జోద్‌పూర్: భూమి కొనుగోలు వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ భర్త రాబర్ట్ వాద్రాకు రాజస్తాన్ హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దర్యాప్తును నిలిపివేయాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం గురువారం తిరస్కరించింది. అయితే, ఆయనకు కొంత ఊరట కల్పించింది.
ఇదే కేసుకు సంబంధించిన మనీ లాండరింగ్ వ్యవహారంలో రాబర్ట్ వాద్రాను అరెస్టు చేయకుండా గతంలో ఇచ్చిన స్టేను మరో నాలుగు వారాలు పొడిగించింది. స్కై లైట్ హాస్పిటాలిటీ అనే సంస్థ రాజస్తాన్‌లోని బికనేర్‌లో 41 ఎకరాలకు పైగా భూమిని కొనుగోలు చేసింది. ఈ సంస్థతో రాబర్ట్ వాద్రాకు, ఆయన తల్లి మౌరీన్ వాద్రాకు సంబంధాలు ఉన్నట్లు ఈడీ చెబుతోంది. భూకొనుగోలులో మనీ ల్యాండరింగ్ జరిగిందని, ఇందులో రాబర్ట్ వాద్రా పాత్ర ఉన్నట్లు గుర్తించింది.
Comments
Please login to add a commentAdd a comment