కండోమ్ ప్రకటనల ప్రసారంపై కేంద్ర ప్రభుత్వం విధించిన నిషేధాన్ని ప్రముఖ నటి, మోడల్ రాఖీ సావంత్ తప్పుపట్టింది. దేశంలో ప్రజలకు ఎయిడ్స్ ప్రబలేలా చేయడానికే కేంద్రం ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటోందని తీవ్రంగా వ్యాఖ్యానించింది. ఒకప్పుడు దేశలో ప్రతి వైన్‌షాప్ దగ్గర కండోమ్ ప్యాకెట్లను పంచిపెట్టారని, సినీ తారలు, క్రీడాకారులతో ప్రకటనలు చేసి కండోమ్‌లపై అవగాహన పెంచిన ప్రభుత్వాలు, ఇప్పుడు మాత్రం ఎందుకు ప్రసారాలను అడ్డుకుంటున్నాయంటూ విమర్శలు ఎక్కుపెట్టింది..
గతంలో వాజ్‌పేయ్ ప్రధానిగా ఉన్న సమయంలో, మైదానంలోకి దిగేటప్పుడు హెల్మెట్ తప్పనిసరి అంటూ ప్రముఖ క్రికెటర్‌తో కేంద్ర సమాచార శాఖ ప్రకటనలు చేసిందని, కానీ ఇప్పుడు మాత్రం ప్రభుత్వం ఎందుకు తప్పుపడుతోందంటూ ప్రశ్నించారు. సరికొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకువస్తున్న బాబా రాందేవ్, కండోమ్‌లను కూడా తీసుకురావాలంటూ వ్యాఖ్యానించింది. రాఖీ సావంత్ ఓ కండోమ్ కంపెనీకి ప్రచార కర్తగా పనిచేస్తోంది.
కేంద్ర ప్రభుత్వం తాజాగా కండోమ్ ప్రకటనలపై ఆంక్షలు విధించింది. పగటి వేళల్లో నిషేధం విధించింది. కుటుంబ సభ్యలతో కలిసి చిన్న పిల్లలు చూసే అవకాశం ఉందంటూ వాటిపై ఆంక్షలు విధించింది. రాత్రి 11గంటల నుంచి ఉదయం 6గంటల వరకు మాత్రమే ప్రసారం చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment