Blackbuck
-
అసలు హీరో అనిల్‌ను వదిలేసి.. లారెన్స్‌కు ప్రాధాన్యం.. కరెక్ట్ కాదు!
ఒక లక్ష్యం కోసం దశాబ్దాలుగా అవిశ్రాంతంగా శ్రమిస్తూ, పని చేస్తున్నవారు సమాజంలో చాలా అరుదుగా ఉంటారు. 48 ఏళ్ల అనిల్ బిష్ణోయ్ అటువంటివాడే. ఆయన విద్యావంతుడే కాదు రైతు కూడా! ఆవాలు, పత్తి పండించేవాడు. వన్యప్రాణుల ప్రేమికుడు, జంతువులు... ముఖ్యంగా కృష్ణ జింకలు అంటే ఆయనకు చిన్నతనం నుంచీ ప్రేమ ఎక్కువ! జంతువులను వేటాడేవారిని అతడు తీవ్రంగా నిరసిస్తాడు. హనుమాన్‌గఢ్‌లోని శ్రీగంగానగర్‌లో జంతువులను రక్షించే మిషన్‌ను ప్రారంభించడానికి వేటగాళ్లే కారణం అంటాడు అనిల్.బిష్ణోయ్ కమ్యూనిటీ వారికి కృష్ణ జింక పవిత్ర జంతువు. ఈ కమ్యూనిటీ వారి గురువైన భగవాన్ జాంబేశ్వర్ అడవినీ, వన్యప్రాణులనూ రక్షించాలనీ, తద్వారా మాత్రమే పర్యావరణ పరి రక్షణ ఉంటుందనీ చెప్పేవారు! ఆ బోధనల ప్రభావం బిష్ణోయ్ కమ్యూ నిటీపై ఎక్కువ ఉంది. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ మీద ఇదే ప్రాంతంలో జింకను చంపిన కేసు నమోదు అవ్వడం గమనార్హం. ఇప్పుడు ఆయనకు చంపుతామనే బెదిరింపులు రావడం ఆందోళన కలిగిస్తున్న అంశం. నిజానికి బిష్ణోయ్ సమాజానికి చెందినవారు సల్మాన్‌ను తమ మందిర్‌కు వచ్చి క్షమాపణ కోరమన్నారు. దీనిని ఆసరా చేసుకుని జైల్లో ఉన్న లారెన్స్ బిష్ణోయ్ అనే గ్యాంగస్టర్ ముఠా బెదిరింపులకు దిగిందని అంటారు. జాతీయ మీడియా అసలు హీరో అనిల్‌ను వదిలేసి లారెన్స్‌కు అధిక ప్రాధాన్యం ఇవ్వడం సరికాదు.హనుమాన్ గఢ్ జిల్లా శ్రీగంగా నగర్‌కు చెందిన అనిల్ చిన్న నాటి నుంచే జింకల వేటగాళ్ల పట్ల కోపంగా ఉండేవాడు! వారిని పోలీస్‌లకు పట్టించేవాడు, సాక్ష్యం చెప్పి వారికి శిక్షలు పడే విధంగా చూసేవాడు! 30 ఏళ్లుగా ఈ సంరక్షకుడు 10 వేల కృష్ణ జింకలను వేటగాళ్ల ఉచ్చు నుంచి కాపాడాడు! వాటి రక్షణ కోసం తన జీవితాన్ని అంకితం చేశాడు. గత మూడు దశా బ్దాలుగా జింకల రక్షణ కోసం ప్రచారం చేస్తున్నాడు. చదవండి: ఆ ప్రాజెక్టుకు పది లక్షల చెట్ల బలి!50 పంచాయతీలలో కృష్ణ జింకల సహజ అవాసాలకు కలిగిన నష్టం, వేటగాళ్ల దుశ్చర్యల గురించి ప్రచార కార్యక్రమం చేపట్టాడు. కృష్ణ జింకలకు నీరు వంటి కనీస వసతులు కల్పించడానికి పూనుకుని... తన గ్రామ ప్రజల నుంచి రెండు లక్షల రూపాయలు చందా పోగు చేశాడు. దానికి తన సొంత డబ్బు కొంత జతచేసి కృష్ణ జింకల అవసరాలను తీర్చడానికి 60కి పైగా చిన్న, మధ్య తరహా నీటి వనరులను ఏర్పాటు చేశాడు. వాటికి గాయాలు అయినపుడు చికిత్స ఏర్పాట్లు కూడా చేశాడు.చదవండి: వ్యక్తిగా రతన్ టాటా ఎలా ఉండేవారు?1990లో సూరత్ గఢ్‌లో కళాశాల చదువు చదువుతున్న కాలంలోనే అటవీ రక్షణ, వన్య ప్రాణుల రక్షణ మీద జరిగిన ఒక సదస్సులో అనిల్ పాల్గొన్నాడు. ‘ఈ సదస్సు నా మనస్సుపై చాలా ప్రభావాన్ని చూపింది’ అంటాడు అనిల్! బీఏ. బీఈడీ చదువు పూర్తి కాగానే గ్రామానికి వచ్చి వ్యవసాయం చేయడం మొదలు పెట్టాడు. రాజస్థాన్ లోని 12 జిల్లాలలో 3,000 మంది వివిధ ఉద్యోగాలు చేసుకునే వారితో కలిసి వన్యప్రాణ రక్షణ మీద, శాంతి ర్యాలీలు, సమావేశాలు పెట్టడం మొదలు పెట్టాడు. ఇప్పటి దాకా వేటగాళ్ల మీద 200లకు పైగా కేసులు నమోదు చేయడం జరిగింది. ఇందులో 30 కేసులు ముగింపు దశకు చేరాయి. కొందరికి జరిమానాలు పడ్డాయి. అనిల్ బిష్ణోయ్ తుంహే సలాం! – ఎండి. మునీర్సీనియర్ జర్నలిస్ట్ -
లక్ష ట్రక్ ఆపరేటర్లకు డిజిటల్ సర్వీసులు
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ఒక లక్ష పైచిలుకు ట్రక్ ఆపరేటర్లకు (ట్రకర్లు) డిజిటలీకరణ సేవలు అందించినట్లు టెక్ స్టార్టప్ సంస్థ బ్లాక్‌బక్ సహ వ్యవస్థాపకుడు రాజేశ్ వై తెలిపారు. తమ వ్యాపారాలను పూర్తిగా స్మార్ట్ఫోన్ల ద్వారా నిర్వహించుకోవడానికి, నగదు లావాదేవీలను తగ్గించుకోవడానికి, తమ ట్రక్కులను మరింత మెరుగ్గా నియంత్రించుకోవడానికి, ఆదాయా న్ని మెరుగుపర్చుకోవడానికి ఇవి ఉపయోగపడుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలో 5,000 పైచిలుకు గ్రామాల్లో తమకు కార్యకలాపాలు ఉన్నాయని, వచ్చే 12 నెలల్లో దీన్ని 15,000కు పెంచుకోవాలని నిర్దేశించుకున్నట్లు రాజేశ్ వివరించారు. కొత్త లోడ్ ఆర్డర్లను పొందడం మొదలుకుని జీపీఎస్‌లతో ట్రక్కులను ట్రాక్ చేసుకోవడం, రుణాలు పొందడం వరకు బ్లాక్బక్తో అన్ని రకాల సర్వీసులు పొందవచ్చని పేర్కొన్నారు. 2015లో రాజేశ్, చాణక్య హృదయ, రామసుబ్రమణియన్ బి కలిసి బ్లాక్‌బక్‌ను ఏర్పాటు చేశారు. (ఇదీ చదవండి: రుణాల చెల్లింపులో అదానీ పోర్ట్స్ దూకుడు.. తాజాగా రూ. 1,500 కోట్లు) -
బరి తెగించిన వేటగాళ్లు
భోపాల్: మధ్యప్రదేశ్‌లో వేటగాళ్లు రెచ్చిపోయారు. వన్యమృగాలను వేటాడుతుండగా పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులపై కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఒక ఎస్సై సహా ముగ్గురు పోలీసులు నేలకొరిగారు. ఒకరు పోలీసు గాయపడ్డారు. ఎదురు కాల్పుల్లో ఒక దుండగుడు హతమయ్యాడు. అనంతరం సోదాల సమయంలో జరిగిన కాల్పుల్లో మరో నిందితుడి మృతదేహాన్ని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. గుణ జిల్లా అరోన్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం వేకువజామున చోటుచేసుకున్న ఈ ఘటన సంచలనం రేపింది. సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించారు. విధి నిర్వహణలో అసువులుబాసిన పోలీసులను మృతవీరులుగా ప్రకటించారు. వారి కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారంతోపాటు ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని ప్రకటించారు. గ్వాలియర్ జోన్ ఐజీని బదిలీ చేశారు. సాగ బార్ఖేడ గ్రామ సమీపంలోని షారోక్ రోడ్డు వద్ద కొందరు దుండగులు వన్యప్రాణులను వేటాడుతున్నారన్న సమాచారం అందడంతో తెల్లవారు జామున 3 గంటల సమయంలో పోలీసు బలగాలు ఆప్రాంతాన్ని చుట్టుముట్టాయి. లొంగిపోవాలని చేసిన హెచ్చరికలను దుండగులు లక్ష్యపెట్టలేదు. పోలీసులపైకి యథేచ్ఛగా కాల్పులకు దిగారు. ఈ కాల్పుల్లో ఎస్సై రాజ్‌కుమార్ జాటవ్, కానిస్టేబుళ్లు నీలేశ్ భార్గవ, శాంతారాం మీనా అసువులు బాశారు. పోలీసులపై కాల్పులకు తెగబడిన నేరగాళ్లు బిధోరియాకు చెందిన వారిగా గుర్తించినట్లు హోం మంత్రి తెలిపారు. ఇద్దరిని అరెస్ట్ చేసి, మరో నలుగురి కోసం తీవ్రంగా గాలింపు జరుగుతోందన్నారు. కాల్పులు చోటుచేసుకున్న ప్రాంతం నుంచి కృష్ణజింకల కళేబరాలు ఐదు, ఒక నెమలి కళేబరాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వర్గాలు వెల్లడించాయి. చదవండి: లౌడ్‌స్పీకర్ల వివాదం..చంపేస్తామని బెదిరింపులు.. రాజ్ ఠాక్రేకు భద్రత పెంపు -
కృష్ణ.. కృష్ణా!
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : దూరంగా ఎత్తైన కొండలు.. పచ్చని చెట్లు... ఆ పక్కనే జింకల గుంపు.. ఈ ఫొటో చూస్తేనే కంటికి ఇంపుగా ఉంది కదా! కానీ ఇవే జింకలు పాలమూరు రైతులకు కష్టాలు తెచ్చి పెడుతున్నాయి. కరువు, కాటకాలతో సతమ తమయ్యే ఈ జిల్లాలోని కొన్ని పల్లెల్లో జింకల కారణంగా ఏకంగా పంటల సాగుకు విరామం ప్రకటించారు. ముఖ్యంగా కృష్ణానది తీర ప్రాంతాలైన మాగనూరు, కృష్ణా మండలాల్లోని పలు గ్రామాల్లో రైతులు పంటలు సాగు చేయలేని పరిస్థితులు నెలకొన్నాయి. కృష్ణ జింకల దాటికి వేలాది ఎకరాల్లో పంటలు సాగు చేసుకోలేని పరిస్థితి నెలకొంది. ఏటా వీటి సమస్య తీవ్రతరమవుతుందే కానీ.. పరిష్కారం లభిం చడం లేదు. లేదు. ఫలితంగా ఏటా సాగుచేసిన పొలాల్లో పెట్టుబడి సైతం నష్టం వాటిల్లుతోంది. ఈ విషయాన్ని అటవీశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఏ మాత్రం ప్రయోజనం ఉండడం లేదు. దీంతో చేసేదేం లేక రైతులే స్వచ్ఛందంగా పంటలకు విరామం ప్రకటిస్తున్నారు. ఏటా ఇదే తంతు ఖరీఫ్‌లో సాగు చేసే పంటల విషయంలో రైతు లకు ప్రతీ ఏటా పాత అనుభవమే ఎదురవుతోంది. పొలంలో విత్తు సాగుచేసి మొలకలు రాగానే... కృష్ణ జింకల మందలు ప్రవేశించి నాశనం చేస్తున్నాయి. గత ఐదారేళ్లు ఇదే తంతు సాగుతోంది. ఇటీవలి కాలంలో కురిసిన వానలకు పంటలను సాగు చేసుకుని నష్టపోవడం ఎందుకనే భావనతో పంటలకు విరామం ప్రకటించేందుకు సిద్ధం కావడం గమనార్హం. సీజన్లో వేసిన పత్తి, ఆముదం, కంది ఇలా ప్రతి పంటలను మొక్క దశలోనే తినేస్తున్నాయి. గత సంవత్సరం మాగనూరు మండలంలోని ప్రెగడబండా, ఓబ్లాపూర్, గుడెబల్లూర్, ముడు మాల్, మురహార్‌దొడ్డి, అడవి సత్యావార్, పుంజనూర్, అచ్చంపేట, మాగనూర్ గ్రామాల్లో వేసిన పంటలన్నీ కృష్ణ జింకల మూలంగా పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఆలాగే కృష్ణా మండ లంలోని చేగుంట, ఐనాపూర్, కున్సి, తంగిడి, సూకూర్ లింగంపల్లి, కుసుమర్థి గ్రామాల్లో ఈ సంవత్సరం సాగు చేసిన కంది, పత్తి పంటలను ధ్వంసం చేశాయి. నమోదవుతున్న కేసులు కృష్ణానది తీర ప్రాంతమైన మాగనూరు, కృష్ణా మండలాల్లోని పరిస్థితులు జింకల ఆవాసానికి అత్యంత అనుకూలంగా మారాయి. పొదలు, పక్కనే నదీ ప్రవహిస్తుండటంతో జింకలు ఈ ప్రాంతాన్ని విడిచి వెళ్లడం లేదు. జింకల తీరుతో విసిగిపోయిన వారు పొరపాటున వాటికి ఏమైనా అపాయం తలపెడితే తీవ్రమైన కేసులు నమోదవుతున్నాయి. షెడ్యూల్–1లో ఉన్న జీవజాతి కావడంతో అటవీశాఖ అధికారులు కృష్ణజింకల విషయంలో చాలా సీరియస్‌గా చర్యలు తీసుకుంటున్నారు. జింకలకు అపాయం తలపెట్టినట్లు నేర నిరూపణ జరిగితే దాదాపు ముడు నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్షతో పాటు జరిమానా విధించే అవకాశం ఉంది. ఇప్పటికే గతేడాది రెండు కేసులు నమోదు కావడంతో ఈ ప్రాంత వాసుల్లో భయం నెలకొంది. 24 గంటలు గస్తీ కాయాల్సిందే.. మాగనూరు, కృష్ణా మండలాల పరిధిలోని గ్రామాల్లో ఎవరైనా పంట సాగు చేశారంటే 24గంటల పాటు గస్తీ కాయాల్సి వస్తోంది. కొద్ది ఏమరపాటుగా ఉన్నా.. మనిషి కాపలా లేకపోయినా పంట పొలాలను సర్వనాశనం చేసేస్తాయి. దీంతో పంటలు సాగు చేసిన వారు ఒక జట్టుగా ఏర్పడి కాపాడుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తుంటారు. కొన్ని సందర్భాల్లో ఎంతగా బెదింపులు చేసిన వందల సంఖ్యలో వచ్చి పొలాలను నాశనం చేస్తున్నాయి. కృష్ణ జింకల మూలంగా వేసిన పంటలను కోల్పోవడమే కాక, పెట్టుబడిగా పెట్టిన వేలాది రుపాయలు కూడా వృథా అవుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ జింకలను అటవీ శాఖ అధికారులు ఇక్కడి నుంచి తీసుకెళ్లాలని, ఈ ప్రాంతంలో జింకలు లేకుండా చేయాలని పలుమార్లు వినతులు అందజేశారు. కృష్ణ జింకలను ఇక్కడి నుంచి తరలిస్తే తప్ప తమ పొలాల్లో పంటలు సాగు చేసుకోలేమని రైతులు విజ్జప్తి చేశారు. ఈ విషయంపై గత సంవత్సరం ప్రెగడబండ, అచ్చంపేట గ్రామాలకు చెందిన రైతులు జిల్లా అటవీ శాఖ అధికారులకు విన్నవించినా పట్టించుకోలేదనే ఆరోపణలున్నా యి. జింకల మూలంగా దాదాపు వేల ఎకరాల్లో పంటలు నష్టపోతున్నాయి. పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం ఇవ్వడమే కాకుండా కృష్ణ జింకల బెడద నుంచి తమను కాపాడాలని బాధిత రెతులు డిమాండ్ చేస్తున్నారు. అధికారులే జింకలను తీసుకెళ్లాలి వన్యప్రాణులను రక్షించా ల ని, వాటిని చంపొద్దని చెప్పే ప్రభుత్వం, మా పంటలకు నష్టం చేస్తూ రూ.లక్షలు కోల్పోయేలా చేస్తున్నా ప ట్టించుకోవడం లేదు. గత రెండేళ్లలో పంటలు పోవడంతో పెట్టుబడి నష్ట పోయాం. మా పొలాల్లోకి జింకలు రాకుండా వా టిని ఇక్కడి నుండి తీసుకెళ్లి నల్లమల అడవుల్లో వదిలి వేయాలి. లేనిపక్షంలో ఈ ప్రాంతం మొత్తాన్ని జింకల కోసం లీజ్‌కు తీసుకుని మాకు ప్రతీ సంవత్సరం పరిహారం చెల్లించాలి. – వెంకట్‌రెడ్డి, రైతు, ప్రెగడబండ, మాగనూర్ -
రాష్ట్ర వృక్షంగా వేప
రాష్ట్ర చిహ్నాలపై ప్రభుత్వం ఎట్టకేలకు స్పందించింది. నాలుగేళ్ల తర్వాత వాటిని గుర్తించింది. వృక్షంగా వేపచెట్టును, పుష్పంగా మల్లెను, జంతువుగా కృష్ణ జింకను, పక్షిగా రామచిలుకను గుర్తిస్తూ బుధవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. సాక్షి, అమరావతి: వేద కాలం నుంచి పూజలందుకుంటూ, పుష్కలమైన ఔషధ గుణాలు కలిగిన వేపచెట్టును ప్రభుత్వం రాష్ట్ర వృక్షంగా నిర్ణయించింది. విభజన నేపథ్యంలో నాలుగేళ్ల తరువాత రాష్ట్రానికి ప్రత్యేక చిహ్నాలు ఖరారు చేసింది. వేపచెట్టును దేవతా స్వరూపంగా భావించి పూజించే సంప్రదాయం అనేక ప్రాంతాల్లో ఉంది. ఉగాది పర్వదినాన తెలుగువారికే ప్రత్యేకమైన ఉగాది పచ్చడిలో వేప పువ్వును ఉపయోగిస్తారు. వేప గింజల నుంచి తీసే నూనెను సబ్బులు, షాంపూలు, క్రీమ్స్‌లో ఉపయోగిస్తారు. వేప చెట్టులోని వివిధ భాగాలను ఆయుర్వేద ఔషధాల్లో ఉపయోగిస్తారు. చర్మవ్యాధులకు వేపాకుతో చేసిన లేపనం దివ్యౌషధంగా పనిచేస్తుంది. దీని శాస్త్రీయ నామం అజాడిరక్త ఇండిక. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని అటవీ పర్యావరణ శాఖ వేపను రాష్ట్ర వృక్షంగా ఖరారు చేసింది. పొడవాటి మెలికలు తిరిగిన కొమ్ములతో శరీరంపై వివిధ వర్ణాల మచ్చలతో చూడటానికి అందంగా కనిపించే కృష్ణ జింకను ప్రభుత్వం రాష్ట్ర జంతువుగా నిర్ణయించింది. దీని శాస్త్రీయ నామం ఏంటిలోప్ సెర్వికాప్రా. ప్రాచీన హిందూ పురాణాల్లో కృష్ణజింక చంద్రుని వాహనంగా చెప్పబడింది. అయితే ప్రస్తుతం ఇది అంతరించిపోయే జంతువుల జాబితాలో ఉంది. పెంపుడు పక్షిగా మనిషికి అత్యంత సన్నిహితంగా ఉండే రామచిలుకను రాష్ట్ర పక్షిగా ఎంపిక చేసింది. శుభకార్యాలనగానే గుర్తుకొచ్చే, సువాసనలు వెదజల్లే మల్లె పువ్వును రాష్ట్ర పుష్పంగా ఖరారు చేసింది. ఈమేరకు అటవీ, పర్యావరణ శాఖ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. దీనికి సంబంధించి జూన్ నాలుగో తేదీన గెజిట్ నోటిఫికేషన్ జారీ కానుంది. -
మళ్లీ జోధ్‌పూర్‌కు సల్మాన్ ఖాన్!
న్యూఢిల్లీ: కృష్ణ జింకల్ని చంపిన కేసులో ఐదేళ్ల జైలు శిక్ష ఎదుర్కొంటున్న సల్మాన్ ఖాన్ ఆదివారం జోధ్‌పూర్ చేరుకున్నారు. ఈ కేసులో సోమవారం జోధ్‌పూర్ సెషన్స్ కోర్టులో జరగనున్న వాదనలకు సల్మాన్ హాజరు కావాల్సి ఉంది. ఇందులో భాగంగా ఒక రోజు ముందే సల్మాన్ జోధ్‌పూర్ చేరుకున్నారు. ముంబై నుంచి విమానంలో వచ్చిన సల్మాన్.. జోధ్‌పూర్ విమానాశ్రయంలో ఆయన కనిపించారని, సోమవారం కోర్టు విచారణకు ఆయన హాజరవుతారని ఏఎన్ఐ వార్తాసంస్థ ట్వీట్‌చేసింది. కృష్ణ జింకల్ని చంపిన కేసులో ఐదేళ్ల జైలు శిక్ష ఎదుర్కొంటున్న సల్మాన్‌కు ప్రస్తుతం బెయిల్‌మీద బయట ఉన్న సంగతి తెలిసిందే. ట్రయల్ కోర్టు ఆయనను దోషిగా నిర్ధారించి జైలు శిక్ష విధించడంతో రెండ్రోజులు జోధ్‌పూర్ కేంద్ర కారాగారంలో సల్మాన్ శిక్ష అనుభవించారు. అనంతరం ఆయనకు బెయిల్ లభించింది. అయితే బెయిల్ మంజూరును రాజస్తాన్ హైకోర్టులో సవాలు చేస్తామని బిష్ణోయ్ తెగ ప్రతినిధి రామ్ నివాస్ తెలిపారు. -
కృష్ణజింకల కళేబరాలు స్వాధీనం
నిందితుల అరెస్టు: చీఫ్ వైల్డ్‌లైఫ్ వార్డెన్ సాక్షి, హైదరాబాద్: అంతరించి పోతున్న జంతు జాతికి చెందిన 2 కృష్ణ జింకల (బ్లాక్‌బక్) కళేబరాలు, మాంసం స్వాధీనం చేసుకున్నట్టు చీఫ్ వైల్డ్‌లైఫ్ వార్డెన్ మనోరంజన్ భాంజా వెల్లడించారు. వీటితోపాటు ఆరు బూడిద రంగు కుందేళ్లు, ఆరు కంజు పిట్టలు, 27 బుడక పిట్టలు, పాము మెడ కలిగిన కొంగ, అడవిబాతు (నీటి) కళేబరాలు కూడా స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. వీటి మాంసాన్ని అమ్ముతున్న పాతబస్తీకి చెందిన సయ్యద్ జమీర్‌ను, సరఫరా చేసిన మెదక్ జిల్లా తూప్రాన్ మండలంలోని దండుపల్లికి చెందిన రాజేశ్‌లను సోమవారం రాత్రి పోలీ సులు అరెస్ట్ చేసినట్లు చెప్పారు. స్వాధీనం చేసుకున్న కళేబరాలు, నిందితులను మంగళవారం అరణ్యభవన్‌లో మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. ట్రాన్సిట్ రిమాండ్ కింద అటవీ అధికారులు వీరిని ప్రశ్నిస్తున్నారని భాంజా తెలిపారు. వైల్డ్‌లైఫ్ ఓఎస్డీ శంకరన్, హైదరాబాద్ జిల్లా అటవీ అధికారి సీపీ వెంకటరెడ్డితో కలసి ఆయన మీడి యాతో మాట్లాడుతూ... వన్యప్రాణి సంరక్షణ చట్టంలోని షెడ్యూల్ ఒకటిలో ఉన్న కృష్ణజింకలను చంపిన వారికి, కనీస జరిమానా రూ.10వేలు మొదలుకుని ఎంతైనా వేయవచ్చునని, నాన్‌బెయిలబుల్ కేసు కింద మూడేళ్ల నుంచి ఏడేళ్ల వరకు శిక్ష విధించవచ్చని చెప్పారు. భూపాలపల్లి జిల్లాలో చోటు చేసుకున్న జింకల వేట తదనంతర పరిణామాల పట్ల అటవీశాఖ పారదర్శకంగా వ్యవహరిస్తోందన్నారు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యా లయంలోని అటవీ ప్రాంతంలో చోటు చేసుకుంటున్న జింకలు, ఇతర జంతువుల వేటపై వీసీ, సీఎస్ఓతో చర్చిం చినట్లు ఓఎస్డీ శంకరన్ తెలిపారు. వర్సిటీలో 400 ఎకరాల అటవీ భూమిలో పచ్చగడ్డి, నీటిని ఏర్పాటు చేసి జంతువులను అక్కడకు తరలించాలని వర్శిటీ అధికారులకు సూచించామన్నారు. -
సల్మాన్ ఖాన్‌ను వీడని కష్టాలు...
న్యూఢిల్లీ : బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్‌కు కృష్ణ జింక కష్టాలు వీడేలా కనిపించడం లేదు. కృష్ణజింకను వేటాడిన కేసులో సల్మాన్‌పై రాజస్తాన్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ ఏడాది జూలై 25న ఆ రాష్ట్ర హైకోర్టు సల్మాన్ నిర్ధోషి అంటూ తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. కాగా 1998లో జోధ్‌పూర్‌కు సమీపంలోని భావద్, మథానియా ప్రాంతాల్లో ఓ కృష్ణజింకను, ఓ మామూలు జింకను వేటాడి చంపినట్టు సల్మాన్ తోపాటు మరో ఏడుగురిపై కేసులు నమోదయ్యాయి. సల్మాన్‌పై వన్యప్రాణి సంరక్షణ చట్టం సెక్షన్ 51 ప్రకారం ఈ కేసులు నమోదు చేశారు. ట్రయల్ కోర్టు సల్మాన్‌ను దోషిగా నిర్ధారించి.. ఒక కేసులో ఏడాది జైలు శిక్ష, మరో కేసులో ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. దీనిపై సల్మాన్ సెషన్స్ కోర్టులో అప్పీలు చేసుకున్నారు. మిథానియా కేసులో సల్మాన్ అప్పీలును తిరస్కరించిన కోర్టు.. భావద్ కేసును హైకోర్టుకు బదిలీ చేసింది. సరైన సాక్షాలు లేవని సల్మాన్‌ను హైకోర్టు నిర్దోషిగా ప్రకటించింది. అయితే ఆ కేసులో తమకు పలు అనుమానాలు ఉన్నాయంటూ, హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ రాజస్థాన్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. -
సల్మాన్ ఖాన్‌ను వీడని కష్టాలు...
-
ఆ జింకలను ఎవరు చంపారు?
సల్మాన్ ను నిర్దోషిగా ప్రకటించిన హైకోర్టు సినిమా షూటింగ్ లో పాల్గొంటూ సరదా కోసం రక్షిత వన్యప్రాణులైన కృష్ణజింకలను వెటాడారన్న కేసులో సల్మాన్ ఖాన్ కు ఊరట లభించింది. రాజస్థాన్ హైకోర్టు సల్మాన్ కు ఈ కేసు నుంచి విముక్తి ప్రసాదించింది. ఈ నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించిన కొన్ని కీలక విషయాలు.. 1998 సంవత్సరంలో రాజస్థాన్ లోని జోథ్ పూర్ లో 'హమ్ సాథ్ సాథ్ హై' సినిమా షూటింగ్ జరిగింది. ఆ సమయంలో ఆ సినిమా నటులైన సల్మాన్ ఖాన్, సోనాలి బింద్రె, టబు, నీలమ్ తదితరులు సరదా కోసం వేటకు వెళ్లారని, రక్షిత వన్యప్రాణులైన జింకలను వేటాడారని అప్పట్లో కేసు నమోదైంది. జోథ్ పూర్ శివార్లలోని భవాద్ అటవీ ప్రాంతంలో 1998 సెప్టెంబర్ 26న ఓ జింక, సెప్టెంబర్ 28న ఘోడా ఫార్మ్ హౌస్ లో మరో జింక హత్యకు గురయ్యాయి. ఈ జింకలను వేటాడి చంపిన కేసులో 2006లో జోథ్ పూర్ ట్రయల్ కోర్టు సల్మాన్‌ఖాన్‌కు ఐదేళ్లు శిక్ష విధించింది. ఈ శిక్షను సవాల్ చేస్తూ సల్మాన్ రాజస్థాన్ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టు శిక్షపై స్టే విధించింది. అనంతరం సుదీర్ఘకాలం వాదనల అనంతరం సల్మాన్ ను నిర్దోషిగా ప్రకటిస్తూ తాజాగా హైకోర్టు తీర్పునిచ్చింది. జింకలను వెటాడిన కేసులో సల్మాన్ ను నిర్దోషిగా ప్రకటించడంపై స్థానిక బిష్ణోయ్ వర్గం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని ఆ వర్గం తెలిపింది. మరోవైపు రాజస్థాన్ ప్రభుత్వం కూడా ఈ తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని భావిస్తోంది. న్యాయవ్యవస్థ ఎంత నెమ్మదిగా పనిచేస్తోందో సెలబ్రిటీ కేసులే మనకు చెప్తాయి. సల్మాన్ ఖాన్ నిర్దోషి అని చెప్పడానికి కోర్టుకు 20 ఏళ్లు పట్టడం నిజంగా భయం కలిగిస్తున్నది- రాంగోపాల్ వర్మ ట్విట్టర్ లో.. Only celebrity cases make us realise how dead slow judiciary works .it's scary it took 20yrs for court to decide Salman khan is not guilty — Ram Gopal Varma (@RGVzoomin) July 25, 2016 సల్మాన్ ఖాన్ కు కేసులు కొత్త కాదు. 'హిట్ అండ్ రన్' కేసులోనూ ఆయన విచారణ ఎదుర్కొన్నారు. మద్యం తాగి వాహనం నడిపి ఓ వ్యక్తి మృతికి, నలుగురు గాయపడటానికి కారణమైనట్టు అభియోగాలు ఎదుర్కొన్న ఈ కేసులో ముంబై హైకోర్టు ఆయనను గత ఏడాది డిసెంబర్ లో నిర్దోషిగా ప్రకటించింది. 13 ఏళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం ఈ కేసులో సల్మాన్ కు ఊరట లభించింది. అయితే, హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీలు చేయడంతో ఈ కేసు ఇంకా సల్మాన్ ను వెంటాడుతూనే ఉంది. 'సుల్తాన్' సినిమాతో బాక్సాఫీసు రికార్డు బద్దలు కొట్టిన సల్మాన్.. ఈ సినిమా ప్రమోషన్ సమయంలో వివాదాస్పద 'రేప్' వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ సమయంలో తన పరిస్థితి అత్యాచారానికి గురైన మహిళలా ఉండేదని ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. -
సల్మాన్ ఖాన్ కు మరో భారీ ఊరట!
-
సల్మాన్ ఖాన్ కు మరో భారీ ఊరట!
జోథ్ పూర్: బాలీవుడ్ కథనాయకుడు సల్మాన్ ఖాన్ కు భారీ ఊరట లభించింది. కృష్ణజింకలను వేటాడిన రెండు వేర్వేరు కేసులలో ఆయనను నిర్దోషిగా ప్రకటిస్తూ రాజస్థాన్ హైకోర్టు సోమవారం తీర్పు వెలువరించింది. 1998లో జోథ్ పూర్ లో రెండు వేర్వేరు ఘటనల్లో రక్షిత వన్యప్రాణులైన ఓ కృష్ణజింకను, ఓ మామూలు జింకను వేటాడి చంపినట్టు సల్మాన్ తోపాటు మరో ఏడుగురిపై కేసులు నమోదయ్యాయి. ఈ కేసులలో జోథ్ పూర్ కోర్టు సల్మాన్ కు ఐదేళ్ల జైలుశిక్ష విధించగా.. ఈ ఉత్తర్వులను హైకోర్టు కొట్టివేసింది. ఈ కేసులో వాదనలు గత మే నెలలో ముగిశాయి. దీంతో తీర్పును రిజర్వ్ చేసిన హైకోర్టు సోమవారం తుది ఉత్తర్వులు వెలువరించింది.