
సాక్షి, ముంబై: మనీలాండరింగ్ కేసులో మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన(ఎమ్మెన్నెస్) చీఫ్ రాజ్ ఠాక్రేను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) గురువారం దాదాపు 9 గంటల పాటు ప్రశ్నించింది. రాత్రి 8.15 గంటల వరకు కూడా విచారణ కొనసాగింది. మరోసారి ఆయన్ను విచారణకు పిలిచేదీ లేనిదీ ఈడీ వెల్లడించలేదు. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్(ఐఎల్ అండ్ ఎఫ్‌ఎస్) నుంచి కోహినూర్ సీటీఎన్‌ఎల్ కంపెనీకి రూ.450 కోట్ల రుణాలు ఇప్పించడంలో రాజ్‌ఠాక్రే అవకతవకలకు పాల్పడినట్లు ఈడీ ఆరోపిస్తోంది.