సల్మాన్‌కు సుప్రీంలో చుక్కెదురు | Salmanku miss court | Sakshi
Sakshi News home page

సల్మాన్‌కు సుప్రీంలో చుక్కెదురు

Published Thu, Jan 15 2015 2:51 AM | Last Updated on Sun, Sep 2 2018 5:20 PM

సల్మాన్‌కు సుప్రీంలో చుక్కెదురు - Sakshi

సల్మాన్‌కు సుప్రీంలో చుక్కెదురు

న్యూఢిల్లీ: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌కు చుక్కెదురైంది. వన్యప్రాణులను వేటాడిన కేసులో ఐదేళ్ల జైలు శిక్షను నిలుపుదల చేస్తూ రాజస్థాన్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ కేసును చట్టప్రకారం మళ్లీ విచారించాలని పేర్కొంది. ‘సల్మాన్ విదేశాలకు వెళ్లేందుకు ఇబ్బంది అవుతుందన్న కారణంతో శిక్షపై స్టే విధించడం సరికాదు. అందుకే ఈ కేసును మళ్లీ విచారించండి’ అని  బుధవారం ద్విసభ్య ధర్మాసనం స్పష్టంచేసింది. దీంతో సల్మాన్‌కు కొన్ని దే శాలు వీసాలు నిరాకరించే పరిస్థితి తలెత్తింది. 1998లో ఓ చిత్రం షూటింగ్ సమయంలో కృష్ణ జింకలను వేటాడినందుకు సల్మాన్‌పై రెండు కేసులు నమోదైన సంగతి తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement