Condom AD
-
బాబా రాందేవ్ కండోమ్‌లు తేవాలి..
కండోమ్ ప్రకటనల ప్రసారంపై కేంద్ర ప్రభుత్వం విధించిన నిషేధాన్ని ప్రముఖ నటి, మోడల్ రాఖీ సావంత్ తప్పుపట్టింది. దేశంలో ప్రజలకు ఎయిడ్స్ ప్రబలేలా చేయడానికే కేంద్రం ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటోందని తీవ్రంగా వ్యాఖ్యానించింది. ఒకప్పుడు దేశలో ప్రతి వైన్‌షాప్ దగ్గర కండోమ్ ప్యాకెట్లను పంచిపెట్టారని, సినీ తారలు, క్రీడాకారులతో ప్రకటనలు చేసి కండోమ్‌లపై అవగాహన పెంచిన ప్రభుత్వాలు, ఇప్పుడు మాత్రం ఎందుకు ప్రసారాలను అడ్డుకుంటున్నాయంటూ విమర్శలు ఎక్కుపెట్టింది.. గతంలో వాజ్‌పేయ్ ప్రధానిగా ఉన్న సమయంలో, మైదానంలోకి దిగేటప్పుడు హెల్మెట్ తప్పనిసరి అంటూ ప్రముఖ క్రికెటర్‌తో కేంద్ర సమాచార శాఖ ప్రకటనలు చేసిందని, కానీ ఇప్పుడు మాత్రం ప్రభుత్వం ఎందుకు తప్పుపడుతోందంటూ ప్రశ్నించారు. సరికొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకువస్తున్న బాబా రాందేవ్, కండోమ్‌లను కూడా తీసుకురావాలంటూ వ్యాఖ్యానించింది. రాఖీ సావంత్ ఓ కండోమ్ కంపెనీకి ప్రచార కర్తగా పనిచేస్తోంది. కేంద్ర ప్రభుత్వం తాజాగా కండోమ్ ప్రకటనలపై ఆంక్షలు విధించింది. పగటి వేళల్లో నిషేధం విధించింది. కుటుంబ సభ్యలతో కలిసి చిన్న పిల్లలు చూసే అవకాశం ఉందంటూ వాటిపై ఆంక్షలు విధించింది. రాత్రి 11గంటల నుంచి ఉదయం 6గంటల వరకు మాత్రమే ప్రసారం చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. -
కండోమ్ యాడ్లపై ఆంక్షలు.. స్వల్ప ఊరట
సాక్షి, న్యూఢిల్లీ : అశ్లీలతను ప్రేరేపించేలా ఉన్నందున కండోమ్ యాడ్లపై కేంద్ర సమాచార & ప్రసార శాఖ ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. అయితే దానికి సడలింపు ఇస్తూ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. అశ్లీలత రహిత, మహిళలను కించపరిచే విధంగా లేని యాడ్లను ఏ సమయంలోనైనా ప్రదర్శించుకోవచ్చంటూ ఉత్తర్వుల్లో పేర్కొంది. రాజస్థాన్ హైకోర్టు జారీ చేసిన నోటీసులకు స్పందించిన కేంద్రం ఈ మేరకు సడలింపు ఇస్తున్నట్లు ప్రకటించింది. పిల్లలపై సదరు యాడ్లు తీవ్ర ప్రభావం చూపుతున్నాయంటూ కొందరు తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సాంకేతిక ప్రచార శాఖ ఆదేశాలనుసారం డిసెంబర్ 11 నుంచి నిబంధనను అమలులోకి తీసుకురాగా.. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటలలోపే యాడ్లను బుల్లితెరపై ప్రదర్శించాలని అందులో ఆదేశించింది. -
నో కండోమ్ యాడ్స్: కీలక ఆదేశాలు
సాక్షి, న్యూఢిల్లీ: కండోమ్ ప్రకటనలపై కేంద్రం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా చిన్నపిల్లలను ఈ ప్రభావం నుంచి రక్షించేలా సోమవారం కొన్ని ఆంక్షలు విధించింది. చిన్న పిల్లలపై ప్రభావం చూపే ఆ యాడ్స్‌ను ఉదయం పూట ప్రసారం చేయరాదు అని ప్రభుత్వం స్పష్టం చేసింది. అంతేకాదు ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని కూడా హెచ్చరించింది. కండోమ్ యాడ్స్‌పై ప్రకటనలు, వాటి ప్రసార సమయాలపై ఇటీవల ఇండియన్ అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఆస్కి) మంత్రిత్వ శాఖకు అందించిన సూచనల మేరకు ఈ దేశాలు జారీ అయ్యాయి. కండోమ్ వాణిజ్య ప్రకటనలను ఉదయం వేళ ప్రసారం చేయరాదు అని కేంద్ర ప్రభుత్వం దేశంలోని అన్ని టీవీ ఛానళ్లకు ఆదేశాలు జారీ చేసింది. ఇవి అసభ్యకరమైన, అనారోగ్య పద్ధతులు సృష్టించగలవంటూ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇకపై ఉదయం 6 గంటలనుంచి రాత్రి 10 గంటల వరకు ప్రసారం చేయడానికి వీల్లేదని సమాచార, ప్రసార శాఖ మంత్రిత్వశాఖ ఆదేశించింది. దీనికి సంబంధించి కొన్ని ఆదేశాలు ఉన్నా.. కొన్ని ఛానళ్లు కండోమ్ యాడ్స్ ప్రసారం చేస్తున్నాయని ఇటీవల విమర్శలు చెలరేగాయి. ఈ నేపథ్యంలోనే రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు మాత్రమే ఈ యాడ్స్‌ను ప్రసారం చేయాలని మంత్రిత్వ శాఖ సూచించింది. ఒకవేళ ఆదేశాలను ఉల్లంఘిస్తే, కేబుల్ టెలివిజన్ నెట్వర్క్ రూల్స్, 1994 ప్రకారం చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. కాగా గత సెప్టెంబరులో సన్నీ లియోన్ నటించిన ఒక కండోమ్ ప్రకటన సూరత్‌లో నిరసన సెగలు రాజేసింది. గుజరాత్ నగరం అంతటా దర్శనమిచ్చిన ఈ హోర్డింగ్స్ పై సిటీకి చెందిన హిందూ యువ వాహిని నిరసనకు దిగింది. -
సన్నీలియోన్ కండోమ్ యాడ్ దుమారం..
న్యూఢిల్లీ : నవరాత్రి సందర్భంగా గుజరాత్లో బాలీవుడ్ నటి సన్నీలియోన్‌తో ఏర్పాటుచేయించిన కండోమ్‌కు సంబంధించిన వాణిజ్య ప్రకటన హోర్డింగ్ వివాదాన్ని తీసుకొచ్చింది. అసభ్య చిత్రాల్లో నటించే సన్నీతో అలాంటి హోర్డింగ్ ఏర్పాటుచేసి హిందువుల మనోభావాలు దెబ్బకొట్టారంటూ, వాటిని వెంటనే తొలగించాలంటూ హిందూ యువ వాహిణి వంటి హిందూమత సంస్థలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. కేవలం డబ్బు సంపాధించడం లక్ష్యంగా చేసుకొని సన్నీలియోన్ భారతీయ విలువలను మంటగలుపుతోందంటూ తీవ్రంగా ధ్వజమెత్తారు. దీనికోసం పెద్ద మొత్తంలో ఆందోళనను కూడా లేవదీసింది. రోడ్లపైకి ఎక్కి నిరసన నినాదాలు చేసింది. గుజరాతీ భాషలో ఏర్పాటుచేసిన ఆ హోర్డింగ్‌లో ‘ఆ నవరాత్రి ఆ రామో, ప్రణతు ప్రేమ్తీ(జరుపుకోండి.. కానీ ప్రేమతో ఈ నవరాత్రిని’ అంటూ కండోమ్‌కు సంబంధించిన ఆ వాణిజ్య ప్రకటనలో రాశారు. అఖిల భారత వర్తక సమాఖ్య కూడా కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రి రామ్ విలాస్ పాశ్వన్కు ఓ లేఖ రాసింది. బాధ్యత రహితంగా ఏర్పాటుచేసిన ఆ హోర్డింగ్‌ను వెంటనే తొలగించేలా ఆదేశించాని కోరింది. దీనిపై మంత్రి వెంటనే చర్య తీసుకోవాలని, సదరు సంస్థపైనా, దానికి రాయబారిగా ఉన్న నటి సన్నీలియోనపైనా వెంటనే చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. -
'ఆ యాడ్ చేయనుగాక చేయను'
ఏ ఆర్టిస్ట్ అయినా స్టార్ ఇమేజ్ రాగానే ఆ ఇమేజ్ ను అడ్డంపెట్టుకోని క్యాష్ చేసుకోవాలి అనుకుంటారు. ముఖ్యంగా రెమ్యూనరేషన్ పెంచేయటంతో పాటు, మల్టీనేషనల్ బ్రాండ్లకు అంబాసిడర్లుగా భారీగా సంపాదించేస్తారు.. బాలీవుడ్ వర్సటైల్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్ధిఖి మాత్రం అలా చేయటం లేదు. భజరంగీభాయ్‌జాన్, మాంఝీ లాంటి సినిమాలతో ప్రజెంట్ బాలీవుడ్లో స్టార్ ఇమేజ్ అందుకున్న ఈ విలక్షణ నటుడు, వచ్చిన ప్రతీ యాడ్‌ను అంగీకరించకుండా సెలక్టివ్‌గా నిర్ణయాలు తీసుకుంటున్నాడు ప్రస్తుతం బాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానే కాక సోలో హీరోగా కూడా సత్తా చాటుతున్న నవాజుద్దీన్, ఓ భారీ ఆఫర్ ను కాదన్నాడు. నవాజ్ ఇమేజ్ను క్యాష్ చేసుకోవాలనుకున్న ఓ కండోమ్ కంపెనీ తమ ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించాలని భారీ ఆఫర్‌ను ఇచ్చింది. నవాజుద్దీన్ సిద్ధిఖీ మాత్రం మన సంస్కృతి సాంప్రదాయాల పట్ల తనకున్న గౌరవంతోనే ఈ ఆఫర్ ను తిరస్కరిస్తున్నట్లు ప్రకటించాడు. -
'నాకోసం టైమ్ వేస్ట్ చేసుకోకండి'
ముంబై: రాజకీయ నాయకులు తన కోసం విలువైన సమయాన్ని వృథా చేసుకోవద్దని శృంగారతార సన్నీ లియోన్ అన్నారు. తాను చేసిన కండోమ్ ప్రకటనను సీపీఐ జాతీయ కార్యదర్శి అతుల్ కుమార్ అన్జాన్ తప్పుపట్టడంపై సన్నీ ఘాటుగా స్పందించారు. రాజకీయ నాయకులు తనపై విమర్శలు చేయడం చౌకబారుతనమని సన్నీ అన్నారు. 'అధికారంలో ఉన్నవారు నా గురించి మాట్లాడుకోవడం మానుకుని కష్టాల్లో ఉన్నవారికి సాయం చేయాలి. నాకోసం వారి సయమం వృథా చేయడం బాధాకరం' అని సన్నీ ట్వీట్ చేశారు. సన్నీ నటించిన ప్రకటన భావోద్వేగాలను రెచ్చగొట్టేలా ఉందని, ప్రజలు గనక ఆ ప్రకటన చూస్తే అత్యాచారాలు మరింత పెరగడం ఖాయమని అతుల్ కుమార్ అన్జాన్ అన్న విషయం తెలిసిందే. ఈ విషయంలో బాలీవుడ్ నటి శిల్పాశెట్టి.. సన్నీలియోన్‌కు బాసటగా నిలిచారు. సన్నీ లియోన్ చేసిన కండోమ్ ప్రకటనపై విమర్శలు చేయడం సరికాదని అన్నారు. -
సన్నీ లియోన్‌కు శిల్పాశెట్టి బాసట
బాలీవుడ్ నటి శిల్పాశెట్టి.. శృంగార తార సన్నీలియోన్‌కు బాసటగా నిలిచారు. సన్నీ లియోన్ చేసిన కండోమ్ ప్రకటనపై విమర్శలు చేయడం సరికాదని అన్నారు. సన్నీ నటించిన ప్రకటన భావోద్వేగాలను రెచ్చగొట్టేలా ఉందని, ప్రజలు గనక ఆ ప్రకటన చూస్తే అత్యాచారాలు మరింత పెరగడం ఖాయమని సీపీఐ జాతీయ కార్యదర్శి అతుల్ కుమార్ అన్జాన్ హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శిల్పాశెట్టి స్పందిస్తూ.. 'సన్నీ యాడ్‌పై విమర్శలు చేయడం హాస్యాస్పదం. అలా ఆలోచిస్తారని నేను భావించడం లేదు. దీని గురించి ఎక్కువగా స్పందించడం సరికాదు. చేతి ఐదువేళ్లు సమానంగా ఉండవు. సానుకూల అంశాలపై మాత్రమే దృష్టిపెట్టాలి' అని శిల్పాశెట్టి అన్నారు. 'మ్యాన్‌ఫోర్స్' అనే కండోమ్ ప్రకటనలో సన్నీ లియోన్ నటించింది. -
'సన్నీ యాడ్‌తో అత్యాచారాలు పెరుగుతాయి'
శృంగార తార సన్నీలియోన్ చేసిన కండోమ్ ప్రకటన వల్ల భవిష్యత్తులో మరిన్ని అత్యాచారాలు జరిగే ప్రమాదం ఉందని సీపీఐ జాతీయ కార్యదర్శి అతుల్ కుమార్ అన్జాన్ హెచ్చరించారు. ఆమె నటించిన ప్రకటన భావోద్వేగాలను రెచ్చగొట్టేలా ఉందని, ప్రజలు గనక ఆ ప్రకటన చూస్తే అత్యాచారాలు మరింత పెరగడం ఖాయమని ఆయన అన్నారు. 'మ్యాన్‌ఫోర్స్' అనే కండోమ్ ప్రకటనలో సన్నీ లియోన్ నటించింది. అయితే, అతుల్ కుమార్ వ్యాఖ్యల గురించి సన్నీ లియోన్ మాత్రం ఎక్కడా స్పందించినట్లు లేదు. కాగా, సన్నీ లియోన్ మీద విమర్శలు గుప్పించడం, ఆమెపై కేసులు పెట్టడం ఇప్పుడు కొత్తేమీ కాదు. గతంలో కూడా ఆమె చిత్రాలు అసభ్యంగా ఉన్నాయంటూ ముంబైలో ఒక మహిళ సన్నీపై కేసు పెట్టారు. సన్నీలియోన్ ఇటీవల నటించిన మస్తీజాదే అనే సెక్స్ కామెడీ సినిమాకు ఇటీవలే సెన్సార్ బోర్డు పచ్చజెండా ఊపిన విషయం తెలిసిందే. -
కండోమ్ యాడ్‌లో కాజల్?
నటి కాజల్ అగర్వాల్ సంచలన నిర్ణయాలకు సిద్ధం అవుతున్నట్లు ఆమె సన్నిహిత వర్గాల సమాచారం. తెలుగు, తమిళం, హిందీ అంటూ దక్షిణాది, ఉత్తరాది సినీ ప్రేక్షకులను అలరిస్తున్న ఈ బ్యూటీకి ప్రస్తుతం అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. అయితే ఆమె కూడా సినిమాలపై ఆసక్తి చూపడం లేదని వాణిజ్య ప్రకటనలో నటించడానికి అధిక ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. టాలీవుడ్ చిత్రం మగధీరతో తన స్టార్‌డమ్‌ను పెంచుకున్న కాజల్ కోలీవుడ్‌లో తుపాకీ చిత్రంలో విజయాన్ని చవి చూశారు. ఆ తరువాత జిల్లా చిత్రం విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న కాజల్ ఆ మధ్య ఉదయనిధి స్టాలిన్‌తో రొమాన్స్ చేసే అవకాశాన్ని వదులుకున్నారు. అయితే అందుకుగాను తీసుకున్న అడ్వాన్స్‌ను తిరిగి చెల్లించకపోవడంతో ఆమె పేరు కాస్త డ్యామేజ్ అయ్యిందనే చెప్పాలి. ప్రస్తుతం ధనుష్‌తో జత కట్టడానికి సిద్ధం అవుతున్న కాజల్ త్వరలోనే నటనకు స్వస్తి చెప్పాలని నిర్ణయానికి వచ్చినట్లు కోడంబాక్కం టాక్. తన సహ నటీమణులు చాలా మంది పెళ్లి చేసుకుని జీవితంలో సెటిల్ అవ్వడం తనచెల్లెలు కూడా పెళ్లి చేసుకుని సంసార జీవితం గడపడం లాంటి కారణాలు ఆమె ఈ నిర్ణయం తీసుకోవడానికి దోహదం చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం కాఫీ, కొబ్బరినూనె, చెప్పులు, టూత్‌పేస్ట్ లాంటి వాణిజ్య ప్రకటనల్లో నటిస్తూ కోట్లాది రూపాయల పారితోషికాన్ని వసూలు చేస్తున్న కాజల్ త్వరలోనే నటనకు స్వస్తి చెప్పాలనుకుంటున్నట్లు ఆమె స్నేహబృందం సమాచారం. ఇలాంటి సమయంలో ఒక కండోమ్ వ్యాపార సంస్థ తమ ప్రచార ప్రకటనలో నటించమని అడిగినట్లు సమాచారం. దీంతో ఇక ఇమేజ్ గురించి ఆలోచిస్తే లాభం లేదన్న భావనకు వచ్చిన కాజల్ ఆ యాడ్‌లో నటించడానికి రెండున్నర కోట్ల పారితోషికం డిమాండ్ చేశారట. అదే సమయంలో కొన్ని షరతులును కూడా విధించారట. గ్లామర్‌గా నటించను, అసభ్య సంభాషణలు చెప్పనులాంటి కొన్ని నిబంధనలకు ఓకే అంటే యాడ్‌లో నటిస్తానని కాజల్ చెప్పారని సమాచారం.