ఢిల్లీ: మనీలాండరింగ్ కేసులో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ నేత, జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లాకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సమన్లు జారీ చేసింది. జనవరి 11న విచారణకు హాజరు కావాలని ఈడీ కోరింది. శ్రీనగర్‌లోని ఈడీ కార్యాలయానికి హాజరు కావాలని స్పష్టం చేసింది.
జమ్మూ కశ్మీర్ క్రికెట్ అసోసియేషన్ (JKCA)లో జరిగిన అవకతవకలపై ఫరూక్ అబ్దుల్లాకు సమన్లు జారీ చేసినట్లు సమాచారం. ఫరూక్ అబ్దుల్లాపై ఈడీ 2022లో అధికారికంగా అభియోగాలు మోపింది. సంబంధం లేని పార్టీలు, JKCA ఆఫీస్ బేరర్‌లతో సహా వివిధ వ్యక్తిగత బ్యాంక్ ఖాతాలకు నిధులను బదిలీ చేయడం, అలాగే JKCA బ్యాంక్ ఖాతాల నుండి నగదు ఉపసంహరణలు చేయడం వంటివి ఇందులో భాగంగా ఉన్నాయి.
అబ్దుల్లాపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) దాఖలు చేసిన 2018 ఛార్జిషీట్‌లో దాఖలు చేసింది. అనంతరం ఈడీ కేసు నమోదు చేసింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ తర్వాత ప్రస్తుతం ఫరూక్ అబ్దుల్లాకు ఈడీ నోటీసులు దాఖలు చేసింది. గత ఏడాది ఏప్రిల్‌లో జమ్మూ కాశ్మీర్ బ్యాంకు మోసం కేసులో ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లాను ఈడీ ప్రశ్నించింది.
ఇదీ చదవండి: సీఎం స్టాలిన్ సంక్రాంతి కానుక
Comments
Please login to add a commentAdd a comment