
దాడి చేసిన వారితో ఆటలా: ఉద్ధవ్
ముంబై: టీ20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్ క్రికెట్ టీమ్‌కు భద్రత కల్పిస్తామంటూ పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నారని శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్‌ఠాక్రే మండిపడ్డారు. భారత్‌లోకి ప్రాయోజిత చొరబాటును పాక్ ఆపేంతవరకు ఆ దేశంతో మనం ఒక్క మ్యాచ్ కూడా ఆడకూడదని ఆదివారం చంద్రాపూర్‌లో జరిగిన కార్యక్రమంలో ఉద్ధవ్ పేర్కొన్నారు.
హిమాచల్‌ప్రదేశ్ సీఎం వీరభద్రసింగ్ తన దేశభక్తిని చాటుకోగా, మమతాబెనర్జీ మాత్రం ఎన్నికల నేపథ్యంలో ఓటుబ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నారన్నారు. భారత్‌పై దాడిచేసిన వారితో మనం ఆడాలా? అని ప్రశ్నించారు. ఒక చేతిలో క్రికెట్, మరో చేతిలో బాంబు కుదరదని, మీరు బాల్‌నన్నా వదిలేయండి లేదా పాక్‌తో ఆడటాన్ని అయినా వదిలేయండి అని అన్నారు.