తాను నిజాయతీపరున్ని అని ప్రజలు తీర్పు ఇచ్చేదాకా సీఎం సీట్లో కూర్చోబోనని ప్రతిజ్ఞ చేశారు. ఢిల్లీ అసెంబ్లీకి సాధ్యమైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించిన సీబీఐ కేసులో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో కేజ్రీవాల్ శుక్రవారం తిహార్ జైలు నుంచి విడుదలవడం తెలిసిందే. ఆదివారం భార్య సునీతతో కలిసి ఆయన ఆప్ ప్రధాన కార్యాలయంలో పార్టీ నేతలు, కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు. రెండు రోజుల్లో ఆప్ ఎమ్మెల్యేలతో సమావేశమై కొత్త సీఎంంను ఎంపిక చేస్తానని వెల్లడించారు. కేజ్రీవాల్ ఇంకా ఏమన్నారంటే... నేరస్తుడినని భావిస్తే నాకు ఓటేయకండి ‘‘దేశ ప్రజలను, ఢిల్లీవాసులను అడగాలనుకుంటున్నాను. కేజ్రీవాల్ నిజాయితీపరుడా? లేక నేరస్తుడా? ప్రజలే తీర్పు చెప్పాలి. కొద్ది నెలల్లో ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలున్నాయి. ప్రతి గల్లీకి, ప్రతి గడపకూ వెళ్తాను. నిజాయితీపరుడని అనుకుంటే నాకు ఓటేయండి. నేరస్తుడినని భావిస్తే వేయకండి. మీరు వేసే ప్రతి ఓటూ నా నిజాయతీకి సర్టిఫికెట్. ఆప్‌కు ఘనవిజయం కట్టబెట్టడం ద్వారా మీరు నన్ను గెలిపించినప్పుడే నేను ముఖ్యమంత్రి పీఠంపై, మనీశ్ సిసోడియా ఉప ముఖ్యమంత్రి సీట్లో కూర్చుంటాం. మా ఇద్దరి విషయంలో నిర్ణయాధికారం ఇక మీ చేతుల్లోనే ఉంది. ఢిల్లీలో వచ్చే ఫిబ్రవరిలో ఎన్నికలు జరగాల్సి ఉంది. వాటిని మహారాష్ట్రతో పాటు వచ్చే నవంబర్లోనే నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరుతున్నా.సీతలా నాకు అగి్నపరీక్ష ‘‘14 ఏళ్ల వనవాసం తర్వాత సీతాదేవి అగి్నపరీక్ష ఎదుర్కోవాల్సి వచి్చంది. జైలు నుంచి వచ్చాక నేను కూడా అగి్నపరీక్షకు సిద్ధంగా ఉన్నాను. కేజ్రీవాల్ చోర్, అవినీతిపరుడు, భరతమాతకు ద్రోహం చేశాడంటూ నిందలేస్తున్నారు. నేను ‘డబ్బుతో అధికారం, అధికారంతో డబ్బు’ అనే ఆటాడేందుకు రాలేదు. దేశానికి మంచి చేద్దామని వచ్చా. ఆప్‌ను విచి్ఛన్నం చేసేందుకే నన్ను జైలుకు పంపించారు. ఎమ్మెల్యేలను డబ్బుతో కొనడం, సీబీఐ, ఈడీలతో భయపెట్టడం, తప్పుడు కేసులు, జైళ్లకు పంపడం, ప్రభుత్వాలను పడగొట్టడం, చివరికి సొంత ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం.. ఇలా ఒక ఫార్మూలా రూపొందించుకున్నారు. నన్ను జైలుకు పంపితే ఢిల్లీలో ఆప్ విచ్ఛిన్నమై ప్రభుత్వం పడిపోతుందని, బీజేపీ ప్రభుత్వం వస్తుందని అనుకున్నారు. కానీ మా పార్టీ, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు విచ్ఛిన్నం కాలేదు. కుట్రలకు వ్యతిరేకంగా పోరాడే సామర్థ్యం ఆప్‌కు ఉంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకే జైలులో ఉండగా పీఎం పదవికి రాజీనామా చేయలేదు’’.భార్యను సీఎం చేయడానికే డ్రామాలు: బీజేపీ భార్య సునీతను సీఎం చేయడానికి కేజ్రీవాల్ నాటకాలాడుతున్నారని బీజేపీ ఎద్దేవా చేసింది. ‘‘సమస్యలను అవకాశాలుగా మార్చుకోవడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. అందులో భాగంగా రాజకీయంగా లబ్ధి కోసమే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ముందు ఇలా డ్రామాకు తెర తీశారు’’ అని పార్టీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా ఆరోపించారు. రాజీనామా చేస్తా అనటమంటే మద్యం కుంభకోణంలో నేరాన్ని ఒప్పుకున్నట్లేనని బీజేపీ నేత సుధాంశు త్రివేది అన్నారు. ఆప్‌లో అంతర్గత ఘర్షణలను తట్టుకోలేకే రాజీనామా ప్రకటన చేసి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు.ఆప్ కొత్త సీఎం ఎవరు? కేజ్రీవాల్ రాజీనామా ప్రకటన నేపథ్యంలో ఢిల్లీ కొత్త సీఎం ఎవరన్న దానిపై చర్చ ప్రారంభమైంది. రేసులో కేజ్రీవాల్ భార్య సునీత, మంత్రులు అతిశీ, గోపాల్ రాయ్ ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. దీనిపై ఆప్ వర్గాలు అధికారికంగా స్పందించకున్నా సునీతకే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు పార్టీ నాయకుడొకరు చెప్పారు. కేజ్రీవాల్ మాదిరిగానే ఐఆర్ఎస్ అధికారిగా చేసిన ఆమెకు ప్రభుత్వాన్ని నడిపే విధానం క్షుణ్ణంగా తెలుసన్నారు. ‘‘అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కేజ్రీవాల్ నిర్ణయం తీసుకుంటారు. ఢిల్లీలో దళితులు, ముస్లింల ప్రాబల్యంగా అధికం గనుక ఆ వర్గాల నుంచి సీఎంను ఎంచుకున్నా ఆశ్చర్యం లేదు’’ అని పరిశీలకులు అంటున్నారు. -
Supreme Court: సిసోడియాకు బెయిల్
న్యూఢిల్లీ: ఢిల్లీ మధ్య కుంభకోణం కేసులో 17 నెలల క్రితం అరెస్టయి తిహార్ జైలులో విచారణ ఖైదీగా గడుపుతున్న ఆప్ నేత, నాటి ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాకు ఎట్టకేలకు సుప్రీంకోర్టులో బెయిల్ దొరికింది. సుదీర్ఘకాలంపాటు కేసు దర్యాప్తును సాగదీసి విచారణ ఖైదీకుండే హక్కులను కాలరాయలేమని శుక్రవారం బెయిల్ ఉత్తర్వులిస్తూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ మేరకు జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌ల ధర్మాసనం సిసోడియాకు బెయిల్‌ను మంజూరుచేస్తూ 38 పేజీల తీర్పు వెలువరించింది. బెయిల్ పిటిషన్‌పై ఆగస్ట్ ఆరో తేదీన వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్‌చేసి ఆగస్ట్ 9వ తేదీన వెలువరించింది.వైకుంఠపాళి ఆడించారు.. ‘‘బెయిల్ అనేది నియమం. బెయిల్‌ను తిరస్కరించి విచారణ ఖైదీగా జైలుకు పరిమితం చేయడం అనేది ఒక మినహాయింపు’’ మాత్రమే అనే సూత్రాన్ని ట్రయల్ కోర్టులు, హైకోర్టులు జ్ఞప్తికి తెచ్చుకోవాల్సిన సమయమిది. బెయిల్ విషయంలో విచారణ కోర్టులు, హైకోర్టులు సేఫ్ గేమ్ ఆడుతున్నాయి. మనీశ్‌పై సీబీఐ, ఈడీలు దర్యాప్తు పూర్తిచేసి జూలై 3 కల్లా చార్జ్షీట్లు సమర్పిస్తాయని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా గతంలో హామీ ఇచ్చారు. కానీ అది జరగలేదు. సిసోడియాను ట్రయల్ కోర్టుకు, అక్కడి నుంచి హైకోర్టుకు, తర్వాత సుప్రీంకోర్టుకు, మళ్లీ ట్రయల్ కోర్టుకు తిప్పుతూ ఆయనతో వైకుంఠపాళి ఆట ఆడించారు. బెయిల్ అనివార్యమైన కేసుల్లోనూ బెయిల్ తిరస్కరించడంతో సంబంధిత పిటిషన్లు సుప్రీంకోర్టుకు వెల్లువలా వస్తున్నాయి. సమాజంతో మమేకమైన సిసోడియా లాంటి వ్యక్తులను శిక్ష ఖరారు కాకుండానే సుదీర్ఘ కాలం నిర్బంధించి ఉంచకూడదు. స్వేచ్ఛగా, వేగవంతమైన విచారణను కోరడం నిందితుడికి రాజ్యాంగం ప్రసాదించిన హక్కు. అయితే కేసు విచారణ నత్తనడకన సాగడానికే సిసోడియానే కారణమన్న కిందికోర్టు అభిప్రాయం వాస్తవదూరంగా ఉంది’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ విషయంలో సిసోడియాకు బెయిల్‌ను తిరస్కరిస్తూ మే 21వ తేదీన ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు పక్కనబెట్టింది. ‘‘రూ.10 లక్షల వ్యక్తిగత బాండ్‌తోపాటు అదే మొత్తానికి మరో రెండు షూరిటీలను సమర్పించాలి. పాస్ట్‌పోర్ట్‌ను ప్రత్యేక ట్రయల్ కోర్టులో ఇచ్చేయాలి. సాక్ష్యాధారాలను ధ్వంసంచేయకూడదు. సాక్షులను ప్రభావితం చేయకూడదు. దర్యాప్తు అధికారి ఎదుట ప్రతి సోమ, గురు వారాల్లో ఉదయం 10–11 గంటల మధ్య హాజరు కావాలి’’ అని కోర్టు షరతులు విధించింది. తొలుత సీబీఐ.. ఆ తర్వాత ఈడీడిఫ్యూటీ సీఎంగా ఉన్న సిసోడియాను మద్యం కేసులో 2023 ఫిబ్రవరి 26వ తేదీన సీబీఐ అరెస్ట్‌చేసింది. తర్వాత రెండు రోజులకే ఆయన తన పదవికి రాజీనామా చేశారు. మార్చి 9న మనీలాండరింగ్ కోణంలో కేసు నమోదుచేసి ఈడీ సైతం జ్యుడీషియల్ కస్టడీలో ఉండగానే ఆయనను అరెస్ట్‌చేసింది.అంబేడ్కర్‌కు రుణపడ్డా: సిసోడియాతీర్పు నేపథ్యంలో శుక్రవారం తీహార్ జైలు నుంచి సిసోడియా విడుదలయ్యారు. పెద్దసంఖ్యలో జైలు వద్దకొ చ్చిన ఆప్ కార్యకర్తలు ఆయనపై పూలు చల్లుతూ స్వాగతం పలికారు. ‘‘ నిరంకుశ కేంద్రప్రభుత్వ చెంప చెళ్లు మనిపించేందుకు రాజ్యాంగ అధికారాలను వినియోగించిన కోర్టుకు నా కృతజ్ఞతలు. శక్తివంతమైన రాజ్యాంగం, ప్రజా స్వామ్యం వల్లే బెయిల్ పొందగలిగా. ఈ బెయిల్ ఉత్తర్వు చూశాక జీవితాంతం రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌కు రుణపడిపోయా. ఈ అనైతిక యుద్ధానికి రాజ్యాంగబద్ధంగా తార్కిక ముగింపు పలికాం. ఏదో ఒక రోజు ఈ చెడు సంస్కృతి అంతమవుతుంది. అప్పుడు బెయిల్‌పై కేజ్రీవాల్ కూడా విడుదల అవుతారు’’ అని సిసోడియా అన్నారు.ఆప్ హర్షంసిసోడియాకు బెయిల్‌పై ఆప్ పార్టీ హర్షం వ్యక్తంచేసింది. ‘‘ సత్యమేవ జ యతే. ఢిల్లీలో విద్యా విప్ల వానికి నాంది పలికిన సిసోడియాకు ఇది గొప్ప విజయం. ఇది విద్యా విజయం, విద్యా ర్థుల విజయం’’ అని ఢిల్లీ మహిళా మంత్రి అతిశి వ్యాఖ్యానించారు. -
హేమంత్ సోరెన్‌కు బెయిల్
రాంచీ: భూకుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, జార్ఖండ్ ముక్తిమోర్చా(జేఎంఎం) కార్యనిర్వాహక అధ్యక్షుడు హేమంత్ సోరెన్(48)కు భారీ ఊరట లభించింది. ఈ కేసులో జార్ఖండ్ హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. తనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ హేమంత్ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ రంగోన్ ముఖోపాధ్యాయ ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. హేమంత్ సోరెన్‌కు బెయిల్ ఇస్తే మళ్లీ ఇదే తరహా అవినీతికి పాల్పడే అవకాశం ఉందని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) తరఫు న్యాయవాది ఎస్.వి.రాజు పేర్కొన్నారు. ఆయనకు బెయిల్ ఇవ్వొద్దని కోరారు. ఈడీ వాదనను ధర్మాసనం తిరస్కరించింది. ప్రాథమిక ఆధారాలను బట్టి చూస్తే హేమంత్ ఏ నేరమూ చేయలేదని, బెయిల్‌పై బయట ఉన్నప్పుడు ఆయన నేరం చేసే అవకాశం లేదని, అందుకే బెయిల్ ఇస్తున్నామని స్పష్టంచేసింది. హేమంత్ రూ.50 వేల పూచీకత్తు సమరి్పంచాలని, ఆయనకు ష్యూరిటీ ఇస్తూ మరో ఇద్దరు రూ.50 వేల చొప్పున పూచీకత్తు సమరి్పంచాలని ఆదేశించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. తాము సుప్రీంకోర్టుకు వెళ్తామని, ఈ బెయిల్ తీర్పుపై 48 గంటలపాటు స్టే విధించాలని ఈడీ తరఫున మరో న్యాయవాది జోహబ్ హుస్సేన్ విజ్ఞప్తి చేయగా ధర్మాసనం తిరస్కరించింది. జార్ఖండ్ రాజధాని రాంచీలో 8.86 ఎకరాల భూకుంభకోణం కేసులో హేమంత్ సోరెన్‌ను ఈ ఏడాది జనవరి 31న ఈడీ అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. తప్పుడు కేసులో ఇరికించారు: హేమంత్ తనను తప్పుడు కేసులో ఇరికించి, ఐదు నెలలపాటు జైల్లో పెట్టారని హేమంత్ సోరెన్ ఆరోపించారు. జైలు నుంచి విడుదలైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్రంలోని అధికార బీజేపీపై నిప్పులు చెరిగారు. ప్రతిపక్ష నేతలు, సామాజిక కార్యర్తలు, జర్నలిస్టుల గొంతులను ప్రభుత్వం అణచివేస్తోందని మండిపడ్డారు. -
Delhi Court: కేజ్రీవాల్‌కు బెయిల్
ఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు భారీ ఊరట లభించింది. మద్యం కుంభకోణంలో మనీలాండరింగ్ అభియోగాలపై అరెస్టయిన ఆమ్ఆద్మీ పార్టీ జాతీయ కనీ్వనర్ కేజ్రీవాల్‌కు ఢిల్లీ కోర్టు గురువారం రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. లక్ష రూపాయల వ్యక్తిగత పూచీకత్తుపై కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేస్తూ వెకేషన్ స్పెషల్ జడ్జి నియయ్ బిందు ఆదేశాలు జారీ చేశారు. బెయిల్ ఆదేశాలను 48 గంటల పాటు నిలిపి ఉంచాలన్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అభ్యర్థనను జడ్జి తిరస్కరించారు. బెయిల్ ఉత్తర్వులను పైకోర్టులో సవాల్ చేస్తామని, అందుకోసం 48 గంటలు ఆదేశాలను నిలిపి ఉంచాలని ఈడీ అభ్యరి్థంచింది. కానీ జడ్జి నియయ్ బిందు ఇందుకు సమ్మతించలేదు. దర్యాప్తునకు ఆటంకం కలి్పంచకూడదని, సాక్షులను ప్రభావితం చేయరాదని కేజ్రీవాల్‌కు కోర్టు షరతులు విధించింది. అలాగే అవసరమైనపుడల్లా కోర్టు ఎదుట హాజరుకావాలని, దర్యాప్తునకు సహకరించాలని షరతులు పెట్టింది. కేజ్రీవాల్‌కు రెగ్యులర్ బెయిల్ రావడం ఆప్‌కు, ఇండియా కూటమి మిత్రపక్షాలకు ప్రధానికి వ్యతిరేకంగా ఒక అస్త్రం దొరికినట్లే. కేజ్రీవాల్ న్యాయవాదులు శుక్రవారం కోర్టులో పూచీకత్తును సమరి్పస్తే అదేరోజు తీహార్ జైలు నుంచి ఢిల్లీ సీఎం బయటకు వస్తారు. ఢిల్లీ మద్యం పాలసీలో కొందరు మద్యం వ్యాపారులకు మేలు చేకూర్చేలా ఉద్దేశపూర్వకంగా నిబంధనలకు చేర్చారని, ఈ కుట్రలో కేజ్రీవాల్ భాగస్వామి అని ఆరోపిస్తూ ఈడీ మార్చి 21న ఢిల్లీ సీఎంను అరెస్టు చేసింది. మద్యం వ్యాపారుల నుంచి అందుకున్న ముడుపులను గోవా ఎన్నికల్లో ఆప్ ప్రచారానికి వినియోగించారని, ఆప్ జాతీయ కనీ్వనర్‌గా కేజ్రీవాల్ వ్యక్తిగతంగా, పరోక్షంగా మనీలాండరింగ్‌కు పాల్పడినట్లేనని ఈడీ వాదించింది. ఈ ఆరోపణలను ఖండించిన కేజ్రీవాల్ ఒక్క పైసాను కూడా ఈడీ పట్టుకోలేదని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారం నిమిత్తం సుప్రీంకోర్టు మే 10 తేదీన కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసింది. ఎన్నికలు ముగిశాక కేజ్రీవాల్ జూన్ 2న తీహార్ జైలులో లొంగిపోయారు. ఈడీది అంతులేని దర్యాప్తు మద్యం కుంభకోణం కేసులో ఈడీ ఎలాంటి నగదును స్వా«దీనం చేసుకోలేదని, కేజ్రీవాల్‌పై అభియోగాలను నిరూపించేందుకు ఎలాంటి ఆధారాలు లేవని ఆయన న్యాయవాది వాదించారు. ఈడీ పక్షాన హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ) ఎస్.వి.రాజు కేజ్రీవాల్‌కు బెయిల్‌ను వ్యతిరేకించారు. ఈడీ ఊహాజనిత దర్యాప్తును చేయడం లేదని, లంచాలుగా ఇచి్చన కరెన్సీ నోట్ల ఫోటోలు తమ వద్ద ఉన్నాయని పేర్కొన్నారు. గోవాలో కేజ్రీవాల్ బసచేసిన సెవన్ స్టార్ హోటల్ గదికి చెల్లింపులు జరపడానికి ముడుపుల డబ్బునే వాడారని ఆరోపించారు. తన మొబైల్ ఫోన్ పాస్ట్‌వర్డ్‌ను కేజ్రీవాల్ ఇవ్వడం లేదని, దీనిబట్టి మద్యం కుంభకోణంలో ఆయన పాత్ర ఉందని భావించవచ్చని రాజు వాదించారు. కేజ్రీవాల్ మొబైల్ ఫోన్‌ను ఓపెన్ చేస్తే మరింతమంది ప్రమేయం బయపడుతుందన్నారు. ‘కేజ్రీవాల్ వ్యక్తిగతంగా ఎలాంటి నేరానికి పాల్పడకపోయినా.. ప్రివెన్షన్ ఆఫ్ మనీ ల్యాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్ఏ) సెక్షన్ 70 ప్రకారం ఆమ్ఆద్మీ పార్టీ వ్యహారాలకు ఆయనే బాధ్యుడు కాబట్టి ఆప్ నేరాలకు కూడా జాతీయ కనీ్వరర్గా ఢిల్లీ సీఎం దోషిగా బాధ్యుడవుతాడు’ అని రాజు పేర్కొన్నారు. కేజ్రీవాల్ తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది విక్రమ్ చౌదరి.. ఈడీ ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవన్నారు. ‘ఈడీ స్వంతత్ర సంస్థా? లేక రాజకీయ బాసులు చెప్పినట్లు ఆడుతోందా? అని విక్రమ్ చౌదరి ప్రశ్నించారు. ఊహాజనిత అంశాల ఆధారంగానే ఈడీ తుది నిర్ణయాలకు వస్తోందన్నారు. ఆప్‌కు రూ. 45 కోట్లు ముడుపులు ముట్టాయనడానికి ఈడీ వద్ద ఎలాంటి ఆధారాలు లేవు. ఇంకా అరెస్టులు కొనసాగిస్తున్నారు. మరోవైపు రూ. 100 కోట్లు ముడుపులుగా అందాయంటారు. ఈడీ ఇంకా ఆధారాలు సేకరిస్తూనే ఉంటే.. ఇది అంతులేని దర్యాప్తే అవుతుంది. కాబట్టి ఇతరులకు ఇచి్చనట్లే కేజ్రీవాల్‌కు స్వేచ్ఛనివ్వాలని విక్రమ్ చౌదరి కోర్టుకు విన్నవించారు. మనీలాండరింగ్ కేసులో పరిణామక్రమం.. జూలై 2022: ఢిల్లీ ఎక్సైజ్ విధానంలో రూపకల్పన, అమలులో అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై సీబీఐ విచారణకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆదేశం. ఆగస్ట్ 2022: సీబీఐ, ఈడీ కేసులు నమోదు. అక్టోబర్ 30, 2023: మనీ లాండరింగ్ కేసులో నవంబరు 2న విచారణకు హాజరు కావాలని కేజ్రీవాల్‌కు ఈడీ తొలి సమన్లు. ఏప్రిల్ 27: చట్టవిరుద్ధ అరెస్టు.. స్వేచ్ఛాయుత ఎన్నికలు, సమాఖ్య వ్యవస్థ అనే ప్రజాస్వామ్య మూలస్తంభాలపై దాడి అని సుప్రీంకోర్టుకు తెలిపిన కేజ్రీవాల్. ఏప్రిల్ 29: ఈడీ పలుమార్లు సమన్లు జారీచేసినా స్టేట్మెంట్ రికార్డు చేయడానికి కేజ్రీవాల్ విచారణకు హాజరుకాకపోవడాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు. మే 10: లోక్‌సభ ఎన్నికల ప్రచారం కోసం కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు. జూన్ 2న లొంగిపోవాలని ఆదేశం. మే 30: అనారోగ్య కారణాలతో మధ్యంతర బెయిల్‌ను కోరుతూ ఢిల్లీ కోర్టుకు కేజ్రీవాల్. జూన్ 5: మధ్యంతర బెయిల్ తిరస్కరణ. జూన్ 20: రెగ్యులర్ బెయిల్ మంజూరు. -
డిఫాల్ట్ బెయిల్ పొందడం నిందితుడి హక్కు
న్యూఢిల్లీ: కేసులో విచారణ ప్రారంభించకుండా నిందితుడిని కస్టడీలో సుదీర్ఘకాలం ఎలా కొనసాగిస్తారని ఎన్పోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలా చేయడం నిందితుడి స్వేచ్ఛను హరించడమే అవుతుందని తేలి్చచెప్పింది. అనుబంధ చార్జిïÙట్లు దాఖలు చేస్తూ నిందితులకు డిఫాల్ట్ బెయిల్ లభించకుండా చేయడం సమంజసం కాదని పేర్కొంది. జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అనుచరుడైన ప్రేమ్ ప్రకాశ్ నివాసంలో 2022 ఆగస్టులో ఈడీ సోదాలు చేసింది. రెండు ఏకే–47 తుపాకులు, 60 బల్లెట్లు లభించాయి. దీంతో అతడిపై ఆయుధాల చట్టంతోపాటు మనీ లాండరింగ్ నేరం కింద ఈడీ కేసులు నమోదు చేసింది. అప్పటి నుంచి నిందితుడి ఈడీ కస్టడీలోనే ఉంటున్నాడు. అతడికి బెయిల్ లభించకుండా ఈడీ ఇప్పటిదాకా కోర్టులో నాలుగు అనుబంధ చార్జిïÙట్లు దాఖలు చేసింది. తనకు డిఫాల్ట్ బెయిల్ ఇవ్వాలని కోరుతూ ప్రేమ్ప్రకాశ్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. దీనిపై సుప్రీంకోర్టు ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. డిఫాల్ట్ బెయిల్ పొందడం నిందితుడి హక్కు అని స్పష్టం చేసింది. అతడిని ఎందుకు కస్టడీలో కొనసాగిస్తున్నారనో చెప్పాలని ఈడీని ప్రశ్నించింది. విచారణను ఏప్రిల్ 29కు వాయిదా వేసింది. సుప్రీంకోర్టు ధర్మాసనం స్పషీ్టకరణ -
హిందూ కార్యకర్త పూజారికి బెయిల్
హుబ్బళ్లి: మూడు దశాబ్దాల క్రితం నాటి రామాలయ ఉద్యమ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న హిందూ కార్యకర్త శ్రీకాంత్ పూజారి శనివారం బెయిల్‌పై విడుదలయ్యాడు. పెండింగ్ కేసులను పరిష్కరిస్తున్న క్రమంలో 2023 డిసెంబర్లో పూజారి కేసు బయటకు వచి్చంది. 1992లో రామాలయం ఉద్యమంలో పాలుపంచుకున్న అతడిపై అక్రమ మద్యం విక్రయం తదితర 16 కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు గుర్తించారు. రెండు పోలీస్ స్టేషన్లలో అతడిపై రౌడీషీట్ కూడా ఉంది. పోలీసులు తనను మార్కెట్‌కు వెళదామంటూ తీసుకొచి్చ, కటకటాల వెనుక పడేసినట్లు పూజారి ఆరోపించాడు. తనపై ఎటువంటి కేసులు లేవన్నాడు. బెయిల్‌పై తన విడుదలకు సహకరించిన హిందూ సంస్థలకు రుణపడి ఉంటానని అన్నాడు. రామాలయం కోసం పోరాడిన తను తిరిగి అయోధ్యకే వెళతానని చెప్పాడు. -
సుప్రీంకోర్టులో సెతల్వాద్‌కు ఊరట
న్యూఢిల్లీ: గుజరాత్లో 2002 గోధ్రా ఘర్షణల తర్వాత సాక్ష్యాలను తారుమారు చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసులో సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్‌కు ఊరట లభించింది. సుప్రీంకోర్టు బుధవారం సెతల్వాద్‌కు సాధారణ బెయిల్ మంజూరు చేసింది. తీస్తా సెతల్వాద్‌కు బెయిల్ మంజూరు చేయడానికి నిరాకరిస్తూ గుజరాత్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను త్రిసభ్య బెంచ్ తోసిపుచ్చింది. గోధ్రా హింసాకాండ కేసుల్లో అమాయకుల్ని ఇరికించడానికి సాక్ష్యాలను తారుమారు చేశారని తీస్తా సెతల్వాద్ అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో సెతల్వాద్‌పై చార్జిషీటు నమోదు కావడంతో ఆమెను మళ్లీ కస్టడీలోకి తీసుకొని విచారించాల్సిన అవసరం లేదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ‘‘తీస్తా సెతల్వాద్ ఇప్పటికే తన పాస్‌పోర్టును సెషన్స్ కోర్టుకు సమర్పించారు. ఆమె సాక్షులను ఎవరినీ ప్రభావితం చేయడానికి వీల్లేదు. వారికి దూరంగా ఉండాలి’’ అని సుప్రీం బెంచ్ ఆదేశించింది. ఈ కేసులో తీస్తా సాక్షుల్ని ప్రభావితం చేస్తున్నారని పోలీసులు భావిస్తే నేరుగా సుప్రీంను ఆశ్రయించవచ్చునని తెలిపింది. -
రామ్‌పూర్ ప్రత్యేక కోర్టులో జయప్రద
బరేలి: ఉత్తరప్రదేశ్‌లోని రామ్‌పూర్ ప్రత్యేక కోర్టుకు సినీనటి, బీజేపీ నాయకురాలు జయప్రద హాజరయ్యారు. 2019నాటి ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసులో ఆమె కోర్టు ఎదుట గత మూడున్నరేళ్లుగా గైర్హాజర్ కావడంతో గత నెలలో కోర్టు నాన్‌బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది. బుధవారం ఆమె కోర్టులో హాజరుకావడంతో న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేశారు. ‘‘మాజీ ఎంపీ , బీజేపీ నాయకురాలు జయప్రద కోర్టు ఎదుట హాజరై బెయిల్ దరఖాస్తును సమర్పించారు. దీంతో కోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేసింది’’ అని ప్రభుత్వం తరఫున లాయర్ తెలిపారు. స్థానిక అధికారుల అనుమతి లేకుండా 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో జయప్రద ఎన్నికల ర్యాలీ నిర్వహించడంతో రెండు వేర్వేరు పోలీసు స్టేషన్లలో ఆమె రెండు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. -
ఆర్యన్‌కు బెయిల్: ‘సినిమా అప్పుడే అయిపోలేదు’
ముంబై: డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ కుమారుడి ఆర్యన్ ఖాన్‌కి బాంబే హైకోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన ఆర్యన్ 20 రోజులకు పైగా జైలు జీవితం గడిపాడు. మూడు సార్లు బెయిల్ తిరస్కరించిన కోర్టు.. నేడు ఆర్యన్‌కి ఊరట కలిగించింది. డ్రగ్స్ కేసుకు సంబంధించి ఆర్యన్ కేసులో కీలకంగా వ్యవహరించిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడేపై ఎన్సీపీ నాయకుడు నవాబ్ మాలిక్ గత కొన్ని రోజులుగా సంచలన ఆరోపణలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్యన్‌కు బెయిల్ వచ్చిన సందర్భంగా నవాబ్ మాలిక్ సంచలన వ్యాఖ్యలు చేసి మరోసారి వార్తల్లో నిలిచారు. (చదవండి: ఎట్టకేలకు ఆర్యన్ ఖాన్‌కు బెయిల్) ఆర్యన్‌కు బెయిల్ వచ్చిన విషయం తెలిసిన వెంటనే నవాబ్ మాలిక్ ట్వీట్ చేశారు. అది కూడా షారుక్ ఖాన్ ఓం శాంతి ఓం సినిమాలోని ఫేమస్ డైలాగ్ ‘పిక్చర్ అభీ బాకీ హై మేరా దోస్త్’(సినిమా అప్పుడే అయిపోలేదు మిత్రమా) అంటూ ట్వీట్ చేశారు. ఎన్సీబీ డైరెక్టర్ సమీర్ వాంఖడేని ఉద్దేశించే నవాబ్ మాలిక్ ఇలా ట్వీట్ చేశారని నెటిజనులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ తెగ వైరలవుతోంది. (చదవండి: ఆర్యన్‌ఖాన్ నవ యవ్వనంలో ఉన్న బాధితుడు.. నిందితుడు కాదు) पिक्चर अभी बाकी है मेरे दोस्त — Nawab Malik نواب ملک नवाब मलिक (@nawabmalikncp) October 28, 2021 సింగిల్ బెంచ్ జస్టిస్ ఎన్వీ సంబ్రే.. ఆర్యన్‌తో పాటు ఆర్భాజ్ మర్చంట్, మున్మున్ ధమేచాలకు కూడా బెయిల్ మంజూరు చేశారు. ఈ సందర్భంగా జస్టిస్ సంబ్రే ‘‘మూడు అభ్యర్ధనలు అనుమతించాను. రేపు సాయంత్రంలోగా నేను వివరణాత్మక ఉత్తర్వులను జారీ చేస్తాను’’ అని తెలిపారు. చదవండి: ఆయన ఉండి ఉంటే: సీఎంకు నటి క్రాంతి వాంఖడే బహిరంగ లేఖ -
అత్యాచారం: టీచర్ ఒత్తిడి వల్లే అలా చెప్పాను
ముంబై: బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మైనర్ల మధ్య ఏకాభిప్రాయంతో జరిగే శృంగారం గురించి చట్టంలో అస్పష్టంగా ఉందని తెలిపింది. ఈ మేరకు గతంలో ఈ తరహా కేసులో 19 ఏళ్ల యువకుడికి విధించిన 10 సంవత్సరాల కఠిన కారగార శిక్షను నిలిపివేస్తూ.. తీర్పు వెల్లడించింది. అంతేకాక నిందితుడికి బెయిల్ మంజూరు చేసింది. సదరు కుర్రాడు తన ఇంట్లో ఉంటున్న మైనర్ బాలికపై అత్యాచారం చేశాడని ఆరోపిస్తూ.. మూడు సంవత్సరాల క్రితం కేసు నమోదయ్యింది. ఈ కేసు వివరాలు ఇలా ఉన్నాయి. బాధితురాలైన మైనర్ బాలిక చదువుకోవడం కోసం తమకు బంధువులు అయిన నిందితుడి ఇంట్లో ఉండేది. ఈ క్రమంలో 2017 సెప్టెంబర్‌లో బాధితురాలు తన కజిన్ తనను అసభ్యకరరీతిలో తాకడాని.. అప్పటి నుంచి తనకు కడుపులో నొప్పి వస్తుందని స్నేహితురాలితో చెప్పింది. స్నేహితురాలు ఈ విషయాన్ని క్లాస్ టీచర్ దృష్టికి తీసుకెళ్లడంతో ఆమె సదరు బాలికను పిలిచి.. విషయం ఏంటని ఆరా తీయగా.. కజిన్ తనపై అత్యాచారం చేశాడని తెలిపింది. టీచర్ ఈ విషయాన్ని ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ్లింది. దాంతో 2018, మార్చి 3న సదరు యువకుడిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇక బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించగా.. ఎలాంటి బాహ్య గాయాలు లేవని తెలిసింది. ఆ తర్వాత నిందితుడికి దిగువ కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించింది. దాంతో అతడు హై కోర్టును ఆశ్రయించాడు. బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేశాడు. ఇక దీని విచారణ సందర్భంగా కోర్టు మైనర్ బాలిక స్టేట్మెంట్ని రికార్డు చేసింది. ఈ సందర్బంగా బాలిక సంచలన విషయాలు వెల్లడించింది. తమ ఇద్దరి ఏకాభిప్రాయంతోనే లైంగిక చర్య జరిగిందని.. ఇలా నాలుగైదు సార్లు తమ మధ్య చోటు చేసుకుందని తెలిపింది. టీచర్ బలవంతం మీదనే తాను అలా చెప్పానని పేర్కొంది. సాక్ష్యాలను పరిశీలించిన జస్టిస్ షిండే.. ‘‘మైనర్ల మధ్య ఏకాభిప్రాయంతో జరిగిన శృంగారం గురించి చట్ట పరంగా అస్పష్టంగా ఉంది. మైనర్ల అనుమతిని పరిగణలోకి తీసుకోలేం. ఇక ఈ కేసులో వెల్లడైన వాస్తవాలు విలక్షణమైనవి. ఈ కేసులో బాధితురాలు, నిందితుడు ఇద్దరు ఒకే కప్పు కింద ఉంటున్నారు.. పైగా విద్యార్థులు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. బాధితురాలు తన స్టేట్మెంట్ని వెనక్కి తీసుకున్న విషయాన్ని కోర్టు పరిగణలోకి తీసుకుంటుంది. వీటన్నింటిని పరిశీలించిన తర్వాత అతడికి బెయిల్ మంజూరు చేస్తున్నాం. బాధితుడు దాన్ని దుర్వినియోగం చేయకూడదు’’ అని కోర్టు సూచించింది. అంతేకాక అతడికి విధించిన శిక్షను నిలుపదల చేస్తూ.. తీర్పు వెల్లడించింది. చదవండి: న్యాయాన్యాయాల విచికిత్స ‘పోక్సో’ చట్టం కింద అది నేరం కాదు -
జగ్గారెడ్డికి బెయిల్ మంజూరు..!
-
జగ్గారెడ్డికి బెయిల్ ..!
సాక్షి, హైదరాబాద్ : మానవ అక్రమ రవాణా కేసులో ఇటీవల అరెస్ట్‌యిన కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డికి బెయిల్ మంజూరైంది. సికింద్రాబాద్ కోర్టు ఆయనకు సోమవారం బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో ఉన్న ఆయన నేడు సాయంత్రం విడుదలైయే అవకాశం ఉంది. 2004లో నకిలీ పత్రాలు, పాస్‌పోర్ట్‌తో మానవ అక్రమ రవాణా చేసిన కేసులో అరెస్ట్అయిన జగ్గారెడ్డిపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఎనిమిది సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జగ్గారెడ్డి అరెస్ట్ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఆయనకు ఒకవేళ బెయిల్ రాకపోయినట్లయితే చివరకి మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు, ఆయన సతీమని నిర్మలను పార్టీ అభ్యర్థిగా ప్రకటించాలని కూడా అధిష్టానం చర్చించింది. ఈ నేపథ్యంలో జగ్గారెడ్డికి బెయిల్ రావడంతో ఆయన అభ్యర్థిత్వంపై కాంగ్రెస్ ఏవిధంగా నిర్ణయం తీసుకుంటుందో ఆసక్తిగా మారింది. -
హిమాచల్ సీఎంకు బెయిల్ మంజూరు
న్యూఢిల్లీ: హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్‌కు సీబీఐ కోర్టులో ఊరట లభించింది. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి వీరభద్రసింగ్తో పాటు, ఆయన భార్యకు సీబీఐ కోర్టు సోమవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. లక్ష రూపాయల వ్యక్తిగత పూచీకత్తుతో పాటు, అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని న్యాయస్థానం ఆదేశించింది. అలాగే వీరభద్రసింగ్ పాస్‌పోర్టును కోర్టులో సమర్పించాలని సూచించింది. కేసు తదుపరి విచారణ జూలై 27వ తేదీకి వాయిదా పడింది.