'నాకోసం టైమ్ వేస్ట్ చేసుకోకండి' | People in power shouldn't waste their time on me: Sunny Leone | Sakshi
Sakshi News home page

'నాకోసం టైమ్ వేస్ట్ చేసుకోకండి'

Published Fri, Sep 4 2015 5:12 PM | Last Updated on Sun, Sep 3 2017 8:44 AM

'నాకోసం టైమ్ వేస్ట్ చేసుకోకండి'

'నాకోసం టైమ్ వేస్ట్ చేసుకోకండి'

ముంబై:  రాజకీయ నాయకులు తన కోసం విలువైన సమయాన్ని వృథా చేసుకోవద్దని శృంగారతార సన్నీ లియోన్ అన్నారు. తాను చేసిన కండోమ్ ప్రకటనను సీపీఐ జాతీయ కార్యదర్శి అతుల్ కుమార్ అన్జాన్ తప్పుపట్టడంపై సన్నీ ఘాటుగా స్పందించారు. రాజకీయ నాయకులు తనపై విమర్శలు చేయడం చౌకబారుతనమని సన్నీ అన్నారు.

'అధికారంలో ఉన్నవారు నా గురించి మాట్లాడుకోవడం మానుకుని కష్టాల్లో ఉన్నవారికి సాయం చేయాలి. నాకోసం వారి సయమం వృథా చేయడం బాధాకరం' అని సన్నీ ట్వీట్ చేశారు. సన్నీ నటించిన ప్రకటన భావోద్వేగాలను రెచ్చగొట్టేలా ఉందని, ప్రజలు గనక ఆ ప్రకటన చూస్తే అత్యాచారాలు మరింత పెరగడం ఖాయమని అతుల్ కుమార్ అన్జాన్ అన్న విషయం తెలిసిందే. ఈ విషయంలో బాలీవుడ్ నటి శిల్పాశెట్టి.. సన్నీలియోన్కు బాసటగా నిలిచారు. సన్నీ లియోన్ చేసిన కండోమ్ ప్రకటనపై విమర్శలు చేయడం సరికాదని అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement