సల్మాన్ఖాన్ జైలు శిక్షపై స్టే
జోధ్పూర్: బాలీవుడ్ నటుడు సల్మాన్ఖాన్కు ఊరట లభించింది. వన్యమృగాలను వేటాడిన కేసులో ఆయనకు కింది కోర్టు విధించిన జైలు శిక్ష అమలుపై రాజస్థాన్ హైకోర్టు స్టే విధించింది. దీంతో బ్రిటన్ వీసా పొందేందుకు ఆయనకు అడ్డంకులు తొలగిపోయాయి. వన్యప్రాణులను వేటాడిన కేసులో సల్మాన్ఖాన్కు 2006లో కింది కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. నాలుగేళ్ల కంటే ఎక్కువ జైలు శిక్ష అనుభవించిన వారు బ్రిటన్ వీసా పొందేందుకు అనర్హులు.
సల్మాన్కు జైలు శిక్ష పడినప్పటి నుంచి ఆయనకు బ్రిటన్ దౌత్య కార్యాలయం వీసా నిరాకరిస్తూ వస్తోంది. కింది కోర్టు తీర్పును హైకోర్టు నిలుపుదల చేయడంతో తాజాగా బ్రిటన్ వీసాకు సల్మాన్ దరఖాస్తు చేయనున్నారు. తన దగ్గరవున్న బ్రిటన్ వీసా గడువు ఇటీవల ముగియడంతో కింది కోర్టు తీర్పును సవాల్ చేస్తూ సల్మాన్ హైకోర్టును ఆశ్రయించారు.