కండోమ్‌ యాడ్లపై ఆంక్షలు.. స్వల్ప ఊరట | Without sexually Explicit Condom ads play any time | Sakshi
Sakshi News home page

Published Thu, Dec 21 2017 3:41 PM | Last Updated on Thu, Dec 21 2017 3:41 PM

Without sexually Explicit Condom ads play any time - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : అశ్లీలతను ప్రేరేపించేలా ఉన్నందున కండోమ్‌ యాడ్లపై కేంద్ర సమాచార & ప్రసార శాఖ ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. అయితే దానికి సడలింపు ఇస్తూ తాజాగా ఆదేశాలు జారీ చేసింది.

అశ్లీలత రహిత, మహిళలను కించపరిచే విధంగా లేని యాడ్లను ఏ సమయంలోనైనా ప్రదర్శించుకోవచ్చంటూ ఉత్తర్వుల్లో పేర్కొంది. రాజస్థాన్‌ హైకోర్టు జారీ చేసిన నోటీసులకు స్పందించిన కేంద్రం ఈ మేరకు సడలింపు ఇస్తున్నట్లు ప్రకటించింది. 

పిల్లలపై సదరు యాడ్లు తీవ్ర ప్రభావం చూపుతున్నాయంటూ కొందరు తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సాంకేతిక ప్రచార శాఖ ఆదేశాలనుసారం డిసెంబర్‌ 11 నుంచి నిబంధనను అమలులోకి తీసుకురాగా.. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటలలోపే యాడ్లను బుల్లితెరపై ప్రదర్శించాలని అందులో ఆదేశించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement