
రాహుల్ నివాసం ఎదుట బీజేపీ ఆందోళన
న్యూఢిల్లీ : ఏఐసీసీ ఉపాధ్యక్షడు రాహుల్ గాంధీ నివాసం ఎదుట బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్ను పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తూ వారు నిరసన చేపట్టారు. బీజేపీ కార్యకర్తలు బారికేడ్లు దాటి లోనికి దూసుకు వెళ్లేందుకు ప్రయత్నించటంతో వారిపై పోలీసులు వాటర్ కెనాన్లను ప్రయోగించారు.
ఈ సందర్భంగా ఆందోళనకారులు కాంగ్రెస్కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దాంతో నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకుని సమీప పోలీస్ స్టేషన్కు తరలించారు. కాగా ఒక ప్రైవేటు విద్యుత్ సంస్థ నుంచి ముడుపులు స్వీకరించిన వీరభద్రసింగ్‌పై సీబీఐ దర్యాప్తు జరిపించాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఈ వ్యవహారంపై బీజేపీ నేత బీజేపీ నేత అరుణ్ జైట్లీ నిన్న ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌కు ఒక లేఖ రాశారు.