Money Laundering Scam
-
Delhi Court: కేజ్రీవాల్‌కు బెయిల్
ఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు భారీ ఊరట లభించింది. మద్యం కుంభకోణంలో మనీలాండరింగ్ అభియోగాలపై అరెస్టయిన ఆమ్ఆద్మీ పార్టీ జాతీయ కనీ్వనర్ కేజ్రీవాల్‌కు ఢిల్లీ కోర్టు గురువారం రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. లక్ష రూపాయల వ్యక్తిగత పూచీకత్తుపై కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేస్తూ వెకేషన్ స్పెషల్ జడ్జి నియయ్ బిందు ఆదేశాలు జారీ చేశారు. బెయిల్ ఆదేశాలను 48 గంటల పాటు నిలిపి ఉంచాలన్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అభ్యర్థనను జడ్జి తిరస్కరించారు. బెయిల్ ఉత్తర్వులను పైకోర్టులో సవాల్ చేస్తామని, అందుకోసం 48 గంటలు ఆదేశాలను నిలిపి ఉంచాలని ఈడీ అభ్యరి్థంచింది. కానీ జడ్జి నియయ్ బిందు ఇందుకు సమ్మతించలేదు. దర్యాప్తునకు ఆటంకం కలి్పంచకూడదని, సాక్షులను ప్రభావితం చేయరాదని కేజ్రీవాల్‌కు కోర్టు షరతులు విధించింది. అలాగే అవసరమైనపుడల్లా కోర్టు ఎదుట హాజరుకావాలని, దర్యాప్తునకు సహకరించాలని షరతులు పెట్టింది. కేజ్రీవాల్‌కు రెగ్యులర్ బెయిల్ రావడం ఆప్‌కు, ఇండియా కూటమి మిత్రపక్షాలకు ప్రధానికి వ్యతిరేకంగా ఒక అస్త్రం దొరికినట్లే. కేజ్రీవాల్ న్యాయవాదులు శుక్రవారం కోర్టులో పూచీకత్తును సమరి్పస్తే అదేరోజు తీహార్ జైలు నుంచి ఢిల్లీ సీఎం బయటకు వస్తారు. ఢిల్లీ మద్యం పాలసీలో కొందరు మద్యం వ్యాపారులకు మేలు చేకూర్చేలా ఉద్దేశపూర్వకంగా నిబంధనలకు చేర్చారని, ఈ కుట్రలో కేజ్రీవాల్ భాగస్వామి అని ఆరోపిస్తూ ఈడీ మార్చి 21న ఢిల్లీ సీఎంను అరెస్టు చేసింది. మద్యం వ్యాపారుల నుంచి అందుకున్న ముడుపులను గోవా ఎన్నికల్లో ఆప్ ప్రచారానికి వినియోగించారని, ఆప్ జాతీయ కనీ్వనర్‌గా కేజ్రీవాల్ వ్యక్తిగతంగా, పరోక్షంగా మనీలాండరింగ్‌కు పాల్పడినట్లేనని ఈడీ వాదించింది. ఈ ఆరోపణలను ఖండించిన కేజ్రీవాల్ ఒక్క పైసాను కూడా ఈడీ పట్టుకోలేదని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారం నిమిత్తం సుప్రీంకోర్టు మే 10 తేదీన కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసింది. ఎన్నికలు ముగిశాక కేజ్రీవాల్ జూన్ 2న తీహార్ జైలులో లొంగిపోయారు. ఈడీది అంతులేని దర్యాప్తు మద్యం కుంభకోణం కేసులో ఈడీ ఎలాంటి నగదును స్వా«దీనం చేసుకోలేదని, కేజ్రీవాల్‌పై అభియోగాలను నిరూపించేందుకు ఎలాంటి ఆధారాలు లేవని ఆయన న్యాయవాది వాదించారు. ఈడీ పక్షాన హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ) ఎస్.వి.రాజు కేజ్రీవాల్‌కు బెయిల్‌ను వ్యతిరేకించారు. ఈడీ ఊహాజనిత దర్యాప్తును చేయడం లేదని, లంచాలుగా ఇచి్చన కరెన్సీ నోట్ల ఫోటోలు తమ వద్ద ఉన్నాయని పేర్కొన్నారు. గోవాలో కేజ్రీవాల్ బసచేసిన సెవన్ స్టార్ హోటల్ గదికి చెల్లింపులు జరపడానికి ముడుపుల డబ్బునే వాడారని ఆరోపించారు. తన మొబైల్ ఫోన్ పాస్ట్‌వర్డ్‌ను కేజ్రీవాల్ ఇవ్వడం లేదని, దీనిబట్టి మద్యం కుంభకోణంలో ఆయన పాత్ర ఉందని భావించవచ్చని రాజు వాదించారు. కేజ్రీవాల్ మొబైల్ ఫోన్‌ను ఓపెన్ చేస్తే మరింతమంది ప్రమేయం బయపడుతుందన్నారు. ‘కేజ్రీవాల్ వ్యక్తిగతంగా ఎలాంటి నేరానికి పాల్పడకపోయినా.. ప్రివెన్షన్ ఆఫ్ మనీ ల్యాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్ఏ) సెక్షన్ 70 ప్రకారం ఆమ్ఆద్మీ పార్టీ వ్యహారాలకు ఆయనే బాధ్యుడు కాబట్టి ఆప్ నేరాలకు కూడా జాతీయ కనీ్వరర్గా ఢిల్లీ సీఎం దోషిగా బాధ్యుడవుతాడు’ అని రాజు పేర్కొన్నారు. కేజ్రీవాల్ తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది విక్రమ్ చౌదరి.. ఈడీ ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవన్నారు. ‘ఈడీ స్వంతత్ర సంస్థా? లేక రాజకీయ బాసులు చెప్పినట్లు ఆడుతోందా? అని విక్రమ్ చౌదరి ప్రశ్నించారు. ఊహాజనిత అంశాల ఆధారంగానే ఈడీ తుది నిర్ణయాలకు వస్తోందన్నారు. ఆప్‌కు రూ. 45 కోట్లు ముడుపులు ముట్టాయనడానికి ఈడీ వద్ద ఎలాంటి ఆధారాలు లేవు. ఇంకా అరెస్టులు కొనసాగిస్తున్నారు. మరోవైపు రూ. 100 కోట్లు ముడుపులుగా అందాయంటారు. ఈడీ ఇంకా ఆధారాలు సేకరిస్తూనే ఉంటే.. ఇది అంతులేని దర్యాప్తే అవుతుంది. కాబట్టి ఇతరులకు ఇచి్చనట్లే కేజ్రీవాల్‌కు స్వేచ్ఛనివ్వాలని విక్రమ్ చౌదరి కోర్టుకు విన్నవించారు. మనీలాండరింగ్ కేసులో పరిణామక్రమం.. జూలై 2022: ఢిల్లీ ఎక్సైజ్ విధానంలో రూపకల్పన, అమలులో అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై సీబీఐ విచారణకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆదేశం. ఆగస్ట్ 2022: సీబీఐ, ఈడీ కేసులు నమోదు. అక్టోబర్ 30, 2023: మనీ లాండరింగ్ కేసులో నవంబరు 2న విచారణకు హాజరు కావాలని కేజ్రీవాల్‌కు ఈడీ తొలి సమన్లు. ఏప్రిల్ 27: చట్టవిరుద్ధ అరెస్టు.. స్వేచ్ఛాయుత ఎన్నికలు, సమాఖ్య వ్యవస్థ అనే ప్రజాస్వామ్య మూలస్తంభాలపై దాడి అని సుప్రీంకోర్టుకు తెలిపిన కేజ్రీవాల్. ఏప్రిల్ 29: ఈడీ పలుమార్లు సమన్లు జారీచేసినా స్టేట్మెంట్ రికార్డు చేయడానికి కేజ్రీవాల్ విచారణకు హాజరుకాకపోవడాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు. మే 10: లోక్‌సభ ఎన్నికల ప్రచారం కోసం కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు. జూన్ 2న లొంగిపోవాలని ఆదేశం. మే 30: అనారోగ్య కారణాలతో మధ్యంతర బెయిల్‌ను కోరుతూ ఢిల్లీ కోర్టుకు కేజ్రీవాల్. జూన్ 5: మధ్యంతర బెయిల్ తిరస్కరణ. జూన్ 20: రెగ్యులర్ బెయిల్ మంజూరు. -
డిజైన్ టెక్ ఆస్తులను ఈడీ జప్తు చేయడం సబబే
సాక్షి, అమరావతి: గత టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో కీలక పాత్రధారైన డిజైన్ టెక్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ సంస్థకు చెందిన రూ.31.20 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లను జప్తు చేస్తూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జారీ చేసిన ప్రాథమిక జప్తు ఉత్తర్వులను (పీఏవో) హైకోర్టు సమర్థించింది. అలాగే మనీలాండరింగ్ చట్టం కింద డిజైన్ టెక్కు అడ్జ్యుడికేటింగ్ అథారిటీ జారీ చేసిన షోకాజ్ నోటీసులు సైతం సబబేనని పేర్కొంది. ఈడీ జారీ చేసిన ప్రాథమిక జప్తు ఉత్తర్వులను, అడ్జ్యుడికేటింగ్ అథారిటీ జారీ చేసిన నోటీసులను సవాల్ చేస్తూ డిజైన్ టెక్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. ఈడీ జారీ చేసిన ప్రాథమిక జప్తు ఉత్తర్వులను అడ్జ్యుడికేటింగ్ అథారిటీ ముందే తేల్చుకోవాలని డిజైన్ టెక్కు స్పష్టం చేసింది. ఈ విషయంలో ఈడీ తరపు న్యాయవాది జోస్యుల భాస్కరరావు చేసిన వాదనతో న్యాయస్థానం ఏకీభవించింది. ఈ కుంభకోణం తీవ్రత, ఇందులో ప్రజాధనం ముడిపడి ఉన్న నేపథ్యంలో ఈడీ ఉత్తర్వులు, అడ్జ్యుడికేటింగ్ అథారిటీ నోటీసుల విషయంలో డిజైన్ టెక్ వాదనను ఆమోదించలేమని తేల్చిచెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి ఇటీవల కీలక తీర్పు వెలువరించారు. ఆధారాలను బట్టి జప్తు చేసే అధికారం ఈడీకి ఉంది ‘మనీలాండరింగ్ చట్టంలోని సెక్షన్ 5 ప్రకారం ఈడీ అధికారులు ఏ వ్యక్తి ఆస్తినైనా జప్తు చేయొచ్చు. ఆ ఆస్తిని నేరం ద్వారా సంపాదించారనేందుకు తమ ముందున్న ఆధారాలను బట్టి జప్తు చేసే అధికారం అధికారులకు ఉంది. ఈ అధికారాన్ని ఉపయోగించే స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో డిజైన్ టెక్ ఫిక్స్డ్ డిపాజిట్లను ఈడీ జప్తు చేసింది. నేరం ద్వారా సంపాదించిన డబ్బు లేదా ఆస్తి (ప్రొసీడ్స్ ఆఫ్ క్రైం)కి విస్తృత నిర్వచనం ఉంది. సీఐడీ జప్తు చేసే నాటికి బ్యాంకు ఖాతాలో ఉన్న రూ.2.8 కోట్లను మాత్రమే ప్రొసీడ్స్ ఆఫ్ క్రైంగా భావించవచ్చని, అంతకు మించిన మొత్తాలను జప్తు చేసే అధికారం ఈడీకి లేదన్న డిజైన్ టెక్ తరఫు సీనియర్ న్యాయవాది వాదనలు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. వాస్తవానికి సీఆర్పీసీ సెక్షన్ 102 కింద సీఐడీ చేపట్టిన చర్యలు, మనీలాండరింగ్ చట్టం కింద ఈడీ చేపట్టిన చర్యలు పరస్పరం భిన్నమైనవి. సీఐడీ జప్తుపై కింది కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు ముందు దాఖలైన వ్యాజ్యాల్లో ఈడీ ప్రతివాది కాదు. ఈ కోర్టులన్నీ కూడా కేవలం సీఐడీ జప్తు అంశానికే పరిమితమయ్యాయి. అందువల్ల ఈడీ జారీ చేసిన జప్తు ఉత్తర్వులను ‘రెండో జప్తు’ అనడానికి ఏమాత్రం వీల్లేదు’ అని న్యాయమూర్తి తన తీర్పులో స్పష్టం చేశారు. డిజైన్ టెక్ వాదనలో ఏమాత్రం పస లేదు.. ‘అడ్జ్యుడికేటింగ్ అథారిటీ ఇచ్చిన షోకాజ్ నోటీసులకు వివరణ ఇచ్చేందుకు, ఈడీ జారీ చేసిన ప్రాథమిక జప్తు ఉత్తర్వులపై అభ్యంతరం తెలిపేందుకు ఉన్న ప్రత్యామ్నాయాలను డిజైన్ టెక్ ఉపయోగించుకోవచ్చు. అడ్జ్యుడికేటింగ్ అథారిటీ నోటీసులకు వివరణ ఇచ్చినట్లు డిజైన్ టెక్ చెబుతోంది. అందువల్ల ఈడీ ప్రాథమిక జప్తు ఉత్తర్వులను కూడా ఆ అథారిటీ ముందే తేల్చుకోవచ్చు. అడ్జ్యుడికేటింగ్ అథారిటీ ముందుకు వెళితే తమకు ఇబ్బంది కలుగుతుందన్న డిజైన్ టెక్ వాదనలో ఏమాత్రం పస లేదు. ఈ కేసు తీవ్రత దృష్ట్యా, ఇందులో ప్రజాధనం ముడిపడి ఉన్న కారణంతో ఆ వాదనను ఆమోదించలేకున్నాం. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకుని డిజైన్ టెక్ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని కొట్టేస్తున్నాం. ఈ తీర్పులో వ్యక్తం చేసిన అభిప్రాయాల ప్రభావానికి లోనవకుండా అడ్జ్యుడికేటింగ్ అథారిటీ ఈ వ్యవహారాన్ని పరిష్కరించాలి’ అని జస్టిస్ రవి తన తీర్పులో పేర్కొన్నారు. స్కిల్ కుంభకోణంపై రంగంలోకి దిగిన ఈడీ.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాల ఏర్పాటు పేరుతో వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని లూటీ చేసిన సంగతి తెలిసిందే. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ కుంభకోణంపై సీఐడీ కేసు నమోదు చేసింది. చంద్రబాబు, అప్పటి మంత్రి అచ్చెన్నాయుడులతో పాటు పలువురు అధికారులను సీమెన్స్, డిజైన్ టెక్ తదితరులను నిందితులుగా చేర్చింది. వందల కోట్ల రూపాయల ప్రజాధనం దారి మళ్లడంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగంలోకి దిగింది. దర్యాప్తులో భాగంగా డిజైన్ టెక్ బ్యాంకు ఖాతాలో ఉన్న రూ.31.20 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లు స్కిల్ కుంభకోణానికి సంబంధించినవేనని తేల్చింది. ఈ మొత్తాన్ని జప్తు చేస్తూ గతేడాది ఏప్రిల్ 21న ఈడీ ప్రాథమిక జప్తు ఉత్తర్వులు ఇచ్చింది. అనంతరం అడ్జ్యుడికేటింగ్ అథారిటీకి ఫిర్యాదు చేసింది. దీంతో అడ్జ్యుడికేటింగ్ అథారిటీ.. డిజైన్ టెక్కు షోకాజ్ నోటీసులు ఇచ్చింది. గతేడాది జూలై 13లోపు ఈ నోటీసులకు సమాధానం ఇవ్వాలని డిజైన్ టెక్‌ను ఆదేశించింది. ఈడీ ప్రాథమిక జప్తు ఉత్తర్వులను, అడ్జ్యుడికేటింగ్ అథారిటీ షోకాజ్ నోటీసులను సవాల్ చేస్తూ డిజైన్ టెక్ చైర్మన్ కమ్ ఎండీ వికాస్ వినయ్ ఖాన్వీల్కర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈడీది రెండో జప్తు అవుతుంది.. డిజైన్ టెక్ తరఫున సీనియర్ న్యాయవాది బి.ఆదినారాయణరావు, ఈడీ తరఫున సీనియర్ స్టాండింగ్ కౌన్సిల్ జోస్యుల భాస్కరరావు వాదనలు వినిపించారు. డిజైన్ టెక్ బ్యాంకు ఖాతాలో ఉన్న నగదును సీఐడీ జప్తు చేసిందని, దానిపై తాము కింది కోర్టును ఆశ్రయించామని ఆదినారాయణరావు చెప్పారు. బ్యాంకు ఖాతా నిర్వహణకు అనుమతినిచ్చిన కింది కోర్టు.. నగదును ఫిక్స్డ్ డిపాజిట్లుగా మార్చాలని ఆదేశించిందన్నారు. తరువాత ఈడీ ఆ ఫిక్స్డ్ డిపాజిట్లను జప్తు చేస్తూ ప్రాథమిక జప్తు ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. వాస్తవానికి ఆ డబ్బును వినియోగించుకునేందుకు హైకోర్టు తమకు అనుమతినిచ్చిందని ఆదినారాయణరావు తెలిపారు. సీఐడీ జప్తు చేసిన మొత్తాలను తిరిగి ఈడీ జప్తు చేయడం రెండో జప్తు కిందకు వస్తుందని, ఒకే ఆస్తికి రెండు జప్తు ఉత్తర్వులు చెల్లవన్నారు. అందువల్ల ఆ ఉత్తర్వులను రద్దు చేయాలని విన్నవించారు. బ్యాంకులో ఉన్న నగదు ఖాతాదారులకు చెల్లించాల్సిన మొత్తమన్నారు. తాము అడ్జ్యుడికేటింగ్ అథారిటీ ముందుకు వెళితే నిర్దిష్ట గడువు లోపు చేయాల్సిన చెల్లింపులు చేయలేమని, దీంతో ఖాతాదారుల నుంచి సివిల్, క్రిమినల్ కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుందని కోర్టుకు నివేదించారు. సీఐడీ, ఈడీ జప్తులు వేర్వేరు డిజైన్‌టెక్ వాదనలను ఈడీ తరఫు న్యాయవాది భాస్కరరావు తోసిపుచ్చారు. ఈ మొత్తం వ్యవహారంపై అడ్జ్యుడికేటింగ్ అథారిటీ విచారణ పూర్తి కాకుండా ఈ వ్యాజ్యం దాఖలు చేశారని, అందువల్ల ఇది అపరిపక్వ వ్యాజ్యమని.. దీన్ని కొట్టేయాలని కోరారు. అడ్జ్యుడికేటింగ్ అథారిటీ ఉత్తర్వులపై డిజైన్ టెక్కు అభ్యంతరం ఉంటే అప్పిలేట్ అథారిటీ వద్దకు వెళ్లాలని, ఆ తరువాతే హైకోర్టుకు రావాల్సి ఉంటుందన్నారు. ఈడీ జప్తు చేసిన మొత్తాలకు, నేరానికి సంబంధం లేదని నిరూపించుకోవాల్సిన బాధ్యత డిజైన్ టెక్పైనే ఉందన్నారు. షోకాజ్ నోటీసుకు ఆ సంస్థ ఇచ్చిన వివరణను పరిశీలించి తదుపరి చర్యలు తీసుకోవాల్సింది అడ్జ్యుడికేటింగ్ అథారిటీయేనన్నారు. సీఆర్పీసీ సెక్షన్ 102 కింద సీఐడీ జారీ చేసిన జప్తు ఉత్తర్వులకు, మనీలాండరింగ్ కింద ఈడీ జారీ చేసిన ఉత్తర్వులకు ఏ మాత్రం సంబంధం లేదని, అవి రెండూ వేర్వేరని నివేదించారు. బ్యాంకు ఖాతాల్లో ఉన్న మొత్తాల విషయంలో కింది కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు సీఐడీ జప్తునకు సంబంధించినవే తప్ప, ఈడీ జప్తుకు సంబంధించినవి కావన్నారు.అందులో ఈడీ పార్టీ కూడా కాదన్నారు. అందువల్ల తమ జప్తు ఉత్తర్వులు రెండో జప్తు కిందకు రావని స్పష్టం చేశారు. ఈ మేరకు ఇరుపక్షాల వాదనలు విని గతేడాది అక్టోబర్ 10న తీర్పును వాయిదా వేసిన న్యాయమూర్తి జస్టిస్ రవి ఇటీవల తన తీర్పును వెలువరించారు. -
ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ కొట్టివేత
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో మనీలాండరింగ్ జరిగిందన్న కేసులో ప్రమేయమున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్‌ను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు కొట్టేసింది. ఈ కేసులో సాక్ష్యాలు నాశనం చేయడంతోపాటు సాక్షులను ప్రభావితం చేయడంలో కవిత ప్రమేయం ప్రాథమికంగా కనిపిస్తోందని... ఆమెను బలిపశువుగా మార్చే యత్నం జరుగుతోందనేందుకు వీల్లేదని వ్యాఖ్యానించింది. కవిత నిస్సందేహంగా పలుకుబడిగల మహిళ అయినందున బెయిల్ ఇస్తే మరోసారి సాక్షులను ప్రభావితం చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తోందిన పేర్కొంది. అందువల్ల ఆమెకు మధ్యంతర బెయిల్ నిరాకరిస్తున్నట్లు స్పష్టం చేసింది. మైనర్ కుమారుడి వార్షిక పరీక్షల నేపథ్యంలో తల్లిగా తన పర్యవేక్షణ అవసరమైనందున మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా సోమవారం ఈ మేరకు తీర్పు వెలువరించారు. బెయిల్ నిరాకరణకు కారణాలను 21 పేజీల తీర్పులో పేర్కొన్నారు. చిన్న కుమారుడికి బంధువుల అండ ఉందిగా ‘‘పిటిషనర్ (కవిత) 16 ఏళ్ల మైనర్ కుమారుడికి ఇప్పటికే 50 శాతం పరీక్షలు పూర్తయ్యాయని న్యాయవాదులు తెలిపారు. కానీ కుమారుడి చదువు, మధ్యంతర బెయిల్ కోరిన రోజుల సంఖ్య, ఇతర కుటుంబ సభ్యుల వివరాలు పొంతన లేకుండా ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ మైనర్ కుమారుడు అన్నయ్య, తండ్రి, అత్తలను కలిగి ఉన్నాడు. వారంతా అతనికి తగిన మద్దతు ఇవ్వలేరనడానికి ఎలాంటి కారణం కనిపించట్లేదు. చిన్న కుమారుడి పరీక్షల వేళ తల్లి నైతిక మద్దతు ఎంతో అవసరమని న్యాయవాదులు చెబుతున్నారు. కానీ 19 ఏళ్ల వయసున్న కవిత పెద్ద కుమారుడు స్పెయిన్‌లో చదువుతున్నాడు. భౌతికంగా తల్లిదండ్రులు దగ్గర లేకున్నా విదేశాల్లో అతను చదువుకోగలుతున్నప్పుడు బంధువుల సమక్షంలో ఉంటున్న చిన్న కుమారుడు పరీక్షలు రాయలేడనడం సమంజసంగా కనిపించట్లేదు. పిల్లల పరీక్షల ఆందోళన పరిష్కరించడానికి తల్లి తప్ప వేరే ప్రత్యామ్నాయం లేదనడం మధ్యంతర బెయిల్ మంజూరుకు తగిన కారణంగా కనిపించట్లేదు. కవిత కేసు పరిష్కారం విషయంలో మైనర్ తండ్రి బిజీగా ఉన్నారన్న కారణం సైతం ఆమోదయోగ్యం లేదు. అందుకే మైనర్ కుమారుడికి అతని అత్తలు తగిన మద్దతు ఇవ్వాల్సిందిగా కోర్టు సూచిస్తోంది. కేసులో ప్రాథమికంగా ప్రమేయం కనిపిస్తోంది ‘‘మాజీ ఎంపీగా, ప్రస్తుత ఎమ్మెల్సీగా, ఉన్నత విద్యావంతురాలిగా కవిత సమాజంలో పలుకుబడి గలవారని నిస్సందేహంగా చెప్పొచ్చు. అంతేకానీ ఈ కేసులో ఓ నిస్సహాయ మహిళను బలిపశువును చేస్తున్నారని ఏ ప్రమాణాల ప్రకారమూ చెప్పేందుకు వీలు కనిపించట్లేదు. నేరాల విషయంలో కవిత చురుకైన ప్రమేయం, సాక్షులను ప్రభావితం చేసే ప్రయత్నంతోపాటు ఉద్దేశపూర్వకంగా సాక్ష్యాలు ధ్వంసం చేస్తారనే విషయంలో కోర్టు ముందుంచిన అంశాలను పరిశీలిస్తే కవిత ప్రమేయం ప్రాథమికంగా కనిపిస్తోంది. అందువల్ల మహిళ కాబట్టి పీఎంఎల్ఏ చట్టం సెక్షన్ 45 (1) ప్రకారం విచక్షణకు ఆమె అర్హురాలు కాదు. ఈ పరిశీలనలతో బెయిల్ దరఖాస్తు తిరస్కరిస్తున్నా’’ అని న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు. నేడు న్యాయమూర్తి ముందుకు కవిత జ్యుడీషియల్ కస్టడీ పూర్తి కానుండటంతో మంగళవారం ఉదయం ఎమ్మెల్సీ కవితను తీహార్ జైలు అధికారులు న్యాయమూర్తి కావేరి బవేజా ముందు హాజరుపరచనున్నారు. అంతకుముందు మధ్యంతర బెయిల్‌ను కోర్టు నిరాకరించడంతో రెగ్యులర్ బెయిల్ కోసం కవిత వేసిన పిటిషన్‌ను త్వరగా విచారించాలని ఆమె తరఫు న్యాయవాదులు జడ్జిని కోరారు. దీంతో గత విచారణ సమయంలో రెగ్యులర్ బెయిల్‌పై ఈ నెల 20న విచారిస్తానన్న న్యాయమూర్తి... తాజాగా ఈ నెల 16న విచారణ చేపడతానని పేర్కొన్నారు. -
సింగపూర్‌లో భారీ కుంభకోణం.. రూ.4492 కోట్ల ఆస్తులు స్వాధీనం
సింగపూర్: సింగపూర్ అడ్డాగా చేసుకుని హవాలాకు పాల్పడుతున్న ఒక విదేశీ ముఠా అసాంఘిక కార్యకలాపాలకు చెక్ పెట్టారు సింగపూర్ పోలీసులు. వారి నుంచి బంగ్లాలు, కార్లు, నగదు, నగలు, బంగారు బిస్కెట్లు అన్నీ కలిపి సుమారు 734.32 మిలియన్ సింగపూర్ డాలర్లు(రూ. 4491 కోట్లు) ఆస్తులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు సింగపూర్ పోలీసులు. సింగపూర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం ఆర్చార్డ్ రోడ్ షాపింగ్ బెల్ట్ నుండి సెంటోసా రిసార్ట్ ఐలాండ్ వరకు జరిపిన సోదాల్లో సుమారు 400 మంది పోలీసు బలగాలు పాల్గొన్నాయని ఈ ముఠా కోసం నగరమంతా జల్లెడ పట్టామని అన్నారు. ప్రధానంగా తొమ్మిది ప్రాంతాల్లో నిర్వహించిన ఈ సోదాల్లో 94 ఆస్తులు, 110 మిలియన్ సింగపూర్ డాలర్లు (రూ. 672 కోట్లు) ఉన్న బ్యాంక్ అకౌంట్లు, 50 లగ్జరీ వాహనాలు, 23 మిలియన్ సింగపూర్ డాలర్లు(140 కోట్ల) నగదు కట్టలు, వందలకొద్దీ హ్యాండ్ బ్యాగులు, నగలు బంగారు బిస్కెట్లు.. మొత్తంగా రూ. 4491 కోట్ల ఆస్తులు నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ దాడుల్లో ఆయా దేశాలకు చెందిన 31 నుండి 44 వయస్సు మధ్యలో ఉన్న పది మంది ముఠాను పట్టుకున్నామని.. వారిని చైనా, కంబోడియా, సిప్రాస్, వణువతు ప్రాంతాలకు చెందినవారుగా గుర్తించామన్నారు. వీరిలో ఒక మహిళ కూడా ఉంది. ఈ ముఠాలో సిప్రాస్ కు చెందిన వ్యక్తి తప్పించుకోబోయి తన బంగ్లా రెండో అంతస్తు నుంచి దూకగా అతడికి స్వల్ప గాయాలయ్యాయని ఆసుపత్రిలో చేర్పించామని చెప్పారు పోలీసులు. ఈ ముఠా ఆన్లైన్లో జూదం, విదేశీ మాఫియా, ఇతర స్కాముల తోపాటు ఇతర క్రిమినల్ కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు పక్కా సమాచారం అందడంతో సోదాలు నిర్వహించామని పోలీసులు తెలిపారు. సింగపూర్ మానిటరీ అథారిటీ ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నట్లు తెలిపింది. ఈ ముఠాకి సహకరించిన ఆర్ధిక సంస్థలను ఉపేక్షించేది లేదని తెలిపింది. ఈ సందర్బంగా పోలీసు శాఖలోని వాణిజ్య వ్యవహారాల డైరెక్టర్ డేవిడ్ చ్యు మాట్లాడుతూ మీరు దొరికితే మిమ్మల్ని అరెస్టు చేస్తాం, అక్రమంగా సంపాదించిన మీ ఆస్తులు దొరికితే వాటిని సీజ్ చేస్తామని అన్నారు. 2021 గణాంకాల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 12% మాత్రమే విదేశీ నగదు వృద్ధి చెందగా కేవలం సింగపూర్ లోనే విదేశీ ధన ప్రవాహం 16% వృద్ధి చెందింది. అందుకే సింగపూర్ పోలీసులు అక్రమార్కులపై కొరడా ఝళిపించారు. ఇది కూడా చదవండి: భార్యను చంపిన జడ్జి.. ఇంట్లో 47 తుపాకులు, మందుగుండు సామాగ్రి.. -
ప్రపంచ ఆర్థిక నేరాలను నిరోధించాలి
గాందీనగర్: ఆర్థిక నేరాలు, మనీలాండరింగ్, క్రిప్టో కరెన్సీలతో సహా వివిధ అసెట్ క్లాస్‌ల గురించి సమాచారాన్ని పంచుకోవడం, ఆయా సవాళ్లను నిరోధించడం కోసం గ్లోబల్ ఆర్కిటెక్చర్‌ను మరింత బలోపేతం చేయాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పిలుపునిచ్చారు. ఇందుకు అనుగుణంగా చట్ట అమలు సామర్థ్యం పెరగాలని ఉద్ఘాటించారు. పన్ను ఎగవేతలు, అవినీతి, అక్రమ ధనార్జన నిరోధంపై ఇక్కడ జరిగిన జీ20 అత్యున్నత స్థాయి సమావేశంలో ఆమె ప్రసంగించారు. జీ20 ప్రెసిడెన్సీ కింద, ఓఈసీడీ సహకారంతో దక్షిణాసియా ప్రాంతంలో పన్ను, ఆర్థిక నేర పరిశోధనలో సామర్థ్యాన్ని పెంపొందించడంలో భారతదేశం ముందుందని సీతారామన్ అన్నారు. కీలక భేటీలు.. ఇండోనేíÙయా ఆర్థిక మంత్రి శ్రీ ముల్యాని ఇంద్రావతి, కెనడా డిప్యూటీ ప్రధాన మంత్రి, ఆర్థిక మంత్రి క్రిస్టియా ఫ్రీలాండ్లతో కూడా ఆమె ఈ సందర్భంగా సమావేశమై, ద్వైపాక్షిక ఆర్థిక, వాణిజ్య అంశాలపై చర్చించారు. 3వ జీ20 ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల సమావేశం సందర్భంగా ఆసియాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ (ఏఐఐబీ)ప్రెసిడెంట్ జిన్ లిక్వెన్ నేతృత్వంలోని ప్రతినిధి బృందంతో సమావేశం నిర్వహించారు. జీ20 ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల భేటీలో పాల్గొనడానికిగాను అమెరికా ఆర్థికమంత్రి జానెత్ యెల్లెన్, ప్రపంచ బ్యాంక్ ప్రెసిడెంట్ అజయ్ బంగా తదితరులు కూడా గాంధీనగర్‌కు విచ్చేశారు. ఈ సందర్భంగా వారు ఇరువురూ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫెసిలిటీని సందర్శించారు. పట్టణ మౌలిక రంగంపై పెట్టుబడులు కాగా, జీ20 ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్‌పై జరిగిన మరో కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, పట్టణ ప్రాంతాల్లో మౌలిక రంగం అభివృద్ధికి ప్రైవేటు పె ట్టుబడులను ఆకర్షించడం అవసరమని పేర్కొన్నా రు. అభివృద్ధి చెందుతున్న పలుదేశాల్లో కఠిన ద్రవ్య విధానాలు అవలంభిస్తున్న నేపథ్యంలో పట్టణాభివృద్ధి కీలక సవాలుగా మారిందని కూడా అన్నారు. -
అర్పిత ఎల్ఐసీ పాలసీల్లో నామినీగా పార్థ ఛటర్జీ!
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ టీచర్ నియామకాల కుంభకోణం దర్యాప్తులో లోతుగా వెళ్లే కొద్దీ మరిన్ని ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈడీ సోదాల్లో బయటపడ్డ డబ్బుతో తనకేం సంబంధం లేదని, తనపై జరిగిన కుట్రకు కాలమే సమాధానం చెప్తుందని టీఎంసీ బహిష్కృత నేత.. బెంగాల్ మాజీ మంత్రి పార్థ ఛటర్జీ చెప్తున్నారు. మరోవైపు ఆయన సన్నిహితురాలు, నటి అర్పితా ముఖర్జీ మాత్రం తాను లేని టైంలో తన ఇంట్లో ఆ డబ్బును పార్థనే ఉంచారని, తన ఇంటిని మినీ బ్యాంకుగా వాడుకున్నారంటూ ఈడీ ముందు వాంగ్మూలం ఇచ్చింది. ఈ తరుణంలో.. ఈ వ్యవహారంలో ఇప్పుడు మరో ఆసక్తికరమైన విషయాన్ని ఈడీ బయటపెట్టింది. అర్పితా ముఖర్జీకి చెందిన దాదాపు 31 లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలలో నామినీగా పార్థ ఛటర్జీ పేరు ఉందని ఈడీ అధికారులు తెలిపారు. అంతేకాదు ఏపీఏ యూటిలిటీ సేవల కింద జనవరి 1, 2012 నుంచి ఇద్దరి మీద భాగస్వామ్యానికి సంబంధించిన దస్తావేజులు వెలుగులోకి వచ్చాయి. అంతేకాదు.. ఈ భాగస్వామ్యం పేరు మీదనే పలు ప్రాపర్టీలు కొనుగోలు చేసినట్లు తమ దర్యాప్తులో తేలిందని ఈడీ అధికారులు వెల్లడించారు. కొనుగోళ్లకు సంబంధించిన లావాదేవీలు నిందితులిద్దరూ నగదు రూపంలోనే చేశారు. అయితే ఆ నగదు ఎక్కడి నుంచి వచ్చిందనేది కనిపెట్టాల్సి ఉంది అని దర్యాప్తు సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇదిలా ఉంటే.. మనీల్యాండరింగ్ కేసులో పార్థ ఛటర్జీ, అర్పితా ముఖర్జీలను సుదీర్ఘంగా ప్రశ్నించిన తర్వాతే అరెస్ట్ చేసింది ఈడీ. అర్పితాకు చెందిన ఇళ్ల నుంచి సుమారు రూ. 50 కోట్ల నగదు, ఐదు కేజీల బంగారం, విలువైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది కూడా. ఆపై ఈడీ ఈ ఇద్దరినీ తమ కస్టడీలోకి తీసుకోగా.. ఆగస్టు 5వ తేదీతో ఆ కస్టడీ ముగియనుంది. ఇదీ చదవండి: సంజయ్ రౌత్ సతీమణికి ఈడీ సమన్లు -
సంజయ్ రౌత్‌ను ఎప్పుడో అరెస్టు చేయాల్సింది: నవనీత్ రాణా
సాక్షి ముంబై: ఈడీ దాడులకి భయపడి మాతో చేరాలనుకునేవారు మా వద్దకి రావద్దని, మాతో చేరవద్దని ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిండే పేర్కొన్నారు. బీజేపీలో కూడా చేరవద్దన్నారు. సంజయ్ రౌత్ నివాసంపై ఈడీ దాడుల అనంతరం.. తనను శివసేన నుంచి దూరం చేసేందుకే కేంద్రం ఈడీతో దాడులు చేయిస్తోందని.. ఎవరెంత బెదిరించినా తాను శివసేనను వీడనని సంజయ్ రౌత్ తన ట్విట్టర్లో పేర్కొనడంపై శిండే స్పందించారు. శనివారం అజిత్ ఖోత్కర్ శిండే వర్గంలో చేరే సమయంలో తన కుటుంబాన్ని దృష్టిలో ఉంచుకుని శిండే వర్గానికి మద్దతు ఇవ్వాల్సి వస్తుందన్నారు. ఈ రెండు అంశాలను దృష్టిలో ఉంచుకుని ఏక్నాథ్ శిండే మాట్లాడారు. ముఖ్యంగా ఈడీకి భయపడి ఎవరు మా వద్దకి రావద్దన్నారు. మీరు తప్పుచేయకుంటే ఈడీకి ఎందుకు భయపడుతున్నారని ఆయన నిలదీశారు. తప్పులేనప్పుడు ఈడీకి సహకరించాలని, ఈడీ తనపని తాను చేసుకుంటుందన్నారు. సంబంధిత వార్త: శివసేన ముఖ్యనేత సంజయ్ రౌత్ అరెస్టు లెక్కలు చూపించాల్సిందే: కిరీట్ సోమయ్య సంజయ్ రౌత్ నివాసంపై ఈడీ దాడుల అనంతరం ‘ఇక లెక్కలు చూపించాల్సిందే’ అంటూ బీజేపీ నేత కిరీట్ సోమయ్య తనదైన శైలిలో రావుత్‌కు చురకలంటించారు. మాఫియా సంజయ్ రౌత్ అంటూ సంభోదిస్తూ, ఆయనకు ఇక లెక్కలు చూపించాల్సి రానుందన్నారు. రూ. 1,200 కోట్ల పత్రాచాల్ కుంభకోణం, వసాయి నాయిగావ్‌లోని బిల్డర్ల కుంభకోణం లేదా మహారాష్ట్రను దోచుకునే పనిచేసిన మహావికాస్ ఆఘాడి ప్రభుత్వం ఇలా మాఫియాగిరి, దాదాగిరి చేస్తూ అందరినీ జైల్లో వేస్తానని బెదిరింపులు చేశారు. కానీ ఇప్పుడు వారికి ఈ విషయాలన్నింటిపై లెక్కలు చూపించాల్సిన సమయం వచ్చిందని కిరీట్ సోమయ్య పేర్కొన్నారు. ఎన్నడో అరెస్టు చేయాల్సింది: నవనీత్ రాణా శివసేన ఎంపీ సంజయ్ రౌత్ నివాసంపై ఈడీ దాడుల అనంతరం ఎంపీ నవనీత్ రాణా తనదైన శైలిలో స్పందించారు. ముఖ్యంగా ఈ చర్య ఎప్పుడో తీసుకోవాల్సింది అని అన్నారు. విలేకరిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన సంజయ్ రౌత్ వద్ద ఇంతపెద్ద మొత్తంలో డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయంటూ సవాల్ విసిరారు. అదేవిధంగా సంజయ్ రౌత్, ఉద్దవ్ ఠాక్రేలు తమ పదవుల దుర్వినియోగం చేశారని ఆరోపించారు. సంజయ్ రౌత్ గతంలోనే అరెస్టు చేసి ఉండాల్సిందన్నారు. చదవండి: గవర్నర్ వివాదాస్పద వ్యాఖ్యలు..స్పందించిన దేవేంద్ర ఫడ్నవీస్ రౌత్‌కు ఇప్పుడు తెలిసొస్తుంది: నితేష్ రాణే అందరి ఉదయం పాడుచేసే సంజయ్ రౌత్‌కు ఇప్పుడు ఆయన ఉదయం పాడవడం తనకు సంతృప్తిగా ఉందని నారాయణ రాణే కుమారుడైన బీజేపీ నాయకుడు నితేష్ రాణే పేర్కొన్నారు. ముఖ్యంగా సంజయ్ రౌత్‌కు నాకు ఎప్పుడు ఏమి జరగదని భావించేవారు. కాని ఈడీ దర్యాప్తు, ఇతరులను ఇబ్బందులు పెట్టడం అంటే ఏమిటో ఇప్పుడు సంజయ్ రౌత్‌కు తెలిసివస్తుందంటూ నితేష్ రాణే మండిపడ్డారు. దేశంలోని ఎవరిపైనైనా దర్యాప్తు చేయవచ్చు: అజిత్ పవార్ సంజయ్ రౌత్ నివాసంపై ఈడీ దాడుల అనంతరం ఎన్సీపీ నాయకుడైన ప్రతిపక్ష నేత అజిత్ పవార్ సౌమ్యంగా స్పందించారు. బీడ్ పర్యటనపై ఉన్న ఆయన ఈ విషయంపై మాట్లాడుతూ, ఈడీకి దేశంలోని ఎవరినైన దర్యాప్తు చేసే అధికారం ఉందన్నారు. గతంలో కూడా అనేక మందికి ఈడీ నోటీసులు పంపించిందని గుర్తు చేశారు. మనీలాండరింగ్ కేసులో ప్రమేయంపై ఆరా.. కాగా, అంతకుముందు శివసేన నేత సంజయ్ రావుత్ నివాసంలో ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు దాడులు నిర్వహించారు. ముంబై భాండూప్‌లోని ఆయన నివాసానికి ఆదివారం ఉదయం ఏడు గంటలకే చేరుకున్న ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. పత్రాచాల్ భూ కుంభకోణానికి సంబంధించి ఈ దాడులు జరిపారు. ఈ మనీలాండరింగ్ కేసులో సంజయ్ రావుత్ ప్రమేయం ఉందన్న ఆరోపణలపై ఇప్పటికే ఈడీ రెండుసార్లు ఆయనకు సమన్లు జారీ చేసింది. కానీ ఆయన ఢిల్లీలో ఉన్నారని తెలిపి వాయిదా వేశారు. అయితే ఆదివారం ఉదయం ఈడీ అధికారులు ఏకంగా ఆయన నివాసానికే వచ్చి సోదాలు చేపట్టారు. ఈ విషయంపై శివసేన కార్యకర్తలు భగ్గుమన్నారు. విషయం తెలుసుకున్న శివసేన కార్యకర్తలు వందలాది మంది భాండూప్‌లోని ఆయన నివాసస్థానం వద్దకి చేరుకున్నారు. సంజయ్ రావుత్‌కు మద్దతుగా అక్కడే ఆయన నివాసముంటున్న భవనం ముందు భైఠాయించి నిరసనలు తెలిపారు. ముఖ్యంగా శివసేన నేతలను భయపెట్టేందుకు ఈడీ ద్వారా దాడులు చేయిస్తున్నారని శివసేన నాయకులు ఆరోపిస్తున్నారు. సంజయ్ రావుత్ ఎలాంటి తప్పుచేయలేదని, అన్ని విధాలుగా ఈడీకి తాను సహకరించనున్నట్టు ప్రకటించినప్పటికీ ఈ విధంగా దాడులు చేపట్టి భయబ్రాంతులకు గురిచేసేలా చేయడం సరికాదని శివసేన కార్యకర్తలు అంటున్నారు. ఇలా శివసేన నాయకులు తీవ్ర ఆక్రోశం వ్యక్తం చేస్తుండగా, మరోవైపు శిందేవర్గం, బీజేపీ నాయకులు ఈడీ సోదాలకు మద్దతు పలుకుతున్నారు. శివసేనను వీడను: సంజయ్ రౌత్ తప్పుడు ఆ«ధారాలు, తప్పుడు సాక్ష్యాలతో నాపై దాడులు చేస్తున్నారని శివసేన నేత సంజయ్ రావుత్ ఆరోపించారు. సంజయ్ రావుత్ నివాసంలో ఈడీ దాడుల అనంతరం ట్విట్టర్ ద్వారా బీజేపీ పేరు ప్రస్తావించకుండానే ఎవరెన్ని చేసినా, ఎన్ని విధాలుగా బెదిరించినా నేను శివసేనను వీడనన్నారు. నేను మరణించినా లొంగిపోనంటూ ట్విట్టర్లో ఆయన స్పష్టం చేశారు. ఈడీ పేరుతో బీజేపీ బెదిరిస్తోంది: అమోల్ మిట్కర్ సంజయ్ రావుత్ నివాసంపై ఈడీ దాడుల అనంతరం ఎన్సీపీ నాయకుడైన అమోల్ మిట్క ర్ బీజేపీపై తీవ్రంగా మండిపడ్డారు. ముఖ్యంగా ఈడీ దర్యాప్తు పేరుతో బెదిరించి బీజేపీ తమ ప్రత్యర్థులను తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోందని ఆయన ఆరోపించారు. దివంగత శివసేన అధినేత బాల్ ఠాక్రే నిష్టావంతుడైన శివసైని కుడు సంజయ్ రావుత్ ఈడీ ముందు తలవంచలేదన్నారు. ఇప్పటివరకు ఈడీ దర్యాప్తుల బెదిరింపులకు అనేక మంది బీజేపీలో చేరారని మిట్కర్ ఆరోపించారు. పలువురు శివసేన ఎమ్మెల్యేలు కూడా విడిపోయారు. అనేక ఎమ్మెల్యేలు శివసేనను వీడిపోయినప్పటికీ సంజయ్ రావుత్ మాత్రం తలవంచకుండా పోరాడుతున్నారన్నారు. ఇది ప్రజలు గమనిస్తున్నారని, అమోల్ తనదైన శైలిలో బీజేపీపై విమర్శలు గుప్పించారు. -
290 కోట్ల భారీ కుంభకోణం.. 9 మంది అరెస్ట్
బెంగళూరు: హవాలా రాకెట్‌కు సంబంధించి రూ. 290 కోట్ల మనీలాండరింగ్ కుంభకోణాన్ని బెంగళూరు సైబర్ పోలీసులు శనివారం నలుగురు విదేశీ పౌరులతో సహా తొమ్మిది మందిని అరెస్ట్ చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. రేజింగ్ పే సాఫ్ట్వేర్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి సమాచారం అందడంతో.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. గేమింగ్, సోషల్, ఇ-కామర్స్ విభాగాలలో ఈ ఆన్లైన్ హవాలా రాకెట్‌ను గుర్తించినట్టు తెలిపారు. కాగా నిందితుల్లో ఇద్దరు చైనా పౌరులు, ఇద్దరు టిబెటన్ జాతీయులు ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. కాగా ప్రధాన నిందితుడు అనాస్ అహ్మద్‌గా గుర్తించినట్టు తెలిపారు. చైనా హవాలా ఆపరేటర్లతో అనాస్‌కు సంబంధాలు ఉన్నట్లు దర్యాప్తులో తేలినట్లు పోలీసులు వెల్లడించారు. అసలు ఏంటి ఈ హవాలా రాకెట్: పవర్ బ్యాంక్ అనే చైనీస్ అప్లికేషన్లో పెట్టుబడి పెడితే అధిక రాబడి వస్తుందంటూ జనాలకు ఆశ కలిగించారు. ప్రజలను ఆకర్షించడానికి సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలను ఎంచుకున్నారు. కాగా కొంతకాలం తర్వాత వారి వ్యాపారాన్ని ఎత్తివేశారు. చదవండి: 4,000 కిలోల మామిడి పండ్లు ద్వంసం.. ఎందుకంటే? -
యస్ బ్యాంక్ రాణా కపూర్ అరెస్ట్!!
ముంబై: సంక్షోభంలో చిక్కుకున్న ప్రైవేట్ రంగ యస్ బ్యాంక్ వ్యవహారం పలు మలుపులు తిరుగుతోంది. మనీ లాండరింగ్ ఆరోపణలపై వ్యవస్థాపకుడు రాణా కపూర్‌ను (62) ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆదివారం అరెస్ట్ చేసింది. మార్చి 11 దాకా ఆయన్ను ఈడీ కస్టడీకి ఇస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. వివరాల్లోకి వెడితే .. యస్ బ్యాంక్‌లో ఆర్థిక అవకతవకలు, దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ (డీహెచ్ఎఫ్ఎల్)కు రుణాలిచ్చినందుకు ప్రతిగా దాదాపు రూ. 600 కోట్ల ముడుపులు అందుకున్నారని కూడా రాణా కపూర్‌పై ఆరోపణలు ఉన్నాయి. వీటికి సంబంధించి ఆయన్ను ఈడీ సుదీర్ఘంగా ప్రశ్నించింది. అయితే, విచారణకు ఆయన సహకరించడం లేదనే కారణంతో ఆదివారం ఉదయం సుమారు 3 గం.ల ప్రాంతంలో కపూర్‌ను అదుపులోకి తీసుకుంది. న్యాయస్థానంలో హాజరుపర్చగా ఈడీ కస్టడీకి అనుమతిస్తూ కోర్టు ఉత్తర్వులిచ్చింది. మరోవైపు, యస్ బ్యాంక్ వ్యవహారాలపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) కూడా లాంఛనంగా దర్యాప్తు ప్రారంభించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. స్కామ్ సంబంధ పత్రాలను అధికారులు సేకరిస్తున్నట్లు వివరించాయి. క్రిమినల్ కుట్ర, మోసం, అవినీతి కోణాల్లో దర్యాప్తుపై సీబీఐ దృష్టి పెట్టినట్లు సమాచారం. మొండి బాకీలు, కార్పొరేట్ గవర్నెన్స్ లోపాలతో కుదేలైన యస్ బ్యాంక్ బోర్డును రద్దు చేసి ఆర్బీఐ తన అధీనంలోకి తీసుకున్న సంగతి తెలిసిందే. అలాగే 30 రోజుల పాటు రూ. 50,000కు మించి విత్‌డ్రాయల్స్ జరపడానికి లేకుండా మారటోరియం కూడా విధించింది. దీనితో ఆ బ్యాంకు జారీ చేసిన ఫారెక్స్ కార్డులు పనిచేయక, వాటిని తీసుకున్న వారు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఖాతాదారుల సొమ్ము భద్రం: ఆర్బీఐ తప్పుడు విశ్లేషణలు చూసి కొన్ని బ్యాంకుల్లో డిపాజిట్ల గురించి ఖాతాదారులు ఆందోళన చెందవద్దంటూ రిజర్వ్ బ్యాంక్ మరోసారి భరోసా కల్పించే ప్రయత్నం చేసింది. అన్ని బ్యాంకులను సునిశితంగా పరిశీలిస్తూనే ఉన్నామని, డిపాజిట్ల భద్రతకు ఢోకా ఉండదని మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్లో ఆర్బీఐ ట్వీట్ చేసింది. మార్కెట్ క్యాప్ ఆధారంగా బ్యాంకుల ఆర్థిక పరిస్థితి ఉండదని తెలిపింది. అటు కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు కృష్ణమూర్తి సుబ్రమణియన్ కూడా డిపాజిటర్లు ఆందోళన చెందవద్దని సూచించారు. బ్యాంకుల్లో సొమ్ము భద్రతను అంచనా వేసేందుకు వాటి మార్కెట్ క్యాప్ సరైన కొలమానం కాదని స్పష్టం చేశారు. మాకు రూ. 662 కోట్లు రావాలి: ఇండియాబుల్స్ హౌసింగ్ యస్ బ్యాంక్ నుంచి తమకు రూ. 662 కోట్లు రావాల్సి ఉందని ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ వెల్లడించింది. బ్యాంక్ బాండ్లలో ఈ మొత్తాన్ని ఇన్వెస్ట్ చేశామని, టర్మ్ లోన్ల రూపంలో బకాయిలేమీ లేవని పేర్కొంది. బ్యాంకు విలువ 10 బిలియన్ డాలర్ల పైగా ఉన్నప్పుడు.. 2017లో అదనపు టియర్ 1 (ఏటీ–1) బాండ్లలో ఇన్వెస్ట్ చేసినట్లు తెలిపింది. డొల్ల కంపెనీలతో ముడుపుల మళ్లింపు... రుణాల మంజూరుకు ప్రతిగా లభించిన ముడుపులను డజను పైగా డొల్ల కంపెనీల ద్వారా రాణా కపూర్ కుటుంబం దారి మళ్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. సుమారు రూ. 2,000 కోట్ల పెట్టుబడులు, అత్యంత ఖరీదైన 44 పెయింటింగ్స్.. వాటి వెనుక ఆర్థిక లావాదేవీలపై ఈడీ కూపీ లాగుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈడీ వర్గాల కథనం ప్రకారం .. డీహెచ్ఎఫ్ఎల్ డిబెంచర్లలో యస్ బ్యాంక్ రూ. 3,700 కోట్లు ఇన్వెస్ట్ చేసింది. ఈ క్రమంలో కపూర్ కుటుంబానికి చెందిన డూఇట్ అర్బన్ వెంచర్స్ అనే సంస్థలోకి డీహెచ్ఎఫ్ఎల్ నుంచి దాదాపు రూ. 600 కోట్లు వచ్చాయి. డీహెచ్ఎఫ్ఎల్కు రుణాలిచ్చినందుకు గాను కపూర్ కుటుంబానికి ఇవి ముడుపుల రూపంలో లభించి ఉంటాయని అనుమానాలు ఉన్నాయి. వీటన్నింటినీ ధృవీకరించుకోవడానికి కపూర్ కుటుంబ సభ్యులను కూడా విచారణ చేయాల్సి ఉందంటూ న్యాయస్థానానికి ఈడీ తెలిపింది. డీహెచ్ఎఫ్ఎల్ డిఫాల్ట్ అయినప్పటికీ.. రుణాలను రాబట్టుకోవడానికి యస్ బ్యాంక్ చర్యలూ తీసుకోకపోవడం అనుమానాలకు ఊతమిస్తోందని పేర్కొంది. అయితే, తాము విచారణకు పూర్తిగా సహకరిస్తున్నామని.. కావాలనే కపూర్‌ను టార్గెట్ చేసుకున్నారని ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. డూఇట్ కంపెనీ తన ఇద్దరు కుమార్తెల పేరు మీద ఉందని కపూర్ తెలిపారు. డీహెచ్ఎఫ్ఎల్కు ట్రిపుల్ ఏ రేటింగ్ ఉన్నప్పుడు యస్ బ్యాంక్ రూ. 3,700 కోట్లు రుణమిచ్చిందని, ఆ తర్వాత దాన్నుంచి డూఇట్ కంపెనీ రూ. 600 కోట్లు రుణం రూపంలో తీసుకుందని వివరించారు. ఇప్పటికీ డూఇట్ సంస్థ రుణాలను చెల్లిస్తూనే ఉందని, డిఫాల్ట్ కాలేదని చెప్పారు. -
ఈడీ దూకుడు
-
ఈడీ ఎదుటకు రాజ్ ఠాక్రే
సాక్షి, ముంబై: మనీలాండరింగ్ కేసులో మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన(ఎమ్మెన్నెస్) చీఫ్ రాజ్ ఠాక్రేను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) గురువారం దాదాపు 9 గంటల పాటు ప్రశ్నించింది. రాత్రి 8.15 గంటల వరకు కూడా విచారణ కొనసాగింది. మరోసారి ఆయన్ను విచారణకు పిలిచేదీ లేనిదీ ఈడీ వెల్లడించలేదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్(ఐఎల్ అండ్ ఎఫ్ఎస్) నుంచి కోహినూర్ సీటీఎన్ఎల్ కంపెనీకి రూ.450 కోట్ల రుణాలు ఇప్పించడంలో రాజ్‌ఠాక్రే అవకతవకలకు పాల్పడినట్లు ఈడీ ఆరోపిస్తోంది. -
రాబర్ట్ వాద్రాకు ఊరట
సాక్షి, న్యూఢిల్లీ : మనీల్యాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రాకు ఊరట లభించింది. వైద్య చికిత్స నిమిత్తం ఆరు వారాల పాటు విదేశీ పర్యటన కోసం ఆయనను రోజ్ ఎవెన్యూ కోర్టు సోమవారం అనుమతించింది. వాద్రా అమెరికా, న్యూజిలాండ్ వెళ్లవచ్చని అయితే లండన్‌కు దూరంగా ఉండాలని కోర్టు స్పష్టం చేసింది. లండన్‌లో విలాసవంతమైన భవనం కొనుగోలులో మనీల్యాండరింగ్‌కు పాల్పడినట్టు వాద్రాపై అభియోగాలున్నాయి. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే పలుమార్లు ఈడీ వాద్రాను ప్రశ్నించిన సంగతి తెలిసిందే. ఇదే కేసులో ఈ ఏడాది ఏప్రిల్ 1న వాద్రాకు కోర్టు ముందస్తు బెయిల్‌ను మంజూరు చేసింది. -
కార్తీ చిదంబరం సీఏ అరెస్ట్..
న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి కేంద్ర మాజీ మంత్రి చిదంబరం కొడుకు కార్తీ చార్టెర్డ్ అకౌంటెంట్(సీఏ)ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) శుక్రవారం అరెస్ట్ చేసింది. దీంతోపాటు చెన్నైలోని కార్తీ సంబంధీకుల ఇళ్లలో సోదాలు జరిపింది. ఢిల్లీలోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్లో ఉన్న కార్తీ సీఏ భాస్కరరామన్‌ను ఈడీ అదుపులోకి తీసుకుని స్పెషల్ జడ్జి ఎదుట హాజరుపరిచింది. అక్రమంగా కూడబెట్టిన ఆస్తుల వివరాలను రాబట్టేందుకు భాస్కరరామన్‌ను విచారించాల్సిన అవసరముందని పేర్కొంది. సీఏను జడ్జి ఐదురోజుల రిమాండ్‌కు పంపారు. -
'చంద్రబాబు జిరాక్స్ సుజనాచౌదరి'
తెలుగుదేశం పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, సీఎం రమేష్‌లు మనీల్యాండరీంగ్ ద్వారా విదేశాల నుంచి వేల కోట్లు రూపాయిలు రాష్ట్రానికి తరలిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు ఆరోపించారు. శనివారం హైదరాబాద్‌లో గట్టు రామచంద్రరావు విలేకర్లతో మాట్లాడుతూ.... సుజనా చౌదరిని వెంటనే అరెస్ట్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు జిరాక్స్ సుజనా చౌదరి అని ఆయన ఆరోపించారు. ఆ విషయం ప్రతి ఒక్కరికీ తెలుసన్నారు. సుజనాచౌదరి మనీ ల్యాండరింగ్ కుంభకోణంపై విచారణ జరపాలని గట్టు రామచంద్రరావు ప్రభుత్వాన్ని కోరారు.