సీఎం పదవి వదులుకోను: వీరభద్ర సింగ్ | nobody asked me to resign, says Virbhadra Singh | Sakshi
Sakshi News home page

సీఎం పదవి వదులుకోను: వీరభద్ర సింగ్

Published Thu, May 22 2014 5:27 PM | Last Updated on Tue, Aug 14 2018 4:24 PM

సీఎం పదవి వదులుకోను: వీరభద్ర సింగ్ - Sakshi

సీఎం పదవి వదులుకోను: వీరభద్ర సింగ్

న్యూఢిల్లీ: తన పదవికి రాజీనామా చేయబోనని కాంగ్రెస్ నాయకుడు, హిమచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ స్పష్టం చేశారు. తనను ఎవరూ రాజీనామా చేయాలని కోరలేదని చెప్పారు. తమ పార్టీ అధినేత్రి సోనియా గాంధీని ఆయన కలిశారు.

ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ప్రజలు తమకు వ్యతిరేకంగా ఓటు వేయలేదని, ప్రధానిగా నరేంద్ర మోడీకి ఓటు వేశారని పేర్కొన్నారు. తమకు రెండు లేదా మూడో స్థానం దక్కినంత మాత్రానా రాజీనామా చేయాల్సిన అవసరం లేదని అన్నారు. ఇటీవల ముగిసిన లోక్సభ ఎన్నికల్లో హిమచల్ ప్రదేశ్ లోని నాలుగు స్థానాలను బీజేపీ గెల్చుకున్న సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement