మంజూరు చేసిన ఢిల్లీ కోర్టు
నేడు విడుదలకానున్న ఢిల్లీ సీఎం
ఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు భారీ ఊరట లభించింది. మద్యం కుంభకోణంలో మనీలాండరింగ్ అభియోగాలపై అరెస్టయిన ఆమ్‌ఆద్మీ పార్టీ జాతీయ కనీ్వనర్ కేజ్రీవాల్‌కు ఢిల్లీ కోర్టు గురువారం రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. లక్ష రూపాయల వ్యక్తిగత పూచీకత్తుపై కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేస్తూ వెకేషన్ స్పెషల్ జడ్జి నియయ్ బిందు ఆదేశాలు జారీ చేశారు.
బెయిల్ ఆదేశాలను 48 గంటల పాటు నిలిపి ఉంచాలన్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అభ్యర్థనను జడ్జి తిరస్కరించారు. బెయిల్ ఉత్తర్వులను పైకోర్టులో సవాల్ చేస్తామని, అందుకోసం 48 గంటలు ఆదేశాలను నిలిపి ఉంచాలని ఈడీ అభ్యరి్థంచింది. కానీ జడ్జి నియయ్ బిందు ఇందుకు సమ్మతించలేదు. దర్యాప్తునకు ఆటంకం కలి్పంచకూడదని, సాక్షులను ప్రభావితం చేయరాదని కేజ్రీవాల్‌కు కోర్టు షరతులు విధించింది.
అలాగే అవసరమైనపుడల్లా కోర్టు ఎదుట హాజరుకావాలని, దర్యాప్తునకు సహకరించాలని షరతులు పెట్టింది. కేజ్రీవాల్‌కు రెగ్యులర్ బెయిల్ రావడం ఆప్‌కు, ఇండియా కూటమి మిత్రపక్షాలకు ప్రధానికి వ్యతిరేకంగా ఒక అస్త్రం దొరికినట్లే. కేజ్రీవాల్ న్యాయవాదులు శుక్రవారం కోర్టులో పూచీకత్తును సమరి్పస్తే అదేరోజు తీహార్ జైలు నుంచి ఢిల్లీ సీఎం బయటకు వస్తారు.
ఢిల్లీ మద్యం పాలసీలో కొందరు మద్యం వ్యాపారులకు మేలు చేకూర్చేలా ఉద్దేశపూర్వకంగా నిబంధనలకు చేర్చారని, ఈ కుట్రలో కేజ్రీవాల్ భాగస్వామి అని ఆరోపిస్తూ ఈడీ మార్చి 21న ఢిల్లీ సీఎంను అరెస్టు చేసింది. మద్యం వ్యాపారుల నుంచి అందుకున్న ముడుపులను గోవా ఎన్నికల్లో ఆప్ ప్రచారానికి వినియోగించారని, ఆప్ జాతీయ కనీ్వనర్‌గా కేజ్రీవాల్ వ్యక్తిగతంగా, పరోక్షంగా మనీలాండరింగ్‌కు పాల్పడినట్లేనని ఈడీ వాదించింది.
ఈ ఆరోపణలను ఖండించిన కేజ్రీవాల్ ఒక్క పైసాను కూడా ఈడీ పట్టుకోలేదని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారం నిమిత్తం సుప్రీంకోర్టు మే 10 తేదీన కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసింది. ఎన్నికలు ముగిశాక కేజ్రీవాల్ జూన్ 2న తీహార్ జైలులో లొంగిపోయారు.
ఈడీది అంతులేని దర్యాప్తు
మద్యం కుంభకోణం కేసులో ఈడీ ఎలాంటి నగదును స్వా«దీనం చేసుకోలేదని, కేజ్రీవాల్‌పై అభియోగాలను నిరూపించేందుకు ఎలాంటి ఆధారాలు లేవని ఆయన న్యాయవాది వాదించారు. ఈడీ పక్షాన హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ (ఏఎస్‌జీ) ఎస్.వి.రాజు కేజ్రీవాల్‌కు బెయిల్‌ను వ్యతిరేకించారు. ఈడీ ఊహాజనిత దర్యాప్తును చేయడం లేదని, లంచాలుగా ఇచి్చన కరెన్సీ నోట్ల ఫోటోలు తమ వద్ద ఉన్నాయని పేర్కొన్నారు.
గోవాలో కేజ్రీవాల్ బసచేసిన సెవన్ స్టార్ హోటల్ గదికి చెల్లింపులు జరపడానికి ముడుపుల డబ్బునే వాడారని ఆరోపించారు. తన మొబైల్ ఫోన్ పాస్ట్‌వర్డ్‌ను కేజ్రీవాల్ ఇవ్వడం లేదని, దీనిబట్టి మద్యం కుంభకోణంలో ఆయన పాత్ర ఉందని భావించవచ్చని రాజు వాదించారు. కేజ్రీవాల్ మొబైల్ ఫోన్‌ను ఓపెన్ చేస్తే మరింతమంది ప్రమేయం బయపడుతుందన్నారు.
‘కేజ్రీవాల్ వ్యక్తిగతంగా ఎలాంటి నేరానికి పాల్పడకపోయినా.. ప్రివెన్షన్ ఆఫ్ మనీ ల్యాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్‌ఏ) సెక్షన్ 70 ప్రకారం ఆమ్‌ఆద్మీ పార్టీ వ్యహారాలకు ఆయనే బాధ్యుడు కాబట్టి ఆప్ నేరాలకు కూడా జాతీయ కనీ్వరర్‌గా ఢిల్లీ సీఎం దోషిగా బాధ్యుడవుతాడు’ అని రాజు పేర్కొన్నారు. కేజ్రీవాల్ తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది విక్రమ్ చౌదరి.. ఈడీ ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవన్నారు.
‘ఈడీ స్వంతత్ర సంస్థా? లేక రాజకీయ బాసులు చెప్పినట్లు ఆడుతోందా? అని విక్రమ్ చౌదరి ప్రశ్నించారు. ఊహాజనిత అంశాల ఆధారంగానే ఈడీ తుది నిర్ణయాలకు వస్తోందన్నారు. ఆప్‌కు రూ. 45 కోట్లు ముడుపులు ముట్టాయనడానికి ఈడీ వద్ద ఎలాంటి ఆధారాలు లేవు. ఇంకా అరెస్టులు కొనసాగిస్తున్నారు. మరోవైపు రూ. 100 కోట్లు ముడుపులుగా అందాయంటారు. ఈడీ ఇంకా ఆధారాలు సేకరిస్తూనే ఉంటే.. ఇది అంతులేని దర్యాప్తే అవుతుంది. కాబట్టి ఇతరులకు ఇచి్చనట్లే కేజ్రీవాల్‌కు స్వేచ్ఛనివ్వాలని విక్రమ్ చౌదరి కోర్టుకు విన్నవించారు.
మనీలాండరింగ్ కేసులో పరిణామక్రమం..
జూలై 2022: ఢిల్లీ ఎక్సైజ్ విధానంలో రూపకల్పన, అమలులో అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై సీబీఐ విచారణకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆదేశం.
ఆగస్ట్ 2022: సీబీఐ, ఈడీ కేసులు నమోదు.
అక్టోబర్ 30, 2023: మనీ లాండరింగ్ కేసులో నవంబరు 2న విచారణకు హాజరు కావాలని కేజ్రీవాల్‌కు ఈడీ తొలి సమన్లు.
ఏప్రిల్ 27: చట్టవిరుద్ధ అరెస్టు.. స్వేచ్ఛాయుత ఎన్నికలు, సమాఖ్య వ్యవస్థ అనే ప్రజాస్వామ్య మూలస్తంభాలపై దాడి అని సుప్రీంకోర్టుకు తెలిపిన కేజ్రీవాల్.
ఏప్రిల్ 29: ఈడీ పలుమార్లు సమన్లు జారీచేసినా స్టేట్‌మెంట్ రికార్డు చేయడానికి కేజ్రీవాల్ విచారణకు హాజరుకాకపోవడాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు.
మే 10: లోక్‌సభ ఎన్నికల ప్రచారం కోసం కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు. జూన్ 2న లొంగిపోవాలని ఆదేశం.
మే 30: అనారోగ్య కారణాలతో మధ్యంతర బెయిల్‌ను కోరుతూ ఢిల్లీ కోర్టుకు కేజ్రీవాల్.
జూన్ 5: మధ్యంతర బెయిల్ తిరస్కరణ.
జూన్ 20: రెగ్యులర్ బెయిల్ మంజూరు.
Comments
Please login to add a commentAdd a comment