సీబీఐ ఎదుట ఎందుకు హాజరుకారు?
న్యూఢిల్లీ: అక్రమ ఆస్తుల కేసు ఎదుర్కొంటున్న హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్ కు ఢిల్లీ హైకోర్టు షాక్ ఇచ్చింది. తమంత తాముగా సీబీఐ ఎందుకు హాజరుకాకూడని హిమాచల్ సీఎంను ప్రశ్నించింది. సీబీఐ దర్యాప్తుకు ఎందుకు సహకరించడం లేదని నిలదీసింది. దర్యాప్తుకు సహకరిస్తే విచారణ త్వరగా పూర్తవుతుందని కదా అని ప్రశ్నించింది.
వీరభద్ర సింగ్ వ్యతిరేకంగా ఆధారాలు సంపాదించామని హైకోర్టుకు సీబీఐ తెలిపింది. అయితే హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు స్టే ఇవ్వడంతో దర్యాప్తుకు ఆటంకం కలుగుతోందని వివరించింది. వీరభద్ర సింగ్ అక్రమ ఆస్తుల కేసులో ఢిల్లీ హైకోర్టు రేపటి(బుధవారం) నుంచి వాదనలు విననుంది.