సిమ్లా: హిమాచల్ ప్రదేశ్లోని చంబా ప్రాంతంలో కొండపైనుంచి ఓ బస్సు జారిపడిన ఘటనలో 8 మంది దుర్మరణం చెందారు. హిమాచల్ ఆర్టీసీ బస్సు చంబా టౌన్ నుంచి కిల్లర్ ప్రాంతానికి వెళుతుండగా తిస్సాకు సమీపంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ ప్రాంతం చంబా ప్రధాన కార్యాలయానికి 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. అయితే కొండపై రోడ్డుమార్గంలో వెళుతున్న బస్సు ఒక్కసారిగా అదుపుతప్పి పల్టీలు కొడుతూ జారి పడిందని ఏఎస్పీ కుల్వంత్ థకూర్ ఫోన్ ద్వారా ఐఏఎన్యస్కు వెల్లడించారు. ఈ ఘటనకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందన్నారు.
ఈ రోడ్డుప్రమాదంలో చాలామందికి గాయాలు అయ్యాయని వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించమన్నారు. కాగా వీరంతా చంబా జిల్లాకు చెందిన వారిగా పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై హిమాచల్ రాష్ట్ర ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ విచారం వ్యక్తం చేశారు. బస్సు ప్రమాదంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆయన ఆదేశించారు.
కొండపై నుంచి జారిపడిన బస్సు, 8 మంది మృతి
Published Thu, Aug 13 2015 4:49 PM | Last Updated on Sun, Sep 3 2017 7:23 AM
Advertisement
Advertisement