హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ఒక లక్ష పైచిలుకు ట్రక్ ఆపరేటర్లకు (ట్రకర్లు) డిజిటలీకరణ సేవలు అందించినట్లు టెక్ స్టార్టప్ సంస్థ బ్లాక్‌బక్ సహ వ్యవస్థాపకుడు రాజేశ్ వై తెలిపారు. తమ వ్యాపారాలను పూర్తిగా స్మార్ట్‌ఫోన్ల ద్వారా నిర్వహించుకోవడానికి, నగదు లావాదేవీలను తగ్గించుకోవడానికి, తమ ట్రక్కులను మరింత మెరుగ్గా నియంత్రించుకోవడానికి, ఆదాయా న్ని మెరుగుపర్చుకోవడానికి ఇవి ఉపయోగపడుతున్నాయని ఆయన పేర్కొన్నారు.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలో 5,000 పైచిలుకు గ్రామాల్లో తమకు కార్యకలాపాలు ఉన్నాయని, వచ్చే 12 నెలల్లో దీన్ని 15,000కు పెంచుకోవాలని నిర్దేశించుకున్నట్లు రాజేశ్ వివరించారు. కొత్త లోడ్ ఆర్డర్లను పొందడం మొదలుకుని జీపీఎస్‌లతో ట్రక్కులను ట్రాక్ చేసుకోవడం, రుణాలు పొందడం వరకు బ్లాక్‌బక్‌తో అన్ని రకాల సర్వీసులు పొందవచ్చని పేర్కొన్నారు. 2015లో రాజేశ్, చాణక్య హృదయ, రామసుబ్రమణియన్ బి కలిసి బ్లాక్‌బక్‌ను ఏర్పాటు చేశారు.
(ఇదీ చదవండి: రుణాల చెల్లింపులో అదానీ పోర్ట్స్ దూకుడు.. తాజాగా రూ. 1,500 కోట్లు)
Comments
Please login to add a commentAdd a comment