
సాక్షి, న్యూఢిల్లీ : మనీల్యాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రాకు ఊరట లభించింది. వైద్య చికిత్స నిమిత్తం ఆరు వారాల పాటు విదేశీ పర్యటన కోసం ఆయనను రోజ్ ఎవెన్యూ కోర్టు సోమవారం అనుమతించింది. వాద్రా అమెరికా, న్యూజిలాండ్ వెళ్లవచ్చని అయితే లండన్‌కు దూరంగా ఉండాలని కోర్టు స్పష్టం చేసింది.
లండన్‌లో విలాసవంతమైన భవనం కొనుగోలులో మనీల్యాండరింగ్‌కు పాల్పడినట్టు వాద్రాపై అభియోగాలున్నాయి. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే పలుమార్లు ఈడీ వాద్రాను ప్రశ్నించిన సంగతి తెలిసిందే. ఇదే కేసులో ఈ ఏడాది ఏప్రిల్ 1న వాద్రాకు కోర్టు ముందస్తు బెయిల్‌ను మంజూరు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment