సల్మాన్ ఖాన్ కు మరో భారీ ఊరట! | Salman Khan acquitted in blackbuck, chinkara poaching cases | Sakshi
Sakshi News home page

సల్మాన్ ఖాన్ కు మరో భారీ ఊరట!

Published Mon, Jul 25 2016 11:07 AM | Last Updated on Mon, Sep 4 2017 6:14 AM

సల్మాన్ ఖాన్ కు మరో భారీ ఊరట!

సల్మాన్ ఖాన్ కు మరో భారీ ఊరట!

జోథ్ పూర్: బాలీవుడ్ కథనాయకుడు సల్మాన్ ఖాన్ కు భారీ ఊరట లభించింది. కృష్ణజింకలను వేటాడిన రెండు వేర్వేరు కేసులలో ఆయనను నిర్దోషిగా ప్రకటిస్తూ రాజస్థాన్ హైకోర్టు సోమవారం తీర్పు వెలువరించింది.

1998లో జోథ్ పూర్ లో రెండు వేర్వేరు ఘటనల్లో రక్షిత వన్యప్రాణులైన ఓ కృష్ణజింకను, ఓ మామూలు జింకను వేటాడి చంపినట్టు సల్మాన్ తోపాటు మరో ఏడుగురిపై కేసులు నమోదయ్యాయి. ఈ కేసులలో జోథ్ పూర్ కోర్టు సల్మాన్ కు ఐదేళ్ల జైలుశిక్ష విధించగా.. ఈ ఉత్తర్వులను హైకోర్టు కొట్టివేసింది. ఈ కేసులో వాదనలు గత మే నెలలో ముగిశాయి. దీంతో తీర్పును రిజర్వ్ చేసిన హైకోర్టు సోమవారం తుది ఉత్తర్వులు వెలువరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement