హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్‌కు సీబీఐ కోర్టులో ఊరట లభించింది.
న్యూఢిల్లీ: హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్‌కు సీబీఐ కోర్టులో ఊరట లభించింది. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి వీరభద్రసింగ్తో పాటు, ఆయన భార్యకు సీబీఐ కోర్టు సోమవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. లక్ష రూపాయల వ్యక్తిగత పూచీకత్తుతో పాటు, అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని న్యాయస్థానం ఆదేశించింది. అలాగే వీరభద్రసింగ్ పాస్‌పోర్టును కోర్టులో సమర్పించాలని సూచించింది. కేసు తదుపరి విచారణ జూలై 27వ తేదీకి వాయిదా పడింది.