కండోమ్ యాడ్‌లో కాజల్? | Kajal Aggarwal to take up Condom AD ? | Sakshi
Sakshi News home page

కండోమ్ యాడ్‌లో కాజల్?

Published Mon, Jan 5 2015 1:51 AM | Last Updated on Tue, Aug 28 2018 4:30 PM

కండోమ్ యాడ్‌లో కాజల్? - Sakshi

కండోమ్ యాడ్‌లో కాజల్?

నటి కాజల్ అగర్వాల్ సంచలన నిర్ణయాలకు సిద్ధం అవుతున్నట్లు ఆమె సన్నిహిత వర్గాల సమాచారం. తెలుగు, తమిళం, హిందీ అంటూ దక్షిణాది, ఉత్తరాది సినీ ప్రేక్షకులను అలరిస్తున్న ఈ బ్యూటీకి ప్రస్తుతం అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. అయితే ఆమె కూడా సినిమాలపై ఆసక్తి చూపడం లేదని వాణిజ్య ప్రకటనలో నటించడానికి అధిక ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. టాలీవుడ్ చిత్రం మగధీరతో తన స్టార్‌డమ్‌ను పెంచుకున్న కాజల్ కోలీవుడ్‌లో తుపాకీ చిత్రంలో విజయాన్ని చవి చూశారు. ఆ తరువాత జిల్లా చిత్రం విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న కాజల్ ఆ మధ్య ఉదయనిధి స్టాలిన్‌తో రొమాన్స్ చేసే అవకాశాన్ని వదులుకున్నారు.
 
 అయితే అందుకుగాను తీసుకున్న అడ్వాన్స్‌ను తిరిగి చెల్లించకపోవడంతో ఆమె పేరు కాస్త డ్యామేజ్ అయ్యిందనే చెప్పాలి. ప్రస్తుతం ధనుష్‌తో జత కట్టడానికి సిద్ధం అవుతున్న కాజల్ త్వరలోనే నటనకు స్వస్తి చెప్పాలని నిర్ణయానికి వచ్చినట్లు కోడంబాక్కం టాక్. తన సహ నటీమణులు చాలా మంది పెళ్లి చేసుకుని జీవితంలో సెటిల్ అవ్వడం తనచెల్లెలు కూడా పెళ్లి చేసుకుని సంసార జీవితం గడపడం లాంటి కారణాలు ఆమె ఈ నిర్ణయం తీసుకోవడానికి దోహదం చేస్తున్నట్లు సమాచారం.
 
 ప్రస్తుతం కాఫీ, కొబ్బరినూనె, చెప్పులు, టూత్‌పేస్ట్ లాంటి వాణిజ్య ప్రకటనల్లో నటిస్తూ కోట్లాది రూపాయల పారితోషికాన్ని వసూలు చేస్తున్న కాజల్ త్వరలోనే నటనకు స్వస్తి చెప్పాలనుకుంటున్నట్లు ఆమె స్నేహబృందం సమాచారం. ఇలాంటి సమయంలో ఒక కండోమ్ వ్యాపార సంస్థ తమ ప్రచార ప్రకటనలో నటించమని అడిగినట్లు సమాచారం. దీంతో ఇక ఇమేజ్ గురించి ఆలోచిస్తే లాభం లేదన్న భావనకు వచ్చిన కాజల్ ఆ యాడ్‌లో నటించడానికి రెండున్నర కోట్ల పారితోషికం డిమాండ్ చేశారట. అదే సమయంలో కొన్ని షరతులును కూడా విధించారట. గ్లామర్‌గా నటించను, అసభ్య సంభాషణలు చెప్పనులాంటి కొన్ని నిబంధనలకు ఓకే అంటే యాడ్‌లో నటిస్తానని కాజల్ చెప్పారని సమాచారం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement