సీఎం భార్యకు ఈడీ సమన్లు
షిమ్లా: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ కుటుంబం పీకల్లోతు కష్టాల్లో పడింది. మనీల్యాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఆయన భార్య ప్రతిభా సింగ్కు సమన్లు జారీ చేసింది. ఈ కేసులో తమ ఎదుట విచారణకు హాజరుకావాల్సిందిగా ఆదేశించింది.
అక్రమాస్తుల కేసులో సీబీఐ అధికారులు వీరభద్ర సింగ్ను ప్రశ్నించిన సంగతి తెలిసిందే. 2009-2012 మధ్య కాలంలో కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించినట్టు ఆయనపై ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించి వీరభద్రసింగ్ తో పాటు ఆయన భార్య ప్రతిభా సింగ్, ఎల్‌ఐసీ ఏజెంట్ ఆనంద్ చౌహాన్, చున్నీలాల్ చౌహాన్‌లపై గత ఏడాది కేసు నమోదైంది.