హిమాచల్ సీఎంపై అవినీతి కేసు నమోదు! | cbi registers corruption case on himachal pradesh cm virbhadra singh | Sakshi
Sakshi News home page

Published Sat, Sep 26 2015 12:20 PM | Last Updated on Thu, Mar 21 2024 9:00 PM

హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్పై సీబీఐ అవినీతి కేసు నమోదు చేసింది. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంతో పాటు న్యూఢిల్లీలోని 11 ప్రదేశాలలో సీబీఐ సోదాలు జరిపింది. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని, అవినీతికి పాల్పడ్డారని వీరభద్ర సింగ్పై అభియోగాలున్నాయి. ఈ నేపథ్యంలోనే సీబీఐ కేసు నమోదు చేసింది. వీరభద్రసింగ్తో పాటు ఆయన కుటుంబ సభ్యులపై కూడా కేసులు నమోదయ్యాయి. 2009 నుంచి 2011 వరకు కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో ఆయన తన ఆదాయం కంటే రూ. 6.1 కోట్ల మేర అధికంగా ఆస్తులు సమకూర్చుకున్నారన్నది సీబీఐ ఆరోపణ. ఆయన భార్య ప్రతిభాసింగ్, కొడుకు విక్రమాదిత్య, కూతురు అపరాజితలపై కూడా కేసులు నమోదయ్యాయి.

Advertisement
 
Advertisement
 
Advertisement