ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను కేంద్ర దర్యాప్తు సంస్థ బుధవారం సీబీఐ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మంగళవారం తిహార్ జైల్లో ఆయనను విచారించి వాంగ్మూలం నమోదు చేసుకున్నాయి. బుధవారం ట్రయల్ కోర్టులో ప్రవేశపెట్టాయి. తిహార్ జైలు నుంచి కేజ్రీవాల్‌ను ఉదయం కోర్టు ముందు హాజరుపర్చారు అధికారులు. ఆయనను కస్టడీకి కోరుతూ కోర్టుకు సీబీఐ దరఖాస్తు చేసుకుంది.
విచారణ సందర్భంగా ప్రస్తుతం రద్దు చేసిన మద్యం పాలసీ కింద నగరంలో మద్యం దుకాణాల ప్రైవేటీకరణకు మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియానే సిఫార్సు చేశారని సీఎం కేజ్రీవాల్ తమ విచారణలో చెప్పినట్లు సీబీఐ అధికారులు రౌస్ అవెన్యూ కోర్టుకు తెలియజేశారు.
అయితే సీబీఐ ఆరోపణలు కేజ్రీవాల్ ఖండించారు. మనీష్ సిసోడియా దోషి అని తాను ఎలాంటి ప్రకటన చేయలేదని పేర్కొన్నారు. సిసోడియా పూర్తిగా అమాయకుడని, తమ పరువు తీయడమే దర్యాప్తు సంస్థల లక్ష్యమని విమర్శించారు. వాస్తవాలను వక్రీకరించి, అసంబద్ధమైన ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు.
కేజ్రీవాల్ తిరస్కరణను తిప్పికొట్టిన సీబీఐ.. తాము వాస్తవాలను మాట్లాడుతున్నట్లు కోర్టుకు తెలిపింది. అయితే సీబీఐ వాదనలపై కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. కేజ్రీవాల్ ప్రకటనను తాము చదివామని ఆయన ఆ విధంగా చెప్పలేదని కోర్టు పేర్కొంది.
ప్రైవేటీకరణ తన ఆలోచన కాదని కేజ్రీవాల్ పేర్కొన్నారని, దానిని సీబీఐ తప్పుగా గ్రహించిందని కోర్టు తెలిపింది. ఇదిలా ఉండగా మద్యం కుంభకోణం కేసులో సిసోడియాను గతేడాది ఫిబ్రవరి 26న సీబీఐ అరెస్ట్ చేసింది. అనంతరం మార్చి 9, 2023న మనీలాండరింకేసులో ఈడీ అదుపులోకి తీసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment