'సన్నీ యాడ్తో అత్యాచారాలు పెరుగుతాయి' | Sunny Leone Condom Ad Will Trigger Rapes, Says Politician | Sakshi
Sakshi News home page

'సన్నీ యాడ్తో అత్యాచారాలు పెరుగుతాయి'

Published Wed, Sep 2 2015 7:09 PM | Last Updated on Sat, Jul 28 2018 8:35 PM

'సన్నీ యాడ్తో అత్యాచారాలు పెరుగుతాయి' - Sakshi

'సన్నీ యాడ్తో అత్యాచారాలు పెరుగుతాయి'

శృంగార తార సన్నీలియోన్ చేసిన కండోమ్ ప్రకటన వల్ల భవిష్యత్తులో మరిన్ని అత్యాచారాలు జరిగే ప్రమాదం ఉందని సీపీఐ జాతీయ కార్యదర్శి అతుల్ కుమార్ అన్జాన్ హెచ్చరించారు. ఆమె నటించిన ప్రకటన భావోద్వేగాలను రెచ్చగొట్టేలా ఉందని, ప్రజలు గనక ఆ ప్రకటన చూస్తే అత్యాచారాలు మరింత పెరగడం ఖాయమని ఆయన అన్నారు. 'మ్యాన్ఫోర్స్' అనే కండోమ్ ప్రకటనలో సన్నీ లియోన్ నటించింది. అయితే, అతుల్ కుమార్ వ్యాఖ్యల గురించి సన్నీ లియోన్ మాత్రం ఎక్కడా స్పందించినట్లు లేదు.

కాగా, సన్నీ లియోన్ మీద విమర్శలు గుప్పించడం, ఆమెపై కేసులు పెట్టడం ఇప్పుడు కొత్తేమీ కాదు. గతంలో కూడా ఆమె చిత్రాలు అసభ్యంగా ఉన్నాయంటూ ముంబైలో ఒక మహిళ సన్నీపై కేసు పెట్టారు. సన్నీలియోన్ ఇటీవల నటించిన మస్తీజాదే అనే సెక్స్ కామెడీ సినిమాకు ఇటీవలే సెన్సార్ బోర్డు పచ్చజెండా ఊపిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement