Virbhadra Singh
-
హిమాచల్ సీఎంగా సుఖ్వీందర్సింగ్ ప్రమాణ స్వీకారం
న్యూఢిల్లీ: హిమాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రిగా సుఖ్వీందర్ సింగ్ సుఖు ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. సీఎంగా సుఖ్వీందర్ సింగ్, ఉప ముఖ్యమంత్రిగా అగ్ని హోత్రిల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. హిమాచల్ రాజధాని సిమ్లాలో జరిగిన ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అధినేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక వాద్రా, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తదితరలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కొత్తగా ఎన్నికైన నాయకులు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే వేదికపై హిమచల్‌ప్రదేశ్‌న్ని ఆరు సార్లు పాలించిన రాజవంశీకుడు దివగంత వీరభద్ర సింగ్‌కి నాయకులందరూ నివాళులర్పించారు. ఆ తర్వాత వేదికపైనే వీరభద్ర సింగ్ భార్య ప్రతిభా సింగ్‌ను రాహుల్ గాంధీ ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. కాగా హిమచల్‌ప్రదేశ్ సీఎం పదవికి పలువురు ప్రయత్నాలు చేయడంతో ఒకరిని ఎంపిక చేయడం హైకమాండ్‌కి క అతిపెద్ద సవాలుగా మారింది. ఎట్టకేలకు ఉత్కంఠకు తెరదించి,సుఖ్వీందర్‌సింగ్‌ని సీఎంగా శనివారం కాంగ్రెస్ అధిష్టానం ఎంపిక చేసిన విషయం తెలిసిందే . ఇదిలా ఉండగా, నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన సుఖ్వీందర్ సింగ్ బస్సు డ్రైవర్ కుమారుడు. ఆయన సిమ్లాలోని హిమాచల్ ప్రదేశ్ విశ్వవిద్యాలయం క్యాంపస్ నుంచి తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. (చదవండి: హిమాచల్ సీఎంగా సుఖు) -
సీఎం పగ్గాల తర్వాత లగ్గం చేసుకుంది వీళ్లే!
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్(49) వివాహం ఇవాళ వార్తల్లో ప్రముఖంగా నిలిచింది. దగ్గరి బంధువు డాక్టర్ గుర్ప్రీత్ కౌర్(32)తో కొద్దిమంది సమక్షంలోనే ఆయన వివాహం జరిగింది. ముఖ్యమంత్రి హోదాలో ఆయన వివాహం జరగడం చర్చనీయాంశంగా మారగా.. గతంలోనూ ఇలా రాజకీయంగా అత్యున్నత హోదాలో ఉండి.. మళ్లీ పెళ్లి చేసుకున్న ప్రముఖులు చాలా మందే ఉన్నారు. హెచ్డీ కుమారస్వామి జేడీ(ఎస్) నేత హెచ్డీ కుమారస్వామి.. కర్ణాటక ముఖ్యమంత్రిగా 2006-07 మధ్య కాలంలో పని చేశారు. 1986లోనే ఆయనకు వివాహం అయ్యింది. అయితే.. 2006లో ఆయన కన్నడ నటి రాధికను రహస్యంగా రెండో వివాహం చేసుకున్నారు. నాలుగేళ్ల తర్వాత రాధిక తనంతట తానుగా ప్రకటించేదాకా ఈ విషయం బయటకు తెలీలేదు. ఆ తర్వాత కుమారస్వామి కూడా ఆ విషయాన్ని అంగీకరించారు. వీర్‌భద్ర సింగ్ హిమాచల్ ప్రదేశ్ రాజకీయాల్లో తిరుగులేని నేత ఈయన. 1962, 1967, 1971లో.. మూడుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. అయితే 1983లో వీర్‌భద్ర సింగ్.. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. ఏడేళ్లపాటు సీఎంగా ఉన్నారు. ఆ సమయంలోనే 1985లో ప్రతిభా సింగ్‌ను రెండో వివాహం చేసుకున్నారు ఆయన. మొదటి భార్య రత్నకుమారి(జుబ్బల్ యువరాణి) అప్పటికే అనారోగ్యంతో మరణించింది. ప్రతిభా సింగ్ ఎవరో కాదు.. మండి లోక్ సభ ఎంపీ. బాబుల్ సుప్రియో మాజీ కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో. 2015లో మొదటి భార్య నుంచి విడాకులు తీసుకున్న ఈయన.. 2019లో మోదీ కేబినెట్లో కేంద్ర మంత్రిగా ఉండగానే ఎయిర్ హోస్టెస్ రచనా శర్మను రెండో వివాహం చేసుకున్నారు. ముంబై నుంచి కోల్‌కతా మధ్య ఫ్లైట్‌లో ప్రయాణించేప్పుడు వాళ్ల మధ్య పరిచయం అయ్యింది. చందర్ మోహన్ హర్యానా మాజీ ఉప ముఖ్యమంత్రి. ఈయన వివాహ జీవితం వివాదాస్పదంగా నిలిచింది. 2008లో మంత్రి పదవిలో ఉన్నప్పడు.. ప్రేయసి అనురాధా బాలి కోసం మతం మార్చుకున్నాడు ఆయన. భార్య సీమా భిష్ణోయ్ సమ్మతితోనే.. చాంద్ మొహమ్మద్, ఫిజా(అనురాధా బాలి)గా ఇద్దరూ పేర్లు మార్చుకుని మరీ వివాహం చేసుకున్నారు. కానీ, ఈ చర్య ఆయన రాజకీయ ప్రస్థానాన్ని ఘోరంగా దెబ్బ తీసింది. అయితే ఈ ప్రేమ కథ ఎన్నోరోజులు సాఫీగా సాగలేదు. కొన్నిరోజులకే ఇద్దరూ విడిపోగా.. 2012లో బాలి అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. ప్రఫుల్లా కుమార్ మహంతా అస్సాం మాజీ ముఖ్యమంత్రి. 1985 డిసెంబర్ నుంచి 1990 వరకు ఆయన సీఎంగా విధులు నిర్వహించారు. సీఎంగా ఉన్న టైంలో 1988లో జయశ్రీ గోస్వామి మహంతను ఆయన వివాహం చేసుకున్నారు. రైటర్ అయిన జయశ్రీ గోస్వామి.. ఆ తర్వాత రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు కూడా. అయితే.. అసెంబ్లీ సెక్రటేరియెట్ ఎంప్లాయి సంఘమిత్ర భరాలిని ఆయన రహస్యంగా రెండో వివాహం చేసుకున్నారన్న ఆరోపణలు ఇప్పటికీ వెంటాడుతూనే ఉన్నాయి. భార్య జయశ్రీ గోస్వామితో ప్రఫుల్లా కుమార్ మహంతా -
హిమాచల్ పీసీసీ చీఫ్‌గా ప్రతిభా వీరభద్ర సింగ్
న్యూఢిల్లీ: హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా మాజీ సీఎం వీరభద్ర సింగ్ భార్య, ఎంపీ ప్రతిభా వీరభద్ర సింగ్‌ను నియమించారు. కుల్దీప్ సింగ్ రాథోర్ స్థానంలో ఆమెను నియమించారు. దీంతోపాటు రాష్ట్ర పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా హర్ష మహాజన్, రాజేందర్ రాణా, పవన్ కాజల్, వినయ్‌కుమార్‌ను సోనియా నియమించారు. స్టీరింగ్ కమిటీ చైర్మన్‌గా ఆనంద్ శర్మ, ప్రచార కమిటీ చైర్మన్‌గా సుక్వీందర్ సింగ్, సీఎల్పీ లీడర్‌గా ముకేశ్ అగ్నిహోత్రి నియమితులయ్యారు. చదవండి: (నవనీత్ కౌర్-రాణా దంపతులపై సంజయ్ రౌత్ సంచలన ఆరోపణలు) -
హిమాచల్ మాజీ సీఎం వీరభద్ర సింగ్ కన్నుమూత
సిమ్లా: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, హిమాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ (87) కోవిడ్ నుంచి కోలుకున్నాక తలెత్తిన ఆరోగ్య సమస్యలతో తుదిశ్వాస విడిచారు. రెండుసార్లు కోవిడ్ నుంచి కోలుకున్న ఆయన సిమ్లాలోని ఇందిరాగాంధీ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున మరణించారు. ఆక్సిజన్ స్థాయి పడిపోవడంతో సోమవారం ఆయనను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్న సమయంలో గుండెపోటు రావడంతో ఆయన మరణించారని ఐజీఎంసీ సూపరింటెండెంట్ డాక్టర్ జనక్ రాజ్ వెల్లడించారు. ఆరుసార్లు ముఖ్యమంత్రిగా, తొమ్మిదిసార్లు ఎమ్మెల్యేగా, ఐదుసార్లు లోక్‌సభకి ఎన్నికై తిరుగులేని విజయాలను మూటగట్టుకున్న వీరభద్ర సింగ్ మృతితో హిమాచల్ రాజకీయాల్లో ఒక శకం ముగిసిపోయింది. రాష్ట్రపతి కోవింద్, ప్రధాని మోదీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ. వీరభద్ర సింగ్ మృతికి సంతాపం వ్యక్తం చేశారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం, అపారమైన పరిపాలనా అనుభవం కలిగిన నేతను కోల్పోవడం తీరని లోటని ప్రధాని ఒక ట్వీట్లో నివాళులర్పించారు. వీరభద్ర సింగ్ కాంగ్రెస్ పార్టీకే కాకుండా, రాష్ట్రానికి, దేశానికి చేసిన సేవల్ని ఎన్నటికీ మరువలేమని సోనియా ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వీరభద్ర సింగ్ అంత్యక్రియలు ఆయన స్వగ్రామమైన రామ్‌పూర్‌లో శనివారం జరగనున్నాయి. జన హృదయ విజేత ప్రజల హృదయాలను గెలుచుకున్న అతి కొద్ది మంది ముఖ్యమంత్రుల్లో వీరభద్ర సింగ్ ఒకరు. రాజా సాహెబ్ అని అందరూ పిలుచుకునే ఆయన గొప్ప పోరాట యోధుడు. దాదాపు ఆరు దశాబ్దాల పాటు హిమాచల్ ప్రదేశ్ రాజకీయాల్లో తిరుగులేని పట్టు కొనసాగించారు. హిల్ స్టేషన్‌ని ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చి దిద్దడంతో పాటుగా విద్య, ఆరోగ్య రంగాలపై ప్రత్యేక శ్రద్ధ చూపించి మాస్ లీడర్‌గా ఎదిగారు. రామ్‌పూర్ రాజకుటుంబానికి చెందిన వీరభద్ర సింగ్ 1934 జూన్ 23న జన్మించారు. 1962లో కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన 28 ఏళ్ల వయసులో ఎంపీగా ఎన్నికయ్యారు. ఇందిరా గాంధీ కేబినెట్లో కేంద్ర మంత్రిగా సేవలు అందించారు. 1983లో తొలిసారిగా హిమాచల్ ప్రదేశ్ గద్దెనెక్కారు. ప్రస్తుతం సోలాన్ జిల్లాలోని అక్రి అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన రెండు సార్లు కోవిడ్బారినపడ్డారు. ఏప్రిల్ 12న ఆయనకి తొలిసారి కరోనా సోకింది.జూన్ 11న మళ్లీ రెండోసారి ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. -
‘నన్ను అద్వానీలా చూడకండి’
సిమ్లా : బీజేపీ సీనియర్ నేతలు ఎల్.కే అద్వానీ, మురళీ మనోహర్ జోషిలా తనను చూడొద్దని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, హిమాచల్ ప్రదేశ్ మాజీ సీఎం వీరభద్ర సింగ్ వ్యాఖ్యానించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి తరువాత మొదటిసారి పార్టీ నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు సుఖ్వీందర్ సింగ్‌తో కలిసి పాల్గొన్నారు. సిమ్లాలో శనివారం నిర్వహించిన సమావేశంలో వీరభద్ర సింగ్ మాట్లాడుతూ..‘అద్వానీలా కేవలం పార్టీకి సలహాలు, సూచనలు ఇవ్వడానికే లేను. ప్రజల్లోకి వెళ్లడానికి ఇప్పటికి సిద్ధంగా ఉన్నాను. పార్టీ ఆదేశిస్తే ఎక్కడికైనా వెళ్లగలను. వయసు రిత్యా కొందరూ నన్ను అద్వానీ, మురళీమనోహర్ జోషిలా కేవలం మార్గదర్శకుడిలా మాత్రమే చూస్తున్నారు. వారి కలలను ఎప్పటికీ సకారం చేసుకోలేకపోయారు. త్వరలో రానున్న లోక్‌సభ ఎన్నికల్లో యువకుడిలా పార్టీకి సేవచేస్తా’ అని వ్యాఖ్యానించారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో వీరభద్రసింగ్‌కు, పీసీసీ అధ్యక్షుడు సుఖ్వీందర్ సింగ్ మధ్య భేదాభిప్రాయాలు వ్యక్తమైన విషయం తెలిసిందే. ఇద్దరు కలిసి ఈ సమావేశంలో పాల్గొనడం విశేషం. సరైన అభ్యర్థులకు సీట్లు కేటాయించకపోవడం మూలంగానే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూడాల్సి వచ్చిందని, కొంత మంది అసమర్థ నేతల వల్ల పార్టీకి నష్టం జరిగిందని వీరభద్ర సింగ్ అన్నారు. రాష్ట్రంలో నూతన విద్యాసంస్థలు, ఆసుపత్రులు నిర్మించడంలో విఫలమైయ్యామని ఓటమికి అది కూడా కారణమని సుఖ్వీందర్ సింగ్ పేర్కొన్నారు. -
ఔను ఓడిపోయాం.. కారణం అదే: ఒప్పుకున్న సీఎం!
షిమ్లా: హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ఓటమిని ముఖ్యమంత్రి వీరభద్రసింగ్ అంగీకరించారు. తమ ప్రభుత్వం ప్రజలకు ఎన్నో మంచి పనులు చేసినప్పటికీ ఓటమి పాలయ్యామని ఆయన వాపోయారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు హిమాచల్ ప్రదేశ్‌లో ప్రచారం చేయకపోవడం కూడా తమ ఓటమికి కారణాల్లో ఒకటి అని ఆయన వ్యాఖ్యానించారు. ‘హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో మంచి పనులు చేసింది. కానీ మేం ఎన్నికల్లో వెనుకబడిపోయాం. ఓటమిని నేను అంగీకరిస్తున్నా.. ఇది ప్రజాతీర్పు. కాంగ్రెస్ నేతలు రాష్ట్రంలో ప్రచారం చేయకపోవడం కూడా పార్టీ ఓటమికి కారణాల్లో ఒకటి’ అని ఆయన విలేకరుల సమావేశంలో అన్నారు. 68 స్థానాలు ఉన్న హిమాచల్ ప్రదేశ్‌లో బీజేపీ సంపూర్ణ మెజారిటీతో విజయం సాధించింది. కమల దళం ఇక్కడ 44 స్థానాలు (గెలుపు, ముందంజ) దక్కించుకోనుండగా.. అధికార కాంగ్రెస్ పార్టీ 20 స్థానాలకు పరిమితం కానుందని తాజా ఫలితాల ట్రెండ్స్ స్పష్టం చేస్తున్నాయి. -
హిమాచలంలో ఎన్నికల వేడి!
హిమాచల్‌ప్రదేశ్ 13వ అసెంబ్లీ ఎన్నికల నామినేషన్లకు గడువు సోమవారంతో ముగిసింది. పాలక, ప్రతిపక్షాలైన కాంగ్రెస్, బీజేపీలు మొత్తం 68 సీట్లకు అభ్యర్థులను ప్రకటించాక రాజకీయ వాతావరణం వేడెక్కింది. కేవలం 4 లోక్‌సభ సీట్లు, 71 లక్షల జనాభా ఉన్న ఈ చిన్న రాష్ట్రంలో ఎలాగైనా అధికారం నిలబెట్టుకోవాలనే పట్టుదలతో కాంగ్రెస్ కొన్ని కొత్త పోకడలకు తెరలేపింది. సీఎం పదవికి పార్టీ అభ్యర్థిగా ప్రస్తుత ముఖ్యమంత్రి వీరభద్రసింగ్‌నే ప్రకటించింది. అంతేగాదు, ఒక కుటుంబానికి ఒకే టికెట్ అనే సూత్రానికి వీడ్కోలు చెప్పి 83 ఏళ్ల వీరభద్రతోపాటు, ఆయన కొడుకు విక్రమాదిత్యసింగ్కు (తండ్రి సీటైన సిమ్లా-రూరల్) టికెట్లు ఇవ్వాలని నిర్ణయించింది. రెండేళ్ల క్రితం 2015 సెప్టెంబర్ 26న ఓ పక్క ముఖ్యమంత్రి వీరభద్ర చిన్న కూతురు మీనాక్షి పెళ్లి ఏర్పాట్లలో ఉండగానే సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లు ఆయన, ఆయన కుమారుడు విక్రమాదిత్య ఆస్తులపై దాడులు జరిపి, కేసులు నమోదుచేశాయి. ఈ పరిణామాలను బీజేపీ కక్షసాధింపు చర్యలుగానే భావించిన కాంగ్రెస్ అప్పటి నుంచి వీరభద్రను సమర్థిస్తూనే ఉంది. మరో బలమైన కాంగ్రెస్ నేత లేకపోవడం సింగ్‌కు కలిసొచ్చిన అంశం. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సీటును కొడుక్కి ఇచ్చి, వరుసగా ఎనిమిదిసార్లు గెలిచిన సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు విద్యాస్టోక్స్ నియోజకవర్గం ఠియోగ్ (సిమ్లాజిల్లా) నుంచి ఆయన ఈసారి పోటీచేస్తున్నారు. 90 ఏళ్ల స్టోక్స్ ఎన్నికల రాజకీయాల నుంచి తప్పుకున్నారు. గెలిచే అవకాశాలున్నా బీజేపీలో సీఎం పదవికి పోటాపోటీ! 1990 నుంచీ 2012 వరకూ బీజేపీ, కాంగ్రెస్ ఒకదాని తర్వాత ఒకటి అధికారంలోకి వచ్చాయి. ప్రతి ఐదేళ్లకూ ఇలా పాలకపక్షాన్ని ప్రజలు మార్చే సంప్రదాయం ఈసారి కూడా కొనసాగితే బీజేపీ వచ్చే నవంబర్ 9న జరిగే ఎన్నికల్లో గెలుస్తుంది. ఒకప్పటి కాంగ్రెస్ మాదిరిగా బీజేపీ తన సీఎం అభ్యర్థి ఎవరో ప్రకటించలేదు. గతంలో బీజేపీ తరఫున పదేళ్లు సీఎంగా ఉన్న ఠాకూర్ ప్రేంకుమార్ ధూమల్, కేంద్ర ఆరోగ్యమంత్రి జగత్‌ప్రకాశ్ నడ్డా పేర్లు వినిపిస్తున్నాయి. బీజేపీ కాంగ్ఢా ఎంపీ, మాజీ సీఎం శాంతాకుమార్(83)కు వయసు, గ్రూపు రాజకీయాల వల్ల బీజేపీ విజయం సాధించినా సీఎం అయ్యే అవకాశాలు లేవు. 1992లో ముఖ్యమంత్రి పదవికి శాంతాకుమార్ రాజీనామా చేశాక రెండు ప్రధాన పార్టీలకు చెందిన ఇద్దరు క్షత్రియులే(ఠాకుర్లు లేదా రాజపూత్‌లు) ఇప్పటి వరకూ ఈ పదవిలో కొనసాగుతున్నారు. ఇంకా సూటిగా చెప్పాలంటే వీరభద్ర, ధూమల్లే పాతికేళ్లుగా ముఖ్యమంత్రి పీఠం సొంతం చేసుకుంటున్నారు. ఈ లెక్కన ఈసారి పాలకపక్షం కాంగ్రెస్ ఓడిపోయి, నడ్డా బీజేపీ తరఫున సీఎం అయితే, పాతికేళ్లుగా సాగుతున్న ఠాకూర్ల పాలనకు తెరపడుతుంది. నడ్డా గతంలో రెండుసార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. రాష్ట్ర ఆరోగ్యమంత్రిగా పనిచేసిన నడ్డా బ్రాహ్మణకుటుంబంలో జన్మించారు. రాష్ట్ర చరిత్రలో శాంతా కుమార్ ఒక్కరే బ్రాహ్మణ ముఖ్యమంత్రి. ఠాకూర్ల (38 శాతం) తర్వాత ఎక్కువ జనాభా ఉన్న బ్రాహ్మణులు(18 శాతం) ఇప్పటి వరకూ ‘కింగ్మేకర్లు’గా పేరు సంపాదించారు. నియోజకవర్గం మారిన ధూమల్ ప్రస్తుతం హమీర్పూర్ ఎమ్యెల్యే అయిన మాజీ సీఎం ధూమల్ ఈసారి సుజన్పూర్ నుంచి పోటీచేస్తుండగా, సుజన్పూర్ బీజేపీ శాసనసభ్యుడు నరేంద్ర ఠాకూర్ హమీర్పూర్ నుంచి రంగంలోకి దిగారు. అవినీతి కుంభకోణాలతో పేరుమోసిన కేంద్ర టెలికం మాజీ మంత్రి పండిత్ సుఖరాం శర్మ కొడుకు అనిల్‌శర్మ వీరభద్ర కేబినెట్ నుంచి రాజీనామా చేసి బీజేపీ టికెట్‌పై తన సొంత స్థానం మండీ నుంచి పోటీచేస్తున్నారు. సోనియాగాంధీ. రాహుల్‌గాంధీ సహా 40 మంది కాంగ్రెస్ సీనియర్లు పార్టీ తరఫున ప్రచారం చేస్తారని ప్రకటించారు. బీజేపీ తరఫున ప్రధాని నరేంద్రమోదీ మొత్తం నాలుగు లోక్‌సభ నియోజకర్గాల్లో ఒక్కొక్క బహిరంగ సభలో ప్రసంగిస్తారు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ వ్యతిరేక ప్రభావం లేకుంటే కాషాయపక్షానికే విజయావకాశాలుంటాయని అంచనా. (సాక్షి నాలెడ్జ్ సెంటర్) -
కాంగ్రెస్‌లో ‘హిమాచల్’ ముసలం!
సాక్షి, న్యూఢిల్లీ: ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో అధికారం కోల్పోయిన కాంగ్రెస్ పార్టీకి హిమాచల్ ప్రదేశ్, బిహార్లలో మరిన్ని కష్టాలు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్వరలోనే హిమాచల్‌లో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు సుఖ్వీందర్ సింగ్ సుక్కు, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి సుశీల్ కుమార్ షిండేలతో ముఖ్యమంత్రి వీరభద్రసింగ్‌కు ఎన్నికలకు సంబంధించిన పలు విషయాల్లో విభేదాలున్నాయి. ఈ నేపథ్యంలో తాను తదుపరి ఎన్నికల్లో పోటీ, ప్రచారం చేయనని వీరభద్ర సింగ్ చెప్పారు. తమ నాయకుడి బాటలోనే తామూ నడుస్తామని కొంతమంది హిమాచల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్‌తో భేటీ అయిన అనంతరం...ఎన్నికల్లో పోటీ చేయనని వీరభద్ర సింగ్ ప్రకటించారు. అటు బిహార్‌లోనూ ఇటీవల సీఎం నితీశ్ కుమార్ మహా కూటమి నుంచి బయటకు రావడంతో కాంగ్రెస్ అధికారం కోల్పోవడం తెలిసిందే. దీంతో కొంత మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జేడీయూలో చేరేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం. బిహార్ కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత సదానంద్ సింగ్‌ను ఢిల్లీ రావాల్సిందిగా సోనియా ఆదేశించారు. -
హిమాచల్ సీఎం, జస్టిస్ కర్ణన్‌కు చుక్కెదురు
న్యూఢిల్లీ: హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్‌కు మరోసారి న్యాయస్థానంలో చుక్కెదురు అయింది. మనీ లాండరింగ్ కేసును కొట్టేయాలన్న ఆయన అభ్యర్థనను ఢిల్లీ కోర్టు సోమవారం తిరస్కరించింది. కాగా మనీ లాండరింగ్ కేసులో వీరభద్రసింగ్తో పాటు ఆయన కుటుంబంపై ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. యూపీఏ–2 ప్రభుత్వంలో ఉక్కు శాఖ మంత్రిగా వీరభద్రసింగ్ పనిచేశారు. ఆ సమయంలో 2009 నుంచి 2011 మధ్య ఆయన, కుటుంబ సభ్యులు కలిసి రూ.10 కోట్ల దాకా అక్రమాస్తులు కూడబెట్టారని సీబీఐ 2015 సెప్టెంబర్‌లో కేసు నమోదు చేసింది. జస్టిస్ కర్ణన్ బెయిల్ పిటిషన్ తిరస్కరణ మరోవైపు కోల్‌కతా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కర్ణన్‌కు సుప్రీంకోర్టులో నిరాశే ఎదురైంది. కోర్టు ధిక్కర నేరానికిగానూ విధించిన ఆరు నెలల జైలు శిక్షను రద్దు చేయాలని దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థానం కొట్టేసింది. కాగా కర్ణన్‌కు సుప్రీంకోర్టు ఆరు నెలలు జైలుశిక్ష విధించిన విషయం తెలిసిందే. తీర్పు వెలువడిన అదేరోజు చెన్నైకు చేరుకున్న కర్ణన్ ఆ తర్వాత అరెస్టు, జైలు శిక్షను తప్పించుకునేందుకు కనిపించకుండాపోయారు. దీంతో కర్ణన్ అరెస్టు కోసం కోల్‌కతా పోలీసులు తమిళనాడులో గాలింపు తీవ్రం చేశారు. ఎట్టకేలకు గతనెలలో అరెస్ట్ చేశారు. 1983లో తమిళనాడులో న్యాయవాదిగా వృత్తిజీవితం ప్రారంభించిన ఆయన 2009లో మద్రాసు హైకోర్టులో న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2016 మార్చి 11న కోల్‌కతా హైకోర్టుకు బదిలీఅయ్యారు. -
హిమాచల్ సీఎంకు బెయిల్ మంజూరు
-
హిమాచల్ సీఎంకు బెయిల్ మంజూరు
న్యూఢిల్లీ: హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్‌కు సీబీఐ కోర్టులో ఊరట లభించింది. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి వీరభద్రసింగ్తో పాటు, ఆయన భార్యకు సీబీఐ కోర్టు సోమవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. లక్ష రూపాయల వ్యక్తిగత పూచీకత్తుతో పాటు, అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని న్యాయస్థానం ఆదేశించింది. అలాగే వీరభద్రసింగ్ పాస్‌పోర్టును కోర్టులో సమర్పించాలని సూచించింది. కేసు తదుపరి విచారణ జూలై 27వ తేదీకి వాయిదా పడింది. -
సీఎంకు, ఆయన భార్యకు బెయిలివ్వొద్దు
అక్రమాస్తుల కేసులో సీబీఐ వాదన న్యూఢిల్లీ: ఆదాయానికి మించి ఆస్తులు కేసులో హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్, ఆయన భార్య సోమవారం పటియాల హౌస్ కోర్టు ముందు హాజరయ్యారు. తమకు బెయిల్ ఇవ్వాలని వారితోపాటు మిగత నిందితులు కోర్టులో దరఖాస్తు చేశారు. అయితే, వారికి షాక్ ఇస్తూ ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ నిందితులకు బెయిల్ ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. సీఎం వీరభద్రసింగ్, ఆయన భార్యకు బెయిల్ ఇవ్వవద్దని, బెయిల్ ఇస్తే వారు కేసు దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశముందని వాదించింది. ప్రస్తుతం న్యాయస్థానం ఈ విషయంలో ఇరుపక్షాల న్యాయవాదుల వాదనలను వింటోంది. గత యూపీఏ-2 ప్రభుత్వంలో ఉక్కు శాఖ మంత్రిగా వీరభద్రసింగ్ పనిచేశారు. ఆ సమయంలో 2009 నుంచి 2011 మధ్య ఆయన, కుటుంబ సభ్యులు కలిసి రూ.10 కోట్ల దాకా అక్రమాస్తులు కూడబెట్టారని సీబీఐ 2015 సెప్టెంబర్‌లో కేసు నమోదు చేసింది. ఈ కేసులో ఇప్పటికే రూ.14 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ జప్తు చేసింది. -
9 గంటలపాటు సీఎంపై ప్రశ్నల వర్షం
న్యూఢిల్లీ: అక్రమాస్తులకు సంబంధించిన కేసు విచారణను ఎదుర్కోవడం కోసం హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్(82) గురువారం ఢిల్లీలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎదుట హాజరయ్యారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఆయన తన అధికారిక వాహనంలో ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం దాదాపు 9 గంటలపాటు ఈడీ ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించింది. గత యూపీఏ–2 ప్రభుత్వంలో ఉక్కు శాఖ మంత్రిగా వీరభద్రసింగ్ పనిచేశారు. ఆ సమయంలో 2009 నుంచి 2011 మధ్య ఆయన, కుటుంబ సభ్యులు కలిసి రూ.10 కోట్ల దాకా అక్రమాస్తులు కూడబెట్టారని సీబీఐ 2015 సెప్టెంబర్‌లో కేసు నమోదు చేసింది. ఈ కేసులో ఇప్పటికే రూ.14 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ జప్తు చేసింది. గతవారంలోనే కేసు విచారణకు హాజరు కావాలంటూ వీరభద్ర సింగ్‌కు ఈడీ సమన్లు ఇచ్చినా.. తనకు కొన్ని అధికారిక పనులు ఉన్నాయనీ, తర్వాతి వారం వస్తానని ఆయన చెప్పారు. దీంతో ఈడీ మరోసారి నోటీసులు జారీచేస్తూ గురువారం విచారణకు హాజరుకావాల్సిందిగా పేర్కొంది. వీరభద్ర సింగ్ విచారణకు హాజరైతే, ఆయనను అరెస్టు చేయబోమంటూ తాము ముందుగానే భరోసా ఇవ్వలేమని ఈడీ బుధవారమే ఢిల్లీ హైకోర్టుకు చెప్పింది. -
హిమాచల్ సీఎంకు ఈడీ సమన్లు
న్యూఢిల్లీ: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో హిమాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్‌కు ఎన్ఫోర్సుమెంట్ డైరెక్టరేట్(ఈడీ) మంగళవారం మరోసారి సమన్లు పంపింది. ఈనెల 20న విచారణ నిమిత్తం తన ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. గతంలో ఏప్రిల్ 13న హాజరు కావాలని సమన్లు పంపినప్పటికీ ఆయన హాజరుకాలేదు. ఇప్పటికే అతని భార్య ప్రతిభా సింగ్, కుమారుడు విక్రమాదిత్య సింగ్‌లను మనీ లాండరింగ్ కేసులో విచారించింది. ఈ నెల మొదటి వారంలో ఢిల్లీలోని వీరభద్రసింగ్‌కు చెందిన ఫాంహౌస్‌ను ఈడీ జప్తు చేసింది. దీని విలువ రూ.27.29 కోట్లు. రాజకీయ ప్రత్యర్థులను అడ్డు తొలగించుకునేందుకు కేంద్రం సీబీఐ, ఈడీలను ఉపయోగించుకుంటోందని, తన ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు తనను వేధిస్తోందని ఫాంహౌస్‌ను సీజ్ చేసిన తర్వాత వీరభద్రసింగ్ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. కాగా అక్రమాస్తుల కేసులో వీరభద్రసింగ్‌పై సీబీఐ రెండేళ్ల క్రితమే కేసు నమోదు చేసిన విషయం విదితమే. ఇప్పటికే పలుమార్లు వీరభద్రసింగ్, ఆయన బంధువుల ఆస్తులపై పలుమార్లు దాడులు చేసింది. ఇటీవల ఢిల్లీ హైకోర్టు కూడా సీబీఐకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. -
అక్రమాస్తుల కేసు: సీఎంకు మళ్లీ సమన్లు
షిమ్లా: మనీలాండరింగ్ కేసులో హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్‌కు చిక్కులు తప్పేలాలేవు. గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరోసారి ఆయనకు సమన్లు జారీ చేసింది. ఈ రోజు విచారణకు హాజరు కావాల్సిందిగా ఇంతకుముందు ఈడీ సమన్లు పంపగా.. వీరభద్ర సింగ్ వెళ్లలేదు. దీంతో ఈడీ తాజాగా మరోసారి ఆయనకు సమన్లు జారీ చేసింది. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో వీరభద్ర సింగ్‌తో పాటు ఆయన భార్య, ఇతర కుటుంబ సభ్యులు విచారణ ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఢిల్లీలోని వీరభద్రసింగ్‌కు సంబంధించిన ఓ ఫాంహౌస్‌ను జప్తు చేసింది. ఈ ఫాంహౌస్ మార్కెట్ విలువ సుమారు రూ. 27 కోట్లు. అక్రమాస్తుల కేసులో వీరభద్రసింగ్‌పై సీబీఐ రెండేళ్ల క్రితమే కేసు నమోదు చేసింది. 2015 సెప్టెంబర్‌లో సీబీఐ ఫిర్యాదు మేరకు ఈడీ మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఆయనపై కేసు నమోదు చేసింది. -
మనీ లాండరింగ్ కేసు: ఈడీ విచారణకు సీఎం డుమ్మా!
షిమ్లా: మనీ లాండరింగ్ కేసు ఎదుర్కొంటున్న హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్ గురువారం ఈడీ విచారణకు డుమ్మా కొట్టబోతున్నారు. ఈ కేసులో విచారణకు హాజరుకావాల్సిందిగా ఈడీ ఆయనకు సమన్లు జారీచేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం ఆయన ఢిల్లీలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణకు హాజరవుతారని భావించారు. అయితే, ఆయన హాజరుకావడం లేదని ఏఎన్ఐ వార్తాసంస్థ తెలిపింది. ఏకంగా ముఖ్యమంత్రినే ఈడీ విచారణకు పిలువడంతో ఆయన కేబినెట్ మంత్రులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ విషయంలో బీజేపీ ఎలాంటి అక్రమ చర్యలకు పాల్పడినా.. తీవ్ర పరిణామాలు తప్పవని హిమాచల్‌లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ హెచ్చరించింది. 2015 సెప్టెంబర్‌లో సీబీఐ ఫిర్యాదు మేరకు ఈడీ మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద సీఎం వీరభద్రసింగ్ మీద కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. -
రూ.27కోట్ల విలువైన సీఎం ఫాంహౌస్ జప్తు
న్యూఢిల్లీ: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోమవారం ఢిల్లీలోని వీరభద్రసింగ్‌కు సంబంధించిన ఓ ఫాంహౌస్‌ను జప్తు చేసింది. దక్షిణ ఢిల్లీలోని మెహ్రౌలీ ప్రాంతంలో మ్యాపిల్ డెస్టినేషన్స్ అండ్ డ్రీమ్బిల్డ్ అనే బినామీ పేరుతో ఉన్న ఈ ఫాంహౌస్ మార్కెట్ విలువ సుమారు రూ. 27 కోట్లు. పీఎంఎల్ఏ చట్టం కింద ఫాం హౌస్‌ను జప్తు చేసినట్లు అధికారులు తెలిపారు. అక్రమాస్తుల కేసులో వీరభద్రసింగ్‌పై సీబీఐ రెండేళ్ల క్రితమే కేసు నమోదు చేసిన విషయం విదితమే. ఇప్పటికే పలుమార్లు వీరభద్రసింగ్, ఆయన బంధువుల ఆస్తులపై పలుమార్లు దాడులు చేసింది. ఇటీవల ఢిల్లీ హైకోర్టు కూడా సీబీఐకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో వీరభద్రసింగ్, ఆయన భార్య ప్రతిభాసింగ్తో పాటు మరికొందరిపై సీబీఐ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. కాగా అక్రమాస్తులకు సంబంధించి తనపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ పెట్టిన కేసును రద్దు చేయాలంటూ వీరభద్రసింగ్ పెట్టుకున్న పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చిన విషయం తెలిసిందే. సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌పై న్యాయస్థానం ఈ నెల 6వ తేదీన వాదనలు విననుంది. -
షాకిచ్చిన కోర్టు.. ఇక ఆ సీఎం అరెస్టేనా!
-
షాకిచ్చిన కోర్టు.. ఇక ఆ సీఎం అరెస్టేనా!
న్యూఢిల్లీ: హిమాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్, ఆయన సతీమణికి ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. అక్రమాస్తులకు సంబంధించి తనపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ పెట్టిన కేసును రద్దు చేయాలంటూ వారు పెట్టుకున్న పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. కేసు విచారణను తాము అడ్డుకోలేమని, కేసును రద్దు చేయడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. అంతేకాదు, 2015, అక్టోబర్ 1లో ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్‌ను సీబీఐ అరెస్టు చేయకుండా ఇచ్చిన మధ్యంతర ఉత్వరులను కూడా జస్టిస్ విపిన్ సంఘి ఎత్తివేశారు. ఈ మధ్యంతర ఉత్తర్వుల ప్రకారం గతంలో వీరభద్రసింగ్‌ను కోర్టు అనుమతి లేకుండా అరెస్టు చేయడంగానీ, విచారణ చేయడంగానీ, చార్జీషీట్ నమోదుకానీ చేయరాదు. తాజాగా ఆ ఉత్తర్వులు కూడా లేకుండా పోవడంతో ఇక సీబీఐ మరింత దూకుడుగా వ్యవహరించే అవకాశం ఉంది. 2015 సెప్టెంబర్ 23న అక్రమాస్తుల కేసు వీరభద్ర సింగ్‌పై నమోదైంది. -
సీఎం బంధువును దారుణంగా చంపేశారు
చండీగఢ్: హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ సమీప బంధువును అతని స్నేహితులు దారుణంగా చంపారు. బీఎండబ్ల్యూ కారును ఆయనపై మూడుసార్లు తొక్కించడంతో తీవ్రంగా గాయపడి మరణించాడు. చండీగఢ్‌లో ఈ సంఘటన జరిగింది. వీరభద్ర సింగ్ భార్య ప్రతిభా సింగ్‌కు మేనల్లుడు ఆకాంశ్ సింగ్ (28) బుధవారం అర్ధరాత్రి లేట్ నైట్ పార్టీలో పాల్గొన్నాడు. గురువారం తెల్లవారుజామున పార్టీలో వారు గొడవపడ్డారు. ఇద్దరు స్నేహితులు.. ఆకాంశ్‌ను కొట్టి, ఆయనపై కారును మూడుసార్లు పోనిచ్చారు. బీఎండబ్ల్యూ కారును ఆకాంశ్‌ను 50 మీటర్ల దూరం లాక్కెళ్లింది. రక్తపుమడుగులో పడిఉన్న ఆకాంశ్‌ను అక్కడే వదిలేసి నిందితులు పారిపోయారు. కాగా తీవ్రంగా గాయపడ్డ ఆకాంశ్‌ను చాలా ఆలస్యంగా గుర్తించారు. శుక్రవారం చండీగఢ్‌లోని ఆస్పత్రిలో తరలించగా, అప్పటికే ఆయన మరణించినట్టు వైద్యులు ప్రకటించారు. నిందితులను హర్మితాబ్ సింగ్ ఫరీద్, బలరాజ్ సింగ్ రంధావాలుగా గుర్తించారు. వీరిద్దరిపై హత్యకేసు నమోదు చేశామని, పరారీలో ఉన్నారని పోలీసులు చెప్పారు. పోలీసుల విచారణ తీరుపై వీరభద్ర సింగ్ కుటుంబ సభ్యులు విమర్శించారు. హత్య జరిగిన 24 గంటలు దాటినా పోలీసులు నిందితులను అరెస్ట్ చేయలేదని వీరభద్ర సింగ్ కొడుకు విక్రమాదిత్య సింగ్ అన్నారు. వీరభద్ర సింగ్ మాట్లాడుతూ.. తాను పంజాబ్ గవర్నర్‌తో మాట్లాడానని, ఈ విషయంలో జోక్యం చేసుకోవాల్సిందిగా కోరానని, నిందితులు దేశం విడిచి పారిపోకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఉత్తరాఖండ్ ఎన్నికల ప్రచారంలో ఉన్న ఆయన తన పర్యటనను రద్దు చేసుకుని చండీగఢ్ వచ్చారు. -
హిమాచల్ రెండో రాజధానిగా ధర్మశాల
షిమ్లా: ధర్మశాలను హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర రెండో రాజధానిగా ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ గురువారం ప్రకటించారు. కాంగ్రా జిల్లాలో ఉండే ధర్మశాలకు ఇప్పటికే ఎంతో ప్రాముఖ్యత ఉందనీ, రెండో రాజధానిగా ఈ నగరం సముచితంగా ఉంటుందన్నారు. శీతాకాల విడిదికి విచ్చేసిన ముఖ్యమంత్రి ప్రస్తుతం ధర్మశాలలోనే ఉంటున్నారు. 2005లో తొలిసారి ఇక్కడ పూర్తిస్థాయి శీతాకాల అసెంబ్లీ సమావేశాలను నిర్వహించారు. ఇప్పటికే 12 సార్లు ఇక్కడ శీతాకాల సమావేశాలు జరిగాయి. ధర్మశాలలో పూర్తిస్థాయి శాసనసభ భవనం కూడా అందుబాటులో ఉంది. -
సంస్కృతాన్ని సంరక్షిద్దామన్న హిమాచల్ సీఎం..
సిమ్లాః ప్రాచీన సంస్కృత భాషను సంరక్షించడం తక్షణావసరమని హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్ పిలుపునిచ్చారు. ప్రపంచంలోని అన్ని భాషలకు ప్రధానమైన... తల్లిలాంటి సంస్కృతభాష.. మన సంస్కృతి కూడా అని ఆయన గుర్తు చేశారు. వేదాలు, పురాణాలు, ఇతిహాసాలతోపాటు.. అనేక గ్రంథాలు.. దేవభాషగా చెప్పే సంస్కృతంలోనే లిఖించబడి ఉన్నాయని, అందుకే సంస్కృతాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని సింగ్ తెలిపారు. 'సమాజం, దేశం అభివృద్ధిలో సంస్కృతం పాత్ర' పై సోలాన్ లో జరిగే మూడు రోజుల జాతీయ సంస్కృత సెమినార్ కు ఆయన అధ్యక్షత వహించారు. భారత దేశాన్ని 'విశ్వ గురు' గా నిలిపేందుకు, పురాతన భారతీయ నాగరికత పరిణామం గురించి తెలుసుకునేందుకు సంస్కృతం ఎంతగానో సహకరించిందని ఆయనన్నారు. మన సంప్రదాయాలు, సంస్కృతితోపాటు.. పురాతన భాషను సంరక్షించడం తక్షణావసరమని వీరభద్రసింగ్ పేర్కొన్నారు. సంస్కృత భాషలో లిఖించిన భారత ఇతిహాసాలు, మహాకావ్యాలు ఇతర భాషల్లో సైతం అనువదిస్తున్నారని, అధ్యయనాలు చేపడుతున్నారని, సంస్కృతాన్ని పశ్చిమాన ఓ విదేశీ భాషగా కూడా చదువువుతున్నారని.. అటువంటిది మనం సంస్కృతాన్ని విస్మరించడం తగదని సింగ్ అభిప్రాయపడ్డారు. సంస్కృత భాషపై యువతకు ఆసక్తి తగ్గుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమయంలో భారత భాషల విశిష్టతను తెలుపుతూ.. వాటి అధ్యయనానికి యువతను మరింత ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. సంస్కృతంలో ఉన్నత విద్య చదివాలనుకున్నవారికి తమ ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుందని చెప్పిన సింగ్.. రాష్ట్రంలో భాషను ప్రచారం చేస్తున్న పండితులను కొనియాడారు. -
సీఎం భార్యకు ఈడీ సమన్లు
షిమ్లా: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ కుటుంబం పీకల్లోతు కష్టాల్లో పడింది. మనీల్యాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఆయన భార్య ప్రతిభా సింగ్‌కు సమన్లు జారీ చేసింది. ఈ కేసులో తమ ఎదుట విచారణకు హాజరుకావాల్సిందిగా ఆదేశించింది. అక్రమాస్తుల కేసులో సీబీఐ అధికారులు వీరభద్ర సింగ్‌ను ప్రశ్నించిన సంగతి తెలిసిందే. 2009-2012 మధ్య కాలంలో కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించినట్టు ఆయనపై ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించి వీరభద్రసింగ్ తో పాటు ఆయన భార్య ప్రతిభా సింగ్, ఎల్ఐసీ ఏజెంట్ ఆనంద్ చౌహాన్, చున్నీలాల్ చౌహాన్‌లపై గత ఏడాది కేసు నమోదైంది. -
సీఎం కొడుకును ప్రశ్నించిన సీబీఐ
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్ కుమారుడు విక్రమాదిత్య సింగ్ ను సీబీఐ ప్రశ్నించింది. ఉదయం 11 గంటలకు విక్రమాదిత్య ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నాడు. ఈ కేసులో వీరభద్రసింగ్ పిల్లలు విక్రమాదిత్య, అపరాజితా కుమారిలను సాక్షులుగా పిలిచినట్లు ఢిల్లీ హైకోర్టుకు సీబీఐ సోమవారమే తెలిపింది. అయితే.. సీబీఐ తమను పిలిచిన తర్వాత అరెస్టు చేయకుండా రక్షణ కల్పించాలంటూ వాళ్లిద్దరూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో తమ తల్లిదండ్రులతో పాటు వేరేవారిని కూడా నిందితులుగా ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు గానీ తమ పేర్లు ఎక్కడా లేవని తెలిపారు. తాము విచారణకు సహకరిస్తాము గానీ, సీబీఐ తమను అరెస్టు చేస్తుందన్న ఆందోళన వ్యక్తం చేశారు. వీరభద్రసింగ్, ఆయన భార్య ప్రతిభా సింగ్, ఎల్ఐసీ ఏజెంటు ఆనంద్ చౌహాన్ తదితరులపై గత సంవత్సరం సెప్టెంబర్ 23న అవినీతి నిరోధక చట్టం కింద కేసు దాఖలైంది. ప్రాథమిక విచారణ అనంతరం వీరభద్రసింగ్ రూ. 6.03 కోట్ల సంపద మూటగట్టుకున్నట్లు సీబీఐ ఆరోపించింది. 81 ఏళ్ల సింగ్ ను ఇప్పటికే రెండుసార్లు సీబీఐ ప్రశ్నించింది. అయితే అప్పట్లో ఆయన విచారణకు సహకరించకపోవడం, ఆస్తుల గురించిన సమాచారం ఏదీ చెప్పకపోవడంతో ఇప్పుడు ఆయన పిల్లల వంతు వచ్చింది. -
ఆస్తులు ఎలా సంపాదించానో తెలియదు: సీఎం
సిమ్లా: అక్రమ ఆస్తుల కేసులో హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. తన భార్య, పిల్లల పేరుతో ఆయన కూడబెట్టిన అక్రమ ఆస్తులకు సంబంధించి సీబీఐ గట్టి ఆధారాలు సంపాదించినట్టు తెలుస్తోంది. వీరభద్ర సింగ్, ఆయన అనుచరులు, భాగస్వాములు కుట్రలు చేసి ఏవిధంగా ఆస్తులు సంపాదించారనే దానిపై సీబీఐ వద్ద సాక్ష్యాలున్నాయని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. వీరభద్ర సింగ్ ను గురువారం సీబీఐ అధికారులు ప్రశ్నించారు. తన భార్య, పిల్లలు పేరు మీద ఆస్తులు ఎలా సంపాదించాననో తెలియదని సీబీఐ విచారణలో ఆయన చెప్పినట్టు సమాచారం. ఎఫ్ఐఆర్ లో పేర్లు ఉన్నవారందిరినీ త్వరలోనే సీబీఐ అధికారులు ప్రశ్నించే అవకాశముంది.