న్యూఢిల్లీ: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో హిమాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్‌కు ఎన్‌ఫోర్సుమెంట్ డైరెక్టరేట్(ఈడీ) మంగళవారం మరోసారి సమన్లు పంపింది. ఈనెల 20న విచారణ నిమిత్తం తన ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. గతంలో ఏప్రిల్ 13న హాజరు కావాలని సమన్లు పంపినప్పటికీ ఆయన హాజరుకాలేదు. ఇప్పటికే అతని భార్య ప్రతిభా సింగ్, కుమారుడు విక్రమాదిత్య సింగ్‌లను మనీ లాండరింగ్ కేసులో విచారించింది. ఈ నెల మొదటి వారంలో ఢిల్లీలోని వీరభద్రసింగ్‌కు చెందిన ఫాంహౌస్‌ను ఈడీ జప్తు చేసింది.
దీని విలువ రూ.27.29 కోట్లు. రాజకీయ ప్రత్యర్థులను అడ్డు తొలగించుకునేందుకు కేంద్రం సీబీఐ, ఈడీలను ఉపయోగించుకుంటోందని, తన ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు తనను వేధిస్తోందని ఫాంహౌస్‌ను సీజ్ చేసిన తర్వాత వీరభద్రసింగ్ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. కాగా అక్రమాస్తుల కేసులో వీరభద్రసింగ్‌పై సీబీఐ రెండేళ్ల క్రితమే కేసు నమోదు చేసిన విషయం విదితమే. ఇప్పటికే పలుమార్లు వీరభద్రసింగ్, ఆయన బంధువుల ఆస్తులపై పలుమార్లు దాడులు చేసింది. ఇటీవల ఢిల్లీ హైకోర్టు కూడా సీబీఐకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.