Rajasthan High Court
-
మేం వినబోం.. హైకోర్టుకు చెప్పుకోండి
న్యూఢిల్లీ: టీనేజీ అమ్మాయిలపై లైంగిక దాడులు, అత్యాచారం ఆరోపణల్లో దోషిగా తేలి యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న వివాదాస్పద గురువు ఆశారాం బాపు తన శిక్షను రద్దుచేయాలంటూ పెట్టుకున్న పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ విషయంలో తామేమీ వినదల్చుకోలేదని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. ‘‘ఏదైనా ఉపశమనం కావాలంటే రాజస్థాన్ హైకోర్టుకు వెళ్లండి’’ అని స్పష్టం చేసింది. అయితే ఈ మేరకు ఆశారం గతంలో పెట్టుకున్న పిటిషన్లను రాజస్థాన్ హైకోర్టు నాలుగుసార్లు కొట్టేసిందని ఆయన తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ పేర్కొన్నారు. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆశారాం శిక్ష రద్దుచేసి మహారాష్ట్ర ఆస్పత్రిలో వైద్యానికి అవకాశం ఇవ్వాలని కోరారు. తామేమీ చేయలేవని, మళ్లీ హైకోర్టుకే వెళ్లాలని ధర్మాసనం స్పష్టం చేసింది. 2013 ఏడాదిలో తన ఆశ్రమంలో టీనేజీ అమ్మాయిని రేప్ చేశాడనే కేసులో అదే ఏడాది అరెస్టయి 2018లో పోక్సో కోర్టు యావజ్జీవ శిక్ష విధించిన నాటి నుంచి ఆయన జైలులోనే ఉన్నారు. -
రాజస్థాన్ హైకోర్టు కీలక తీర్పు.. పేలుళ్ల కేసు నిందితుల ఉరిశిక్ష రద్దు..
జైపూర్: రాజస్థాన్ హైకోర్టు బుధవారం సంచలన తీర్పు వెలువరించింది. 71 మంది మరణించి, 180 మంది గాయపడిన 2008 జైపూర్ వరుస పేలుళ్ల కేసులో నిందితుల్లో నలుగురికి ఉరిశిక్షను రద్దు చేసి నిర్దోషులుగా విడుదల చేసింది. 2019 డిసెంబర్లోనే వీరికి ట్రయల్ కోర్టు మరణశిక్ష విధించడం గమనార్హం. నలుగురు నిందుతుల పేర్లు.. మహమ్మద్ సల్మాన్, మహమ్మద్ సైఫ్, సర్వార్ ఆజ్మీ, సైఫురెహ్మాన్ అన్సారీ. జస్టిస్ పంకజ్ భండారీ, జస్టిస్ సమీర్ జైన్‌తో కూడిన డివిజన్ బెంచ్ 28 అప్పీళ్లను ఆమోదించి ఈమేరకు తీర్పు వెలువరించింది. ఈ కేసు నిందితుల్లో ఒకరిని నిర్దోషిగా ప్రకటించిన దిగువ కోర్టు తీర్పును సమర్థించింది. వరుస పేలుళ్లతో జైపూర్ షేక్.. 2008 మే 13న జైపూర్ వరుస పేలుళ్లతో ఉలిక్కిపడింది. ఈ ఘటనల్లో మొత్తం 71 మంది చనిపోయారు. 180మందికిపైగా గాయపడ్డారు. ఓ సైకిల్‌పై ఉన్న స్కూల్ బ్యాగ్‌లో లైవ్ బాంబు కూడా లభ్యమైంది. ఈ కేసుకు సంబంధించి మొత్తం 13 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. 8 ఎఫ్ఐర్లు నమోదయ్యాయి. 1,293 మంది సాక్షులను విచారించారు. నిందితుల్లో ముగ్గురు హైదరాబాద్, ఢిల్లీ జైలులో ఉన్నారు. మరో ముగ్గురు ఇప్పటికీ పరారీలో ఉన్నారు. ఇద్దరు బత్లా హౌస్ ఎన్కౌంటర్లో హతమయ్యారు. నలుగురు జైపుర్ జైల్లో ఉన్నారు. చదవండి: 2025 కాదు 2050లో కూడా బీజేపీ గెలవదు.. కేజ్రీవాల్ జోస్యం.. -
రాబర్ట్ వాద్రాకు రాజస్తాన్ హైకోర్టులో ఎదురుదెబ్బ
జోద్పూర్: భూమి కొనుగోలు వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ భర్త రాబర్ట్ వాద్రాకు రాజస్తాన్ హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దర్యాప్తును నిలిపివేయాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం గురువారం తిరస్కరించింది. అయితే, ఆయనకు కొంత ఊరట కల్పించింది. ఇదే కేసుకు సంబంధించిన మనీ లాండరింగ్ వ్యవహారంలో రాబర్ట్ వాద్రాను అరెస్టు చేయకుండా గతంలో ఇచ్చిన స్టేను మరో నాలుగు వారాలు పొడిగించింది. స్కై లైట్ హాస్పిటాలిటీ అనే సంస్థ రాజస్తాన్‌లోని బికనేర్‌లో 41 ఎకరాలకు పైగా భూమిని కొనుగోలు చేసింది. ఈ సంస్థతో రాబర్ట్ వాద్రాకు, ఆయన తల్లి మౌరీన్ వాద్రాకు సంబంధాలు ఉన్నట్లు ఈడీ చెబుతోంది. భూకొనుగోలులో మనీ ల్యాండరింగ్ జరిగిందని, ఇందులో రాబర్ట్ వాద్రా పాత్ర ఉన్నట్లు గుర్తించింది. -
న్యాయమైన ఆశయం
పెద్దవాళ్లు, చుట్టుపక్కల వాళ్లు చేసేది చూసి పిల్లలు అనుకరిస్తుంటారు. కొంతమంది అనుకరణతో ఆగిపోకుండా వాళ్లలాగే తామూ ఎదగాలన్న లక్ష్యాన్ని పెట్టుకుని ఆ దిశగా అడుగులు వేస్తుంటారు. ఈ కోవకు చెందిన అమ్మాయే 23 ఏళ్ల కార్తీక గెహ్లాట్. తండ్రి ఉద్యోగరీత్యా డ్రైవర్. న్యాయమూర్తులను కోర్టుకు తీసుకెళ్లడం ఆయన పని. చిన్నప్పటి నుంచి నాన్న నడిపే కారులో ఎంతో హుందాగా ఉండే న్యాయమూర్తులను దగ్గర నుంచి చూసిన కార్తీక తను కూడా జడ్జీ కావాలనుకుంది. నేను పెద్దయ్యాక నల్లకోటు ఆఫీసర్ అవుతాను అని అనుకరించి చూపిస్తూండేది. అది చూసిన వారంతా చిన్నపిల్ల చేష్టలనుకునేవారు. కానీ నేడు కార్తీక జుడీషియల్ సర్వీసెస్ పరీక్షలో మంచి మార్కులతో 66 ర్యాంకు సాధించి పిల్లచేష్టలు కాదు, మరికొన్నేళ్లలో జడ్జి్జని కాబోతున్నానని చెప్పకనే చెబుతూ అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. జోద్‌పూర్‌కు చెందిన రాజేంద్ర గెహ్లాట్ ముద్దుల కూతురే కార్తీక గెహ్లాట్. 31ఏళ్లుగా ప్రధాన న్యాయమూర్తులెందరికో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు రాజేంద్ర. రాజస్థాన్ హైకోర్టులో పనిచేస్తున్న ఎంతోమంది జడ్జీలను, లాయర్లను చూస్తూ పెరిగిన కార్తీక తాను కూడా పెద్దయ్యాక జడ్జి కావాలనుకునేది. ఆరోతరగతిలో ఉండగా నల్లకోటు వేసుకుని న్యాయస్థానంలో పనిచేయాలని గట్టిగా నిర్ణయించుకుంది. అప్పటి నుంచి ఆదిశగా అడుగులు వేస్తూ... జో«ద్‌పూర్‌లోని సెయింట్ ఆస్టిన్ సీనియర్ సెకండరీ స్కూల్లో పాఠశాల విద్య పూర్తిచేసింది. ఇంటర్మీడియట్ తరువాత జై నారాయణ్ వ్యాస్ యూనివర్సిటీలో ఐదేళ్ల బిబిఏ.ఎల్ఎల్.బి. పూర్తిచేసింది. ఈ ఏడాదే డిగ్రీ పూర్తిచేసినప్పటికీ జడ్జీ అయ్యేందుకు 2019 నుంచి సన్నద్ధమవడం ప్రారంభించింది. ఒక పక్క సెమిస్టర్ పరీక్షల కోసం చదువుతూనే, మరోపక్క పిలిమినరీ, మెయిన్స్‌కు ప్రిపేర్ అయ్యేది. కరోనా సమయంలో ఆఫ్‌లైన్ క్లాసులు అందుబాటులో లేకపోవడంతో, ఆన్లైన్ తరగతులకు హాజరవుతూ సిలబస్ పూర్తిచేసింది. ఇదే సమయంలో అలహాబాద్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి గోవింద్ మాథూర్, జిల్లా సెషన్స్ జడ్జి మండల్ ప్రసాద్ బోహ్రాల వద్ద లా గైడెన్స్, అడ్వకేట్ ధర్మేంద్ర వద్ద ఏడాదిన్నరపాటు టెక్నికల్ గైడెన్స్, మాజీ ఐఏఎస్ అధికారి, తన మాజీ స్కూలు ప్రిన్సిపాల్ వంటివారందరి సలహాలు సూచనలతో రోజుకి నాలుగు గంటలు కష్టపడి చదివేది. పరీక్ష తేది ప్రకటించిన తరువాత ప్రిపరేషన్‌ను పది నుంచి పన్నెండు గంటలకు పెంచింది. సోషల్ మీడియా వినియోగం ఎక్కువగా ఉన్న ఈ రోజుల్లో అన్నింటికీ దూరంగా ఉండి తన లక్ష్యంపై దృష్టిపెట్టి రాజస్థాన్ జుడీషియల్ సర్వీసెస్ పరీక్షలో 66వ ర్యాంకు సాధించింది. దీంతో తన చిన్ననాటి కల జడ్జీ కావడానికి మొదటి అడుగు వేసింది. నేను న్యాయమూర్తులను కోర్టుకు తీసుకెళ్లడాన్ని అప్పుడప్పుడు కార్తీక చూసేది. అలా చూస్తూ పెరిగిన ఆమె 12 ఏళ్ల వయసులో ఒకరోజు నేను కూడా త్వరలో నల్లకోటు వేసుకుని జడ్జిని అవుతానని చెప్పింది. అప్పుడు నేను పెద్దగా పట్టించుకోలేదు. కార్తీక మాత్రం అప్పటి నుంచి జడ్జిఅవ్వాలన్న కలను నిజం చేసుకునేందుకు కష్టపడుతూనే ఉంది. వాళ్ల అమ్మకూడా∙తనని అన్ని విధాల సాయపడుతూ అండగా ఉండడంతో ఈ రోజు తన కలను సాకారం చేసుకుంది. ఏళ్లుగా ఎంతోమంది జడ్జీలను వెనుకసీట్లోకూర్చోపెట్టి తిప్పాను. భవిష్యత్‌లో నా కూతురు కూడా వారిలా వెనుకసీట్లో కూర్చోబోతున్నందుకు సంతోషంగా ఉంది. – కార్తీక తండ్రి రాజేంద్ర గెహ్లాట్ పెళ్లికాదని భయపడుతున్నారు చాలామంది తల్లిదండ్రులు తమ కూతుర్లు లా చదువుతామంటే ఇష్టపడరు. లా చదివిన అమ్మాయిలకు పెళ్లిళ్లు కావు అని భయపడతారు. ఇలాంటి అపోహలు పోవాలంటే ప్రతి ఒక్కరికి చట్టం గురించిన ప్రాథమిక అవగాహన ఉండాలి. అప్పుడు తమ హక్కుల గురించి ధైర్యంగా పోరాడగలుగుతారు. నలుగురు సంతానంలో నేను ఒకదాన్ని. ప్రారంభంలో నా నిర్ణయాన్ని ఎవరూ సీరియస్‌గా తీసుకోలేదు. తర్వాత కష్టపడి చదవడం చూసి ప్రోత్సహించారు. వారి సహకారంతో ఈ రోజు ఇంతమంచి ర్యాంకును సాధించగలిగాను. నన్ను ప్రేరణగా తీసుకుని నా తోబుట్టువులు సైతం లా చదివేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. నా ప్రిపరేషన్లో ఆన్లైన్ యాప్స్‌తో పాటు, ఏకాగ్రతతో చదవడానికి సంగీతం చాలా బాగా ఉపయోగపడ్డాయి. – కార్తీక -
జడ్జి గారూ.. నాకు పిల్లలు కావాలి!
దేశ న్యాయవ్యవస్థలో ఇదొక విచిత్రమైన ఆదేశం!. సంతానం పొందే హక్కు కింద.. జీవిత ఖైదు అనుభవిస్తున్న ఓ వ్యక్తి భార్య కోర్టుకు ఎక్కింది. దీంతో భార్యతో కాపురం చేసుకునేందుకు వీలుగా.. సదరు భర్తకు 15 రోజుల పెరోల్ మంజూరు చేసింది కోర్టు. నంద్లాల్(34) అనే వ్యక్తి ఓ కేసులో అజ్మీర్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. అయితే తమకు పిల్లలు కావాలని, అందుకు తన భర్తను జైలు నుంచి విడుదల చేయాలని ఆమె రాజస్థాన్ హైకోర్టు జోధ్‌పూర్ బెంచ్ ముందు పిటిషన్ దాఖలు చేసింది. వాదనలు విన్న జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఫర్జాంద్ అలీతో కూడిన బెంచ్.. ఆమె భావోద్వేగాలని అర్థం చేసుకుంది. రుగ్వేదంతో పాటు అన్ని మతాల్లోనూ ఆడవాళ్లకు పిల్లలను కనే హక్కు ఉంటుందని కోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. సంప్రదాయాల్ని అమితంగా గౌరవించే మన దేశంలో గృహిణిలకు ఉన్న ప్రథమ హక్కు పిల్లల్ని కనడం అని, కాబట్టి అతనికి పదిహేను రోజుల పెరోల్ జారీ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇదిలా ఉండగా.. నందలాల్‌కు గతంలోనూ కోర్టు పెరోల్ మంజూరు చేయించింది. 2021 మొదట్లో 20 రోజుల పెరోల్ ఇవ్వగా.. ఆ టైంలో అతని ప్రవర్తన సక్రమంగా ఉండడంతో ఈసారి మళ్లీ ఇస్తున్నట్లు తెలిపింది. నేరం చేసింది ఆమె భర్త అని, అలాంటప్పుడు ఆమె ఎందుకు శిక్ష అనుభవించాలని ఈ సందర్భంగా కోర్టు అభిప్రాయపడింది. అంతేకాదు ఆమె సంతానం పొందే హక్కును ప్రాథమిక హక్కులతో పోలుస్తూ.. సదరు భర్తను విడుదల చేస్తున్నట్లు వెల్లడించింది. -
సహజీవనం కేసు: రాజస్థాన్ హైకోర్టు సంచలన తీర్పు!
పెళ్లైన మహిళ, మరో వ్యక్తితో కలిసి సహజీవనం చేయడం అక్రమమే అవుతుందని రాజస్థాన్ హైకోర్టు తాజాగా తేల్చి చెప్పింది. జస్టిస్ సతీష్ కుమార్ శర్మతో కూడిన ఏకధర్మాసనం తీర్పును వెలువరించింది. అలాగే పోలీసుల భద్రత కోరుతూ ఈ జంట దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరించింది. వారికి రక్షణ పొందే అర్హత లేదని న్యాయమూర్తి పేర్కొన్నారు. మహిళకు ఇంతకముందే పెళ్లై, ఇప్పటి వరకు విడాకులు తీసుకోని నేపథ్యంలో మరో వ్యక్తితో సహజీవనం చేయడం వివాహేతర సంబంధం కిందకు వస్తుందని పేర్కొన్నారు. అలాగే పోలీసుల రక్షణ కోరుతూ వేసిన పిటిషన్‌ను తిరస్కరించారు. డేటింగ్ చేస్తున్న వారికి పోలీసుల భద్రత కల్పించడం అంటే ఇలాంటి సంబంధాలకు పరోక్షంగా అనుమతి ఇవ్వడమే అవుతుందని వ్యాఖ్యానించారు. అయితే ఈ జంటపై ఎవరైనా దాడికి పాల్పడితే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని పిటిషనర్లను ఆదేశించారు. ఈ కేసు పూర్వాపరాలను పరిశీలిస్తే.. రాజస్థాన్‌లోని జున్జును జిల్లాకు చెందిన 30 ఏళ్ల మహిళ, 27 ఏళ్ల యువకుడు సహజీనం చేస్తున్నారు. అయితే మహిళకు ఇంతకుముందే చట్టబద్ధంగా మరో వ్యక్తితో వివాహం అయ్యింది. భర్త శారీరక వేధింపులకు పాల్పడుతున్న కారణంగా ఆమె తన నుంచి విడిగా ఉంటూ ఈ యువకుడితో జీవిస్తోంది. ఈ క్రమంలో భర్త, అత్తమామలు మహిళపై నిరంతరం బెదిరింపులకు పాల్పడుతున్నారు. దీంతో తమ జీవితాలకు ప్రమాదం ఉందని రక్షణ కల్పించాలని బాధిత జంట కోర్టును ఆశ్రయించింది. విచారణ సమయంలో.. మహిళ భర్త, అతని కుటుంబ సభ్యులు సైతం ఈ జంట మధ్య సంబంధాన్ని చట్ట విరుద్ధమని ఆరోపించారు. కాగా గత జూన్‌లో జస్టిస్ నవీన్ సిన్హా,జస్టిస్ అజయ్ రస్తోగిలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం సహజీవనం చేస్తున్న జంటకు రక్షణ కల్పించాలని పంజాబ్ పోలీసులను ఆదేశించింది. అంతకముందు వీరి పిటిషన్‌ను పంజాబ్-హర్యానా హైకోర్టు తిరస్కరించింది. -
అసెంబ్లీ సమావేశాలు జరిగేవరకు రిసార్ట్‌లోనే
జైపూర్: రాజస్థాన్‌లో పొలిటికల్ హైడ్రామా క్లైమాక్స్‌కు చేరుకుంటోంది. అనేక నాటకీయ పరిణామాల తర్వాత అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు గవర్నర్ కల్రాజ్ మిశ్రా అంగీకరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జైపూర్‌లోని పైర్‌మౌంట్ రిసార్ట్‌లో గురువారం మధ్యాహ్నం కాంగ్రెస్ శాసన సభాపక్షం సమావేశమయ్యింది. ఈ భేటీలో ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు పలు సూచనలు చేశారు. అసెంబ్లీ సమావేశాలు జరిగే వరకు ఎమ్మెల్యేలందరూ ఎట్టి పరిస్థితుల్లోనూ రిసార్ట్‌లో ఉండాలన్నారు. (ముచ్చటగా మూడోసారి) అయితే మంత్రులు వారి పనులు నిర్వర్తించుకునేందుకు సచివాలయానికి వెళ్లొచ్చని తెలిపారు. కాగా ఆగస్టు 14 నుంచి అసెంబ్లీ సమావేశాలను ప్రారంభించేందుకు గవర్నర్ అనుమతించారు. ఇదిలా వుండగా 2018లో జరిగిన ఎన్నికల్లో బీఎస్పీ తరఫున ఎమ్మెల్యేలుగా గెలిచిన ఆరుగురు.. ఆ తరువాత 2019 సెప్టెంబర్‌లో కాంగ్రెస్‌లో చేరారు. ఈ విలీనాన్ని సవాలు చేస్తూ బహుజన్ సమాజ్ పార్టీ బుధవారం రాజస్తాన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై నేడు విచారణ చేపట్టిన న్యాయస్థానం స్పీకర్ సహా ఆరుగురు బీఎస్పీ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది. ఆగస్టు 11 లోపు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. (రాజస్తాన్ డ్రామాకు తెర) -
హైకోర్టు ఉత్తర్వులు ఇవ్వొచ్చు
న్యూఢిల్లీ: రాజస్తాన్‌లో 19 మంది కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేలకు కొంత ఊరట లభించింది. వారిపై అనర్హత వేటు వేసే ప్రక్రియను ప్రారంభిస్తూ అసెంబ్లీ స్పీకర్ జారీ చేసిన నోటీసును వ్యతిరేకిస్తూ వారంతా హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీంతో అనర్హత చర్యల విషయంలో జూలై 24 వరకు స్పీకర్‌ను నిరోధిస్తూ రాజస్తాన్ హైకోర్టు ఉత్తర్వు జారీ చేసింది. దీన్ని సవాలు చేస్తూ స్పీకర్ సి.పి.జోషి సుప్రీంకోర్టులో బుధవారం స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ బి.ఆర్.గవై, జస్టిస్ కృష్ణ మురారీతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. 19 మంది ఎమ్మెల్యేల వినతిపై తదుపరి ఉత్తర్వు ఇవ్వడానికి రాజస్తాన్ హైకోర్టుకు అనుమతి మంజూరు చేసింది. అయితే, ఈ ఉత్తర్వు స్పీకర్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఇచ్చే ఆదేశాలకు లోబడి ఉండాలని స్పష్టం చేసింది. ఉత్తర్వు ఇవ్వకుండా హైకోర్టును తాము అడ్డుకోలేమని వెల్లడించింది. అంతేకాకుండా అనర్హత వేటు విషయంలో తనను నిరోధిస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుపై మధ్యంతర స్టే ఇవ్వాలన్న స్పీకర్ వినతిని ధర్మాసనం తోసిపుచ్చింది. అసమ్మతి గొంతు నొక్కేయలేం రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం చట్ట సభల సభ్యులపై అనర్హత వేటు వేసే విషయంలో స్పీకర్ అధికారాల్లో కోర్టులు జోక్యం చేసుకోవడం తగదని స్పీకర్ సి.పి.జోషి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు ధర్మాసనం స్పందిస్తూ.. స్పీకర్ ముఖ్యమైన ప్రశ్నలను లెవనెత్తారని, దీనిపై మరింత విచారణ జరగాల్సి ఉందని తేల్చిచెప్పింది. స్పీకర్ తరపు న్యాయవాది కపిల్ సిబల్ మాట్లాడుతూ.. తిరుగుబాటు ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించేందుకు అన్ని అవకాశాలు ఉన్నాయని, వారు సొంత ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నించారని చెప్పారు. దీనిపై ధర్మాసనం బదులిస్తూ.. తిరుగుబాటు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడానికి అనుమతి ఇవ్వొచ్చా లేదా అనేది తేల్చేందుకు ప్రయత్నిస్తున్నామని వివరించింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో అసమ్మతి స్వరాన్ని నొక్కేయలేమని వ్యాఖ్యానించింది. స్పీకర్ పిటిషన్‌పై విచారణను జూలై 27వ తేదీకి వాయిదా వేసింది. 19 మంది ఎమ్మెల్యేల పిటిషన్‌పై రాజస్తాన్ హైకోర్టు శుక్రవారం ఉత్తర్వు జారీ చేయనుంది. షెకావత్‌పై విచారణ జరపండి సంజీవని క్రెడిట్ కో–ఆపరేటివ్ సొసైటీ కుంభకోణంలో కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ హస్తం ఉందని ఆరోపిస్తూ దాఖలైన ఫిర్యాదుపై విచారణ జరపాలని జైపూర్ అదనపు జిల్లా జడ్జి కోర్టు రాజస్తాన్ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ సొసైటీలో వేలాది మంది సొమ్ము మదుపు చేశారు. సొసైటీ నిర్వాహకులు ఇందులో రూ.900 కోట్లను మింగేసినట్లు ఆరోపణలున్నాయి. ఈ కుంభకోణంపై స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్(ఎస్ఓజీ) దర్యాప్తు చేస్తోంది. 2019 ఆగస్టు 23న ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. అయితే, ఇందులో షెకావత్ పేరును చేర్చలేదు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ గులామ్సింగ్, లాబూ సింగ్ అదనపు జిల్లా జడ్జి కోర్టును ఆశ్రయించారు. సహకార సొసైటీ కుంభకోణంలో పాత్రదారులైన కేంద్ర మంత్రిని, మరికొందరిని ఎస్ఓజీ ఉద్దేశపూర్వకంగానే రక్షిస్తోందని ఫిర్యాదుదారులుఆరోపిస్తున్నారు. టేపులను విదేశాలకు పంపిస్తాం: గహ్లోత్ తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ కుట్ర పన్నారని సీఎం గహ్లోత్ మరోసారి ఆరోపించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేస్తూ ఆయన మాట్లాడినట్టుగా వెలుగులోకి వచ్చిన ఆడియో టేపులు ముమ్మాటికీ నిజమైనవేనని ఉద్ఘాటించారు. ఫోరెన్సిక్ టెస్టు కోసం వాటిని విదేశాల్లోని సైన్స్ ల్యాబ్‌కు పంపిస్తామని చెప్పారు. షెకావత్ ఏ తప్పూ చేయకపోతే స్వర నమూనా ఇచ్చేందుకు ఎందుకు అంగీకరించడం లేదని నిలదీశారు. తమ ప్రభుత్వానికి అసెంబ్లీలో పూర్తి మెజారిటీ ఉందన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా ఐక్యంగా ఉన్నారని, త్వరలోనే అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు. సచిన్ పైలట్ వర్గం కోర్టును ఆశ్రయించడంపై ఆయన స్పందిస్తూ.. వారంతా కోర్టుకు వెళ్లి తప్పు చేశారని పేర్కొన్నారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంతో న్యాయస్థానానికి సంబంధం లేదని గుర్తుచేశారు. -
సచిన్ పైలట్ వర్గానికి 24 వరకు ఊరట
జైపూర్: అనర్హత నోటీసులకు సంబంధించి రాజస్తాన్ కాంగ్రెస్ తిరుగుబాటు నేత సచిన్ పైలట్, ఆయన వర్గం 18 మంది ఎమ్మెల్యేలకు మంగళవారం హైకోర్టులో కొంత ఊరట లభించింది. ఆ నోటీసులను సవాలు చేస్తూ పైలట్ వర్గం దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై శుక్రవారం తీర్పునిస్తామని, అప్పటివరకు వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని అసెంబ్లీ స్పీకర్ సీపీ జోషికి హైకోర్టు సూచించింది. స్పీకర్ జారీ చేసిన అనర్హత నోటీసులపై మంగళవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఇంద్రజిత్ మహంతి, జస్టిస్ ప్రకాశ్ గుప్తా ధర్మాసనం ముందు వాదనలు ముగిశాయి. శుక్రవారంలోగా తమ వాదనలను లిఖిత పూర్వకంగా సమర్పించాలని ధర్మాసనం ఇరు వర్గాలను ఆదేశించింది. అయితే, ఈ కేసుకు సంబంధించి శుక్రవారం కోర్టు తుది తీర్పును ప్రకటిస్తుందా? లేక మధ్యంతర ఉత్తర్వులను ఇస్తుందా? అనే విషయంలో స్పష్టత లేదు. మరోవైపు, తిరుగుబాటు నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్‌పై మాటల దాడిని ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ కొనసాగించారు. పార్టీని మోసం చేసిన వారు ప్రజలకు ముఖం చూపించలేరని వ్యాఖ్యానించారు. ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర జరుగుతోందని తెలిసినా.. తన విశ్వాసం సడలలేదని, ఐదేళ్ల పదవీకాలం పూర్తి చేసుకుంటానన్న నమ్మకం తనకుందని పేర్కొన్నారు. ‘కరోనా వైరస్‌తో అంతా పోరాడుతున్న సమయంలో.. పీసీసీ చీఫ్ కొందరు ఎమ్మెల్యేలతో కలిసి ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర పన్నారు. దీన్ని సహించబోం’ అని పైలట్ పేరెత్తకుండా మంగళవారం జరిగిన కాంగ్రెస్ శాసనసభాపక్ష భేటీలో ఆరోపణలు గుప్పించారు. వారం రోజుల వ్యవధిలో సీఎల్పీ భేటీ జరగడం ఇది మూడోసారి. జైపూర్ శివార్లలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు విడిది చేసిన హోటల్లోనే ఈ సీఎల్పీ సమావేశాన్ని నిర్వహించారు. పార్టీ సీనియర్ నేతలు కేసీ వేణుగోపాల్, అజయ్ మాకెన్, రణ్‌దీప్ సూర్జేవాలా, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ అవినాశ్ పాండే తదితరులు కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. సీఎల్పీ భేటీ అనంతరం సీఎం గహ్లోత్ నివాసంలో కేబినెట్ సమావేశం నిర్వహించారు. కరోనాపై పోరు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, సంక్షేమ పథకాలు.. తదితరాలపై కేబినెట్ భేటీలో చర్చించారని అధికారులు తెలిపారు. -
రాజస్తాన్: సచిన్ పైలట్‌కు హైకోర్టులో ఊరట
జైపూర్/ఢిల్లీ: రాజస్తాన్‌లో రాజకీయ సంక్షోభానికి కారణమైన అసమ్మతి నేత సచిన్ పైలట్‌కు రాష్ట్ర హైకోర్టులో ఊరట లభించింది. ఈ నెల 24 వరకు రెబల్ ఎమ్మెల్యేల అనర్హతపై ఎలాంటి చర్యలు తీసుకోరాదని హైకోర్టు రాజస్తాన్ స్పీకర్‌ను ఆదేశించింది. అనర్హత ఎమ్మెల్యేల పిటిషన్‌పై హైకోర్టులో మంగళవారం వాదనలు ముగిసిన అనంతరం ఈ మేరకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ పిటిషన్‌పై వచ్చే శుక్రవారం (జులై 24) హైకోర్టు తీర్పు వెలువరించనుంది. ఇక రాజస్తాన్ మంత్రివర్గం కాసేపట్లో భేటీ కానున్నట్టు తెలుస్తోంది. కాగా, అశోక్ గహ్లోత్ ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత సచిన్ పైలట్, అతని వర్గం ఎమ్మెల్యేలు 18 మంది తిరుగుబాటు బావుటా ఎగరేసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ శాసన సభా పక్షం రెండు భేటీలకూ వారు హాజరు కాలేదు. దాంతో సచిన్ సహా 19 మంది అసమ్మతి ఎమ్మెల్యేలపై అనర్హతన వేటు వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విప్ ధిక్కరణపై స్పీకర్ సీపీ జోషి వారికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అయితే, నిబంధనలు అనుసరించకుండా తమకు నోటీసులు ఇచ్చారని పేర్కొంటూ అసమ్మతి ఎమ్మెల్యేలు కోర్టు మెట్లెక్కారు. (చదవండి: అసమర్థుడు.. పనికిరాని వాడు!) (ఛత్తీస్‌గఢ్ సీఎంపై మండిపడ్డ ఒమర్ అబ్దుల్లా) -
పెహ్లూ ఖాన్: రాజస్థాన్ హైకోర్టు కీలక ఉత్తర్వులు
జైపూర్: గోరక్షకుల కిరాకత మూకదాడిలో మృతి చెందిన పెహ్లూ ఖాన్, అతని ఇద్దరు కుమారులపై నమోదైన ఆవుల స్మగ్లింగ్ కేసును రాజస్థాన్ హైకోర్టు బుధవారం కొట్టివేసింది. మూకదాడిలో చనిపోయిన పెహ్లూ ఖాన్, అతని కొడుకులపై గత మే నెలలో రాజస్థాన్ పోలీసులు చార్జ్‌షీట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. జంతువధ, జంతు తరలింపు నిషేధ చట్టంలోని సెక్షన్ 5,8, 9ల కింద ఆవులను స్మగ్లింగ్ చేస్తున్నారంటూ అభియోగాలు మోపారు. దీనిపై హైకోర్టును ఆశ్రయించిన పెహ్లూ ఖాన్ కొడుకులకు తాజాగా ఊరట లభించింది. 2017 ఏప్రిల్ 1వ తేదీన అల్వార్‌లో పెహ్లూ ఖాన్, అతని కొడుకులు ఓ వాహనంలో ఆవులను తరలిస్తుండగా.. అతను ఆవులను స్మగ్లింగ్ చేస్తున్నాడనే అనుమానంతో గోరక్షకులు కిరాతక చర్యకు దిగారు. వారి వాహనాన్ని అడ్డుకొని.. వారిపై దాడి చేశారు. వృద్ధుడు అన్న కనికరం చూపకుండా గోరక్షకులు అతన్ని చితకబాదడంతో.. రెండురోజుల తర్వాత పెహ్లూ ఖాన్ ప్రాణాలు విడిచారు. ఈ నేపథ్యంలో బాధితుడు, మృతుడైన పెహ్లూ ఖాన్‌కు వ్యతిరేకంగానే చార్జిషీట్ పోలీసులు దాఖలు చేయడంతో అప్పట్లో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే, గత బీజేపీ ప్రభుత్వం హయాంలో ఈ కేసు విచారణ జరిగిందని, ఆ విచారణ అనుగుణంగానే ఇప్పుడు చార్జిషీట్ వేశారని, . కేసు విచారణలో ఏమైనా వివక్షలు, అవకతవకలు ఉంటే.. కేసును మళ్లీ పునర్విచారణ జరిపిస్తామని అప్పట్లో సీఎం అశోక్ గెహ్లాట్ హామీ ఇచ్చారు. మూకదాడిలో తండ్రిని కోల్పోయానని, అయినా తమపైనే కేసులు పెట్టి వేధిస్తున్నారని అప్పట్లో పెహ్లూ ఖాన్ కొడుకు ఇర్షాద్ (25) ఆవేదన వ్యక్తంచేశాడు. -
న్యాయం.. 23 ఏళ్లు వాయిదా!
శ్రీనగర్: వారి జీవితంలోని విలువైన కాలమంతా జైలు నాలుగు గోడలమధ్యే గడిచిపోయింది. దాదాపు 23 ఏళ్ల పాటు జైళ్లో నిర్బంధించి, ఇప్పుడు తీరిగ్గా నిర్దోషులేనంటూ వారిని విడుదల చేశారు. కశ్మీర్‌కు చెందిన మొహమ్మద్ అలీ భట్, లతీఫ్ అహ్మద్ వాజా, మీర్జా నాసర్ హుస్సేన్‌ల విషాదమిది. లజపతినగర్ మార్కెట్ పేలుళ్లలో హస్తం ఉందంటూ వీరిని మొదట 1996లో ఢిల్లీ పోలీసులు నేపాల్‌లో అరెస్ట్ చేశారు. అనంతరం ఓ బస్సును పేల్చారనే ఆరోపణలపై రాజస్తాన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లజపత్ నగర్ కేసుకు సంబంధించి వీరిని 2012లో ఢిల్లీ హైకోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. రాజస్తాన్ బస్సు కేసు నుంచి బయటపడకపోవడంతో ఆ తరువాతా వారు జైల్లోనే మగ్గాల్సి వచ్చింది. తాజాగా రాజస్తాన్ హైకోర్టు సైతం వారిని నిర్దోషులంటూ తీర్పు ఇవ్వడంతో.. ఎట్టకేలకు 23 ఏళ్ల విలువైన జీవితాన్ని కోల్పోయిన అనంతరం స్వేచ్ఛాప్రపంచంలోకి రాగలిగారు. కశ్మీరీ ఉపకరణాలను అమ్మి జీవనం గడిపేందుకు నేపాల్ వెళ్లిన వారిని 1996లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ’నేపాల్‌లో ఉన్న సామాన్యులమైన మేం ఢిల్లీలో, రాజస్తాన్‌లో బాంబు పేలుళ్లకెలా బాధ్యులమవుతాం? మమ్మల్ని చిత్రహింసలు పెట్టారు. తెల్లకాగితాలపై సంతకాలు పెట్టించుకుని మమ్మల్ని బలిపశువులను చేశారు’ అని శ్రీనగర్‌కు చెందిన వాజా ఆవేదన వ్యక్తం చేశారు. భట్ జైళ్లో ఉన్న సమయంలోనే తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయాడు. ఇంటికి వెళ్లగానే మొదట భట్ స్మశానవాటికకు వెళ్లి తన తల్లిదండ్రుల సమాధుల వద్ద చిన్నపిల్లాడిలా ఏడ్చాడు. ‘నా సగం జీవితాన్ని కోల్పోయాను. నాకు జరిగిన అన్యాయానికి ఎవరు బాధ్యులు?’ అనే భట్ ప్రశ్నకు ఎవరి వద్దా సమాధానం లేదు. మాలాంటి అమాయకులు ఇంకా జైళ్లలో చాలామంది ఉన్నారని ఈ ముగ్గురు చెబుతున్నారు. -
ముగ్గురు సంతానమైతే.. ప్రమోషన్..?
జైపూర్ : రెండో వివాహం ద్వారా మూడో బిడ్డను పొందినవారు కూడా పదోన్నతులకు అర్హులేనని రాజస్థాన్ హైకోర్టు తీర్పునిచ్చింది. పదోన్నతుల్లో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాన్ని వ్యతిరేకిస్తూ జైరాం మీనా అనే వ్యక్తితో పాటు మరో నలుగురు ప్రభుత్వ ఉద్యోగులు రాజస్థాన్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను విచారించిన జస్టిస్ ఎమ్ఎన్ భండారి, జస్టిస్ డీసీ సోమనాయ్ డివిజన్ బెంచ్ వీరికి అనుకూలంగా తీర్పు వెలువరించింది. జనాభా నియంత్రణలో భాగంగా రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం 2002, జూన్‌లో ఒక నిబంధనను అమల్లోకి తెచ్చింది. దాని ప్రకారం ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు పదోన్నతులకు అనర్హులని తెలిపింది. అయితే 2015 నవంబర్ 30న ఈ నిబంధనను సడలించింది. మొదటి భార్య/ భర్త ద్వారా ఇద్దరు సంతానాన్ని పొంది, రెండవ వివాహం ద్వారా మరో సంతానాన్ని పొందిన వారు ఈ నిబంధన పరిధిలోకి రారని ప్రకటించింది. అయితే సడలించిన ఈ నిబంధనను తమకు వర్తింపచేసి పదోన్నతి ఇవ్వాల్సిందిగా జైరాం తన పిటిషన్లో పేర్కొన్నారు. కోర్టు ఈ పిటిషన్‌ను విచారించి వీరు కూడా పదోన్నతులకు అర్హులేనని తీర్పునిచ్చింది -
సల్మాన్ ఖాన్‌కు మరో షాక్
జోధ్‌పూర్ : బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌కు మరో షాక్ తగిలింది. ఆయన బెయిల్ పిటిషన్‌పై సంగ్దిగ్ధం నెలకొంది. శనివారం పిటిషన్ విచారణకు రావాల్సి ఉండగా.. రాజస్థాన్ హైకోర్టు అనూహ్య నిర్ణయం తీసుకుంది. జోధ్‌పూర్ జిల్లా మరియు సెషన్స్ జడ్జిని బదిలీ చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. సల్మాన్ బెయిల్ పిటిషన్‌పై వాదనలు వింటున్న సెషన్స్ జడ్జి రవీంద్ర కుమార్ జోషితోపాటు రాష్ట్రవ్యాప్తంగా 87 మంది జడ్జిలను ట్రాన్స్ఫర్ చేస్తూ హైకోర్టు శుక్రవారం సాయంత్రం ఆదేశాలు జారీ చేసింది. దీంతో సల్మాన్ బెయిల్ పిటిషన్ వాయిదా పడినట్లేనని.. ఆయన మరిన్ని రోజులు జైల్లోనే గడపాల్సి ఉంటుందని న్యాయ నిపుణలు చెబుతున్నారు. నిజానికి సల్మాన్‌కు శిక్ష ప్రకటించిన రోజే (గురువారం) బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే కేసుపై మరోసారి పూర్తి అధ్యయనం చేసిన తర్వాతే ఆయనకు బెయిల్ ఇవ్వాలా? వద్దా? అన్నది నిర్ధారిస్థానని జడ్జి జోషి తెలిపారు. ఈ నేపథ్యంలో శనివారం సల్మాన్‌కు బెయిల్ వస్తుందని అంతా భావించారు. (సల్మాన్‌కు శిక్ష హ్యాపీగా ఉంది : నటి) ప్రస్తుతం జోషి స్థానంలో చంద్ర కుమార్ సొంగారాను జడ్జిగా బదిలీ చేశారు. చంద్ర కుమార్ తీసుకునే నిర్ణయంపైనే సల్మాన్ బెయిల్ ఆధారపడి ఉంటుంది. ఈ విషయమై న్యాయమూర్తిని కలిసి విజ్ఞప్తి చేస్తామని సల్మాన్ తరపు న్యాయవాది చెబుతున్నారు. 1998లో హమ్ సాథ్ సాథ్ హై చిత్ర షూటింగ్ సందర్భంగా రెండు కృష్ణ జింకలను వేటాడిన కేసులో సల్మాన్‌పై మొత్తం మూడు కేసులు నమోదు అయ్యాయి. సుమారు 20 ఏళ్ల విచారణ తర్వాత జోధ్‌పూర్ సెషన్స్ కోర్టు సల్మాన్‌కు ఐదేళ్ల శిక్ష ఖరారు చేసిన సంగతి తెలిసిందే. (సల్మాన్ కేసు.. మతం రంగు) -
దీపిక నడుముతో పెద్ద తలనొప్పి!
పద్మావత్ చిత్ర విడుదలకు క్లియరెన్స్ లభించినా మేకర్లకు మాత్రం చిక్కులు తప్పటం లేదు. ఓవైపు కర్ణి సేన హెచ్చరికల నేపథ్యంలో ఆందోళన చెందుతున్న దర్శకనిర్మాత సంజయ్ లీలా భన్సాలీ.. మరోవైపు సెన్సార్ బోర్డు సూచనల మేరకు చిత్రానికి మరమ్మత్తులు పనిలో బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో ఆయనకు ఓ కొత్త సమస్య ఎదురైందని తెలుస్తోంది. ఈ చిత్రంలో గూమర్ సాంగ్‌లో పద్మావతిగా దీపిక వేసిన స్టెప్పులు అందరినీ ఆకర్షించాయి. కానీ, కర్ణిసేన మాత్రం ఆ పాట పై కన్నెర్ర చేసింది. రాణి పద్మావతి అలా గంతులేయటం ఏంటని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్న సెన్సార్ బోర్డు ప్యానెల్ సభ్యులు ఆ పాటను కూడా ఎడిట్ చేయాల్సిందేనని పేర్కొన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పాటలో దీపిక నడుము కనిపించే షాట్లను తొలగించాలని సూచించింది. అయితే అది మొత్తం పాట పైనే ప్రభావం చూపే అవకాశం ఉండటంతో భన్సాలీ ఓ నిర్ణయానికి వచ్చాడు. కంప్యూటర్ గ్రాఫిక్స్ వర్క్ ద్వారా దీపిక నడుమును కప్పిపుచ్చే యత్నం చేస్తున్నాడంట. అయితే ఈ ఎడిటింగ్ పనుల వల్ల చిత్రం జనవరి 25 తేదీన విడుదలయ్యే అవకాశం తక్కువగా కనిపిస్తోందని బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ముందు మాకు చూపించండి : రాజస్థాన్ హైకోర్టు పద్మావత్ చిత్రంపై దాఖలైన ఓ పిటిషన్ పై శుక్రవారం రాజస్థాన్ హైకోర్టు విచారణ చేపట్టింది. చరిత్రను వక్రీకరిస్తున్నారంటూ దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీతోపాటు దీపిక, రణ్వీర్లపైన గతేడాది మార్చిలో నగౌర్ జిల్లా దీవానా పోలీస్ స్టేషన్లో ఓ కేసు దాఖలైంది. అయితే ఆ అభియోగాలను కొట్టివేయాలంటూ భన్సాలీ రాజస్థాన్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన బెంచ్.. అభ్యంతరాల నేపథ్యంలో ముందు చిత్రాన్ని తమ ముందు ప్రదర్శించాలని.. చూసి నిర్ధారించుకున్నాకే కేసును కొట్టివేస్తామని వ్యాఖ్యానించింది. ఈ పిటిషన్ పై తదుపరి వాదనను జనవరి 23వ తేదీకి వాయిదా వేసింది. 17 నుంచి నిరసన ప్రదర్శనలు చిత్తోర్‌ఘడ్ వేదికగా మరో ఉద్యమానికి రాజ్‌పుత్ కర్ణిసేన సిద్ధమవుతోంది. పద్మావత్ చిత్ర విడుదలను అడ్డుకునే దిశగా పెద్ద ఎత్తున్న ప్రయత్నాలు ప్రారంభించింది. ఆదివారం కర్ణిసేన ప్రతినిధులు హోం శాఖా మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీ కానున్నారు. మరోవైపు కర్ణిసేన పెద్దలు 17న తేదీన పద్మావత్ చిత్రానికి దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలకు పిలుపునిచ్చారు. -
కండోమ్ యాడ్లపై ఆంక్షలు.. స్వల్ప ఊరట
సాక్షి, న్యూఢిల్లీ : అశ్లీలతను ప్రేరేపించేలా ఉన్నందున కండోమ్ యాడ్లపై కేంద్ర సమాచార & ప్రసార శాఖ ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. అయితే దానికి సడలింపు ఇస్తూ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. అశ్లీలత రహిత, మహిళలను కించపరిచే విధంగా లేని యాడ్లను ఏ సమయంలోనైనా ప్రదర్శించుకోవచ్చంటూ ఉత్తర్వుల్లో పేర్కొంది. రాజస్థాన్ హైకోర్టు జారీ చేసిన నోటీసులకు స్పందించిన కేంద్రం ఈ మేరకు సడలింపు ఇస్తున్నట్లు ప్రకటించింది. పిల్లలపై సదరు యాడ్లు తీవ్ర ప్రభావం చూపుతున్నాయంటూ కొందరు తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సాంకేతిక ప్రచార శాఖ ఆదేశాలనుసారం డిసెంబర్ 11 నుంచి నిబంధనను అమలులోకి తీసుకురాగా.. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటలలోపే యాడ్లను బుల్లితెరపై ప్రదర్శించాలని అందులో ఆదేశించింది. -
మరో ‘లవ్ జిహాద్’ కేసు కలకలం
సాక్షి, ముంబై : కేరళ లవ్ జిహాద్ కేసు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయిన సమయంలో.. అలాంటి ఉదంతాలు బోలెడు నమోదు అవుతున్నాయంటూ దర్యాప్తు సంస్థలు నివేదికలు వెల్లడించిన విషయం విదితమే. ఇదిలా ఉండగా రాజస్థాన్‌లో ఇప్పుడు మరో కేసు తెరపైకి వచ్చింది. పాయల్ సింఘ్వీ అనే 22 ఏళ్ల హిందూ యువతి రాజస్థాన్ హైకోర్టులో శనివారం బుర్ఖాతో ప్రత్యక్షమైంది. ముస్లిం యువకుడిని ప్రేమ వివాహం చేసుకున్న ఆమె కోర్టు ప్రాంగణంలో తానోక ముస్లింనని ప్రకటించటం కలకలమే రేపింది. యువతి తల్లిదండ్రులు ఆమెను బెదిరించి బలవంతంగా మతం మార్పించి మరీ యువకుడు వివాహం చేసుకున్నాడని వారు ఆరోపిస్తుండగా.. తన ఇష్టప్రకారమే అంతా జరిగిందని యువతి చెబుతోంది. ఇక ఈ ఘటనపై మహిళా సంఘాలు స్పందిస్తున్నాయి. తమకు తెలీకుండా తమ కూతురు మతం మారటం ఆ తల్లిదండ్రులు భరించలేకపోతున్నారని అబ సింగ్ అనే ఉద్యమకారిణి చెబుతున్నారు. ‘‘ఉగ్ర సంస్థలు ఆ యువతిని బలవంతం చేసి ఈ పని చేసి ఉంటారని ఆమె తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే తమ కూతురు వెనక్కి రావొచ్చనే వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అందుకు కారణం బలవంతపు మత మార్పిడులపై రాజస్థాన్ ప్రభుత్వం చేసిన కఠిన చట్టాలే. అందుకుగానూ ఐదేళ్ల వరకు అక్కడ కఠిన కారాగార శిక్షలు ఉంటాయి. ఈ దశలో విచారణలోనే వాస్తవాలు తెలుస్తాయి’’ అని అబ సింగ్ చెప్పారు. బలవంతపు మత మార్పిడులు చెల్లవని మరో ఉద్యమకారిణి షాలిని చౌచాన్ అంటున్నారు. ప్రతీరోజు తన తండ్రి పక్కన కూర్చుని సాయి బాబాని కొలిచే యువతి.. ఇలా చేసిందంటే నమ్ముతామా? తల్లిదండ్రులు అంతగా ఏడుస్తున్నా ఆమె పట్టించుకోలేదంటేనే పరిస్థితి అర్థమౌతోంది. ఆమె ఆలోచనలను ఎవరో బాగా ప్రభావితం చేశారు అని షాలిని చెబుతున్నారు. గత నెల 25న ఇంటి నుంచి వెళ్లిన పాయల్ తిరిగి రాలేదని ఆమె సోదరుడు చిరాగ్ సింఘ్వీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే పోలీసులు ఆ ఫిర్యాదును పట్టించుకోకపోవటంతో నేరుగా కోర్టునే అతను ఆశ్రయించాడు. ఇదిలా ఉంటే తాను ఏప్రిల్‌లో ఫయాజ్ మహ్మద్‌ను వివాహం చేసుకున్నట్లు యువతి రాతపూర్వకంగా కోర్టుకు తెలిపింది. కానీ, పాయల్ కుటుంబ సభ్యులు మాత్రం అపహరణ, బెదిరింపులతో ఆమెను లొంగదీసుకున్నారని.. వివాహ ధృవీకరణ నకిలీ పత్రాలు సృష్టించారని వాదిస్తున్నారు. చివరకు ఇరు పక్షాల వాదనలు విన్న రాజస్థాన్ హైకోర్టు యువతిని ప్రభుత్వ వసతి గృహానికి తరలించాలని పోలీసులను ఆదేశిస్తూ నవంబర్ 7కి తదుపరి విచారణ వాయిదా వేసింది. -
ఆడ నెమళ్లకు తోడు అక్కర్లేదా?
న్యూఢిల్లీ: మగ నెమలిని జాతీయ పక్షిగా గుర్తించినప్పుడు ఆవును మాత్రం జాతీయ జంతువుగా ఎందుకు గుర్తించరని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నిస్తూ రాజస్థాన్ జడ్జీ ఎంసీ శర్మ నెమళ్ల గురించి ఓ వింతైన విషయం చెప్పారు. మగ నెమళ్లు జీవితాంతం బ్రహ్మచారులుగా ఉంటాయని, వాటి కన్నీళ్లను తాగడం ద్వారా ఆడ నెమళ్లలో సంతానోత్పత్తికి బీజం పడుతుందని ఆయన కొత్త విషయం చెప్పారు. ఆడ, మగ నెమళ్లు ఎలా కలసుకుంటాయో జియోగ్రఫికల్ ఛానళ్లు చూసిన వాళ్లు ఇటు జడ్జీ వ్యాఖ్యల వీడియో క్లిప్పింగులను, అటు నెమళ్ల మేటింగ్ వీడియోలను ట్విట్టర్లో పోస్ట్‌చేసి షేర్ చేసుకుంటున్నారు. మానవ పరిణామ క్రమం సిద్ధాంతాన్ని వివరించిన చార్లెస్ డార్విన్‌కు మగ నెమళ్లకు తోక ఎందుకు అంత పెద్దగా ఉంటుంది, ఎందుకు అంత అందంగా ఉంటుందన్న విషయం ఓ అర్థంకాక అప్పట్లో తలపట్టుకు తిరిగారట. ఆయన రాసిన ‘సర్వైవల్ ఆఫ్ ఫిట్టెస్ట్’ సిద్ధాంతం ప్రకారం పర్యావరణ పరిస్థితులకు అనుగుణంగా ఏ జాతి జంతువైనా, పక్షి అయినా మనుగడ సాగిస్తుంది. అలా మనుగడ సాగించలేని జాతులు అంతరించి పోతాయి. లేదా మనుగడ సాగించే జాతుల ఆకతిలో, అవయవాల్లో మార్పులు వస్తాయన్నది ఆయన సిద్ధాంతం. ఆయన 1859లో ‘ది ఆరిజన్ ఆఫ్ స్పీసెస్’ (జాతుల మూలాలు) అంటూ ఓ పుస్తకం కూడా రాశారు. అప్పుడే ఆయన బుర్రలో ఓ అనుమానం తలెత్తింది. సులువుగా గాలిలోకి ఎగరడానికి, వేగంగా దూసుకుపోవడానికి మగ నెమళ్లకు పొడవైన ఈకలతో కూడిన తోక అడ్డం పడుతోంది. అలా అడ్డం పడుతున్న తోక కాల క్రమంలో ఎందుకు అంతరించి పోవడం లేదన్నది ఆయన అనుమానం. ఈ అనుమానాన్ని నివత్తి చేసుకోవడం కోసం నెమళ్లపై ఆయన మరింత లోతుగా అధ్యయనం జరిపారు. అప్పుడు అసలు విషయం ఆయనకు అర్థం అయింది. మగ నెమళ్ల తోకలను బట్టి ఆడ నెమళ్లు తోడును వెతుక్కుంటాయని తేలింది. పైగా ఆ తోకలు అంత అందంగా ఉండడానికి కారణం కూడా ఆడ నెమళ్లను ఆకర్షించడానికేనని కూడా డార్విన్ అర్థం చేసుకున్నారు. అంటే తోకకు సెక్స్ ప్రయోజనం ఉండడం వల్ల అది అంతరించి పోవడం లేదన్నది ఆయన థియరీ. మగ నెమళ్లు పురివిప్పి నాట్యం చేసేదే ఆడ నెమళ్లను ఆకర్షించడానికని, ఆడ నెమళ్లు తమ రుతు క్రమాన్నిబట్టి వాటికి స్పందిస్తాయని పక్షి ప్రేమికుడు, పక్షుల అలవాట్లపై పుస్తకాలు రాసిన ప్రముఖ రచయిత బెర్నార్డ్ పియర్స్ బ్రెంట్ మరింత వివరంగా చెప్పారు. -
నెమళ్లు శృంగారానికి దూరంగా ఉంటాయి!
రాజస్థాన్ హైకోర్టు జడ్జి ఆశ్చర్యకర వ్యాఖ్యలు జైపూర్: ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలంటూ సూచించిన రాజస్థాన్ హైకోర్టు జడ్జి నెమళ్ల విషయంలో ఆశ్చర్యకర వ్యాఖ్యలు చేశారు. నెమళ్లు బ్రాహ్మచారులు కావడం వల్లే వాటిని జాతీయపక్షిగా ప్రకటించారని ఆయన పేర్కొన్నారు. ‘మగ నెమలి బ్రాహ్మచారిగా ఉంటుంది. ఆడ నెమలితో అది శృంగారాన్ని నెరుపదు. మగ నెమలి కన్నీళ్లు తాగడం ద్వారా ఆడ నెమలి గర్భం దాలుస్తుంది. అందుకే శ్రీకృష్ణుడు నెమలిపింఛాన్ని తన తలపై ధరించారు’ అని ఆయన పేర్కొన్నారు. నెమలి తరహాలోనే ఆవు కూడా పవిత్రమైనదని జస్టిస్ మహేష్ చంద్ర శర్మ తెలిపారు. ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని, ఆవును చంపినవారికి జీవితఖైదు శిక్ష విధించాలని అంతకుముందు జస్టిస్ శర్మ తీర్పునిచ్చారు. ఈ తీర్పు గురించి మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. నేపాల్ ఇప్పటికే ఆవును జాతీయ జంతువుగా ప్రకటించిందని, భారత్ కూడా ఆత్మపరిశీలన చేసుకొని ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని ఆయన కోరారు. దీనితో లౌకికవాదానికి ఎలాంటి సంబంధం లేదన్నారు. -
ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలి
-
ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలి
జైపూర్: ఆవును జాతీయ జంతువుగా ప్రకటించేలా తగిన చర్యలు తీసుకోవాలని రాజస్తాన్ హైకోర్టు జడ్జి జస్టిస్ మహేశ్‌చంద్ శర్మ బుధవారం ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఈ అంశం కేంద్ర పరిధిలోనిది కనుక కేంద్రంతో కలసి పనిచేయాలని పేర్కొన్నారు. ఆవును వధించేవారికి జీవిత ఖైదు పడేలా చూడాలనీ సూచించారు. ఆవుకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అడ్వొకేట్ జనరల్‌లు చట్టబద్ధ సంరక్షకులుగా ఉండాలన్నారు. ‘హిందూ దేశమైన నేపాల్ ఆవును జాతీయ జంతువుగా ప్రకటించింది. భారత్ పశుపెంపకంపై ఆధారపడిన వ్యవసాయిక దేశం. 48, 51ఏ(జీ) రాజ్యాంగ అధికరణల ప్రకారం.. ఆవుకు చట్టబద్ధ హోదా కల్పించేందుకు రాష్ట్రం చర్యలు తీసుకోవాలి.. ఆవును చంపేవారికి జైలు శిక్షను మూడేళ్ల నుంచి జీవిత ఖైదుకు పెంచేందుకు రాష్ట్ర చట్టాన్ని సవరించాలి’ అని జస్టిస్ శర్మ తన 145 పేజీల ఉత్తర్వులో పేర్కొన్నారు. జడ్జిగా ఆయన పదవీకాలం బుధవారమే ముగిసింది. జైపూర్‌లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న హింగోనియా గోశాలలో వందలాది ఆవులు చనిపోయిన కేసులో ఈ ఆదేశాలు జారీ చేశారు. తర్వాత జస్టిస్ శర్మ విలేకర్లతో మాట్లాడుతూ తన ఆదేశాలు సిఫార్సుల కిందికి వస్తాయని, వాటికి కట్టుబడటం తప్పనిసరేమీ కాదన్నారు. ‘గోవును వధించేవారిపై చర్యలు తీసుకోవాలని కోరడం నా ఆత్మఘోష, మీ ఆత్మఘోష, అందరి ఆత్మఘోష... ఆవు తల్లివంటిది. పలు వ్యాధుల నుంచి కాపాడుతుంది’ అని అన్నారు. జాతీయ పక్షి నెమలి శృంగారంలో పాల్గొనదని, ఆడ నెమలి.. మగనెమలి కన్నీటిని సేవించే సంతానోత్పత్తి చేసుకుంటుందని ఈ సందర్భంగా న్యాయమూర్తి అన్నారు. గోవు కూడా నెమలి అంత పవిత్రమైనదని వెల్లడించారు. జోక్యానికి కేరళ హైకోర్టు నిరాకరణ తిరువనంతపురం: పశువధపై కేంద్రం తీసుకొచ్చిన నిషేధం విషయంలో జోక్యానికి కేరళ హైకోర్టు నిరాకరించింది. కేంద్ర నోటిఫికేషన్ రాజ్యాంగానికి వ్యతిరేకం కాదని, బీఫ్ అమ్మకం, వినియోగంపై అందులో నిషేధం లేదని పేర్కొంది. నిషేధంపై చర్చించడానికి అన్ని రాష్ట్రాల సీఎంలతో సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. -
ఆవును చంపితే జీవిత ఖైదు: కోర్టు
-
ఆవును చంపితే జీవిత ఖైదు: కోర్టు
ఎవరైనా ఆవులను చంపితే వాళ్లకు జీవిత ఖైదు విధించాలని రాజస్థాన్ హైకోర్టు సూచించింది. చాలామంది హిందువులు పవిత్ర జంతువుగా భావించే ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని కూడా తెలిపింది. ఆసియాలోనే అత్యుత్తమ గోరక్షణ కేంద్రాల్లో ఒకటిగా భావించే హింగోనియా గోశాల కేసును హైకోర్టు విచారిస్తోంది. అక్కడ గత సంవత్సరం జనవరి 1 నుంచి జూలై 31 వరకు ఏకంగా 8వేల ఆవులు చనిపోయాయి. రాజ్యాంగంలోని 48, 51 ఎ(జి) అధికరణాలను బట్టి చూస్తే ఆవులకు తగిన రక్షణ కల్పించడంతో పాటు వాటిని పూర్తిగా సంరక్షించాలని, అందువల్ల ప్రభుత్వం ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని జస్టిస్ మహేష్ చంద్ర శర్మ తన 145 పేజీల తీర్పులో తెలిపారు. భారతదేశం ప్రధానంగా వ్యవసాయ ఆధారిత దేశమని, ఇక్కడ పశుపోషణ కూడా చాలా ముఖ్యమని కోర్టు తెలిపింది. ఆవుల సంరక్షణ, పరిరక్షణకు సంబంధించి కస్టోడియన్లుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, అడ్వకేట్ జనరల్‌లను జడ్జి నియమించారు. వాళ్లు ఆవుల విషయంలో పూర్తి బాధ్యతలు తీసుకోవాలని చెప్పారు. పశువధను నిషేధిస్తూ కేంద్రప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేయడం, వాటిపై పలు రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కొన్ని సంఘాలు కూడా గొడవ చేయడం తెలిసిందే. పశువులను కబేళాలకు తరలించేందుకు కొనుగోలు, అమ్మకాలు చేయడాన్ని పూర్తిగా నిషేధిస్తూ కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ కఠినమైన నిబంధనలను నోటిఫై చేసింది. ఆవులతో పాటు ఎద్దులు, ఆంబోతులు, గేదెలు, దూడలు, ఒంటెలు తదితర జంతువులను ఇందులో చేర్చారు. ఈ నోటిఫికేషన్ మీద మద్రాస్ హైకోర్టు మదురై బెంచి నాలుగు వారాల పాటు స్టే విధించింది. -
సల్మాన్ ఖాన్‌ను వీడని కష్టాలు...
న్యూఢిల్లీ : బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్‌కు కృష్ణ జింక కష్టాలు వీడేలా కనిపించడం లేదు. కృష్ణజింకను వేటాడిన కేసులో సల్మాన్‌పై రాజస్తాన్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ ఏడాది జూలై 25న ఆ రాష్ట్ర హైకోర్టు సల్మాన్ నిర్ధోషి అంటూ తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. కాగా 1998లో జోధ్‌పూర్‌కు సమీపంలోని భావద్, మథానియా ప్రాంతాల్లో ఓ కృష్ణజింకను, ఓ మామూలు జింకను వేటాడి చంపినట్టు సల్మాన్ తోపాటు మరో ఏడుగురిపై కేసులు నమోదయ్యాయి. సల్మాన్‌పై వన్యప్రాణి సంరక్షణ చట్టం సెక్షన్ 51 ప్రకారం ఈ కేసులు నమోదు చేశారు. ట్రయల్ కోర్టు సల్మాన్‌ను దోషిగా నిర్ధారించి.. ఒక కేసులో ఏడాది జైలు శిక్ష, మరో కేసులో ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. దీనిపై సల్మాన్ సెషన్స్ కోర్టులో అప్పీలు చేసుకున్నారు. మిథానియా కేసులో సల్మాన్ అప్పీలును తిరస్కరించిన కోర్టు.. భావద్ కేసును హైకోర్టుకు బదిలీ చేసింది. సరైన సాక్షాలు లేవని సల్మాన్‌ను హైకోర్టు నిర్దోషిగా ప్రకటించింది. అయితే ఆ కేసులో తమకు పలు అనుమానాలు ఉన్నాయంటూ, హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ రాజస్థాన్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. -
సల్మాన్ ఖాన్‌ను వీడని కష్టాలు...
-
సల్మాన్‌ఖాన్ నిర్దోషి
కృష్ణజింకల వేట కేసులో రాజస్తాన్ హైకోర్టు తీర్పు జోధ్‌పూర్ : కృష్ణజింకల వేటకు సంబంధించిన రెండు కేసుల్లో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌ను రాజస్తాన్ హైకోర్టు నిర్దోషిగా ప్రకటిస్తూ సోమవారం తీర్పు ఇచ్చింది. 1998లో జోధ్‌పూర్‌కు సమీపంలోని భావద్, మథానియా ప్రాంతాల్లో సల్మాన్, అతని సహ నటులు కలసి కృష్ణజింకలను వేటాడినట్టు కేసులు ఉన్నాయి. సల్మాన్‌పై వన్యప్రాణి సంరక్షణ చట్టం సెక్షన్ 51 ప్రకారం ఇవి నమోదయ్యాయి. ట్రయల్ కోర్టు సల్మాన్‌ను దోషిగా నిర్ధారించి.. ఒక కేసులో ఏడాది జైలు శిక్ష, మరో కేసులో ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. దీనిపై సల్మాన్ సెషన్స్ కోర్టులో అప్పీలు చేసుకున్నారు. మిథానియా కేసులో సల్మాన్ అప్పీలును తిరస్కరించిన కోర్టు.. భావద్ కేసును హైకోర్టుకు బదిలీ చేసింది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పీళ్లూ హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నాయి. ఈ పిటిషన్లన్నీ కలిపి 2015 నవంబర్ 16న హైకోర్టు విచారణ ప్రారంభించింది. విచారణ జరిపి ఈ ఏడాది మే 13న తీర్పును రిజర్వ్‌లో ఉంచారు. సోమవారం తుది తీర్పులు వెలువరించినజస్టిస్ నిర్మలాజిత్ కౌర్ రెండు కేసుల్లోనూ సల్మాన్‌ను నిర్దోషిగా ప్రకటించారు. సల్మాన్‌కు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం వేసిన అప్పీళ్లను తోసిపుచ్చారు. ఘటనా స్థలంలో లభించిన జింకల కళేబరాల నుంచి సేకరించిన పెల్లెట్లు.. సల్మాన్‌కు చెందిన లెసైన్స్డ్ తుపాకీతో కాల్చినవి కాదని తేలిందన్నారు. వేట సమయంలో సల్మాన్, అతని టీమ్ వాడిన జీప్ డ్రైవర్ కనిపించకుండాపోవడంతో కేసు బలహీనపడింది. అయితే అదనపు అడ్వొకేట్ జనరల్ కేఎల్ టాకూర్ స్పందిస్తూ.. హైకోర్టు తీర్పుపై అప్పీలు చేసే అంశంపై ఆర్డర్ కాపీ వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. -
ఆ జింకలను ఎవరు చంపారు?
సల్మాన్ ను నిర్దోషిగా ప్రకటించిన హైకోర్టు సినిమా షూటింగ్ లో పాల్గొంటూ సరదా కోసం రక్షిత వన్యప్రాణులైన కృష్ణజింకలను వెటాడారన్న కేసులో సల్మాన్ ఖాన్ కు ఊరట లభించింది. రాజస్థాన్ హైకోర్టు సల్మాన్ కు ఈ కేసు నుంచి విముక్తి ప్రసాదించింది. ఈ నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించిన కొన్ని కీలక విషయాలు.. 1998 సంవత్సరంలో రాజస్థాన్ లోని జోథ్ పూర్ లో 'హమ్ సాథ్ సాథ్ హై' సినిమా షూటింగ్ జరిగింది. ఆ సమయంలో ఆ సినిమా నటులైన సల్మాన్ ఖాన్, సోనాలి బింద్రె, టబు, నీలమ్ తదితరులు సరదా కోసం వేటకు వెళ్లారని, రక్షిత వన్యప్రాణులైన జింకలను వేటాడారని అప్పట్లో కేసు నమోదైంది. జోథ్ పూర్ శివార్లలోని భవాద్ అటవీ ప్రాంతంలో 1998 సెప్టెంబర్ 26న ఓ జింక, సెప్టెంబర్ 28న ఘోడా ఫార్మ్ హౌస్ లో మరో జింక హత్యకు గురయ్యాయి. ఈ జింకలను వేటాడి చంపిన కేసులో 2006లో జోథ్ పూర్ ట్రయల్ కోర్టు సల్మాన్‌ఖాన్‌కు ఐదేళ్లు శిక్ష విధించింది. ఈ శిక్షను సవాల్ చేస్తూ సల్మాన్ రాజస్థాన్ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టు శిక్షపై స్టే విధించింది. అనంతరం సుదీర్ఘకాలం వాదనల అనంతరం సల్మాన్ ను నిర్దోషిగా ప్రకటిస్తూ తాజాగా హైకోర్టు తీర్పునిచ్చింది. జింకలను వెటాడిన కేసులో సల్మాన్ ను నిర్దోషిగా ప్రకటించడంపై స్థానిక బిష్ణోయ్ వర్గం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని ఆ వర్గం తెలిపింది. మరోవైపు రాజస్థాన్ ప్రభుత్వం కూడా ఈ తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని భావిస్తోంది. న్యాయవ్యవస్థ ఎంత నెమ్మదిగా పనిచేస్తోందో సెలబ్రిటీ కేసులే మనకు చెప్తాయి. సల్మాన్ ఖాన్ నిర్దోషి అని చెప్పడానికి కోర్టుకు 20 ఏళ్లు పట్టడం నిజంగా భయం కలిగిస్తున్నది- రాంగోపాల్ వర్మ ట్విట్టర్ లో.. Only celebrity cases make us realise how dead slow judiciary works .it's scary it took 20yrs for court to decide Salman khan is not guilty — Ram Gopal Varma (@RGVzoomin) July 25, 2016 సల్మాన్ ఖాన్ కు కేసులు కొత్త కాదు. 'హిట్ అండ్ రన్' కేసులోనూ ఆయన విచారణ ఎదుర్కొన్నారు. మద్యం తాగి వాహనం నడిపి ఓ వ్యక్తి మృతికి, నలుగురు గాయపడటానికి కారణమైనట్టు అభియోగాలు ఎదుర్కొన్న ఈ కేసులో ముంబై హైకోర్టు ఆయనను గత ఏడాది డిసెంబర్ లో నిర్దోషిగా ప్రకటించింది. 13 ఏళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం ఈ కేసులో సల్మాన్ కు ఊరట లభించింది. అయితే, హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీలు చేయడంతో ఈ కేసు ఇంకా సల్మాన్ ను వెంటాడుతూనే ఉంది. 'సుల్తాన్' సినిమాతో బాక్సాఫీసు రికార్డు బద్దలు కొట్టిన సల్మాన్.. ఈ సినిమా ప్రమోషన్ సమయంలో వివాదాస్పద 'రేప్' వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ సమయంలో తన పరిస్థితి అత్యాచారానికి గురైన మహిళలా ఉండేదని ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. -
సల్మాన్ ఖాన్ కు మరో భారీ ఊరట!
-
సల్మాన్ ఖాన్ కు మరో భారీ ఊరట!
జోథ్ పూర్: బాలీవుడ్ కథనాయకుడు సల్మాన్ ఖాన్ కు భారీ ఊరట లభించింది. కృష్ణజింకలను వేటాడిన రెండు వేర్వేరు కేసులలో ఆయనను నిర్దోషిగా ప్రకటిస్తూ రాజస్థాన్ హైకోర్టు సోమవారం తీర్పు వెలువరించింది. 1998లో జోథ్ పూర్ లో రెండు వేర్వేరు ఘటనల్లో రక్షిత వన్యప్రాణులైన ఓ కృష్ణజింకను, ఓ మామూలు జింకను వేటాడి చంపినట్టు సల్మాన్ తోపాటు మరో ఏడుగురిపై కేసులు నమోదయ్యాయి. ఈ కేసులలో జోథ్ పూర్ కోర్టు సల్మాన్ కు ఐదేళ్ల జైలుశిక్ష విధించగా.. ఈ ఉత్తర్వులను హైకోర్టు కొట్టివేసింది. ఈ కేసులో వాదనలు గత మే నెలలో ముగిశాయి. దీంతో తీర్పును రిజర్వ్ చేసిన హైకోర్టు సోమవారం తుది ఉత్తర్వులు వెలువరించింది. -
సల్మాన్‌కు సుప్రీంలో చుక్కెదురు
న్యూఢిల్లీ: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌కు చుక్కెదురైంది. వన్యప్రాణులను వేటాడిన కేసులో ఐదేళ్ల జైలు శిక్షను నిలుపుదల చేస్తూ రాజస్థాన్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ కేసును చట్టప్రకారం మళ్లీ విచారించాలని పేర్కొంది. ‘సల్మాన్ విదేశాలకు వెళ్లేందుకు ఇబ్బంది అవుతుందన్న కారణంతో శిక్షపై స్టే విధించడం సరికాదు. అందుకే ఈ కేసును మళ్లీ విచారించండి’ అని బుధవారం ద్విసభ్య ధర్మాసనం స్పష్టంచేసింది. దీంతో సల్మాన్‌కు కొన్ని దే శాలు వీసాలు నిరాకరించే పరిస్థితి తలెత్తింది. 1998లో ఓ చిత్రం షూటింగ్ సమయంలో కృష్ణ జింకలను వేటాడినందుకు సల్మాన్‌పై రెండు కేసులు నమోదైన సంగతి తెలిసిందే. -
ఆశారాం బాపూకు కోర్టులో చుక్కెదురు
జోథ్‌పూర్: ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపూకు కోర్టులో మరోసారి చుక్కెదురైంది. ఆయన పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌ను రాజస్థాన్ హైకోర్టు తిరస్కరించింది. ఫిబ్రవరి 3వ తేదీన డిఫెన్స్, ప్రాసిక్యూషన్ లాయర్ల వాదనలను పెండింగ్ లో ఉంచిన న్యాయమూర్తి జస్టిస్ నిర్మల్జిత్ ఈ రోజు బెయిల్ పిటీషన్ ను తోసిపుచ్చుతూ తీర్పు చెప్పారు. గత వారం కోర్టుకు వచ్చిన ఆశారాం బెయిల్ పిటీషన్ పై రాం జెఠ్మలానీ వాదనలు వినిపించారు. ఆశారాం చాలా కాలంగా జైలు జీవితం గడుపుతున్నారని, ఆయన ఆరోగ్య పరిస్థితి సరిగా లేనందును బెయిల్ మంజూరు చేయాలని కోర్టుకు తెలిపారు. అతనిపై దాఖలైన చార్జిషీట్ బలంగా ఉన్నందున బెయిల్ మంజూరు చేయకూడదని ప్రాసిక్యూషన్ కౌన్సిల్ తరుపున మిష్పాల్ బిస్నోయ్ వాదించారు. 72 ఏళ్ల ఆశారాం బాపూ సెప్టెంబర్ 2 నుంచి జోధ్‌పూర్ సెంట్రల్ జైలులో ఉన్నారు. జోధ్‌పూర్ సమీపంలోని తన ఆశ్రమంలో 16 ఏళ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలతో ఆగస్టు 20న ఆశారాం బాపుపై కేసు నమోదయింది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ ఆశ్రమంలో అరెస్ట్ చేసి ఆయనను సెప్టెంబర్ 1న జోథ్‌పూర్‌కు తరలించారు. -
సల్మాన్‌ఖాన్ జైలు శిక్షపై స్టే
జోధ్‌పూర్: బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్‌కు ఊరట లభించింది. వన్యమృగాలను వేటాడిన కేసులో ఆయనకు కింది కోర్టు విధించిన జైలు శిక్ష అమలుపై రాజస్థాన్ హైకోర్టు స్టే విధించింది. దీంతో బ్రిటన్ వీసా పొందేందుకు ఆయనకు అడ్డంకులు తొలగిపోయాయి. వన్యప్రాణులను వేటాడిన కేసులో సల్మాన్‌ఖాన్‌కు 2006లో కింది కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. నాలుగేళ్ల కంటే ఎక్కువ జైలు శిక్ష అనుభవించిన వారు బ్రిటన్ వీసా పొందేందుకు అనర్హులు. సల్మాన్‌కు జైలు శిక్ష పడినప్పటి నుంచి ఆయనకు బ్రిటన్ దౌత్య కార్యాలయం వీసా నిరాకరిస్తూ వస్తోంది. కింది కోర్టు తీర్పును హైకోర్టు నిలుపుదల చేయడంతో తాజాగా బ్రిటన్ వీసాకు సల్మాన్ దరఖాస్తు చేయనున్నారు. తన దగ్గరవున్న బ్రిటన్ వీసా గడువు ఇటీవల ముగియడంతో కింది కోర్టు తీర్పును సవాల్ చేస్తూ సల్మాన్ హైకోర్టును ఆశ్రయించారు. -
ఆశారాం బాపూకు మరోసారి చుక్కెదురు
జోథ్‌పూర్: ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపూకు కోర్టులో మరోసారి చుక్కెదురయింది. ఆయన పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌ను రాజస్థాన్ హైకోర్టు తిరస్కరించింది. డిఫెన్స్, ప్రాసిక్యూషన్ లాయర్ల వాదనలు విన్న తర్వాత న్యాయమూర్తి జస్టిస్ నిర్మల్జిత్ కౌర్.. ఆశారాం బెయిల్ పిటిషన్‌ను తోసిపుచ్చారు. ఆశారాం తరపున ప్రముఖ న్యాయవాది రాం జెఠ్మలానీ వాదనలు వినిపించారు. గత నెల 13న ఆయన పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌ను జోధ్‌పూర్ కోర్టు తోసిపుచ్చింది. 72 ఏళ్ల ఆశారాం బాపూ సెప్టెంబర్ 2 నుంచి జోధ్‌పూర్ సెంట్రల్ జైలులో ఉన్నారు. ఆయనకు విధించిన జ్యుడీషియల్ కస్టడీని జోధ్‌పూర్ కోర్టు ఈ నెల 11కు వరకు పొడిగించింది. జోధ్‌పూర్ సమీపంలోని తన ఆశ్రమంలో 16 ఏళ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలతో ఆగస్టు 20న ఆశారాం బాపుపై కేసు నమోదయింది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ ఆశ్రమంలో అరెస్ట్ చేసి ఆయనను సెప్టెంబర్ 1న జోథ్‌పూర్‌కు తరలించారు.