
న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు రౌస్ అవెన్యూ కోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది.లిక్కర్ స్కాం కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న కేజ్రీవాల్.. మధ్యంతర బెయిల్ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ కోర్టు తిరస్కరించింది.
కాగా వైద్య పరీక్షలు నిర్వహించుకునేందుకు ఏడు రోజుల పాటు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కేజ్రీవాల్ ఈ పిటిషన్ వేశారు. దీనిపై న్యాయస్థానం విచారణ చేపట్టింది. కేజ్రీవాల్‌కు వైద్య పరీక్షలు నిర్వహించాలని తీహార్ జైలు అధికారులను కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను జూన్ 7కు వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment